మహిళ చేతికి ప్రపంచ ఎక్స్ఛేంజీల సమాఖ్య పగ్గాలు
• ఎన్‌ఎస్‌ఈ సీఈఓ
• చిత్రా రామకృష్ణకు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ (డబ్ల్యూఎఫ్‌ఈ) కొత్త చైర్‌పర్సన్‌గా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ నియమితులయ్యారు. దీని పగ్గాలు ఒక మహిళ చేతికి దక్కటం ఇదే తొలిసారి. 2008లో కూడా ఒకసారి ఎన్‌ఎస్‌ఈకి ఈ హోదా దక్కినా... అప్పట్లో ఎండీ-సీఈఓగా చిత్రా రామకృష్ణ లేరు. ఇక సిక్స్ గ్రూప్ సీఈవో ఉర్స్ రుగ్‌సెగర్.. డబ్ల్యూఎఫ్‌ఈ వైస్ చైర్మన్‌గా, షికాగో బోర్డు ఆప్షన్‌స ఎక్స్చేంజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విలియన్ బ్రాడ్‌స్కై.. డబ్ల్యూఎఫ్‌ఈ వర్కింగ్ గ్రూప్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు.
‘డబ్ల్యూఎఫ్‌ఈ చైర్‌పర్సన్‌గా ఎంపిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నా సహచర ఉద్యోగులతో కలిసి సంస్థను ముందుకు నడిపిస్తాను’ అని చిత్ర తెలిపారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డబ్ల్యూఎఫ్‌ఈలో 200 మార్కెట్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ప్రొవైడర్లు, దాదాపు 45,000 లిస్టెడ్ కంపెనీలు సభ్యత్వం కలిగి ఉన్నారుు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్చేంజ్‌లు, మార్కెట్ పార్టిసిపెంట్స్ ప్రమాణాలను మెరుగుపరచడానికి వివిధ రెగ్యులేటర్స్‌తో, పాలసీ తయారీదారులతో కలిసి పనిచేస్తూ ఉంటుంది.