చైర్‌పర్సన్ X సీఈవో! | Chairperson X CEO! | Sakshi
Sakshi News home page

చైర్‌పర్సన్ X సీఈవో!

Published Sat, May 21 2016 10:41 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

చైర్‌పర్సన్ X సీఈవో!

చైర్‌పర్సన్ X సీఈవో!

జిల్లాపరిషత్ కార్యాలయం వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ప్రతి చిన్న విషయూన్ని ఉద్యోగులు భూతద్దంలో చూస్తుండడంతో ఇక్కడ వాతావరణం చెడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల మధ్య కుర్చీల కుమ్ములాటలు చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, సీఈవో బి.నగేష్ మధ్య అంతరానికి కారణమవుతున్నాయి. పాలనా వ్యవహారాల్లో చైర్‌పర్సన్ నిర్ణయానికి సీఈవో అడ్డుపడుతుండడంతో సమస్య తలెత్తిందని కార్యాలయ వర్గాలు బహిరంగంగా చెప్పుకుంటున్నాయి.

పాలనా వ్యవహారాల్లో తరచూ ఇలాంటి సమస్యలే ఎదురవుతుండడంతో ఉద్యోగులు వర్గాలుగా విడిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

 
 * అంతర్గత బదిలీలపై మాటపట్టింపు
 * సీట్ల కోసం ఉద్యోగుల కుమ్ములాట
 * ముదురుతున్న వ్యవహారం
 * కీలక సీట్లపై మల్లగుల్లాలు

శ్రీకాకుళం టౌన్: జెడ్పీ కార్యాలయంలో తొమ్మిది విభాగాలున్నాయి. వాటిలో ఆర్థిక, పాలనా వ్యవహారాలు, కార్యాలయ నిర్వహణ, ఇంజినీరింగ్ విభాగాలు కలుపుకుని తొమ్మిది సెక్షన్లు పనిచేస్తున్నాయి. అందులో ఏ విభాగంలో అకౌంట్స్, బీ లో పాలనా అంశాలు, సీ లో నియామకాలు, ఉద్యోగుల వ్యవహారాలు, డీ లో లేఖా సంబంధమైన అంశాలు, ఈ లో విద్యాశాఖ వ్యవహరాలు, ఎఫ్, జీ విభాగాల్లో ప్రావిడెంట్ ఫండ్, ఇంజినీరింగ్‌తోపాటు ఫ్లానింగ్ విభాగాలుగా విభజించారు. కార్యాలయ నిర్వహణకు ఇవి ఎంతో కీలకం.

ఇందులో ఇంజినీరింగ్, అకౌంట్స్, పీఎఫ్, నియామకాల విభాగాలు నిర్వహించే ఉద్యోగుల సీట్లకు గిరాకీ ఉంటుంది. ఇక్కడ నిత్యం ఆర్థిక లావాదేవీలు ఉండడంతో ఈ విభాగాల్లో పని చేసేందుకు వీలుగా అక్కడ కుర్చీల కోసం పాకులాడుతుంటారు. పాలకవర్గం మారినపుడు వారికి అనుకూలంగా లేని ఉద్యోగులను కీలక విభాగాల్లో నియమించకుండా పాలకవర్గం సైతం జాగ్రత్త పడుతూఉంటుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక విభాగాల్లో నియమించడానికి వీలుగా ప్రస్తుత చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి జెడ్పీ కార్యాలయంలో శాఖల మార్పిడి రెండుసార్లు చేపట్టారు.

గతంలో కొందర్ని మార్చినప్పటికీ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి విషయంలో ముఖ్యప్రణాళికాధికారి (సీఈఓ), చైర్‌పర్సన్ల మధ్య అంతరం పెరిగింది. అలాగే కార్యాలయ పరిధిలో టైఫిస్టుగా పనిచేస్తున్న సంతోష్‌ను కుటుంబ కలహాల ఫిర్యాదు మేరకు అరెస్టయినపుడు సస్పెండ్ చేయాల్సి ఉండగా..చైర్‌పర్సన్ అడ్డుపడ్డారు. అయితే నిబంధనల ప్రకారం సీఈవో నగేష్ సస్పెం డ్ చేశారు. దీంతో అప్పట్లో చైర్‌పర్సన్, సీఈవోల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. తాజాగా 15 మంది ఉద్యోగులకు శాఖల మార్పునకు చైర్‌పర్సన్ ధనలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.

అకౌంట్స్ విభాగంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న సెక్షన్ అధికారి సీటు మార్చాలని చైర్‌పర్సన్ నిర్ణయం తీసుకున్నారు. అతనితోపాటు ఇద్దరు సూపరింటెండెంట్లకు శాఖల మార్పిడి తప్పనిసరి. వీరితో కలసి 15 మందికి స్థానచలనంతోపాటు కొత్తగా వచ్చిన మరో ముగ్గురికి సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన సీఈవో మూడురోజులుగా మార్పునకు అనుమతించలేదు. ఇది జెడ్పీలో చర్చనీయూంశంగా మారింది. ఈ విషయం జెడ్పీ సీఈవో, చైర్‌పర్సన్ల మధ్య వివాదానికి దారితీసే పరిస్థితి ఉందని కొంతమంది ఉద్యోగులంటున్నారు.
 
పాలనా సౌలభ్యం కోసమే మార్పులు
జెడ్పీలో పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు చేసుకునే వీలుంది.  శాఖల మార్పు అనివార్యం.బాధ్యతాయుతం గా పనిచేస్తున్న వారిని మార్చినప్పు డు కొత్తసమస్యలు తలెత్తకుండా చేస్తాం.
- బి.నగేష్, జెడ్పీ సీఈవో
 
అభ్యంతరాలు ఉండడం సహజమే
జెడ్పీ పరిధిలో పాలనా పరమైన అం శా ల్లో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతోనే అంతర్గతమార్పులు చేస్తున్నాం.  శాఖల మార్పు వల్ల ఉన్నతాధికారులకు అభ్యంతరాలు ఉండడం సహజమే. మార్పులు చేసినపుడు వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి.
- చౌదరి ధనలక్ష్మి, జెడ్పీ చైర్‌పర్సన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement