ఉద్యోగంలో చేర్చుకోవడం ఎంత ముఖ్యమో.. తొలగించడం కూడా అంతే ముఖ్యం అంటూ, టెక్ కంపెనీ జర్నీ సీఈఓ 'ఆండ్రియాస్ రోట్ల్' (Andreas Roettl) చెబుతున్నారు. దీనికోసం నైపుణ్యం అవసరమని తమ మేనేజర్‌లను, టీమ్ లీడర్‌లకు సంస్థలే ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఫోటో ప్రింటింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్న టెక్ సంస్థ జర్నీ సీఈఓ ఆండ్రియాస్ రోట్ల్.. నాయకులంటే ఉద్యోగులను నియమించుకోవడం మాత్రమే కాదు, తొలగించడంలో కూడా కొంత నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అంతే కాకుండా నేను ఉద్యోగులను తొలగించడంలో చాలా మంచివాడినని ఆండ్రియాస్ పేర్కొన్నారు.
జర్నీ సంస్థలో ఉద్యోగులను ఎలా తొలగించాలో మా లీడ్‌లకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెడతాము. మీరు కూడా అలా చేయాలని ఆండ్రియాస్ వెల్లడించారు. ఉద్యోగి పనితీరును అంచనా వేయడానికి తొలగింపు విధానాలను తప్పకుండా నేర్చుకోవాలి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఉపయోగించడం వంటివి కూడా తెలుసుకోవాలి. పనితీరు ఎక్కువగా ఉన్న సిబ్బందికి మద్దతు ఇవ్వడం అత్యంత ప్రాధాన్యం అని అన్నారు.
తొలగించడానికి సంబంధించిన విధానాన్ని ఆండ్రియాస్ రోట్ల్ ఫుట్‌బాల్ ఆటతో పోల్చారు. ఇక్కడ ఆటగాళ్లకు హెచ్చరికగా పసుపు కార్డు అందుతుంది. దీనిని మొదటి హెచ్చరికగా వెల్లడించాలి. పనితీరును మెరుగుపరచుకోవాలి, కష్టపడుతున్న ఉద్యోగులతో సంభాషణలు జరపాలని చెప్పాలి.
ఇదీ చదవండి: పోయిన రూ.5 కోట్ల కారు: పట్టించిన ఎయిర్‌పాడ్స్ - ఎలా అంటే?
మొదటిసారి పసుపు కార్డు అందుకున్న వ్యక్తి పనితీరులో ఎలాంటి పురోగతి కనిపించకపోతే.. రెండవ పసుపు కార్డును ఇవ్వాలి. ఇది వారు తమ ఉద్యోగానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని తెలియజేస్తుందని అన్నారు. రెడ్ కార్డు ఇవ్వాల్సిన సందర్భాలు వస్తే.. అది వేరే కథ. దానికి వేరే ప్రాసెస్ ఉంటుందని అన్నారు. ఆండ్రియాస్ రోట్ల్ చేసిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే ఆండ్రియాస్ ఫాలో-అప్ సందేశాన్ని పేర్కొన్నారు. నా సందేశం వల్ల బాధ కలిగి ఉండే క్షమాపణలు కోరుతున్నా అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment