ప్రకాశం ,కనిగిరి:
సెల్‌ఫోన్ రాకతో తరం మారిపోయింది. టెక్నాలజీ అంతా చేతిలోకి వచ్చింది. కానీ దీనిని కొంతమంది యువత అనైతిక కార్యకలపాలకు వాడటం అలవాటుగా మారింది. నగ్న దృశ్యాలకు ఫొన్.. కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. పైగా సోషల్ మీడియా అంటూ అటువంటి చిత్రాలను అందరికీ షేర్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. కనిగిరిలో తాజాగా చోటు చేసుకున్న ఘటనతో పాటు ఎన్నో సంఘటనలకు పట్టణం వేదికగా మారింది.
⇔ ఓ యువతితో స్నేహం నటించిన యువకుడు.. మరో ఇద్దరి స్నేహితులతో కలిసి కనిగి శివారు ప్రాంతాలకు తీసుకెళ్లారు. డిగ్రీ చదువుతున్న ఆమెపై అత్యాచార యత్నం చేశారు. ఇది ఆగస్టులో జరగ్గా మంగళవారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ముర్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
⇔ కొద్ది కాలం క్రితం కొందరు యువకులు ఓ యుతిని కనిగిరి కొండపైకి తీసుకెళ్లి మద్యం తాపించి అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుంగా యువతితో చేసిన వికృత చేష్టలను సెల్‌లో చిత్రీకరించి స్నేహితులకు షేర్ చేసి పైశాచిక ఆనందం పొందారు. దీంతో ఆమె ఊరు వదిలి వెళ్లింది.
⇔ ఇటీవల పట్టణానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి ఓ మహిళకు లిప్ లాక్ పెడుతూ సెల్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియో పట్టణంలో హల్ చల్ చేసింది. దీంతో ఆ మహిళ కూడా కనిగిరి వదిలి వెళ్లినట్లు తెలిసింది.
⇔ ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థిని సెల్ ఫోన్ ద్వారా కనిగిరి మండలంలోని శ్రీరంగాపురానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. అయితే ఆ యువకుడికి వివాహం జరుగుతున్నట్లు తెలుసుకుని ఒంటరిగా కనిగిరికి వచ్చింది. ఆర్ధరాత్రి 1 గంట సమయంలో ఆటోవాలాలు అపహరించబోయారు. ఇంతలో పోలీసులు గమనించి కాపాడారు.
సెల్లీ థింగ్స్!
Published Wed, Sep 27 2017 6:56 AM | Last Updated on Wed, Sep 27 2017 7:02 AM
Advertisement
Advertisement