
సాక్షి, దర్శి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే తన రాజకీయ పయనం ఉంటుందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన కుమారుడి వివాహం, సొంత పనుల కారణంగా రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు.
కాగా, ప్రకాశం జిల్లా దర్శిలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని స్పష్టంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో తిరిగి వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్నారు. దర్శి పట్టణం, నియోజకవర్గంలో ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం త్వరలో టెండర్లు పిలుస్తున్నట్టు తెలిపారు. దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిశాక గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళతానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment