ప్రకాశంలో వైఎస్ఆర్ సీపీ జయభేరి.. జెడ్పీ పీఠం సొంతం | YSRCP wins Prakasham ZP chirman | Sakshi
Sakshi News home page

ప్రకాశంలో వైఎస్ఆర్ సీపీ జయభేరి.. జెడ్పీ పీఠం సొంతం

Published Tue, May 13 2014 7:52 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

ప్రకాశంలో వైఎస్ఆర్ సీపీ జయభేరి.. జెడ్పీ పీఠం సొంతం - Sakshi

ప్రకాశంలో వైఎస్ఆర్ సీపీ జయభేరి.. జెడ్పీ పీఠం సొంతం

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. జిల్లాలో మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలు సాధించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. జిల్లాలో మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్లో వెలువడిన  తొలి జెడ్పీ చైర్మన్ ఫలితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి రావడం విశేషం. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తోంది. అత్యధిక ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిచింది. ఈ మూడు జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ పదవులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకునే దిశగా మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. ఇక గుంటూరు, కృష్ణా, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో టీడీపీతో హోరాహోరీగా సీట్లను గెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా అందాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement