ప్రకాశం: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. చెరుకూరు గ్రామానికి చెందిన నవాబు సురేశ్(28) పుట్టుకతోనే మూగవాడు.అదే గ్రామానికి చెందిన ఆరుద్ర సాంబయ్య అనే వ్యక్తి సోమవారం రాత్రి సురేశ్‌ను కత్తితో నరికి ఆటోలో పారిపోయాడు.
వివాహేతర సంబంధం నేపథ్యంలో సాంబయ్య, సురేశ్‌ను హత్య చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సురేశ్ భార్య, సాంబయ్యకు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉందని ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పలు సార్లు ఘర్షణ జరిగిందని స్థానికులు తెలిపారు.