ఏలూరు అర్బన్ : కోళ్లఫారంలో పనిచేస్తున్న ఓ వివాహిత మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి కథనం ప్రకారం.. పెదవేగి మండలం ముండూరులోని ఒక కోళ్లఫారంలో గెడ్డం ప్రభావతి భర్త శామ్యూల్‌తో కలిసి పనిచేస్తోంది. ఆమె దీర్ఘకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. దానికి మందులు కూడా వాడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం విపరీతమైన కడుపునొప్పి రావడంతో తాళలేక భర్తలేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితికి చేరుకుంది. భర్త వచ్చి ఆమె అచేతనంగా పడి ఉండడం గమనించి వెంటనే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.