భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని ఓ వివాహిత తన 16 నెలల కూతురికి ఉరివేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది.
కాగజ్‌నగర్ రూరల్ (సిర్పూర్): భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని ఓ వివాహిత తన 16 నెలల కూతురికి ఉరివేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సీతానగర్ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. నజ్రూల్‌నగర్ విలేజ్ నంబర్ 1కు చెందిన ప్రదీప్ బిశ్వాస్, సీతానగర్ గ్రామానికి చెందిన జయబిశ్వాస్ (29)లు భార్యాభర్తలు.
వీరికి కుషి బిశ్వాస్ (16నెలలు) పాప ఉంది. ఆరు నెలలుగా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో విసిగి పోయిన జయ బిశ్వాస్ పుట్టింటికి వెళ్లిపోయింది. మృతురాలి తండ్రి నరేశ్‌రాయ్ కూడా పలుసార్లు అల్లుడిని బతిమిలాడినా మారలేదు. దీంతో విసిగిపోయిన జయబిశ్వాస్ బుధవారం సీతానగర్‌లోని తల్లిగారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముందుగా బిడ్డకు ఉరివేసింది. ఆ తర్వాత తాను దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.