
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను బజారుకీడుస్తున్నాయి. కొన్ని సంబంధాలు హద్దులు దాటడంతో అవి చివరకు హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. దీంతో వారి పిల్లలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. ఆమెకు పదేళ్ల క్రితం పెళ్లై ఇద్దరు పిల్లలుగా పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. తీరా ఆమె ప్రియుడితో బెడ్ రూమ్‌లో రాసలీలలు కొనసాగిస్తూ భర్త రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. అనంతరం దారుణానికి ఒడిగట్టింది.
వివరాల ప్రకారం.. పుర్నియ జిల్లా చకర్పద గ్రామానికి చెందిన పోషిత్ కుమార్‌కు సావిత్రిదేవితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, సావిత్రిదేవి వారి ఇంటి పక్కనే ఉండే మరోవ్యక్తి అరవింద్ మహల్దార్‌తో కొద్ది రోజులుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. కాగా, ఓరోజు కుమార్ పని నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి సావిత్రి బెడ్‌రూమ్‌లో తన ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.
దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తమ బండారం బయటపడటంతో ప్రియుడు మహల్దార్‌తో కలిసి సావిత్రి.. కుమార్ మెడకు తాడు బిగించి దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలో కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సావిత్రి, అరవింద్ మహల్దార్‌ను అరెస్ట్ చేశారు.
ఇది చదవండి: హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు..
Comments
Please login to add a commentAdd a comment