
అధినేతను కలిసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
మండపేట : నగరం గ్యాస్ దుర్ఘటనలో బాధితులను పరామర్శించేందుకు జిల్లాకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఆదివారం పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలుసుకున్నారు. నగరం దుర్ఘటన బాధితులను పరామర్శించిన అనంతరం శనివారం రాత్రి జగన్‌మోహన్‌రెడ్డి పినపళ్లలో మాజీమంత్రి సంగిత వెంకటరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మండపేటలో పార్టీ వాణిజ్యవిభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడుకు చెందిన కామత్ ఆర్కెడ్‌లో బసచేశారు. ఆయనను కలుసుకొనేందుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కామత్ ఆర్కెడ్ ఆదివారం కిక్కిరిసిపోయింది.
పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, మండపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల కోఆర్డినేటర్లు గిరజాల వెంకటస్వామినాయుడు, గుత్తుల సాయి, పార్టీ కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, పార్టీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, పోతంశెట్టి ప్రసాద్, సిరిపురపు శ్రీనివాసరావు, వల్లూరి రామకృష్ణ, సత్తి వెంకటరెడ్డి, దూలం వెంకన్నబాబు, తాడి విజయభాస్కరరెడ్డి, తుపాకుల ప్రసన్నకుమార్, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అధినేతను కలుసుకున్నారు. జగన్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. స్థానిక పరిస్థితులపై పలువురు నేతలు ఆయనతో చర్చించారు. ఉదయం 9.30 గంటలకు మండపేట నుంచి జగన్‌మోహన్‌రెడ్డి రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన వెంట తరలి వెళ్లారు.
ఘనంగా వీడ్కోలు
మధురపూడి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి రాజమండ్రి విమానాశ్రయంలో పలువురు పార్టీ నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన ఆదివారం ఉదయం 10.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. 10.35 గంటలకు జెట్ ఎయిర్‌వేస్ విమానంలో హైదరాబాద్ వెళ్లారు. జగన్‌మోహన్‌రెడ్డికి వీడ్కోలు పలికినవారిలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, వరుపుల సుబ్బారావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మి, కర్రి పాపారాయుడు, అనంతఉదయభాస్కర్, సుంకర చిన్ని, శెట్టిబత్తుల రాజబాబు, కామన ప్రభాకరరావు, జక్కంపూడి రాజా, తాడి విజయభాస్కర్‌రెడ్డి, కానుబోయిన సాగర్, గుర్రం గౌతమ్, యడ్ల సత్యనారాయణ ఉన్నారు.