- మంత్రులు పత్తిపాటి, దేవినేని ఆకాంక్ష
- పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం
ముకుందరెడ్డి మరింత ఉన్నతి సాధించాలి
Published Sun, Nov 6 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
మండపేట :
జాతీయస్థాయిలో బిగ్గెస్ట్ లేయర్ కోళ్లరైతు అవార్డు గ్రహీత కర్రి వెంకట ముకుందరెడ్డి మరింత ఉన్నతిని సాధించాలని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు ఆకాంక్షించారు. విజయవాడలో ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముకుందరెడ్డిని ఘనంగా సత్కరించి, మంత్రుల చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు. బిక్కవోలు మండలం బలభధ్రపురంలో కేపీఆర్ గ్రూప్ సంస్థల్లో భాగంగా శ్రీలక్ష్మి పౌల్ట్రీస్ పేరిట రెండు దశాబ్దాల క్రితం రెండు లక్షల లేయర్ కోళ్లతో ఫారమ్‌ను ఏర్పాటు చేసిన ముకుందరెడ్డి అంచెలంచెలుగా శ్రీ లక్ష్మి ఎగ్‌ఫార్మ్ ప్రైవేటు లిమిటేడ్ పేరిట ఏపీ, కర్ణాటకల్లో 28 లక్షల లేయర్ కోళ్లతో ఫారాలు నెలకొల్పారు. ముకుందరెడ్డిని జాతీయ గుడ్ల సమన్వయ సంస్థ(నెక్) అక్టోబర్ 14న ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి చేతుల మీదుగా సత్కరించి అవార్డును అందజేసింది. విజయవాడ సత్కారంలో ముకుందరెడ్డి మాట్లాడుతూ పౌల్ట్రీపరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రులను కోరారు. ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు, జిల్లాకు చెందిన పలువురు కోళ్ల రైతులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement