mukundareddy
-
ముకుందరెడ్డి మరింత ఉన్నతి సాధించాలి
మంత్రులు పత్తిపాటి, దేవినేని ఆకాంక్ష పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం మండపేట : జాతీయస్థాయిలో బిగ్గెస్ట్ లేయర్ కోళ్లరైతు అవార్డు గ్రహీత కర్రి వెంకట ముకుందరెడ్డి మరింత ఉన్నతిని సాధించాలని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు ఆకాంక్షించారు. విజయవాడలో ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముకుందరెడ్డిని ఘనంగా సత్కరించి, మంత్రుల చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు. బిక్కవోలు మండలం బలభధ్రపురంలో కేపీఆర్ గ్రూప్ సంస్థల్లో భాగంగా శ్రీలక్ష్మి పౌల్ట్రీస్ పేరిట రెండు దశాబ్దాల క్రితం రెండు లక్షల లేయర్ కోళ్లతో ఫారమ్‌ను ఏర్పాటు చేసిన ముకుందరెడ్డి అంచెలంచెలుగా శ్రీ లక్ష్మి ఎగ్ఫార్మ్ ప్రైవేటు లిమిటేడ్ పేరిట ఏపీ, కర్ణాటకల్లో 28 లక్షల లేయర్ కోళ్లతో ఫారాలు నెలకొల్పారు. ముకుందరెడ్డిని జాతీయ గుడ్ల సమన్వయ సంస్థ(నెక్) అక్టోబర్ 14న ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి చేతుల మీదుగా సత్కరించి అవార్డును అందజేసింది. విజయవాడ సత్కారంలో ముకుందరెడ్డి మాట్లాడుతూ పౌల్ట్రీపరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రులను కోరారు. ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు, జిల్లాకు చెందిన పలువురు కోళ్ల రైతులు పాల్గొన్నారు. -
జిల్లాల ఏర్పాటులో రాజకీయాలు
సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి హుస్నాబాద్: హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలంటూ చేపట్టిన నిరహారదీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. గురువారం దీక్షలో తోటపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. దీక్షలను సందర్శిన సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా ఏర్పాటులో రాజకీయం నడుస్తున్నదన్నారు. హుజురాబాద్‌ను హన్మకొండలో చేర్పించేందుకు మంత్రి హారీష్‌రావు సహకారం తీసుకుంటున్న ఎమ్మెల్యే సతీష్‌కుమార్, హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలుపుతున్నాడని అన్నారు. హుస్నాబాద్ ప్రాంతం నుంచి దాదాపు 3వేల మందికి పైగా గిరిజనులు కరీంనగర్లో జీవనోపాధి పొందుతున్నారని, వందలాది మంది జిల్లాకేంద్రంలో ఉన్నత చదువులు అభ్యాసిస్తున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి హుస్నాబాద్, కొహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశాడు. హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు భీమాసాహెబ్, నాయకులు కొమురయ్య, సత్యనారాయణ, శివరాజ్, సింగిల్ విండో డైరెక్టర్ ∙మల్లికార్జున్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శంకర్‌రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్, చందు, బీజేపీ నాయకులు దేవేందర్‌రెడ్డి, విద్యాసాగర్, సీపీఐ నాయకులు శ్రీధర్ పాల్గొన్నారు.