- సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి
జిల్లాల ఏర్పాటులో రాజకీయాలు
Published Thu, Sep 1 2016 10:51 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
హుస్నాబాద్: హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలంటూ చేపట్టిన నిరహారదీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. గురువారం దీక్షలో తోటపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. దీక్షలను సందర్శిన సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా ఏర్పాటులో రాజకీయం నడుస్తున్నదన్నారు. హుజురాబాద్‌ను హన్మకొండలో చేర్పించేందుకు మంత్రి హారీష్‌రావు సహకారం తీసుకుంటున్న ఎమ్మెల్యే సతీష్‌కుమార్, హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలుపుతున్నాడని అన్నారు. హుస్నాబాద్ ప్రాంతం నుంచి దాదాపు 3వేల మందికి పైగా గిరిజనులు కరీంనగర్‌లో జీవనోపాధి పొందుతున్నారని, వందలాది మంది జిల్లాకేంద్రంలో ఉన్నత చదువులు అభ్యాసిస్తున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి హుస్నాబాద్, కొహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశాడు. హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు భీమాసాహెబ్, నాయకులు కొమురయ్య, సత్యనారాయణ, శివరాజ్, సింగిల్ విండో డైరెక్టర్ ∙మల్లికార్జున్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శంకర్‌రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్, చందు, బీజేపీ నాయకులు దేవేందర్‌రెడ్డి, విద్యాసాగర్, సీపీఐ నాయకులు శ్రీధర్ పాల్గొన్నారు.
Advertisement