నూతన జిల్లాల మ్యాప్
-
కొత్త జిల్లాల ఏర్పాటుపై బిగుస్తున్న రాజకీయ పట్టు...
-
ప్రత్యేక జిల్లా కోసం నేడు నడిగడ్డ బంద్
-
కొడంగల్, దౌల్తాబాద్ బంద్‌కు పిలుపునిచ్చిన అఖిలపక్షం
-
శంషాబాద్‌లోకి షాద్‌నగర్, కల్వకుర్తిలోని కొన్ని మండలాలు
సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొత్త జిల్లాలకు ప్రభుత్వం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాటిలో తమ ప్రాంతానికి స్థానం ఉంటుందని ఆశపెట్టుకున్న వారిలో నిరాసక్తత వ్యక్తమవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాను మూడు జిల్లాలుగా చేయాలని ప్రభుత్వం ఆదినుంచి భావించి ఆ మేరకు కసరత్తు చేసింది. అయితే జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడంపై రాజకీయ పక్షా లు పెద్దగా అభ్యంతరాలు లేనప్పటికీ జి ల్లా కేంద్రాలుగా ఆవిర్భావించే ప్రాంతాలపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల కారణంగా భౌగోళికంగా, రాజకీయంగా జిల్లా స్వరూపం పూర్తిగా మారునుందన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది.
శంషాబాద్ పరిధిలోకి షాద్‌నగర్, పలు మండలాలు
అనూహ్యంగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ జిల్లా పరి ధిలోకి షాద్‌నగర్ నియోజకవర్గాన్ని, కల్వకుర్తి మండలంలోని పలు మండలాలను చేర్చే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు ఆయా ప్రాంతాల ప్రజల్లో గుబులురేపుతోంది. కేశంపేట, కొత్తూర్, షాద్‌నగర్‌ల పోలీస్‌స్టేçÙన్‌లను శంషాబాద్ కమిషనరేట్‌కు అనుసంధానం చేయగా ఇప్పుడు జిల్లాపరంగాను షాద్‌నగర్ నియోజకవర్గాన్ని శంషాబాద్ జిల్లాలో కలిపేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆప్రాంత ప్రజల్లో కలవరం రేపుతున్నాయి.
ఎవరి డిమాండ్ వారిదే..
నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన జిల్లాల పునర్విభజన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో జిల్లాకు చెందిన అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్త జిల్లాల ఏర్పాటుపై తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టి చెప్పారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ గద్వాలను జిల్లాగా ప్రకటించాల్సిందేనని పట్టుబట్టారు. డీకే అరుణ డిమాండ్ ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మద్ధతు పలికారు. అలాగే నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి నారాయణపేటను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేయగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి వనపర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని పట్టుబట్టారు. ఇక టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం రెండు ముక్కలు కానుంది.
ఆందోళనలకు పిలుపు
కొత్త జిల్లాలో గద్వాలకు స్థానం లేదని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ జిల్లా సాధన సమితి శుక్రవారం గద్వాల పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది. కొత్తజిల్లాలో మండలాలను పూర్తి చేశాకే రాజకీయ వర్గాల్లో అసంతప్తి వ్యక్తమవుతుంది. జిల్లాలో మహబూబ్‌నగర్ రూరల్ మండలంతోపాటు మరో ఆరు మండలాలు కొత్తగా ఆవిర్భావించనున్నాయి. అలాగే షాద్‌నగర్, కల్వకుర్తిలను రెవెన్యూ డివిజన్‌లుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. జిల్లాల అవకాశాలు, వనరులపై జిల్లా యంత్రాంగం ఇప్పటికి ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. ఈ నెల 20వ తేదీన జరగనున్న అఖిలపక్ష సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వవైఖరి పట్ల ఘాటుగా స్పందించేందుకు కాంగ్రెస్, టీడీపీలు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.