క్రికెట్‌ బెట్టింగ్‌ వల్లే జసిత్‌ కిడ్నాప్‌! | Police Suspects Jashith Relatives In Kidnap Case In East Godavari | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ వల్లే జసిత్‌ కిడ్నాప్‌!

Published Mon, Aug 5 2019 8:53 AM | Last Updated on Mon, Aug 5 2019 10:40 AM

Police Suspects Jashith Relatives In Kidnap Case In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి(కాకినాడ) : మండపేటలో బ్యాంకు ఉద్యోగుల కుమారుడు జసిత్‌ కిడ్నాప్‌  క్రికెట్‌ బెట్టింగ్‌ నేపథ్యంలోనే సాగిందని ఎస్పీ అద్నాన్‌ నయిమ్‌ అస్మీ తెలిపారు. ఆయన ఆదివారం తమ కార్యాలయంలో ఆ వివరాలను విలేకరులకు తెలియజేశారు. అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విలేకరుల ప్రశ్నకు పైమేరకు సమాధానమిచ్చారు. 17 మంది బుకీలు ఈ కిడ్నాప్‌ సంఘటనలో ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు. ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో బాలుడి బంధువులు కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ తెలిపారు. బాలుడిని మూడు రోజుల పాటు దాచేందుకు ఉపయోగించిన స్థలాలను నిర్థారించామన్నారు. 

చదవండి: సిత్‌ను కిడ్నాప్‌ చేసింది ఎవరు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement