East Godavari Crime News
-
దారుణం: కస్తూర్భ టీచర్‌పై భర్త కత్తి దాడి
సాక్షి, తూర్పు గోదావరి: తుని మండలం వి.కొత్తూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కస్తూర్భా బాలికలో విద్యాలయంలో పనిచేస్తున్న జూవాలజీ టీచర్‌పై ఆమె కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేగింది. భర్త విచక్షణంగా దాడి చేయడంతో సదరు ఉపాధ్యాయురాలు మధురాక్షి తీవ్ర గయాలయ్యాయి. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకుని గాయపడిన మధురాక్షిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ తగాదాలే దాడికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
బాలుడి సరదా ఆటతో ఆవిరైన తండ్రి కష్టం
అమలాపురం టౌన్: స్థానిక గణపతి థియేటర్ సమీపంలో ఓ బాలుడు సరదాగా తన తల్లి స్మార్ట్ ఫోన్ నుంచి ఆడిన ఆన్లైన్ గేమ్‌తో రూ.5.40 లక్షల దోపిడీకి గురై ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో.. ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కాక ఆ బాలుడి తల్లి తల్లడిల్లుతోంది. ఆన్లైన్ గేమ్ పేరుతో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు రూ.లక్షలు పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. అమలాపురం పట్టణ పోలీసులకు బాలుడి తల్లి చెప్పిన వివరాలతో ఈ ఆన్లైన్ గేమ్ మోసంలో మరిన్ని కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఆ బాలుడు తన తల్లి స్మార్ట్ ఫోన్‌తో ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొంటూనే ఖాళీ సమయాల్లో సరదాగా ఆన్లైన్ గేమ్‌ల్లోకి వెళ్లాడు. 20 రోజులుగా ఆ గేమ్‌లు ఆడుతున్నాడు. ఫ్రీ ఫైర్ అనే ఆన్లైన్ గేమ్ యాప్‌ను ఓపెన్ చేశాడు. అందులో వెపన్స్ కొనాలంటే ఫలానా లింక్ ఓపెన్ చేయమంటే అదీ కూడా ఓపెన్ చేశాడు. (అవకాశాలు అంత తేలికకాదు.. ) అందులో ఈ గేమ్ యాప్ నిర్వాహకులు తెలివిగా తొలుత ఆ వెపన్స్ రూ.వంద నుంచి ధర చూపించాడు. ఓటీపీ అడిగినప్పుడు అదీ కూడా టైప్ చేసేశాడు. అలా ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ల విషయాలన్నీ అవతలి వారికి తెలిసే ప్రక్రియ అందులో ఉంటుంది. రూ.వందతో మొదలైన వెపన్స్ కొనుగోలు రూ.400, రూ.1000 నుంచి రూ.5000 వరకు ధరలతో బాలుడి తన స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడంతో తన తల్లికి సంబంధించిన రెండు బ్యాంక్‌ల అకౌంట్ల నుంచి 20 రోజుల్లో మొత్తం రూ.5.40 లక్షలు డ్రా అయ్యాయి. 20 రోజుల్లో రోజుకు కొంత మొత్తం వంతున అంతా ఆన్లైన్ మోసంతో కొల్లగొట్టేశారు. తల్లి ఏదో అవసరం పడి శనివారం ఏటీఎంకు వెళ్లి రూ.15 వేలు డ్రా చేసేందుకు పిన్ కొడితే డబ్బులు రాలేదు. మళ్లీ రూ.10 వేలు డ్రా చేస్తే నగదు వచ్చింది. అయితే రూ.10 వేలు డ్రా అయిన తర్వాత తన స్మార్ట్ ఫోన్‌కు రూ.1000 మాత్రమే బ్యాలెన్స్ చూపడంతో తల్లి కంగారు పడింది. తర్వాత రెండు బ్యాంక్‌లకు వెళ్లి ఆరా తీస్తే రెండు అకౌంట్లలో డబ్బులన్నీ డ్రా అయినట్టు చెప్పడంతో ఆమెకు చెమటలు పట్టాయి. పోలీసులు ఈ కేసుపై పలు కోణాల్లో ఆదివారం ఉదయం విచారించారు. అయితే గేమ్ ఆడినప్పుడల్లా డబ్బులు డ్రా అయినట్టు స్మార్ట్ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నా అవి గజిబిజిగా ఉండడంతో అంతగా చదువుకోని ఆమె పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. ఓటీపీ ఇవ్వడం, డ్రా అయిన డబ్బులకు మెసేజ్‌లు రావడంతో పోలీసులు ఈ కేసు సైబర్ నేరం కింద వస్తుందా? రాదా? అనే దానిపై సైబర్ నేరాల నిపుణలతో సంప్రదిస్తున్నారు. ఆమె భర్త కువైట్‌లో ఉంటూ తాను అక్కడ కష్ట పడి పనిచేస్తూ భార్య, పిల్లల కోసం రూ.లక్షలు కూడబెట్టి బ్యాంక్‌లో వేస్తే తమ కొడుకు సరదాగా ఆడిన ఆట ఆ కుటుంబాన్ని కోలుకోని దెబ్బతీసింది. పరాయి దేశంలో తన కుటుంబ కోసం శ్రమకోర్చి సమకూర్చుకున్న ఆదాయం ఇక్కడ అన్లైన్ మోసంతో ఆవిరైపోయింది. -
‘నేను స్పెషలాఫీసర్‌ని.. ఇది నా ఐడీ’
సాక్షి, సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం) : సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో సోమవారం హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి బాలాజీపేటకు చెందిన 40వ వార్డు సచివాలయ కార్యదర్శులను వెంటబెట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా తహసీల్దార్ గదిలోకి వెళ్లి ఆయన సీట్లో కూర్చున్నాడు ‘‘నేను సీఎం కార్యాలయం నుంచి వచ్చిన స్పెషలాఫీసర్‌ను, ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది’’ ఇది నా ఐడీ అని చూపించాడు. తన పేరు ఉపేంద్ర రోషన్ అని తన సెల్ నంబర్: 6301814060గా చెప్పాడు. తహసీల్దార్ సుస్వాగతం అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజును పిలిచి వివరాలు అడిగాడు. బుధవారం మళ్లీ వస్తానని అప్పటికి అన్ని రికార్డులు సిద్ధం చేసి ఉంచాలని చెప్పి వెళ్లిపోయాడు. (టార్గెట్ వైఎస్సార్సీపీ! ) సందేహం కలిగిన డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు ప్రభుత్వ కార్యాలయానికి ఫోన్ చేసి ఆరా తీయగా అటువంటి వ్యక్తి ఎవరూ లేరని చెప్పారు. దీంతో సాయంత్రం ఆ వ్యక్తికి ఫోన్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరగా, తొలుత వీలుపడదని చెప్పాడు. అయితే డిప్యూటీ తహసీల్దార్ గట్టిగా చెప్పడంతో రాత్రి ఏడు గంటలకు కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న టూటౌన్ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతడు రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన వాడని, బీఎడ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని టూటౌన్ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగురోజులుగా రాజమహేంద్రవరంలో పలు సచివాలయాలకు వెళ్లి, తాను సీఎం పేషీ నుంచి వచ్చానని అక్కడి సిబ్బందిపై హడావుడి చేస్తూ వస్తున్నాడని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన వారి ఫోన్ నంబర్లన్నీ అతడి ఫోన్లో ఉండడం కొసమెరుపు. నకిలీ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: నగర శివారు తిమ్మాపురం గ్రామ పంచాయతీ అవంతి నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందాను తిమ్మాపురం పోలీసులు రట్టు చేశారు. తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాకినాడ డీఎస్పీ భీమారావు, కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ ఈ వివరాలు వెల్లడించారు. దుర్గాడకు చెందిన కొటికలపూడి రాజు, చీడిగ గ్రామానికి చెందిన వాసంశెట్టి ఇందిరా ప్రియదర్శిని కలిసి ఫ్యామిలీ పేరుతో అవంతి నగర్లో అద్దెకు ఇల్లు తీసుకున్నారు. గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన అప్పాజీ, బెంగళూరుకు చెందిన ఏజెంట్ రాజేష్‌ల ద్వారా అమ్మాయిలను రప్పించి గుట్టుగా వ్యభిచార దందా సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందే బెంగళూరు నుంచి రప్పించిన ఇద్దరు అమ్మాయిలను అడ్డం పెట్టుకుని కాకినాడ చుట్టుపక్కల వ్యక్తులను ఫోన్ల ద్వారా రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో సీఐ మురళీకృష్ణ, ఎస్సై విజయ్‌కుమార్, సిబ్బంది దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్నారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు బెంగళూరు అమ్మాయిలకు విముక్తి కల్పించారు. నిందితుల్లో ఏజెంట్ రాజేష్, కొటికలపూడి రాజు, ప్రియదర్శిని, గుర్తేడుకు చెందిన సతీష్, కొత్తపల్లికి చెందిన అప్పాజీ, కరపకు చెందిన పెంకే శ్రీనుబాబు, విటులు పంపన రాముడు, దబరిక సూరిబాబు ఉన్నారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు రాజేష్‌తో పాటు సతీష్, అప్పాజీలు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన వారిని కోర్టులో హాజరు పరుస్తామని, బెంగళూరుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను బాధితులుగా గుర్తించి నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. వారి ఉత్తర్వుల ప్రకారం ఆ అమ్మాయిలను ప్రొటెక్షన్ హోమ్‌కు పంపుతామని డీఎస్పీ తెలిపారు. వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేసిన సీఐ, ఎస్సైలతో పాటు సిబ్బంది శ్రీనివాసరావు, సూర్యచంద్ర, మొహిద్దీన్, శిరీష, ఐడీ పార్టీ సిబ్బంది సత్యనారాయణ, ప్రసాద్‌బాబు, రవికుమార్, నారాయణరెడ్డిలను డీఎస్పీ అభినందించారు. -
ప్రియుడి మోసం.. విధుల్లో ఉండగానే
తూర్పుగోదావరి, పెద్దాపురం: మండలంలోని వడ్లమూరు రోడ్డులోని అపెక్స్ రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న యువతి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన మాడపల్లి పద్మ (24) ఈ పరిశ్రమలో కార్మికురాలు. సహచర ఉద్యోగితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్థాపానికి గురైన పద్మ ఫాక్యరీలోనే విధుల్లో ఉండగానే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది . పద్మ అక్కడికక్కడే మృతి చెందగా ఈ ఘటనను చూసిన ఒడిశాకు చెందిన సహచర యువతులు సోనాలి, మనీషా, గంగీలు అపస్మారక స్థితిలోకి చేరారు. దీంతో స్థానికులు వారిని పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వి,సురేష్ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్తమామల దాష్టీకం.. కర్టెన్ తాడుతో
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని మామిడికుదురు మండలం అప్పనపల్లిలో అమానుషం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న కడలి శాంతి అనే మహిళపై ఆమె అత్తమామలు మంగళవారం హత్యాయత్నం చేశారు. కర్టెన్ తాడుతో మహిళకు ఉరివేసేందుకు ప్రయత్నించగా ఆమె పెద్దగా కేకలు వేసింది. దీంతో అత్తమామలు ఆమెను కాలితో పొత్తి కడుపులో తన్నారు. బాధిత మహిళ కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోగా ఆమె ప్రాణాలతో బయటపడింది. కాగా శాంతి యూరినల్ ఆగిపోవడంతో ఆమెను హుటాహుటిన రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(మాస్టారు నీచత్వం: విద్యార్థితో) -
రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా..
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం అమలాపురం డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు రాజమహేంద్రవరం నుంచి అమలాపురం వెళ్లే బస్సు, అమలాపురం నుంచి రాజమహేంద్రవరం వస్తున్న బస్సులు రత్నా ప్లాస్టిక్స్ వద్ద అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేస్తూ అమలాపురం నుంచి వస్తున్న బస్సును ఎదురుగా ఢీ కొట్టాడు. అమలాపురం బస్సు విద్యుత్ సబ్ స్టేషన్ గేటు గోడకు ఢీ కొట్టాగా, రాజమహేంద్రవరం బస్సు కల్యాణి సోంపాపిడి కోట్టును ఢీ కొట్టి అగిపోయింది. ఈ సంఘటనలో పట్టి సీమ ఆలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న ఉప్పలగుప్తంకు చెందిన సలాది తాతారావు, ఆయన భార్య సలాది భ్రమరాంబ, వారి కుమార్తెలు మహేశ్వరి, వైష్ణవి తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరి కుటుంబం బస్సు ముందు భాగంలో కూర్చొవడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు నరేంద్రపురానికి చెందిన వెలుగుల శంకరరావు, కొత్తపేటకు చెందిన పచ్చమళ్ళ శ్రీనివాసరావు, అమలాపురానికి చెందిన సత్య, అనుషా స్వల్పగాయాలతో బయటపడ్డరు. మరి కొంత మంది గాయాల పాలవ్వగా వారికి ప్రాథమిక చికిత్స అందించారు. టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుమార్తెను ఇచ్చి వివాహం చేయనందుకే..
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: కడియం మండలం దుళ్ల గ్రామంలో జనవరి 21వ తేదీ అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న వారిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి నలుగురు మృతికి, ఇద్దరు చిన్నారులు గాయాల పాలవ్వడానికి కారణమైన నిందితులను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిమూషీ బాజ్‌పేయి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. కడియం మండలం దుళ్ల గ్రామంలో జనవరి 21వ తేదీ రాత్రి రెండు గంటాల సమయంలో కోట్ని సత్యవతి(50) ఆమె కుమారుడు కోట్ని రాము(16) కుమార్తె గంటాా దుర్గా భవానీ(30) భవానీ కుమార్తె గంటాా విజయలక్ష్మి, మరో ఇద్దరు గంటా దుర్గా మహేష్, గంటాా యేసు కుమార్ ఒకే గదిలో నిద్రిస్తుండగా కడియం మండలం, మురమండ గ్రామానికి చెందిన మాసాడ శ్రీను, అతడి బావ మర్లపూడి మోహన్‌లు ఇంటి తలుపులు తీసి పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యారని తెలిపారు. ఈ సంఘటనలో కోట్ని రాము(16), గంటా విజయలక్ష్మి(5) అక్కడికక్కడే దగ్ధమై మృతి చెందారని తెలిపారు. తీవ్ర గాయాలతో కోట్ని సత్యవతి, గంటా దుర్గా భవానీ చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. వీరితో పాటు గాయాలపాలైన గంటా దుర్గా మహేష్, గంటా ఏసు కుమార్‌లు కోలుకున్నారని వివరించారు. వివాహం చేస్తామని చెప్పి.. మాట తప్పారని.. కోట్ని సత్యవతికి మేనల్లుడయ్యే మాసాడ శ్రీనుకు తన రెండో కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని అతడి వద్ద రూ.లక్ష నగదు తీసుకుందని, అనంతరం శ్రీను వ్యసనాలకు బానిస కావడంతో వివాహం చేయలేదని వివరించారు. మేనత్త కూతుర్ని తనకు కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి, తీసుకున్న అప్పు ఇవ్వకుండా తనను మోసం చేసిన మేనత్తపై కక్ష పెంచుకున్న మాసాడ శ్రీను ఆమె రెండో కుమార్తె రామలక్ష్మికి వేరే వివాహం చేశారని తెలుసుకొని జనవరి 17వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో దుళ్ల గ్రామంలోని సత్యవతి ఇంటికి వచ్చి ఆమె గొంతుపై చాకుతో దాడి చేసి పరారయ్యాడని తెలిపారు. ఈ సంఘటనపై కడియం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం తన మేనత్త బతికి ఉందని తెలుసుకున్న మాసాడ శ్రీను, అతడి బావ (అక్క భర్త) మర్లపూడి మోహన్‌లు, సత్యవతిని హత్య చేయాలని జనవరి 21వ తేదీ రాత్రి రెండు గంటల సమయంలో దుళ్ల గ్రామంలో ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకొని సత్యవతి ఇంట్లో పడుకున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి బయట తలుపు గొళ్లెం పెట్టాడని వివరించారు. గదిలో మంటలు వ్యాపించి గదిలో నుంచి బయటకు వచ్చేందుకు వీలులేక మంటల్లో కాలిపోతూ కేకలు వేశారని తెలిపారు. ఈ కేకలు విన్న స్థానికులు మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారని, ఈ సంఘటనలో కోట్ని రాము, గంటా విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. తీవ్ర గాయాలపాలైన కోట్ని సత్యవతి, ఆమె కుమార్తె గంటా దుర్గా భవాని చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. నిందితులను ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో విశాఖ జిల్లా రావికవతం మండలం, టి.అర్జాపురం గ్రామంలోని సిమెంట్ ఇటుకల బట్టీ వద్ద మాసాడ శ్రీను, మర్లపూడి మోహన్ లను సౌత్ జోన్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు, కడియం ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్ కుమార్ వారి సిబ్బంది సీహెచ్‌వీ రమణ, కె.సురేష్ బాబు, కె.బాల గంగాధర్, బి.నాగరాజుల సహాయంతో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని, స్పెషల్ టీమ్‌ను అభినందించి రివార్డు అందజేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకుతొమ్మిది ప్రత్యేక బృందాలు నిందితులను అరెస్ట్ చేసేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ షిమూషీ బాజ్‌పేయి తెలిపారు. ఎక్కడా ఆధారాలు లేకుండా మారణ హోమం సృష్టించిన నిందితులు ఆరు నెలలు ఒక చోట చొప్పున గ్రామాలు మారుతూ అప్పులు చేస్తుంటారని పోలీస్ విచారణలో తేలిందని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సంఘటన జరిగిన రాత్రి నిందితులు స్కూటీ పై దుప్పల పూడి వెళ్లి, కోళ్ల ఫారం వద్ద ఉంటున్న కుటుంబ సభ్యులకు ఏమి తెలియకుండా జాగ్రత్తపడ్డారని తెలిపారు. కోళ్లఫారం యజమాని వద్ద తమ కుమారుడికి వంట్లో బాగోలేదని చెప్పి రూ.రెండు వేలు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. సామర్లకోట రైల్వే స్టేషన్లో స్కూటీ మోటారు సైకిల్‌ను ఉంచి అనకాపల్లికి మకాం మార్చారని వివరించారు. మాసాడ శ్రీను, అతడి తండ్రి, తల్లి, అక్క, బావ వారి పిల్లలు నలుగురూ ఒక గ్రూప్‌గా ఉంటూ అప్పులు చేసి అక్కడి నుంచి పరారవుతుంటారని తెలిపారు. విశాఖ జిల్లా రావికవతం గ్రామంలో సిమెంట్ ఇటుకల బట్టీలో పనికి కుదిరారని, అక్కడ నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. -
జల్సాలకు అలవాటు పడి.. మైనర్లను ఉచ్చులోకి
తాళ్లరేవు: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు యువకుల్ని అరెస్ట్ చేసి జువైనల్ కోర్టుకు తరలించినట్లు కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ తెలిపారు. కోరంగి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాళ్లరేవు, కాజులూరు, ఐ.పోలవరం మండలాల పరిధిలో గత కొన్ని రోజులుగా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఐదుగురు యువకులను జార్జిపేట వై.జంక్షన్ వద్ద తమ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.25 వేల నగదు, సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులకు సంబంధించి ప్రధాన నిందితుడైన ఓలేటి మహాలక్ష్మిరావు అలియాస్ మహాను ఏ1గా నమోదు చేసి అతనిపై రౌడీషీట్ కూడా దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఎదుర్లంక గ్రామానికి చెందిన మహాలక్ష్మీరావు కాజులూరు మండలం గొల్లపాలెంలో దొంగతనాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. అతను జల్సాలకు అలవాటు పడి అభం శుభం తెలియని మైనర్లను ఈ ఉచ్చులోకి లాగుతున్నాడని తెలిపారు. ఆయా మండలాల పరిధిలోని నాలుగు కేసులకు సంబంధించి రికవరీలు చేశామన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఓ సుజుకీ బైక్, ఐ.పోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వైన్‌షాప్‌లో జరిగిన దొంగతనం కేసులో కొంతమేర నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులకు సంబంధించి ఉప్పంగల గ్రామంలో జరిగిన దొంగతనంలో మంగళసూత్రాలు, బంగారు నెక్లెస్, బ్రాస్లెట్, చెవి దుద్దులు, వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎంతో చాకచక్యంగా దొంగలను పట్టుకున్న కోరంగి ఎస్సై వై.సతీష్, ఏఎస్సై వలీ, సిబ్బంది పి.కాసురాజు, ఎన్వి రమణ, పి.సురేష్ తదితరులును అభినందించడంతో పాటు వారికి రివార్డులు అందించనున్నట్లు సీఐ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ మురళీకృష్ణ సూచించారు. ఇటీవల సెల్ఫోన్ల దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయని తమ సెల్ఫోన్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని రాత్రి వేళల్లో తలుపులు తెరచుకుని పడుకోరాదని అన్నారు. అలాగే తీర్థయాత్రలకు, ఎక్కడికైనా వెళ్లేటపుడు సెల్ఫోన్లో ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే నూతన గృహాలు నిర్మించుకునేవారు తమ ఇంటివద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ సూచించారు. సమావేశంలో ఎస్సై యడవల్లి సతీష్, ఏఎస్సై వలీ, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
చోరీ చేశారు.. చివరికి చిక్కారు
తూర్పుగోదావరి, మామిడికుదురు: సినీ ఫక్కీలో వారు బ్యాంకుకే కన్నం వేశారు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. మామిడికుదురులోని ఎస్బీఐలో చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇందులో ఏడుగురు అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారిని ఆదివారం రాజోలు కోర్టులో హాజరుపర్చారు. ఈ మేరకు రాజోలు పోలీస్ స్టేషన్లో సీఐ డి.దుర్గాశేఖరరెడ్డి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. చోరీకి 11 మంది సభ్యులు వ్యూహం రచించారు. ఇందులో ఓ మహిళతో సహా ఏడుగురిని గత నెల 30న మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఆదివారం రాజోలు కోర్టులో హాజరుపర్చిన వారిలో మహారాష్ట్రకు చెందిన సంతోష్హరి ఖాదం, సచిన్ హరోన్సిం«థే, మంగేష్ దనాజీగోర్, అముల్ మహదేవ్బాగల్, సవితా సంతోష్హత్కర్, యూపీకి చెందిన అస్లాం ఖాన్, జాఫర్ అలీ ఉన్నారు. నిందితుల నుంచి రూ.93,275 చిల్లర నాణేలతో పాటు రెండు చిన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన బాబు కౌసర్ అలియాస్ బాబూఖాన్, పస్తా అలియాస్ తాజాబ్ అలమ్కల్లుఖాన్, నవజాద్ నన్సార్ అలీ అలియాస్ సహబాజ్‌ఖాన్, ఖళియా ఇస్రాక్ అలీఖాన్ అనే గుడ్డూఖాన్లను మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కాతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసులో అరెస్టు చేశారు. వారిని మామిడికుదురు ఎస్బీఐ చోరీ కేసులో అదుపులోకి తీసుకోవాల్సి ఉందని సీఐ తెలిపారు. దోపిడీకి పాల్పడిన మిగతా సొమ్మును ఎక్కడ దాచారో వారి నుంచి కూఫీ లాగుతామన్నారు. నిందితులంతా పాత నేరస్తులే అన్నారు. కొల్హాపూర్‌లో వారిని అరెస్టు చేసి ట్రాన్సిట్ రిమాండ్‌కు తీసుకుని రాజోలు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చామన్నారు. అనంతరం రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. రెండు నెలల క్రితమే రెక్కీ ఈ ముఠా బ్యాంకు చోరీల్లో ఆరితేరారు. ఇందులో భాగంగా మామిడికుదురులో చోరీకి రెండు నెలల ముందే రెక్కీ నిర్వహించారు. రెండు కార్లలో అమలాపురం మీదుగా మామిడికుదురుకు గత నెల 24వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకున్నారు. ఆ కార్లను వెనక్కి తిప్పి పంపించేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్, సిలిండర్ల సాయంతో బ్యాంకు ప్రధాన ద్వారం తాళాలు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి స్ట్రాంగ్ రూమ్, సెల్ప్ లాకర్లను తెరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. స్ట్రాంగ్ రూమ్‌లోని అల్యూనిమినియం పెట్టెల్లో భద్రపరిచిన రూ.18.76 లక్షలను దోచుకుపోయారు. తెల్లవారు జామున 4.30 గంటల వరకు బ్యాంకులోనే ఉండి తరువాత బయటకు వచ్చి అక్కడ రెడీగా ఉన్న తమ వాహనాల్లోనే తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని కొల్హాపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులకు చిక్కారు. అక్కడి పోలీసుల నుంచి వచ్చిన సమాచారం మేరకు మన జిల్లా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న రాజోలు సీఐ డి.దుర్గాశేఖరరెడ్డితో పాటు వారి దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషాలు అభినందించారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
గండేపల్లి (తూర్పుగోదావరి) : ఇంజినీరింగ్ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై బి.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన కిలుకూరి అలేఖ్య (19) మండలంలోని సూరంపాలెంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ సెకండ్ ఇయర్ చదువుతూ, అదే కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటోంది. కొంతకాలం నుంచి తలనొప్పితో బాధపడుతూ విజయవాడలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటోంది. ఆదివారం ఉదయం 6.40 గంటల సమయంలో తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమె తాను ఉంటున్న హాస్టల్లోని నాల్గో అంతస్తు పైనుంచి కిందకు దూకేసింది. ఆమె తలకు బలమైన గాయమై రక్తస్రావం జరిగింది. పక్కగదిలో ఉన్న హాస్టల్ విద్యార్థినులు ఈ విషయం గమనించి వార్డెన్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను కళాశాల సిబ్బంది వెంటనే చికిత్స నిమ్తితం కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతురాలి తండ్రి ప్రసాద్ రెడ్డి, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై తెలిపారు. ప్రగడవరంలో విషాదఛాయలు చింతలపూడి: విద్యార్థిని ఆత్మహత్యతో స్వగ్రామం ప్రగడవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన చిలుకూరి ప్రసాద్‌రెడ్డి, నాగమణి దంపతుల కుమార్తె అలేఖ్య. విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన కాకినాడ తరలివెళ్లారు. చదువులో చలాకీగా ఉండే అలేఖ్య మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
వివాహేతర సంబంధానికి అడ్డు వచ్చాడని..
సాక్షి, తుని(తూర్పు గోదావరి) : వివాహేతర సంబంధానికి తరచూ అడ్డుతగులుతున్నాడన్న అక్కసుతో కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య ఉదంతమిది. తండ్రి, ప్రియుడు, ప్రియుడి స్నేహితుడి సహాయంతో భర్త హత్యకు ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేసి చివరికి జైలు పాలైంది. ఆమెకు సహకరించిన వారు కూడా కటకటాల పాలయ్యారు. ఈనెల 17వతేదీ రాత్రి తుని మండలం డి.పోలవరం బస్టాప్‌లో పడుకున్న చిల్లపల్లి అప్పారావు (38) హత్య గ్రామంలో సంచలనం కలిగించింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలను బుధవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ కొత్తూరి కిషోర్‌బాబు, రూరల్ ఎస్సై గణేష్ కుమార్ ఇలా వెల్లడించారు. (బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం) వారి కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా కలవచర్ల గ్రామానికి చెందిన చల్లపల్లి అప్పారావు(38) ఈనెల 17న హత్యకు గురయ్యాడు. 18న సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యలో పాల్గొన్న వంకల చినగవరయ్య(గున్నయ్య) బుధవారం గ్రామ వీఆర్వో వద్ద లొంగిపోగా, అతడిని విచారించగా హత్యతో సంబంధం ఉన్న చినగవరయ్య, చల్లపల్లి వేణు, వనశెట్టి ముసలయ్య(మురళి), లావేటి భానులను అరెస్టు చేశామన్నారు. చల్లపల్లి అప్పారావుకు తుని మండలం డి.పోలవరం గ్రామానికి చెందిన వేణుతో వివాహమైందని, స్వగ్రామంలో ఇతడిపై లైంగిక దాడి, దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. (దారుణం : బాలుడిపై సామూహిక అత్యాచారం) దీంతో అప్పారావు, భార్య వేణు మధ్య విభేదాలు తలెత్తి వేర్వేరుగా ఉండడంతో, వేణు తునికి చెందిన వనశెట్టి ముసలయ్య (మురళి) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుందన్నారు. భర్త గ్రామానికి వచ్చిపోతుండడం వేణు, మురళీలకు ఇబ్బందిగా మారింది. దీంతో కాపురాన్ని తుని పట్టణంలోకి వేణు మార్చింది. భర్తను పూర్తిగా వదిలించుకోవాలని భావించిన వేణు తన ప్రియుడు మరళి, అతడి స్నేహితుడు లావేటి భాను, తండ్రి గున్నయ్యలతో కలసి హత్యకు ప్రణాళిక సిద్ధం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఎప్పటిలాగే మద్యం సేవించి గ్రామానికి వచ్చిన అప్పారావును మామగారైన గున్నయ్య బస్టాప్‌లో పడుకోబెట్టాడు. తర్వాత మురళి, భానులు వెళ్లి లారీ కమాన్ప్లేటుతో బలంగా తలపై కొట్టి హత్య చేశారన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు అప్పగించినట్టు తెలిపారు. -
‘పెట్రోల్ దాడి’ ఘటనపై దర్యాప్తు వేగవంతం
తూర్పుగోదావరి,కడియం: మండలంలోని దుళ్ల ముదిరాజుల పేటలో నిద్రపోతున్న ఆరుగురిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్ స్వయంగా కేసును పర్యవేక్షిస్తుండడంతో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిందితుడిగా భావిస్తున్న మాసాడ శ్రీను నివాసం ఉంటున్న తిరుపతికి ప్రత్యేక బృందం చేరుకుని అతడి బంధువులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నిందితుడుతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు. పెట్రోల్ బంకు వద్ద సీసీ టీవీ ఫుటేజీలను బట్టి ఇది తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తి ఎవరన్న దిశలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈనెల 17న తన మేనత్తపై దాడి సమయంలో శ్రీను కూడా మరో వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తి కోసం కూపీలాగుతున్నారు. అలాగే బాధితులు, నిందితుల బంధువులు, స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. గొళ్లెం పెట్టడమే కీలకం.. నిద్రపోతున్న ఆరుగురిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి, ఆ గది తలుపులకు బయట వైపు గొళ్లెం పెట్టడంపై ప్రస్తుతం పోలీస్‌లు దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ గదితో పాటు పక్కనే ఉన్న ఇంటి యజమాని గదికి కూడా గొళ్ళెం పెట్టారు. 17వ తేదీన కూడా మేనత్త సత్యవతిపై దాడి సమయంలో ఇదే విధంగా యజమాని నిద్రపోతున్న గదికి మాసాడ శ్రీను గొళ్లెం పెట్టి, గొడవకు సిద్ధమైనట్టు తెలిసింది. పెట్రోల్ దాడి ఘటనలో కూడా అదే విధంగా తలుపులకు గొళ్లెం పెట్టడంతో నిందితుడు మాసాడ శ్రీనుగానే పోలీస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అలాగే పెట్రోల్ బంకులో వంద రూపాయల పెట్రోల్‌ను ప్లాస్టిక్ సీసాలో పోయించుకున్నప్పుడు మరో వ్యక్తి మోటారు సైకిల్‌పై ఉన్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. 17న దాడి సమయంలో కూడా ఇద్దరు వ్యక్తులే వచ్చారు. తలుపులకు గొళ్లెం పెట్టడం, ఇద్దరు వ్యక్తులు ఉండడం, దాడికి కొద్ది సేపటి ముందే సీసాలో పెట్రోలు పోయించుకోవడం వంటి విషయాలను గమనిస్తే మాసాడ శ్రీనే నిందితుడై ఉండొచ్చని బలంగా విశ్వసిస్తున్నారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మూడు రోజులు మృత్యువుతో పోరాడి.. రాజమహేంద్రవరం క్రైం: కాలిన గాయాలతో మూడు రోజులు గా నరకయాతన అనుభవించి, మృత్యువుతో పోరాడి మరో మహిళ మృతి చెందింది. దుళ్ల గ్రామంలో ఉన్మాది ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంఘటనలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటనలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా, గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంటా దుర్గా భవాని(23) మృతి చెందింది. ఈ సంఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. పాపం చిన్నారులు కళ్ల ముందే చెల్లెలు విజయలక్ష్మి, మేనమామ కోట్ని రాము అగ్నికి ఆహుతి కాగా బియ్యం పెట్టె చాటున దాక్కొని స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయట పడిన గంటా ఏసు కుమార్, గంటా దుర్గా మహేష్‌లు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గాయాలతో విలవిల్లాడుతున్నారు. తల్లి, చెల్లి, అమ్మమ్మ, మేనమామ ఇలా నలుగురినీ ఒకేసారి కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తల్లి చనిపోయిందనే సమాచారం ఆ చిన్నారులకు బంధువులు చెప్పకపోవడంతో ఆమె రాకకోసం వారు బెంగగా ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులకుమృతదేహాలు అప్పగింత ఈ సంఘటనలో మృతి చెందిన మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలు కోట్ని సత్యవతి భర్త అప్పారావు(నిందితుడిని పట్టుకునేందుకు ఆచూకీ కోసం పోలీసులు తిరుపతి తీసుకువెళ్లారు.) అందుబాటులో లేకపోవడంతో అల్లుడు గంటా భద్రరాజు మామతో ఫోన్లో మాట్లాడి సత్యవతి, దుర్గా భవానీల మృతదేహాలకు రోటరీ కైలాస భూమికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు అయిన ఖర్చును వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి బాధితులకు అందించారు. -
కన్న తండ్రే కాటేశాడు
రాయవరం: కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడిన ఓ తండ్రి బాగోతమిది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాకలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన బాలిక రామచంద్రపురంలోని హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి, సోదరుడు నాయనమ్మతో కలిసి వెదురుపాకలో నివాసం ఉండటంతో పండగ సెలవులకు ఆదివారం ఇంటికి వచ్చింది. ఆ రాత్రే ఆమెకు కన్న తండ్రి కాళరాత్రిని చూపించాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె మిన్నకుండి పోయింది. సోమవారం రాత్రి తిరిగి మరోసారి లైంగిక దాడికి తెగబడటానికి ప్రయత్నిస్తుంటే ఆమె పక్కింటికి పారిపోయి, ఫోన్లో సమీప బంధువులకు తెలిపింది. స్థానికులు ఈ విషయాన్ని 100 నంబరుకు ఫోన్ చేసి చెప్పడంతో ఎస్సై ఎల్.శ్రీనివాసనాయక్ ఘటనా స్థలికి వెళ్లి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాలరెడ్డి, అనపర్తి సీఐ ఎన్వీ భాస్కరరావు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. గతంలోనూ ఆ చిన్నారిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడటానికి ప్రయత్నించగా స్థానికులు దేహశుద్ధి చేసినట్లు సమాచారం. -
మధ్యప్రదేశ్‌లో చోరీ.. కాకినాడకు చేరి
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: మధ్యప్రదేశ్‌లోని ఓ హోటల్లో మారు తాళంతో బంగారు వ్యాపారి ఉండే రూమ్‌ను తెరచి రూ.2.300 కిలోల బంగారాన్ని దొంగిలించిన ఓ వ్యక్తిని కాకినాడలో త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా కుప్పం గ్రామానికి చెందిన పిన్నిటి రమేష్‌బాబు కాకినాడలో కొన్ని సంవత్సరాలుగా ఇత్తడి వ్యాపారం చేస్తూ కాకినాడ రూరల్ మండలం సర్పవరం వివేకనగర్‌లో ఉంటున్నాడు. ఇతడు 20 రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ సిటీ, రాజ్వాడ్‌కు వెళ్లి హోటల్ పుష్కర్‌లో రూమ్ తీసుకొని ఆ హోటల్లో ఉన్న మిగిలిన రూములకు సంబంధించి నకిలీ తాళాలు తయారు చేయించారు. దీనిలో భాగంగా ఆ హోటల్లో బస చేసిన ఒక బంగారు వ్యాపారి రూమ్ తాళాన్ని తెరిచి ఆ రూమ్‌లో ఉన్న బంగారాన్ని రమేష్‌బాబు దొంగిలించాడు. దీనిపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ముద్దాయి కాకినాడలో ఉన్నట్టు ఇండోర్ ఎస్పీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీకి తెలిపారు. దీనిపై అప్రమత్తమైన జిల్లా పోలీస్ యంత్రాంగం కాకినాడ ఎస్డీపీవో కరణం కుమార్‌ను అప్రమత్తం చేశారు. కాకినాడ మూడో పట్టణ పోలీసులు పలు చోట్ల దర్యాప్తు చేపట్టారు. ఇండోర్ పోలీసులు కాకినాడకు చేరుకోవడంతో త్రీటౌన్ శాంతి, భద్రతల విభాగం సిబ్బందితో కలసి సర్పవరం వివేకనగర్‌లో ఉన్న ముద్దాయి రమేష్‌బాబు ఇంటిని చెక్ చేయగా ఇండోర్ సిటీ, రాజ్వాడ్‌లోని హోటల్ పుష్కర్‌లో ముద్దాయి దొంగిలించి తీసుకొచ్చిన 2.300 కిలోల బంగారాన్ని సీజ్ చేసి ముద్దాయిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ కరణం కుమార్, సీఐ శ్రీరామకోటేశ్వరరావు శుక్రవారం సాయంత్ర తెలిపారు. ముద్దాయి పిన్నిటి రమేష్‌బాబును నాలుగో అదనపు మొదటి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. -
పీజీ అమ్మాయి.. పదో తరగతి అబ్బాయి
ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. యువతి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ అయితే.. యువకుడు అదే ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్.. ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే వారి ప్రేమను పెద్దలకు చెప్పలేక.. తీవ్ర మానసిక సంఘర్షణ మధ్య ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి ప్రేమ కథకు వారికి వారే ముగింపు పలుకుతూ.. వారి రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టారు. సాక్షి, మలికిపురం(తూర్పుగోదావరి జిల్లా): మండలంలోని తూర్పుపాలెం గ్రామానికి చెందిన పద్మశాలి సామాజికవర్గానికి చెందిన చిక్క రాముడు, సూర్యకుమారి భార్యాభర్తలు. వీరికి వీరవెంకట నాగ సత్య దుర్గా ప్రశాంతి కుమార్తె, సాయి వీరేంద్ర కుమారుడు. వీరిది నిరుపేద కుటుంబం. చేనేత వృత్తితో ఆదాయం సరిపోక తండ్రి రాముడు తాపీపని చేస్తుంటారు. భర్త చేనేతలో పాలు పంచుకుంటూ భార్య కూడా నేత నేస్తుంది. తమ సంతానం తమ మాదిరిగా కాకుండా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆ పేదింటి తల్లిదండ్రుల పట్టుదల. అందుకు తగ్గట్టుగానే కుమార్తెను పీజీ వరకు చదివించారు. కుమారుడు కూడా పీజీ పదువుతున్నాడు. పీజీ అనంతరం ప్రశాంతి మండలంలోని గూడపల్లి వెంకటసత్య కాన్సెప్ట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదుడు వాదోడుగా నిలుస్తూ వచ్చింది. శోక సముద్రంలో ప్రశాంతి తల్లిదండ్రులు తీవ్ర మానసిక సంఘర్షణతో.. రాజోలు మండలంలో కాట్రేనిపాడుకు చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన యాలంగి రమేష్‌తో ఆమెకు పరిచయమై అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఇద్దరూ భావించారు. పదో తరగతి చదివిన యాలంగి రమేష్ ప్రశాంతి పనిచేసే కాన్వెంట్ స్కూల్ వ్యాన్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో ఈనెల 8న ప్రశాంతికి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. అయితే ప్రశాంతి తన ప్రేమ సంగతిని కుటుంబ సభ్యులకు చెప్పలేక, ప్రేమించిన యువకుడిని వదల్లేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైంది. అయితే తల్లిదండ్రులు ఆమెకు ముందుగా కుదిర్చిన యువకుడితో ఇటీవల నిశ్చితార్థం జరిపించేశారు. ఆ మరుసటి రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చదువుకున్న కళాశాల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని చెప్పి బయల్దేరిన కుమార్తెను ఆ తల్లి ఉదయమే బస్సు ఎక్కించి దగ్గరుండి మరీ సాగనంపింది. అవే ఆ తల్లీ, కుమార్తెలకు కడసారి చూపులు అవుతాయని ఆరోజు వారు అనుకోలేదు. సర్టిఫికెట్ల కోసమని వెళ్లిన కుమార్తె చీకటిపడినా రాకపోవడంతో తల్లిదండ్రులకు కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఈనెల 12న యానాం వద్ద గోదావరిలో కుమార్తె ప్రశాంతి, ఆమె ప్రేమికుడు రమేష్‌ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కుమార్తె ప్రేమ వ్యవహారం తమకు తెలియదని తెలిస్తే సహకరించే వారమని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా సున్నితమనస్కురాలైన ప్రశాంతి చదువులో ఎప్పుడూ ఫస్ట్‌లోనే ఉంటానని చెబుతూ అలానే చదువుకుందని, పెద్ద ఉద్యోగం చేసి తమకు కష్టాలు లేకుండా చేస్తానని ఎప్పుడూ చెప్పే చిట్టి తల్లి కళ్లెదుటే కనిపించకుండా పోయిందని ఆ తల్లిదండ్రులు కుమార్తె ఫొటోను చూసుకుంటూ గుండెలవిసేలా రోధిస్తున్నారు. మరో వైపు యాలంగి రమేష్ తల్లిదండ్రులు కృష్ణమూర్తి, సీతలను ఎవరైనా పలకరిస్తే చాలు దుఃఖం పొంగుకువచ్చేస్తోంది. ఆ ప్రేమజంట అర్ధాంతరంగా తనువు చాలించడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. -
భారీ సంఖ్యలో పట్టుబడిన కోడికత్తులు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోళ్ల పందాలలను నివారించే దిశగా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోడి కత్తుల తయారీ కేంద్రాలపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తాళ్లరేవు మండలం కోరంగి పరిధిలో సోమరాజు అనే వ్యక్తి వద్ద సుమారు రూ. 12 లక్షలు విలువ చేసే 3800 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ కరణం కుమార్ హెచ్చరించారు. -
భూమాయ కేసులో.. కీలక సూత్రధారుల అరెస్టు
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అమలాపురం భూమాయ కేసులో ప్రధాన నిందితులు, సూత్రధారులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వేదికగా సాగిన ఈ భూమాయలో ప్రధాన నిందితులైన ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి చిన తాతయ్యనాయుడు, లక్ష్మీనరసమ్మ, వారి కుమారుడు మోటూరి బలరామమూర్తిలను అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా ఆధ్వర్యంలో పట్టణ సీఐ జి.సురేష్‌బాబు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక ఎర్రవంతెన వద్ద అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వాస్తవంగా లేని 53 ఎకరాల భూములకు నకిలీ రికార్డులు సృష్టించి వాటిని అమలాపురం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో తనఖా పెట్టి రూ.1.50 కోట్లు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ మోసానికి పాల్పడిన, సహకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బేబీ జ్ఞానాంబతో పాటు మరో సూత్రధారి కామనగరువు వీఆర్వో బడుగు ప్రశాంత్‌కుమార్, అమలాపురం తహసీల్దార్ కార్యాలయ వెబ్ ల్యాండ్ కంప్యూటర్ ఆపరేటర్ వంశీకృష్ణ, కాట్రేనికోన మండలం కందికుప్ప, చిర్రయానాం వీఆర్వోలు ఏసురత్నం, విష్ణుమూర్తిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితులు భార్యాభర్తలు, వారి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయగా అదే రోజు ఈ కేసులో మరో నిందితుడైన బ్యాంక్ రుణానికి గ్యారంటీర్‌గా ఉన్న ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి చిన తాతయ్యనాయుడు పొలంలో పనిచేసే పాలేరు కాశి పల్లంరాజు కూడా కోర్టులో పోలీసులకు లొంగిపోయాడు. ఇక కేసులో అరెస్ట్ చేయాల్సిన ఒకే ఒక నిందితుడు విశ్రాంత తహసీల్దార్ నాగాబత్తుల రమేష్ పరారీలోనే ఉన్నాడు. అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సురేష్‌బాబు, ఎస్సై వి.శ్రీనివాసరావు నిందితుల వివరాలను వెల్లడించారు. మోసం బయటపడిందిలా.. బ్యాంక్‌ను బురిడీ కొట్టించి తీసుకున్న భారీ రుణానికి కొన్ని వాయిదాలు చెల్లించి మోటూరి కుటుంబీకులు మిన్నకున్నారు. అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు తమ వార్షిక తనిఖీల్లో భాగంగా తనఖా పెట్టిన ఈ 53 ఎకరాల భూములను వెబ్‌ల్యాండ్ చూసుకోవడంతో పాటు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. వెబ్ ల్యాండ్‌లో, క్షేత్రస్థాయిలో ఆ భూములు లేకపోవడంతో బ్యాంక్‌ను మోసం చేసినట్టు గత సెప్టెంబర్‌లో గుర్తించి రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అప్పటి నుంచి ఈ భూమాయ వెలుగు చూసింది. బ్యాంక్, రిజిస్ట్రార్ అధికారులపైవచ్చిన అభియోగాలపైనా విచారణ ఈ భూమాయలో అటు అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో లేని భూములకు ఈసీ, మార్టగేజ్ చేసిన ఆ కార్యాలయ అధికారులపైన, క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండా, లీగల్ ఒపీనియన్ సరిగా తీసుకోకుండా రుణం ఇచ్చేసిన బ్యాంక్ అధికారులపైన వస్తున్న అభియోగాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని సీఐ సురేష్‌బాబు వెల్లడించారు. వారి పాత్ర కూడా ఉన్నట్టు తెలిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నకిలీ రికార్డుల సృష్టి ఇలా.. మోటూరి చినతాతయ్యనాయుడు కుటుంబీకులు 2017 ఆగస్టులో తొలుత కాట్రేనికోన మండలం కందికుప్ప, చిర్రయానం గ్రామాల్లో లేని 53 ఎకరాలకు అప్పటికే అదే మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న ప్రశాంత్‌కుమార్ పథకంతో ఆ రెండు గ్రామాల వీఆర్వోల సహకారంతో నకిలీ రికార్డులు సృష్టించారు. అందుకు అప్పటి కాట్రేనికోన తహసీల్దార్ నాగాబత్తుల రమేష్ కూడా సహకారం అందించారు. ఈ నకిలీ రికార్డులను హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు సమర్పించి రూ.1.50 కోట్ల రుణం కోసం ప్రయత్నించారు. అయితే భూములు కాట్రేనికోన మండలానికి చెందినవి కావడంతో బ్యాంక్ అధికారులు ఈ దస్తావేజులను మార్ట్గేజ్ కోసం ముమ్మిడివరం రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపారు. అక్కడి రిజిస్ట్రార్ వాటిని పరిశీలించగా నకిలీ రికార్డులుగా గుర్తించి ఈ సమాచారాన్ని కాట్రేనికోన తహసీల్దార్ కార్యాలయానికి తెలిపారు. దీంతో అక్కడ వీరి అక్రమాలు పారకపోవడంతో వారి స్కెచ్‌ను అమలాపురం తహసీల్దార్ కార్యాయానికి మార్చారు. అప్పటికే అమలాపురం రూరల్ మండలం వీఆర్వోగా వచ్చిన ప్రశాంత్‌కుమార్ మరో స్కెచ్ వేశారు. అందుకు అప్పటి అమలాపురం తహసీల్దార్ బేబీ జ్ఞానాంబతో పాటు అదే కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ వంశీకృష్ణ అందుకు సహకరించారు. అంతే మరోసారి ఇదే మండలంలో లేని 53 ఎకరాలకు తప్పడు రికార్డులు తయారుచేయడం, వాటిని అదే బ్యాంక్‌లో తనఖా పెట్టడం చకాచకా జరిగిపోయాయి. ఈసారి ముమ్మిడివరం రిజిస్ట్రార్ కార్యాలయంలో దొరికిపోయినట్టు దొరికిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో లేని భూములకు మార్టగేజ్ అయ్యే వరకు వెబ్‌ల్యాండ్‌లో నకిలీ సర్వే నంబర్లు అలానే ఉంచి బ్యాంక్ రుణం మంజూరు చేసిన తర్వాత వెబ్ ల్యాండ్ నుంచి ఈ నంబర్లను రీవోక్ చేసేశారు. ఇదంతా 2018 జూన్‌లో జరగడం...బ్యాంక్ రుణం ఇచ్చేయడం జరిగిపోయింది. ఎవరికి ఎంతెంత లంచం? ఈ భూమాయలో సహకరించిన రెవెన్యూ అధికారులకు మోటూరి తాతయ్యనాయుడు కుటుంబీకులు బ్యాంక్ నుంచి అప్పనంగా తీసుకున్న రూ.1.50 కోట్ల రుణం నుంచి రూ.22 లక్షలు లంచాలుగా పంచేశారు. తొలుత కాట్రేనికోన తహసీల్దార్ కార్యాయంలో పుట్టించిన నకిలీ రికార్డుల కోసం అప్పటి తహసీల్దార్ రమేష్‌కు రూ.ఐదు లక్షలు, స్కెచ్ వేసిన వీఆర్వో ప్రశాంత్‌కుమార్‌కు రూ.ఐదు లక్షలు, కందికుప్ప, చిర్రయానాం వీఆర్వోలు ఏసురత్నం, విష్ణుమూర్తిలకు చెరో రూ.రెండు లక్షలు ఇచ్చారు. తర్వాత అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన నకిలీలకు తహసీల్దార్ బేబీ జ్ఞానాంబకు రూ.ఐదు లక్షలు, వీఆర్వో ప్రశాంత్‌కుమార్‌కు రూ.రెండు లక్షలు, కంప్యూటర్ ఆపరేటర్ వంశీకృష్ణకు రూ.లక్ష లంచాలు అందించారు. ఈ లంచాల వివరాలను సీఐ సురేష్‌బాబు గణాంకాలతో వివరించారు. -
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలి
సాక్షి, పిఠాపురం(తూర్పు గోదావరి): ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించాలంటూ చేబ్రోలుకు చెందిన బండి దుర్గాభవాని శుక్రవారం రాత్రి గొల్లప్రోలు పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం గోర్స సమీపంలోని ఆనంద్ నగర్‌కు చెందిన సలాది నాగేశ్వరరావు, దుర్గాభవాని రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడు. పెళ్లి చేసుకోవాలని కోరితే ముఖం చాటేసి వేరే పెళ్లికి సిద్ధపడ్డాడు. దీంతో దుర్గాభవాని తన తల్లిదండ్రులు, బంధువులతో కలసి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ముందు 216 జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి నిరసనకు దిగింది. తాళి»ొడ్డు, పూలదండలతో రోడ్డుపై బైఠాయించింది. నాగేశ్వరరావుతో తన వివాహం జరిపించాలని పట్టుబట్టింది. దీంతో మెయిన్‌రోడ్డుపై రెండు గంటలు ట్రాఫిక్ నిలిచిపోయింది. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామలింగేశ్వరరావు ఆ యువతికి, బంధువులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఆందోళన విరమించలేదు. పిఠాపురం సీఐ బి.సూర్య అప్పారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను బైపాస్ రోడ్డువైపు మళ్లించారు. రాత్రి పది గంటలకు కూడా నిరసన కొనసాగుతోంది. దుర్గాభవాని ఫిర్యాదు మేరకు నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
విషాదంగా మారిన దీప్తీశ్రీ కిడ్నాప్ కేసు
సాక్షి, తూర్పుగోదావరి : మూడు రోజుల క్రితం తప్పిపోయిన చిన్నారి దీప్తీశ్రీ (7) కేసు చివరికి విషాదంగా మారింది. కాకినాడలో శుక్రవారం పాఠశాలకు వెళ్లిన దీప్తీ కిడ్నాప్‌కు గరైన విషయం తెలిసిందే. పాప సవతి తల్లి శాంతి కుమారినే ఈ దారుణానికి పాల్పడినట్లు చిన్నారి నాయనమ్మ ఆరోపించడంతో పోలీసులు శాంతి కుమారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీప్తిని గొంతు నులిమి హత్య చేసినట్లు, ఉప్పుటేరు కాల్వలో పడేశానని పలు రకాల సమాధానాలు చెప్పడంతో కాకినాడ సబ్ డివిజన్ పోలీసులు చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చర్యలు ముమ్మరం చేసిన పోలీసులకు ఇంద్రపాలెం లాకుల వద్ద గుర్రపు డెక్కల కింద చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి దీప్తీని సవతి తల్లి శాంతికుమారి అపహరించి హత్య చేసిందని, అనంతరం ఆమె మృతదేహాన్ని మూటలో కట్టి ఇక్కడ పడేసినట్లు పోలీసులు తెలిపారు. -
యువతితో ట్రాప్ చేయించి.. నగ్న వీడియోలతో
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాకు చెందిన వ్యక్తిని యువతితో ట్రాప్ చేయించి ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను సామర్లకోట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దుర్గారెడ్డి పరారీలో ఉండగా, రాకేష్ అనే వ్యక్తితో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ముఠాకు చెందిన రాకేష్ భార్య అశ్వినీతో గొల్లలమామిడాడకు మణికంఠరెడ్డి అనే వ్యక్తిని ట్రాప్ చేయించారు. అతడితో పరిచయం పెంచుకునేలా పథకం రచించారు. ఈ క్రమంలో వారిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు ముఠాకు చెందిన వ్యక్తులు వీడియోలు చిత్రీకరించారు. అనంతరం ఆ నగ్న వీడియోను చూపించి మణికంఠను బెదిరించడం మొదలుపెట్టారు. అతడిని కిడ్నాప్ చేసి దాదాపు 63 వేల రూపాయల విలువైన ఆభరణాలు దోచుకున్నారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముఠాకు చెందిన రాకేష్‌తో పాటు వారికి సహకరించిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా దుర్గారెడ్డికి, రాకేష్‌కు సహకరించిన ఈ ఏడుగురు కాకినాడకు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ముఠాలోని ప్రధాన నిందితుడైన దుర్గారెడ్డి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఏసీబీ వలలో అవినీతి ఏఎస్సై
సాక్షి, కాకినాడ: కాకినాడలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి పట్టుబడింది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో 1981లో చేరిన గుణ్ణం వీరవెంకట సత్యనారాయణ చౌదరి 37 ఏళ్లలో రూ. కోట్లకు పడగెత్తారు. తన ఉద్యోగంతో పాటు అక్రమ ఆస్తులనూ అదే స్థాయిలో కూడబెడుతూ వచ్చారు. ఏఎస్సై స్థాయి అధికారి రూ. కోట్లకు పడగెత్తాడంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉంటే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని వివిధ చోట్ల రాజకీయ నాయకులను మచ్చిక చేసుకొని, వారికి బినామీగా ఉంటూ రూ. కోట్లకు ఎగబాకినట్టు తెలుస్తోంది. రాత్రిపూట వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల వారిని తనిఖీల పేరుతో భారీగా సొమ్ములు వసూలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా పోలీసులు సైతం చెబుతున్నారు. ఆయన తాను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం, స్థలాలు కొనుగోలు చేయడం, తన శాఖ అధికారులు, సిబ్బంది, బంధువులు, స్నేహితులతో వడ్డీ వ్యాపారం చేయించడం అలవాటుగా మార్చుకున్నాడు. పొలం కొనుగోలుతో వివాదం ఇటీవల సామర్లకోట మండలం అచ్చంపేట–ఉండూరు మధ్యలో సత్యనారాయణ చౌదరి అరెకరం పొలం కొనుగోలు చేయడంతో వివాదం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో కొందరు వ్యక్తులు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు చెబుతున్నారు. కాకినాడ ట్రాఫిక్‌లో హెచ్‌సీగా పనిచేసిన సత్యనారాయణ చౌదరి పదోన్నతిపై పోర్టు పోలీస్ స్టేషన్ ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. వారు ఐదు బృందాలుగా విడిపోయి సోదాలు జరిపారు. కాకినాడ జగన్నాథపురం మరిడమ్మపేటలోని సత్యనారాయణ చౌదరి ఇంటితో పాటు కాకినాడ రామారాపుపేట, రావులపాలెం, సామర్లకోటలోని రెండుచోట్ల, యానాం, గండేపల్లి ప్రాంతాల్లో ఏకకాలంలో బుధవారం సోదాలు నిర్వహించారు. ముందుగా కరప మండలం అరట్లకట్టకు పెదపూడికి ఏసీబీ బృందాలు వెళ్లాయి. అరట్లకట్టలో అత్తగారి పేరుతో ఇల్లు, చర్చి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కాకినాడలో రెండుచోట్ల, సామర్లకోటలో రెండుచోట్ల, రావులపాలెంలోను సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు విలువైన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు గుర్తించాయి. రూ. మూడు కోట్లుగా చెబుతున్నా.. అధికారులు గుర్తించిన ఏఎస్సై అక్రమాస్తుల విలువ రూ. మూడు కోట్లుగా చెబుతున్నప్పటికీ బయట మార్కెట్లో చూస్తే వీటి విలువ రూ.10 నుంచి 15 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో జగన్నాథపురంలోని రెండంస్తుల భారీ భవనం, రామారావుపేటలో రెండంస్తుల డాబా ఇల్లు, సామర్లకోటలో రెండంతస్తుల భవనాలు రెండు, యానాంలో నాలుగంతస్తుల భవనంతో పాటు కేజీన్నర బంగారం, కేజీ వెండి, 100కు పైగా అప్పులు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, ఎనిమిది ఖాళీ స్థలాలకు సంబంధించిన పత్రాలు, రూ. 3 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులతో పాటు 10 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఓ బ్యాంకులో రూ.19.75 లక్షలు ఉన్నట్లు బ్యాంకు పుస్తకాల పరిశీలనలో తెలిసింది. అంతేగాకుండా పెద్ద మొత్తంలో బ్యాంకు లాకర్లు ఉన్నాయని, వీటిల్లో కూడా పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు ఉండవచ్చని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా సత్యనారాయణ చౌదరి భార్య వీరవెంకట వరలక్ష్మి పేరుతోనే ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. బ్యాంకులోని లాకర్లను కూడా తెరిపించనున్నట్లు వివరించారు. బ్యాంకు అకౌంట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఏఎస్పీ పీవీ రవికుమార్, ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, ఏసీబీ అధికారులు తిలక్, పుల్లారావు, సూర్యనారాయణ తదతరులు పాల్గొన్నారు. ఏఆర్ కానిస్టేబుల్‌గా ప్రస్థానం సామర్లకోట మండలం ఉండూరుకు చెందిన సత్యనారాయణ చౌదరి 1981లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. కొంతకాలం తర్వాత సివిల్ కానిస్టేబుల్‌గా మారారు. కాకినాడ, సామర్లకోట, రావులపాలెం, పిఠాపురం పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఎక్కువ కాలం కాకినాడలోనే ఆయన ఉద్యోగం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వాధికారులకు అవినీతికి పాల్పడినా, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా తమకు సమాచారం అందించాలని ఏసీబీ ఏఎస్పీ పీవీ రవికుమార్, డీఎస్పీ రామచంద్రరావు కోరారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించడంతో సత్యనారాయణ చౌదరిని అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. -
ఆ మూడూ హత్యలు చేసింది సింహాద్రినే!
ఇంతవరకు ఆ ముగ్గురు సాధారణంగానే మృతి చెందారని భావించారు. అయితే వారిలో ఒకరిది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరూ ఊహించన విధంగా ఆ ముగ్గురు హత్యకు గురయ్యారన్న విషయం తెలియగానే రాజమహేంద్రవరంలో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ముగ్గురిని హత్య చేసింది ఒక్కడే. వారిలో బంధువులైన ఇద్దరు మహిళలను.. ఆశ్రమం స్వామీజీని నిందితుడు హత్య చేశాడు. దీంతో బంధువులు బోరున విలపిస్తుంటే.. ఆశ్రమం పరిసర గ్రామాల వారు అవాక్కయారు. సంచలనం సృష్టించిన ఈ హత్యల ఉదంతం ఇలా ఉంది. సాక్షి, రాజమహేంద్రవరం: ఎవరికీ అనుమానం రాకుండా బంగారు వస్తువులు, నగదు చోరీకి పాల్పడుతూ నగరంలో మూడు హత్యలు చేసిన ఏలూరు మండలం వెంకటాపురానికి చెందిన వెల్లంకి సింహాద్రి పశ్చిమగోదావరి జిల్లా పోలీసులకు చిక్కాడు. జిల్లాలో ఈ ముగ్గురిని హత్య చేసిన అతడు ఏమీ ఎరుగనట్టు వారి కుటుంబ సభ్యులతోనే తిరుగుతూ ఆ తర్వాత తప్పించుకోపోయాడు. చివరకు ఒక హత్య కేసులో దొరకడంతో డొంక కదిలింది. తాను చేసిన పది హత్యల్లో జిల్లాలో ముగ్గురుగు ఉన్నట్టు నిందితుడు అంగీకరించాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలోని రామకృష్ణానంద స్వామీజీ ఆశ్రమం నిర్వాహకుడు రామకృష్ణానంద స్వామి, రాజమహేంద్రవరం పేపరు మిల్లు ప్రాంతానికి చెందిన కొత్తపల్లి నాగమణి, బొమ్మూరు గ్రామానికి చెందిన శామంతకుర్తి నాగమణిలను నిందితుడు హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రియల్ ఎస్టేటు లాభసాటిగా లేదని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంత లాభసాటిగా లేదని, సులభంగా డబ్బు సంపాదించాలని సింహాద్రి ఆలోచనలో పడ్డాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగురాళ్లు ఇంట్లో ఉంటే కోటీశ్వరులు కావచ్చని, గుప్త నిధులు చూపిస్తానని, బంగారాన్ని రెట్టింపు చేస్తానని నమ్మించడం మొదలెట్టాడు. సైనేడ్ కలిపిన ప్రసాదం, ఆయుర్వేదం మందు ఇచ్చి.. 20 నెలల్లో పది మందిని హతమార్చాడు. ఏలూరుకు చెందిన పీఈటి కాటి నాగరాజు మృతితో భార్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏలూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంతో జిల్లాకు చెందిన మూడు హత్యలు బయటపడ్డాయి. 2018 ఏప్రిల్ 28న.. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో రామకృష్ణా పరమానంద స్వామీజీ ఆశ్రమంలోని రామకృష్ణానంద స్వామీజీ వద్దకు నిందితుడు భక్తుడిగా స్వామీజీతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. నిత్యాన్నదానం, పండగలకు హోమాలు స్వామీజీ చేస్తుంటే.. ఆయనతో ఉంటూ పరిసర ప్రాంతాల వారికి సుపరిచితుడయ్యాడు. స్వామీజీ వద్ద భారీగా సొమ్ము ఉంటుందని భావించి 2018 ఏప్రిల్ 28న ఆయుర్వేద మందులో సైనేడ్ కలిపి ఇచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన స్వామీజీ బస్టాండ్ వద్ద ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే స్వామీజీ మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందారనుకుని అందరూ భావించారు. ఆశ్రమంలోనే ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. స్వామిజీ వద్ద నగదు లేకపోవడంతో అతడు వెనుదిరిగాడు. సింహాద్రి పోలీసులకు చిక్కడంతో స్వామీజీ గుండెపోటుతో మరణించలేదని, హత్యకు గురయ్యాడని తెలియడంతో పురుషోత్తపట్నం తదితర ప్రాంతాల వారు ఆశ్చర్యపోతున్నారు. స్వామిజీని ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయం వరకు ఉన్న సింహాద్రి ఆ తరువాత కనిపించ లేదని స్థానికులు చెబుతున్నారు. స్వామీజీని హత్య చేశారన్న విషయాన్ని జీరి్ణంచుకోలేకపోతున్నామని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. 2018 డిసెంబర్ 23న.. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు క్వార్టర్స్‌లో ఉండే కొత్తపల్లి నాగమణికి సింహాద్రి సమీప బంధువు. చుట్టపు చూపుగా తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. 2018 డిసెంబర్ 23న డయోబెటిక్ మందు అంటూ ఆమెతో సైనేడ్ ఇవ్వడంతో ఆమె మృతి చెందింది. వెంటనే ఆమె మెడలోని బంగారు మంగళ సూత్రం తాడు తీసుకుని పరారయ్యాడు. ఆమెది అందరూ సహజ మరణంగా భావించారు. ఆమె దిన కార్యక్రమాల్లో ఎవరికీ అనుమానం రాకుండా అక్కడే అతడు తిరిగాడు. ఈ ఏడాది జనవరి 12న.. కొత్తపల్లి నాగమణిని హత్య చేసిన కొద్దిరోజులకే ఆమె కోడలు, వరుసకు వదిన అయిన బొమ్మూరు గ్రామానికి చెందిన దెందులూరులో హెచ్వీగా పనిచేస్తున్న శామంతకుర్తి నాగమణి (50)ను డబ్బు రెట్టింపు చేస్తానని నమ్మించాడు. ఈ ఏడాది జనవరి 12న ఆమె ఆలమూరు వెళ్లి యేసురాజు అనే వ్యక్తిని చేబోదులుగా రూ.5 లక్షలు అడిగింది. మధ్యాహ్నం బ్యాంకులో బంగారం పెట్టి ఇస్తానని చెప్పి తీసుకువచ్చింది. మధ్యాహ్నం బొమ్మూరులోని ఇంటి వద్ద సింహాద్రి ప్రసాదం పేరుతో ఆమెకు సైనేడ్ తినిపించి, రూ.5 లక్షలు, బంగారు వస్తువులతో పరారయ్యాడు. బాత్రూమ్లో విగతజీవిగా పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనను అప్పుట్లో బొమ్మూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మర్నాడు సింహాద్రి పోస్టుమార్టం వద్దకు వచ్చి రూ.5 లక్షలు ఇచ్చిన యేసురాజుపై కేసు పెట్టేంచేలా ప్రయత్నాలు చేశాడు. కుటుంబ సభ్యులు సైతం అతనికి మద్దతుగా నిలిచారు. తల్లి నాగమణిని, భార్యను అతడు హత్య చేశాడని తెలుసుకున్న భర్త మాణిక్యాలరావు అవాక్కయ్యాడు. కుటుంబ సభ్యుడే ఇలా హత్యలకు పాల్పడడాన్ని వారు జీరి్ణంచుకోలేకపోతున్నారు. బాధలో ఉన్న తమను ఇంక వదిలేయాలని ప్రాధేయపడ్డారు. -
కొడుకును చంపిన తండ్రి
చుట్ట ఇవ్వలేదన్న కోపంతో బిక్కవోలు మండలం కొంకుదురులో ఓ తండ్రి క్షణికావేశంలో తన తయుడుని హతమార్చగా.., కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురంలో మరో తండ్రి కుమారుడి వేధింపులు భరించలేక అతడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒకే రోజు జరిగిన ఈ సంఘటనలు జిల్లాలో సంచలనమయ్యాయి. సాక్షి బిక్కవోలు (తూర్పుగోదావరి): ఓ చుట్ట కోసం కొడుకుతో తగాదా పెట్టుకున్న తండ్రి క్షణికావేశంలో కర్రతో తలపై మోదడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయిన ఘటన బిక్కవోలు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామ శివారులో ఉన్న ఇటుక బట్టిలో పని చేయడానికి నాలుగు నెలల కిందట జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన పాక చంటి, అతని రెండో భార్య అర్జమ్మ వచ్చారు. గురువారం రాత్రి తండ్రి చుట్ట ఇమ్మని కొడుకుని అడిగితే ఇంట్లో బియ్యం పెట్టె మీద ఉంది తీసుకోమన్నాడు. అది కనిపించలేదు. దీంతో కొడుకు మీద కొప్పడ్డాడు. ఇలా ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగింది. దీంతో తండ్రి కోపంతో కర్ర తీసుకువచ్చి కొడుకు నాగు (24)తలపై కొట్టాడు. ఆ దెబ్బకు తల పగిలి తీవ్ర రక్త స్రావం కావడంతో స్థానికులు వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసికెళ్లారు. అప్పటికే మృతి చెందినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి సమాచారం మేరకు బిక్కవోలు పోలీసులు శుక్రవారం ఉదయం అనపర్తి సీఐ ఎన్వీ భాస్కరరావు, ఎస్త్సె పి.వాసు, వీఆర్వో రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు చంటి పరారీలో ఉన్నాడని ఎస్త్సె పి.వాసు తెలిపారు. కన్నకొడుకుపై తండ్రి హత్యాయత్నం కిర్లంపూడి (జగ్గంపేట): కన్నకొడుకుపై తండ్రి హత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం మండలంలోని ఎస్ తిమ్మాపురం గ్రామంలో జరిగింది. కిర్లంపూడి ఎస్సై జి అప్పలరాజు కథనం ప్రకారం.. ఎస్ తిమ్మాపురం గ్రామానికి చెందిన నక్కా పెదఅప్పారావుకి నలుగురు కుమారులు ఉన్నారు. ఇతడు ప్రతినెలా వృద్ధాప్య ఫించన్ తీసుకుంటున్నాడు. ప్రతినెలా పెద్ద కొడుకు నక్కా పెద సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు తండ్రి వద్ద నుంచి బలవంతంగా పింఛను డబ్బులు గుంజుకుంటున్నాడు. ఈ నెలలో అలా చేయడంతో పెదఅప్పారావు కొడుకు సత్తిబాబుపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతడి ముఖంపై బలమైన గాయమవ్వడంతో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాలుగో కుమారుడు నక్కా శివ ఫిర్యాదు మేరకు తండ్రి నక్కా పెదఅప్పారావుపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.అప్పలరాజు తెలిపారు. -
భార్య రాలేదన్న మనస్తాపంతో..
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: పుట్టింటి నుంచి భార్య రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఇంట్లో ఫ్యాన్ ఉక్కుకు లుంగీతో ఉరేసుకొని మరణించాడు. టూటౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ పి ఈశ్వరుడు కథనం ప్రకారం.. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 47వ డివిజన్ ఎస్ అచ్యుతాపురం రావిచెట్టువీధికి చెందిన నూతలపాటి వీరబాబు (22)కి గొల్లప్రోలుకు చెందిన సత్యవేణితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన దగ్గర నుంచి భార్య సత్యవేణి పుట్టింటికి వెళ్లిపోతుండడంతో ఈనెల 16న తన భార్యను తీసుకువచ్చేందుకు వీరబాబు గొల్లప్రోలు వెళ్లాడు. తన భార్యను పంపించాలని అడగడంతో అత్త, మామ, బావమరిది భార్య కలసి వీరబాబును కొట్టి పంపించేశారు. భార్యపై ఆపేక్ష పెంచుకున్న వీరబాబు మళ్లీ దీపావళి పండగకు గొల్లప్రోలు వెళ్లాడు. అత్తింటి వారు పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో తిరిగి వచ్చి సోమవారం రాత్రి తన ఇంట్లోనే లుంగీతో ఫ్యాన్ ఉక్కుకు ఉరేసుకుని చనిపోయినట్టు సీఐ ఈశ్వరుడు తెలిపారు. మృతుడు తల్లి వెంకాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
రాలిపోయిన క్రీడా కుసుమం
సాక్షి, తాళ్లరేవు (ముమ్మిడివరం): క్రీడా కుసుమం రాలిపోయింది. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడిన నాగబాబు కన్నుమూశాడు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువకుడిని బాణసంచా పేలుడు పొట్టను పెట్టుకుంది. ఈ నెల 18న తాళ్లరేవు మండలం జి.వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడు ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన యర్రంనీడి నాగశివ లక్ష్మీనారాయణ(18) నాలుగు రోజులపాటు నరకయాతన అనుభవించి మంగళవారం తనువు చాలించాడు. నాగబాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని జి.వేమవరం తీసుకువెళ్లారు. కన్నీటి వీడ్కోలు.. చేతికందివచ్చిన కొడుకు అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లి అనంతలక్ష్మి, సోదరుడు పవన్ కృష్ణమూర్తిలు బోరున విలపించడం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. నాగబాబుతో కలసి చదువుకున్న స్నేహితులు, చదువు చెప్పిన ఉపాధ్యాయులు సైతం నాగబాబు మృతదేహం వద్ద బోరున విలపించారు. పేలుడు ఘటనలో గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి సత్యనారాయణకు కుమారుడి మరణవార్త తెలియనివ్వలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు విషణ్ణవదనాలతో నాగబాబుకు కన్నీటి వీడ్కోలు పలికారు. వాలీబాల్, సాఫ్ట్‌బాల్, త్రోబాల్ క్రీడల్లో విశేష ప్రతిభ నాగబాబు చిన్నతనం నుంచి చదువుతో పాటు ఆటలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఆరో తరగతి నుంచి క్రీడల్లో సత్తా చాటుతున్నాడు. అండర్–14, అండర్–19 విభాగాల్లో త్రోబాల్, సాఫ్ట్‌బాల్, వాలీబాల్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కురుక్షేత్రలో జరిగిన త్రోబాల్ చాంపియన్‌షిప్, హర్యానాలో జరిగిన వాలీబాల్ అండర్ 14 ఎస్జీఎఫ్ఐ క్రీడల్లో ప్రతిభ కనబరిచాడు. రెండుసార్లు వాలీబాల్, నాలుగుసార్లు సాఫ్ట్‌బాల్ జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించినట్టు జి.వేమవరం హైసూ్కల్ పీడీ స్వామి తెలిపారు. నాగబాబు ఐడియల్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతూ ఈ నెల 15, 16, 17 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో జరిగిన వైఎస్సార్ ఎస్జీఎఫ్ క్రీడల్లో పాల్గొన్నాడు. క్రీడల నుంచి 17వతేదీన తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అయితే 18వ తేదీన తండ్రితోపాటు బాణసంచా తయారీకి వెళ్లి పేలుడు ఘటనలో బలయ్యాడు. రూ.10 లక్షల నష్ట పరిహారం జి.వేమవరం బాణసంచా పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యర్రంనీడి నాగశివ లక్ష్మీనారాయణకు రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించినట్టు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ పేర్కొన్నారు. బాణసంచా బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో మంచి క్రీడాకారున్ని కల్పోవడం బాధాకరమన్నారు. బంగారంలాంటి క్రీడాకారున్ని కోల్పోయాం మంచి క్రమశిక్షణ, నైపుణ్యం కలిగిన క్రీడాకారున్ని కోల్పోయాం. సాధారణంగా క్రీడాకారులు ఏదో ఒక్క క్రీడలో రాణించడం జరుగుతుంటుంది. అయితే నాగబాబు అనేక క్రీడలలో రాణించడంతోపాటు అతిచిన్న వయస్సులోనే జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నాడు. అథ్లెటిక్స్‌లో సైతం 185 సెంమీ హైజంప్‌ను నాగబాబు అవలీలగా చేసేవాడు. ఇటువంటి క్రీడాకారున్ని కోల్పోవడం దురదృష్టకరం. ఎస్ఆర్కేయూ స్వామి, ఫిజికల్ డైరెక్టర్, జెడ్పీ హైసూ్కల్, జి.వేమవరం -
విశ్వవిద్యాలయాల్లో విశృంఖలత్వం
సాక్షి , రాజమహేంద్రవరం: యువతను సన్మార్గంలో పెట్టి సమాజ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించాల్సినా గురువులు గాడి తప్పుతున్నారు. కొందరి వక్రబుద్ధి మొత్తం విద్యావ్యవస్థకే కళంకం తెచ్చిపెడుతోంది. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుందామని ఎన్నో ఆశలతో వందల కిలోమీటర్ల దూరం నుంచి తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చే విద్యార్థినులకు మనో ధైర్యం నింపాల్సిన బాధ్యత గురువులపై ఉంది. అటువంటి వారే ఇంటర్నల్ మార్కులను ఆసరాగా చేసుకుని బరితెగించి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు దిగడం జుగుప్సాకరంగా మారింది. వీటిని సంస్కరించాల్సిన పెద్దలు పాలకమండళ్ల పీఠాలపై కూర్చొనికూడా అరికట్టలేకపోతున్నారు. కాకినాడ జేఎన్టీయూ, రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నతమైన విద్య అందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ చేరుతున్నారు. ఆవు చేలో మేస్తే చందంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు ఏకంగా సహచర ఉపాధ్యాయినులపైనే వేధింపులకు ఒడిగట్టడం విడ్డూరం. ఈయనపై కేసు పెట్టినా గత టీడీపీ సర్కార్‌లో కేసును నీరుగార్చేయడం తెలిసిందే. ఈ బాగోతాన్ని ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో వైఎస్సార్‌కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని సస్పెండ్ చేసింది. జేఎన్టీయూకేలో... గత ఏడాది కాకినాడ జేఎన్టీయులో కూడా ఇప్పుడు నన్నయ వర్సిటీలో జరిగినట్టే ఎంటెక్ విద్యార్థినులపై ప్రొఫెసర్ కె.బాబులు లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనమైంది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న ఒక మంత్రి అండదండలతో టీడీపీ నేతలు ప్రొఫెసర్ కు అనుకూలంగా పావులు కదిపారు. చివరకు విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలపడంతో వర్సిటీ ఐఎస్టీ డైరెక్టర్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ప్రొఫెసర్ కె.బాబులును తప్పిం చారు. ఆ సంఘటన మరువకుండానే నన్నయలో ఇంగ్లిషు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్.సూర్యరాఘవేం ద్ర లైంగిక వేధింపుల బాగోతం సంచలనమైంది. విద్యార్థినులు నేరుగా సీఎంకు లేఖ రాయడం, ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి వచ్చి రాష్ట్ర స్థాయిలో తీవ్ర సంచలనమైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను విచారణకు పంపించారు. ఇంగ్లిషు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులను స్పెషల్ క్లాసుల పేరుతో బలవంతంగా రాజమహేంద్రవరంలో తన ఫ్లాట్‌కు తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డ రాఘవేంద్రను సస్పెండ్ చేయడానికి పాలకమండలి మీనమేషాలు లెక్కించడం విమర్శలపాలైంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థినులు నేరుగా సీఎంకు లేఖ రాసుకున్నా, రాఘవేంద్ర నిజస్వరూపం వర్సిటీలో చాలా మందికి తెలిసినా.. చర్యలకు వెనుకాడటం గమనార్హం. ఆంధ్ర మహిళా ఫో రం జోక్యం తరువాతనే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలు వడ్డాయి. గురువారం వరకూ నిందితుడ్ని అరెస్టు చేయకుండా వదిలేయడం తదితర పరిణామాలు మేధావి వర్గాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవేళ ఆంధ్రమహిళ ఫోరం చొరవ తీసుకోకుండా, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు జోక్యం చేసుకోకుండా ఉండిఉంటే రాఘవేంద్ర అకృత్యాలు వర్సిటీ కాంపౌండ్ గేటు దాటి బయటకు వచ్చేవే కావని మహిళా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. హైపవర్ కమిటీపై భిన్నాభిప్రాయాలు ఇవన్నీ ఓ ఎత్తైతే రాఘవేంద్రపై సమగ్ర విచారణ కోసం నియమించిన హైపవర్ కమిటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ అనుబంధంగా ఉన్న కాకినాడ పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఇద్దరు టీచింగ్, ఇద్దరు నాన్‌టీచింగ్, ఇద్దరు ఎన్జీఓలతో కలిపి ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీపై విమర్శలు వస్తున్నాయి. ఏడుగురు సభ్యుల కమిటీలో ఇద్దరు ఎన్జీఓలు మినహాయిస్తే మిగిలిన ఐదుగురు వర్సిటీలో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. ఇటువంటి వ్యవహారాల్లో ఏర్పాటయ్యే ఈ తరహా కమిటీల విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే విశ్వా సం చాలా తక్కువగా ఉంటుందంటున్నారు. ఎం దుకంటే విచారణ అనంతరం కమిటీలో మెజార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా నివేదిక రూపొం దుతుందనేది బహిరంగ రహస్యమే. అందునా ఏడుగురు సభ్యులలో ఐదుగురు సభ్యులు వర్సిటీ ఉద్యోగులే కావడం గమనార్హం. కేవలం ఇదే కారణంతో రాజమహేంద్రవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తులసి హైపవర్ కమిటీ నుంచి వైదొలగడం ఇందుకు బలం చేకూరుస్తోంది. చర్యలపై పలు సందేహాలు రాఘవేంద్ర లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆంధ్రమహిళా ఫోరం వర్సిటీలోకి ప్రవేశించక ముందు, ఆ తరువాత పరిణామాలను బేరీజు వేసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న విచారణ పలు సందేహాలకు తావిస్తోంది. ఇందుకుతోడు రాఘవేంద్రపై ‘ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 67 ఎ’ ప్రకారం కేసు నమోదుచేసి ఉంటే చర్యలు తీవ్రంగా ఉండేవని రాష్ట్ర బార్ అసోసియేషన్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు అభిప్రాయపడుతున్నారు. అటువంటి చర్యల ద్వారా మాత్రమే వర్సిటీలో ఇటువంటి అకృత్యాలకు చెక్ పెట్టవచ్చునంటున్నారు. ఇదిలా ఉండగా, వర్సిటీలో గురువారం నాడు చోటుచేసుకున్న సంఘటనలు చర్చనీయాంశమయ్యాయి. వర్సిటీ నుంచి సమాచారం బయటకు ఎలా పోతుందనే అంశం అంతర్గత సమీక్షలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇద్దరు అధ్యాపకురాలు తప్పుపట్టారని విశ్వసనీయంగా తెలిసింది. విద్యార్థినులతో రాఘవేంద్ర అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలకు తామే ప్రత్యక్ష సాక్షులమని వివరించడంతో అధికారులు మిన్నకుండిపోయారని సమాచారం. అప్పుడు జేఎన్టీయూకేలో, ఇప్పుడు నన్నయలో అయినా నిష్పక్షపాత విచారణ ద్వారా విద్యార్థినుల్లో మనో ధైర్యాన్ని నింపే ప్రభుత్వ ప్రయత్నాలకు విశ్వవిద్యాలయాల పాలకమండళ్ల ప్రతినిధులు కాస్త మానవతాదృక్పథంతో సహకరించాల్సి ఉంది. ఈ తరహా వ్యవహారాలు తలెత్తినప్పుడు గతంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బయటి వర్సిటీ ప్రొఫెసర్‌తో కమిటీ వేయడం లేక, స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించారు. వర్సిటీలపై మరింత నమ్మకం పెరిగేలా చూడాల్సిన గురుతర బాధ్యత పాలకమండళ్లపై ఉంది. కంచే చేను మేస్తే? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ...ఇదీ మన సంప్రదాయం. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుంటారని ఎంతో నమ్మకంతో పాఠశాలలకు, కళాశాలలకు పంపుతారు. గురువే కీచకునిగా మారితే, ఇక విద్యార్థినులు తమ సమస్యలçను ఎవరితో చెప్పుకోవాలి? కంచే చేను మేస్తే ఎవరు దిక్కు? విద్యాసంస్థలలో నిఘా మరింత పెంచాలి. ఇటీవల నన్నయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కొన్ని సంఘటనలు మానవత్వానికే మచ్చ తెచ్చేతీరులో ఉన్నాయి. పరిస్తితిని అదుపుచేయకపోతే, విద్యావ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితులు తలెత్తవచ్చు. – ఎం.ఉమాదేవి, ప్రిన్సిపాల్, శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా డి.ఎడ్.కళాశాల విచక్షణతో కూడిన కోరికలు మాత్రమే ఉండాలి మానవునికి కోరికలు ఉండాలి, కానీ అవి విచక్షణతో కూడినవై ఉండాలి. విద్యాలయాలలో ఇటువంటి కీచకులు తరచుగా కనిపిస్తున్నారు. వీరిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి. ఇలాంటివారికి వేసే శిక్షలు కఠినంగా ఉండాలి. అప్పుడే మరో కీచకుడు తయారవకుండా ఉంటాడు. – పి.శ్యామ, వైస్ ప్రిన్సిపాల్, ఏఎస్డీ మహిళా డిగ్రీ కళాశాల, కాకినాడ గురువులు యోగా,మెడిటేషన్ తప్పనిసరిగా అలవరచుకోవాలి మానవునికి జీవులలోకెల్లా భిన్నంగా విచక్షణాజ్ఞానాన్ని ప్రకృతి ప్రసాదించింది. ఆ విచక్షణను చదువుకున్న విద్యావంతులే మంచికి ఉపయోగించకపోవటం విచారకరం. మానవుడు వివేకవంతంగా నడవాలంటే యోగా, మెడిటేషన్లు అలవరచుకోవాలి. వీటితోపాటు ఆత్మశుద్ధి కలగటానికి దైవమార్గాన్ని అలవరచుకోవాలి. అప్పుడే మానవుడు వక్రబుద్ధి వదలి సన్మార్గంలో నడవగలుగుతాడు. – డాక్టర్ డి.చిన్నారావు, రసాయన శాస్త్రం విభాగాధిపతి, ఏఎస్డీ మహిళా డిగ్రీ కళాశాల, కాకినాడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 67ఏ ప్రకారం కేసు నమోదు చేయాలి ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో విద్యార్ధినులను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 67 ఏ ప్రకారం కేసు నమోదు చేసి ఉంటే బెయిల్ రావడానికి అవకాశం ఉండేది కాదు. బెయిల్ వచ్చే విధంగా పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేశారో అర్థం కావడం లేదు. పోలీసులు ఇప్పటికైనా సక్రమంగా విచారణ జరిపి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారం కేసు నమోదు చేసి, ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ విద్యార్థుల, ప్రజల్లో నమ్మకాన్ని కలిగేట్టు చేయాల్సిన అవసరం ఉంది. – ముప్పాళ్ల సుబ్బారావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి ఆదికవి నన్నయ్య యూనిర్శిటి విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురి చేసిన అధ్యాపకుడు సూర్య రాఘవేంద్రపై తక్షణం క్రిమినల్ కేసులు పెట్టాలి. విద్యార్థునులను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆయన అంగికరించాడు. నిర్భయ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టాలి. భవిషత్తులో ఇలాంటివి జరగకుండా యంత్రాంగం ఏర్పాటు చెయ్యాలి. ఇంటర్నల్ కమిటీ వేయడంతో ఇంటర్నల్ మార్కులు వారి చేతిలో ఉంటాయి. భయం కొద్దీ చెప్పలేరు. అలాంటివి కాకుండా ప్రభుత్వం తరుపు నుంచి, ఐసీడీఎస్ అధికారులను వేసి విచారణ జరపాలి. – టి.అరుణ్, సీపీఎం జిల్లా కార్యదర్శి చట్టాలు కఠినంగా ఉండాలి... సరస్వతీ నిలయాలుగా ఉండే విద్యాలయాల్లో ఇటువంటి చర్యలకు పాల్పడి విద్యావ్యవస్ధకే ముప్పు తెస్తున్నారు. ఇటువంటి వాటిపై వర్సిటీ స్ధాయిలో కఠినమైన చట్టాలు ఉండాలి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించడానికి వచ్చే విద్యార్థినులకు సరైన రక్షణ ఉండి ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి. జగన్ ప్రభుత్వం ఇంత త్వరగా స్పందించి చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. – కాశిన మల్లేశ్వరరావు,బీసీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు వర్సిటీలో గ్రీవెన్స్‌సెల్ సమర్థవంతంగా పనిచేయాలి వర్సిటీలో ఉన్న గ్రీవెన్స్ సెల్ సమర్థవంతంగా పనిచేసి మహిళలకు రక్షణ కల్పించాలి. వర్సిటీలకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల తరువాత గురువులనే పూజిస్తారు. వీరి ఆలోచనలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి. – వై.జయ, ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్,జేఎన్టీయూకే మొగ్గలోనే తుంచి వేయాలి చదువుచెప్పే అధ్యాపకుని ప్రవర్తనలో అభ్యంతరకరమైన ధోరణి కనపడితే, విద్యార్థినులు మౌనంగా ఉండరాదు. ఈ ధోరణులను మొగ్గలోనే తుంచి వేయడానికి అధికారులు, తల్లిదండ్రులు, సాటి విద్యార్థుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లాలి. విద్యార్థినులు సంఘటితశక్తిగా నిలబడాలి. తప్పు చేసినవాడిని నిలదీయాలి. అధ్యాపకులు విద్యార్థినులను తమ పిల్లలుగా భావించాలి. – గుంటూరి వెంకటేశ్వరరావు, కవి, విశ్రాంత ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ -
పర్యాటకంలో విషాదం...
తూర్పుగోదావరి ,పి.గన్నవరం: సరదాగా ప్రకృతి ఒడిలో సేద తీరదామని వచ్చిన ఓ యువకుడు అదే ప్రకృతిలో ప్రాణాలను కోల్పోయాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చిన అతడిని మృత్యువు కాటేసింది. మారేడుమిల్లి నుంచి 14 కిలోమీటర్ల దూరంలోని పర్యాటక ప్రాంతం అమృతధార జలపాతం వద్దకు ఆదివారం సాయంత్రం పి.గన్నవరం మండలం ముంగండ గ్రామానికి చెందిన పాలూరి మణికంఠ (23) స్నేహితులతో వాహనంలో వచ్చాడు. స్నానం చేసేందుకు అమృతధార జలపాతం పైకి ఎక్కగా ప్రమాదవశాత్తూ పైనుంచి జారి పడ్డాడు. అతని శరీరానికి బలంగా బండరాళ్లు తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతనిని స్నేహితులు వారు వచ్చిన వాహనంలో రంపచోడవరం ఆస్పత్రికి తీసుకు వెళ్లేసరికే అతడు మృతి చెందాడు. ముంగండలో విషాద ఛాయలు ముంగండ ముత్యాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన మణికంఠ మరణించినట్టు సమాచారం రావడంతో అతడి తల్లిదండ్రులు, బంధువుల కన్నీరుమున్నీరుగా విలపించారు. అతడి తండ్రి ఆదినారాయణ కొబ్బరి కాయలు గ్రేడింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. వీరికి అతడు ఏకైక సంతానం. అతడు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన ఏకైక కుమారుడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో తల్లి,దండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. -
వీడిన కాకినాడ జంట హత్యల కేసు మిస్టరీ!
సాక్షి, తూర్పుగోదావరి: నాలుగు నెలల క్రితం కాకినాడలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాకినాడ టూటౌన్ పోలీసులు.. సోమవారం నిందితుడు వీర్రాజును అరెస్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. నిందితుడు వీర్రాజు గతంలో రెండేళ్ల పాటు అదే ఇంట్లో అద్దెకు ఉన్నాడనీ, స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు రావడంతో చోరీలకు పాల్పడేవాడు. అదే క్రమంలో చోరీకి పాల్పడుతూ అడ్డుకున్న దంపతులను హత్య చేశాడు. ఈ క్రమంలో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పలు డాక్యుమెంట్లను తగులబెట్టాడు. కాగా జూన్ 7న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ముమ్మిడివారి వీధిలో నివాసం ఉంటున్న తుమ్మలపల్లి సత్యానందం (65), మంగతాయారు (62) అనే వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. భార్యభర్తలను హత్య చేసిన ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు చేసిన కేవలం మూడు సెకండ్స్ ఫోన్ కాల్ ఆధారంగా కేసును చేధించామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ వెల్లడించారు. అంతేకాక అతని నుంచి రూ. 4 లక్షల 75 వేల విలువైన వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నట్లు మీడియాకు వివరించారు. -
ఆరిపోయిన ఇంటి దీపాలు
దీపావళి రోజున వెలుగులు నింపడానికి బాణసంచా తయారీలో పనికి కుదిరిన ఆ కూలీల జీవితాల్లో విషాదమే మిగిలింది. వ్యవసాయ పనులేవీ లేకపోవడంతో నెల రోజుల ఉపాధి కోసం వెళ్లిన ఈ ఐదుగురూ మృత్యువుతో పోరాడి అసువులు బాశారు. బుధవారం ఇద్దరు, గురువారం ముగ్గురు మృత్యువాత పడడంతో సామర్లకోట మండల పరిధిలోని వేట్లపాలెం శివారు కాలనీల్లో కన్నీరు గూడుకట్టుకుంది. తెలతెలవారుతుండగానే... సూరీడు పొద్దు పొడవకముందే ఆ గ్రామంలో కూలీలు నిద్రలేచి కూటి కోసం పరుగులు తీస్తారు. రోజూలాగానే 12 మంది కూలీలందరూ కలసి గత నెల 30వ తేదీన బాణసంచా తయారీ పనులకు వెళ్లారు. గత నెలాఖరు... అదే వారి జీవితాల్లో ఆఖరి ఘడియలని తెలుసుకోలేకపోయారు. వారి బతుకులతో విధి ఆడిన వికృత క్రీడకు ఆ ఇంటి దీపాలు ఆరిపోయాయి. సామర్లకోట (పెద్దాపురం): మండలంలోని వేట్లపాలెం–జి.మేడపాడు మధ్య కెనాల్ రోడ్డులో ఉన్న ఇందిరా ఫైర్ వర్క్స్‌లో గత సోమవారం బాణసంచా తయారీ చేస్తుండగా జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. వేట్లపాలెం శివారు ప్రాంతం గూడపర్తి, జొన్నలదొడ్డికి చెందిన 12 మంది సోమవారం బాణసంచా తయారు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించిన విషయం విదితమే. ఈ సంఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడగా, వారిని మెరుగైన వైద్యం కోసం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ క్షతగాత్రులైన బంటు చెల్లాయ్యమ్మ (45) మాకిరెడ్డి నూకాలమ్మ (70) బుధవారం మృతి చెందగా, బత్తిన లోవ కుమారి (45) కాకర అనిత(30) కొంగు లక్ష్మి(55) గురువారం మృతి చెందారు. క్షతగాత్రులు మృతి చెందిన విషయం తెలియడంతో వేట్లపాలెంలోని శివారు ప్రాంతాలైన జొన్నలదొడ్డి, గూడపర్తిలలో విషాదఛాయలు అలముకున్నాయి. బంటు చెల్లాయ్యమ్మకు ఇద్దరు కుమార్తెలు. వారికి పెళ్లిళ్లు చేసింది. భర్తను పోషించడానికి కూలి పనికి వెళ్లి పేలుడు ప్రమాదంలో చనిపోయింది. మాకిరెడ్డి నూకాలమ్మ వృద్ధాప్యంలోనూ కుటుంబపోషణకు వెళ్లి బలైంది. బత్తిన లోవకుమారికి భర్త, ఇద్దరు కుమార్తెలు. బాణసంచా తయారీ పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. నాలుగు రోజులుగా తన తల్లి కనిపించకపోవడంతో ఏడో తరగతి, నాలుగో తరగతి చదువుతున్న చిన్నారులు బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నారు. గురువారం తల్లి మృతి చెందిన విషయం తెలిసి చిన్నారులతో పాటు ఆ ప్రాంత ప్రజలు విషాదంలో మునిగిపోయారు. కాకర అనితకు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒక కుమార్తె ఇంటర్, మరో కుమార్తె ఆరో తరగతి చదువుతున్నారు. సోమవారం నుంచి తండ్రి దుర్గారావుతోపాటు వారు కూడా కంటిపై కునుకు లేకుండా ఉన్నారు. గురువారం అనిత మరణ వార్తతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. కొంగు లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమారుడికి వివాహమైంది. చిన్నకుమారుడుకి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో ఆమె లేకుండా పోయిందని ఆమె బంధువులు రోదించారు. మృతదేహాలను ఇళ్లకు తీసుకువెళ్లకుండా కాకినాడ నుంచి నేరుగా వేట్లపాలెంలోని శ్మశాన వాటికకు గురువారం రాత్రి తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. ఆందోళనతో విజయం సాధించాం బాణసంచా పేలుడు ప్రమాదంలో క్షతగాత్రులు మృతి చెందడంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించామని దళిత నాయకులు లింగం గంగాధర్, లింగం శివప్రసాద్, వల్లూరి సత్తిబాబు, సరిపల రాజేష్, సిద్ధాంతుల కొండబాబు, పి.జనార్దన్‌లు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చారని వారు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో పాటు, ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు దళిత సంఘాల ఆందోళనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారని వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు తెలిపారు. మృతి చెందిన వారి, క్షతగాత్రుల ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రికి మంత్రి కన్నబాబు వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించి మృతి చెందిన వారికి రూ.పది లక్షలు, క్షతగాత్రులకు రూ.నాలుగు లక్షలు ఇవ్వడానికి అంగీకరించారని దొరబాబు స్థానిక విలేకర్లకు తెలిపారు. వీరి కుటుంబాలకు అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని దొరబాబు తెలిపారు. -
ఫోటోలు తీయాలంటూ నమ్మించి..
సాక్షి, కాకినాడ: పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరుకు ఫొటోలు తీయాలని, బంగారు ఆభరణాలు తీసివేసి ఫోటో దిగాలని నమ్మిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మలికిపురం పోలీసులు అరెస్టు చేశారు. రాజోలులో సీఐ నాగమోహనరెడ్డి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. సఖినేటిపల్లికి చెందిన ఇంజేటి ఆనంద్‌బాబు కొంతకాలంగా పలు చోరీ కేసులలో నిందితుడిగా ఉన్నాడు. మలికిపురం మండలం శంకరగుప్తం, లక్కవరం, విశ్వేశ్వరాయపురం గ్రామాల్లో ఇటీవల పలు చోరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆనంద్‌బాబుపై అనుమానం వచ్చింది. గతంలో సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పలు దొంగతనాలకు సంబంధించి అతడు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. తాజా చోరీల నేపథ్యంలో మలికిపురం ఎస్సై కేవీ రామారావు అతడిపై నిఘా పెట్టారు. గుడిమెళ్ళంకలో ఆదివారం ఆనంద్‌బాబు అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్సై అతడిని అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు రూ.2.36 లక్షల విలువైన 65 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డుల కోసం ఫొటోలు తీయాలని, ఆ సమయంలో శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు తీసివేయాలని, లేకపోతే పింఛన్ పొందేందుకు అర్హత కోల్పోతారని చెబుతూ, వారి నగలను అపహరిస్తున్నాడని సీఐ తెలిపారు. ఒంటరిగా ఉన్న మహిళలకు మాయమాటలు చెప్పి, బంగారు ఆభరణాలు అపహరిస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడన్నారు. నిందితుడిని రాజోలు కోర్టుకు తరలిస్తున్నట్టు ఎస్సై చెప్పారు. -
మాయగాడి వలలో చిక్కుకొని..
సాక్షి, కాకినాడ : హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఆ మాయగాడి వలలో పడింది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్లు సహజీవనం చేశారు. ఓ బిడ్డను కన్నారు. చివరికి ఆ యువతిని అతగాడు వంచించాడు. ‘ఎవడి దగ్గర బిడ్డను కన్నావంటూ అత్యంత అవమానకరంగా, నీచంగా మాట్లాడి, ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి నెల రోజుల ఆడ శిశువుతో ఆ యువకుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. ఆమె కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన కేసిరెడ్డి పాండు, లక్ష్మి దంపతుల కుమార్తె నందిని. ఆమెకు 2013లో వరంగల్‌కు చెందిన మేనమామతో వివాహమైంది. తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడంతో కొద్ది రోజులకే తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లకుండా ఓ ఇంట్లో పనికి చేరింది. 2016లో ఓ మొబైల్ షాపులో చేరింది. అదే సమయంలో కోటనందూరు మండలం ఎస్సార్ పేట గ్రామానికి చెందిన అన్నంరెడ్డి నూకరాజు హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. నందినితో అతడు పరిచయం ఏర్పరచుకున్నాడు. నందిని పరిస్థితులు తెలుసుకున్న నూకరాజు పెళ్లి చేసుకుంటానని, తన దగ్గరకు వచ్చేయమని కోరాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె ఆ మాటలు నమ్మి, అతడి వద్దకు చేరింది. నెల రోజుల పసికందుతో బాధితురాలు నందిని నందిని ఒంటరితనాన్ని ఆసరాగా తీసుకున్న నూకరాజు మోసపూరితంగా వ్యవహరించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించేందుకు హైదరాబాద్‌లోని ఒక గుడిలో దండలు మార్చి, పెళ్లయ్యిందనిపించాడు. అలా సహజీవనం ప్రారంభించిన కొంత కాలానికి నందిని గర్భవతి అయ్యింది. దీంతో ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అబార్షన్ చేయించాడు. ఆ తరువాత మళ్లీ తన ఇంట్లో అందరి సమక్షంలోనూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మళ్లీ గర్భవతి కావడంతో రెండోసారి కూడా అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు నందిని తిరస్కరించింది. అప్పటి నుంచీ అల్లర్లు, గొడవలతో వారి జీవనం సాగేది. ఈ నేపథ్యంలో ప్లేటు ఫిరాయించిన నూకరాజు ‘‘ఎవడి దగ్గర బిడ్డని కన్నావు? నిన్ను పెళ్లి చేసుకోను’’ అని నీచంగా మాట్లాడుతూ ముఖం చాటేశాడు. మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని వివాహం చేసుకొనేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామం ఎస్సార్ పేట వచ్చాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు నందిని ఆదివారం సాయంత్రం నెల రోజుల తన పసిబిడ్డతో ఎస్సార్ పేట చేరుకుంది. అతడి ఇంటి ముందు నిరసనకు దిగింది. నూకరాజు కుటుంబ సభ్యులు గెంటేయడంతో తన బిడ్డతో పక్కవారింట్లో తల దాచుకొంది. అయిన వారందరినీ కోల్పోయిన తాను నూకరాజుతోనే జీవిస్తానని, తనకు పుట్టిన బిడ్డకు నూకరాజే తండ్రని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. స్థానికుల సహకారంతో కోటనందూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి : నపుంసకునితో వివాహం చేశారని.. -
ముసలి వయస్సులో అర్థం లేని అనుమానంతో..
సాక్షి, కాకినాడ : ముసలి వయస్సులో అర్థం లేని అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. వేగాయమ్మపేట గ్రామంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని హైస్కూల్ వీధిలో నివాసం ఉండే వాడపర్తి మంగకు మేనమామ సమనస చంద్రరావుతో 35 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం తన సొంత ఊరు ముమ్మిడివరం మండలం కమిడి నుంచి వేగాయమ్మపేటకు చంద్రరావు వచ్చేశాడు. అప్పటి నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు అబ్బాయిలు. వారందరికీ వివాహాలు జరిగినా భార్యలతో విడిపోయి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. చంద్రరావు, కుమారులు ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చంద్రరావు పెళ్లయిన నాటి నుంచే అనుమానంతో భార్యను వేధించేవాడు. ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్లినా నీ దగ్గరకు వచ్చి వెళ్తున్నారంటూ భార్య మంగతో గొడవ పడి కొడుతుండేవాడు. కొడుకులు, బంధువులు వారించినా వినేవాడు కాదు. శనివారం రాత్రి కూడా 10 గంటల సమయంలో భార్యతో గొడవ పడ్డాడు. నిన్ను చంపితే పీడ విరగడ అవుతుందని కేకలు వేశాడు. ఉదయం చిన్న కొడుకు వీరబాబు, మంగ చెల్లెలు వాడపర్తి లక్ష్మి టీ ఇద్దామని మంగ దగ్గరకు వెళ్లగా గదిలో మంచంపై భయంకరమైన స్థితిలో మంగ(50) మృతదేహం పడి ఉంది. గొడ్డలితో బలంగా నరికినట్టు తలభాగం విడిపోయి మెదడు బయటకు వచ్చి చూసేందుకు భయం గొలిపేలా ఉంది. వెంటనే వారు ద్రాక్షారామ పోలీసులకు సమాచారం అందించారు. తెల్లవారు జామున 5 గంటల సమయంలో చంద్రరావు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని టవల్లో చుట్టి సైకిల్‌పై తీసుకువెళ్లడం చూశామని కొందరు చెప్పడంతో మంగ తండ్రి వాడపర్తి సూరన్న తన కూతురును హత్య చేసిన చంద్రరావుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేశారు. పక్క ఇంట్లో ఉంటున్న బంధువుల ఇద్దరి కుమార్తెలు బాలింతలు. వారి పిల్లలు పాల కోసం ఏడుస్తుండటంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో మంగ వారి ఇంటికి వెళ్లి చంటి పిల్లలను సముదాయించి వెళ్లడంతో హత్య తెల్లవారుజామున చేసి ఉంటాడని భావిస్తున్నారు. రామచంద్రపురం సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ద్రాక్షారామ ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ సంఘటనా స్థలం వద్ద విచారణ నిర్వహించారు. గ్రామ వీఆర్వో వాసంశెట్టి శ్రీరామకృష్ణ పోలీసుల విచారణకు సహకరించారు. మృతురాలి తల్లిదండ్రులు సూరన్న, సత్తెమ్మ, కుమారులు లోవరాజు, గుర్రయ్య, వీరబాబు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కలచివేసింది. ఇంత దారుణం చేస్తాడనుకోలేదు పెళ్లయిన నాటి నుంచే అనుమానంతో వేధించేవాడు. తరువాత మారతాడులే అనుకునే వాళ్లం. కానీ వయస్సు పెరిగినా అతడిలో అనుమానం చావలేదు. ఇంటికి పెద్ద గోడ కట్టించినా బయటివాళ్లకు మా అమ్మాయి కన్పించకూడదని కొబ్బరి ఆకులు అడ్డం పెట్టాడు. ఎవరు రోడ్డుపై నుంచి వెళ్లినా వాళ్లతో సంబంధం అంటగట్టి గొడవ పెట్టేవాడు. ఏడాది క్రితం నెత్తి మీద కర్రతో గట్టిగా కొట్టడంతో బలమైన గాయం అయ్యింది. అప్పుడు పోలీసు కేసు పెట్టకుండా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించాం. ఇప్పుడు ఇంత భయకరంగా నరికి చంపుతాడని ఎవరం ఊహించలేదు. ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి. – వి.సూరన్న, మృతురాలి తండ్రి -
ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య
సాక్షి, కాకినాడ : రూరల్ మండలం తూరంగిలో ఓ ప్రధానోపాధ్యాయుడ్ని అతని ఇంట్లోనే దారుణంగా నరికి హత్య చేసిన సంఘటన కాకినాడలో కలకలం సృష్టించింది. రేపూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న పట్నాల వెంకట్రావు (57) హత్యకు గురయ్యారు. ఇంటి వెనుక వైపు ఉన్న కిటికీలోనుంచి వెదురు గెడకు చిన్న చాకును కట్టి దాన్ని వంచి తలుపు గెడ తీసి ఇంటి లోపలకు ప్రవేశించిన దుండగులు వెంకట్రావును హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్య జరగడానికి ముందు దుండగులతో ఆయన పెనుగులాడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారనే విషయాలు తెలియకపోవడంతో వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని డీఎస్పీ కె.కుమార్, రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ పరిశీలించారు. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ వేలిముద్రలు సేకరించాయి. చుట్టు పక్కల ప్రాంతాలను డాగ్ స్క్వాడ్ పరిశీలించింది. కుక్క వాసన చూసుకుంటూ పక్కనే ఉన్న కాలువ వరకూ వెళ్లి తిరిగి వెనక్కి వచ్చింది. హత్యకు గురైన వెంకట్రావు తూరంగి సూర్యనగర్ పక్కన ఉన్న రోడ్డు నుంచి కొవ్వూరు వెళ్లే రోడ్డులో ఓ లేఅవుట్లో రెండంతస్తుల ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఆ ఇంటి వెనుక మరో రెండంతస్తుల భవనం మాత్రమే ఉంది. చుట్టు పక్కల ఎవరూ నివసించకపోవడం, అంతా ఖాళీ ప్రదేశం కావడంతో వచ్చిన దుండగులు వెంకట్రావును సులభంగా హత్య చేసి వెళ్లిపోయారని భావిస్తున్నారు. మృతునికి భార్య వెంకటరమణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరికీ వివాహాలు కావడంతో వెంకట్రావు దంపతులు మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు. బంధువులు తెలిపిన సమాచారం మేరకు... హైదరాబాదులో ఉంటున్న చిన్న కుమార్తె తులసి రాధికకు, ఆమె పిల్లలకు అనారోగ్యంగా ఉందని తెలియడంతో భార్యను శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో బస్సు ఎక్కించి ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నారు. తూరంగి భాస్కర గార్డెన్‌వీధిలో నివాసం ఉంటున్న తన వియ్యంకుడు ప్రభాకరరావుతో కొద్దిసేపు ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఇంటికి భోజనానికి రావాలని ప్రభాకరరావు కోరడంతో తాను తన అమ్మ సత్యవతిని చూడటానికి కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప వెళ్తానని చెప్పారు. ఉదయం హైదరాబాద్ చేరుకున్న వెంకట్రావు భార్య వెంకటరమణ ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని రావడంతో తమ వియ్యంకుడు ప్రభాకరరావుకు ఫోన్ చేసి ఆయన ఫోన్ ఎత్తడంలేదని, ఒక సారి ఇంటికి వెళ్లి చూసి రావాలని కోరారు. దీంతో ప్రభాకరరావు తన మేనల్లుడితో కలసి వెంకట్రావు ఇంటికి వెళ్లారు. ముందు తలుపులన్నీ మూసి ఉండటంతో వెనుక వైపు వెళ్లి చూసేసరికి తలుపులు తీసి ఉండటం, లోపలికి వెళ్లగా వెంకట్రావు శరీరంపై అనేక కత్తిపోట్లతో మృతి చెంది ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ హత్య రాత్రి 11 గంటల సమయంలో జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు పాల్గొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హత్య జరిగిన కోణాన్ని పరిశీలిస్తే దొంగతనం కోసం జరిగినట్టుగా కన్పించడంలేదని, ఏదో కక్షతో ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్టు కన్పిస్తుందన్నారు. ఇంట్లో ఏ వస్తువు గానీ, బీరువాను గానీ దుండగులు ముట్టుకోలేదని పోలీసులు చెబుతున్నారు. వెంకట్రావు ఫోను, ల్యాబ్‌టాప్ కన్పించడంలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ హత్యకు కారణాలు ఏమిటీ, దొంగతనం కోసం జరిగి ఉంటే ఇంట్లో ఏ ఒక్క వస్తువు పోలేదని, ఆస్తుల గొడవలు ఏమీ లేవని బంధువులు చెబుతున్నారన్నారు. హెచ్ఎం వెంకట్రావు హత్య సమాచారం అందడంతో ఉపాధ్యాయులు, అధికారులు, స్నేహితులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విధి నిర్వహణలో ఎంతో సౌమ్యుడిగా పేరొందిన వెంకట్రావు హత్యను తోటి ఉపాధ్యాయులు, అధికారులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని చూసిన ఉపాధ్యాయులు బోరున విలపించారు. పోలీసులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మింగేసిన బావి
రోజూ మాదిరిగానే ఉపాధి కోసం కూలి పనికి వెళ్లిన వారు అక్కడే సజీవ సమాధి అయిపోయారు. పాడుబడిన ఓ బావిని పూడ్చే యత్నంలో.. మీద పడిన మట్టిపొరల్లో చిక్కుకుపోయి మృత్యులోకాలకు చేరుకున్నారు. కాకినాడలోని ఓ ఇంట్లో బావిని పూడ్చేందుకు శుక్రవారం ఇటుకలు తీస్తూండగా.. ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలైన ఘటన అయినవారికి విషాదాన్ని మిగిల్చింది. సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : కాకినాడ ఎస్.అచ్యుతాపురం రైల్వేగేటు సమీపంలోని ద్వారకానగర్‌లో పాడుబడిన నుయ్యిని మూసే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో ఎస్.అచ్యుతాపురం ద్వారకానగర్‌కు చెందిన గోడసకుర్తి సత్యనారాయణ (42), కరప మండలం పెద్దాపురప్పాడు సలాది శ్రీను(45) మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ద్వారకానగర్‌లోని గుర్రాల లక్ష్మీకాంతానికి చెందిన స్థలంలో 50 ఏళ్ల పైబడిన 15 అడుగుల పురాతన నుయ్యి ఉంది. దీనిని పూడ్చేందుకు నిర్ణయించిన లక్ష్మీకాంతం మొదట మట్టి వేసి మూసివేయాలని ప్రయత్నించారు. ఎవరో అలా చేయకూడదని చెప్పడంతో తనకు తెలిసిన వాస్తు సిద్ధాంతి సలహా తీసుకున్నారు. ఆయన కూడా నూతిని నేరుగా పూడ్చకూడదని, ఉన్న ఇటుకలు, తీసివేసి అప్పుడు మూసివేయాలని చెప్పడంతో ఆ ప్రకారం లక్ష్మీకాంతం తన సమీప బంధువు తాపీమేస్త్రీ అయిన ఎస్ అచ్యుతాపురం ద్వారకానగర్‌కు చెందిన గోడసకుర్తి సత్యనారాయణ(42)కు పని పురమాయించారు. దీంతో సత్యనారాయణ తన వద్ద పని చేస్తున్న కరప మండలం పెద్దాపురప్పాడు సలాది శ్రీను (45)తో కలసి గురువారం నుంచి నూతిలోని ఇటుకలను తీసివేసే పనులు ప్రారంభించారు. శుక్రవారం కూడా యథావిధిగానే ఆ పనులు చేపట్టారు. మధ్యాహ్న సమయంలో ఇంటి యజమాని గుర్రాల లక్ష్మీకాంతం పనుల పరిశీలనకు ఆ ప్రాంతానికి రాగా అక్కడ పని చేస్తున్న సత్యనారాయణ, శ్రీను కనిపించలేదు. నుయ్యిలోని మట్టి అండలు కూలిపోయి ఉండడంతో ఆందోళనకు గురైన లక్ష్మీకాంతం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి నుయ్యిలో పూడుకుపోయిన అండలను తీసే కార్యక్రమాన్ని చే³ట్టారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రత్యేక క్రేన్ల సాయంత్రం మట్టి అండలను, ఇటుకలు తీసే పనులను ప్రారంభించారు. చివరకు రాత్రి 7.30 గంటల సయమంలో నూతిలో సజీవ సమాధి అయిన సత్యనారాయణ, శ్రీను మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబాలు అక్కడకి చేరుకొని మృతదేహాలను తరలించేందుకు వీల్లేదని, తమ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. ఈ సంఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు గోడసకుర్తి సత్యనారాయణకు భార్య ఉమామహేశ్వరి, ఇద్దరు పిల్లలు ఉండగా, సలాది శ్రీనుకు భార్య ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వారిద్దరికీ పెళ్లిళ్లయ్యాయని బంధువులు చెబుతున్నారు. బావిలో మట్టిపెళ్లలు తొలగించి, కూలీల మృతదేహాలను వెలికితీస్తున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది -
ఆశయం నెరవేరకుండానే అనంతలోకాలకు..
సాక్షి తూర్పుగోదావరి(కత్తిపూడి) : విధి నిర్వహణలో ఉండగానే తండ్రి అకాల మరణం చెందడంతో ఆ ఉద్యోగం పొందేందుకు బంధువు సహయంతో బైక్‌పై వెళుతున్న ఓ యువతి గురువారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. ఏలేశ్వరం మండలం మార్కెండేయపురానికి చెందిన బొజ్జపు వెంకటలక్ష్మి (28) తండ్రి ఇటీవలే అకాల మరణం చెందారు. అయితే తండ్రి ఉద్యోగాన్ని పొందేందుకు ఆమె తన సమీప బంధువు అడ్డతీగల గ్రామానికి చెందిన పడాల నరేష్‌తో కలసి తుని ఆర్టీసీ డిపోకు వెళుతుండగా కత్తిపూడి 16 నంబరు జాతీయ రహదారి ఆర్టీఓ కార్యాలయం సమీపంలో తుని నుంచి కాకినాడ వైపు వెళుతున్న మినీవ్యాన్ రాంగ్ రూట్లో వచ్చి వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. నరేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని పంచనామా నిమిత్తం ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అడిషనల్ ఎస్సై శంకర్రావు తెలిపారు. -
స్నేహితురాలితో మేడపై ఆడుకుంటూ...
సాక్షి, తూర్పుగోదావరి(పిఠాపురం) : వారిద్దరూ మిత్రులు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న వీరు ఎప్పుడూ కలిసే ఉంటారు. కలిసే ఆడుకుంటారు. ఎప్పటిలానే తమ మేడపై ఆడుకుంటుండగా విద్యుత్ షాక్ రూపంలో వచ్చిన మృత్యువు ఆ స్నేహాన్ని విడదీసింది. ఒకరు అనంత లోకాల్లో కలసి పోగా మరొకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన పిఠాపురం పట్టణంలోని లయన్స్‌క్లబ్ ఏరియాలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. పిఠాపురం లయన్స్‌క్లబ్ ఏరియాలో నివాసముంటున్న చింతపల్లి రామచంద్రారెడ్డి కుమార్తె చింతపల్లి సమీర(11), వారి ఇంటికి దగ్గరలో ఉన్న ఇందనపు సుబ్బలక్ష్మి కుమార్తె ఐశ్వర్య (12) ఇద్దరు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. ఇద్దరు స్థానిక ప్రైవేటు స్కూల్లో ఏడో తరగతి చదువుతుండగా ఐశ్వర్య ఈ ఏడాది ప్రైవేటు స్కూల్ నుంచి స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలకు మారింది. స్నేహితురాలికి జ్వరం వచ్చిందని.. స్కూలుకు వెళ్లేటప్పుడు వచ్చిన తరువాత ఇద్దరు కలుసుకుని మాట్లాడుకోవడం, ఖాళీ సమయాల్లో కలిసి ఆడుకోవడం చేస్తుంటారు. బుధవారం స్కూల్‌కు బయల్దేరిన ఐశ్వర్య తన స్నేహితురాలు బడికి వెళ్లడం లేదని జ్వరం వచ్చిందని తెలిసి తాను బడికి వెళ్లడం మానేసింది. తన ఫ్రెండ్ సమీర ఇంటికి వెళ్లిన ఐశ్వర్య సమీరకు తోడుగా ఉంది. జ్వరం కాస్త తగ్గడంతో ఇద్దరు మధ్యాహ్నం సమీర ఇంటి మేడపైన బంతాట ఆడుకుంటున్నారు. ఇంతలో బంతి మేడ పిట్టగోడకు బిగించి ఉన్న లైట్ వద్దకు వెళ్లి పోవడంతో దానిని తీసుకునే ప్రయత్నం చేసిన ఐశ్వర్య ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురై లైట్‌కు అతుక్కుపోయింది. అక్కడే ఉన్న సమీర ఆమెను రక్షించే ప్రయత్నం చేసి ఆమెను లాగే ప్రయత్నంలో ఆమె కూడా కరెంట్ షాక్‌కు గురైంది. ఇంతలో వారి అరుపులు విన్న సమీర తల్లి నాగశివజ్యోతి పరుగున మేడపైకి వచ్చి ఇద్దరినీ రక్షించే ప్రయత్నంలో తాను కూడా కరెంట్ షాక్‌కు గురవుతానన్న భయంతో వెంటనే కిందకు వెళ్లి మెయిన్ ఆఫ్ చేసి వచ్చి ఇద్దరినీ విడిపించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఐశ్వర్య మృతి చెందింది. సమీరను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. కంటికి రెప్పలా పెంచుకున్న కన్న కూతురు ఇక లేదని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్న మృతురాలి తల్లి సుబ్బలక్ష్మిని ఆపడం ఎవరితరం కావడం లేదు. పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి నిరాకరించిందని దాడి!
సాక్షి, పశ్చిమగోదావరి(పెనుగొండ) : పెళ్లికి నిరాకరించడంతో యువతిపై చాకుతో దాడి చేసి ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం మార్టేరుకు చెదిన గ్రంధి మణికుమార్(28), రామోజు శాంతకుమారి(22) మార్టేరులోని ఒక ప్రైవేటు షాపులో పనిచేసేవారు. మణికుమార్ ఆమెను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. ఇందుకు శాంతకుమారి నిరాకరిస్తూ వస్తోంది. మంగళవారం పెనుగొండ గాంధీ బొమ్మల సెంటరుకు పనిమీద వచ్చిన యువతిపై మణికుమార్ చాకుతో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి స్వల్ప గాయం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆమెపై దాడికి పాల్పడిన మణికుమార్ అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో మణికుమార్ కోలుకుంటున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకులో బంగారం విడిపిస్తానని ఫైనాన్సియర్‌ను నమ్మించి..
సాక్షి, తూర్పుగోదావరి(అన్నవరం) : బ్యాంకులో కుదువ పెట్టిన రూ.ఏడు లక్షల విలువైన బంగారాన్ని విడిపించుకోవడానికి రూ.2.20 లక్షలు సహాయం చేస్తే ఆ బంగారాన్ని తక్కువ ధరకు మీకే విక్రయిస్తానని ఫైనాన్సియర్‌ను నమ్మించి ఆ సొమ్ము తీసుకుని పరారైన ఘరానా మోసగాడి ఉదంతమిది. తొండంగి ఎస్సై గోపాలకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని గోపాలపట్నంలోని ఎస్బీఐ బ్రాంచ్ ఇటీవల బ్యాంకులో ఖాతాదారులు విడిపించుకోని బంగారాన్ని వేలం వేస్తున్నట్టు పత్రికలో ప్రకటన ఇచ్చింది. అది చూసిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కుమార్ అనే వ్యక్తి విజయవాడలోని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి ఫోన్ చేశాడు. ఆ కంపెనీ బ్యాంకు వేలం వేసే బంగారాన్ని పాడుకుని తిరిగి లాభాలకు విక్రయిస్తుంది. ఈ కంపెనీకి ఈనెల ఆరో తేదీన కుమార్ ఫోన్ చేసి గోపాలపట్నంలో గల స్టేట్‌బ్యాంక్ శాఖలో రూ.ఏడు లక్షల విలువ చేసే తన బంగారం సోమవారం వేలం వేస్తున్నారని, తన వద్ద రూ.ఐదు లక్షలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన డబ్బు మీరు సర్దితే ఆ బంగారాన్ని విడిపించి వెంటనే మీకు అమ్ముతానని తెలిపాడు. అది నిజమని నమ్మిన ఆ ఫైనాన్స్ కంపెనీ యజమాని రూ.2.20 లక్షలు తమ వద్ద పనిచేసే టి.సురేష్ అనే వ్యక్తికి ఇచ్చి సోమవారం ఉదయం ఆ బ్యాంక్‌కు పంపించారు. మరోవైపు కుమార్ సోమవారం ఉదయం అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్ దిగి, తాను ఆర్టీసీలో డీఎంనని అక్కడ క్యాంటీన్ నిర్వహిస్తున్న కర్రి లోవదొరను పరిచయం చేసుకున్నాడు. అర్జెంట్ గా స్టేట్‌బ్యాంక్‌కు వెళ్లాలని కారు కావాలని అడిగాడు. దీంతో లోవదొర తన కారు ఇచ్చి తన బంధువుతో అతడిని బ్యాంకుకు పంపించాడు. ఆ బ్యాంకు వద్ద వేచి ఉన్న ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సురేష్ వద్దకు వెళ్లి ఈ కారు తనదేనని చెప్పి బీఎం వద్దకు వెళ్లి మాట్లాడివస్తానని వెళ్లాడు. తరువాత కొంతసేపటికి వెనక్కి వచ్చి డబ్బు ఇవ్వండి బ్యాంకు మేనేజర్‌కు కట్టేస్తాను అని రూ.2.20 లక్షలు తీసుకుని మరలా బ్యాంక్ మేనేజర్ రూమ్‌లోకి వెళ్లి ఆయనతో మాట్లాడి వెనక్కి వచ్చాడు. అర్జంటుగా బయటకు వెళ్లి ఒక సంతకం పెట్టాలి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళుతుండగా ఆ ఫైనాన్స్ ఉద్యోగి అతడిని నిలదీశాడు. ‘‘మా కారు ఇక్కడే ఉంది. నేను ఇప్పుడే వచ్చేస్తా’’ అని చెప్పి రోడ్డు మీదకు వెళ్లాడు. ఎంతసేపటికి అతడు రాకపోవడంతో ఆఫైనాన్స్ ఉద్యోగి బ్రాంచ్ మేనేజర్ వద్దకు వెళ్లి గోల్డ్‌లోన్ వేలం గురించి, తన వద్ద డబ్బు చెల్లించాలని తీసుకున్న విషయం చెప్పాడు. అయితే తనను ఆ విషయాలు అతడు అడగలేదని, పర్సనల్ లోన్ కావాలని మాత్రమే అడిగాడని బీఎం చెప్పారు. దీంతో ఆ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సురేష్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బ్యాంకుకు వచ్చి సీసీటీవీ పుటేజీ పరిశీలించి ఆ మోసగాడి ఫొటో డౌన్లోడ్ చేశారు. ఈ మోసగాడిపై ఇప్పటికే ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లో పదికి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని పరిశీలనలో తేలిందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రేమించాడు..పెళ్లి ముహుర్తం పెట్టాకా..
సాక్షి, తూర్పుగోదావరి(ముమ్మిడివరం) : ప్రేమించిన ప్రియుడు వివాహ ముహూర్తం పెట్టాక ముఖం చాటేయడంతో ప్రియురాలి ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు ఛీటింగ్, అత్యాచారం కేసులు నమోదు చేశారు. కాకినాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ యాక్టు విభాగం డీఎస్పీ ఏబీజే తిలక్, ఎస్సై వెంకటరమణ మండలంలోని కొమానపల్లిలో బాధితురాలి కుటుంబ సభ్యులను విచారించారు. కొమానపల్లి గ్రామానికి చెందిన వంగలపూడి అమ్మాజీ, ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన అప్పాడి రాజేష్ అమలాపురంలో కంప్యూటర్ విద్య నేర్చుకొనే సమయంలో ప్రేమించుకున్నారు. ఆ తరువాత అమ్మాజీ ముమ్మిడివరంలో హోండా షోరూమ్‌లో పనిచేస్తున్న సమయంలో రాజేష్ గత జూలై నెలలో పెళ్లి చేసుకుంటానని అమలాపురం సాయిబాబా గుడికి తీసుకు వెళ్లి నుదుట విభూది బొట్టు పెట్టి అక్కడి నుంచి ఓడల రేవు బీచ్‌కు తీసుకువెళ్లాడు. 29న హైదరాబాద్ ఆర్య సమాజానికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుని, కొద్ది రోజులు అక్కడ వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. విషయం అమ్మాజీ తల్లిదండ్రులకు తెలియడంతో కొమానపల్లి తీసుకువచ్చి పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా ఆగస్టు 25న వారికి పెళ్లి చేయడానికి రాజేష్ తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే ఫైనాన్స్ కంపెనీలో తగవు ఉందని చెప్పి ఆగస్టు 17న స్నేహితులతో కలిసి వెళ్లిన రాజేష్ తిరిగి రాలేదని ఈ విషయంపై రాజేష్ తండ్రిని నిలదీస్తే వారి పెళ్లికి కులం అడ్డుగా చూపి నిరాకరించాడని అమ్మాజీ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ముమ్మిడివరం ఎస్సై ఎం.పండుదొర ఛీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేశారు. బాధితురాలి స్వగృహంలో సోమ వారం అమ్మాజీతో పాటు తల్లిదండ్రులు శంకరరావు, సత్యవతిలను విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. -
కలతల కల్లోలంలో.. తల్లీ బిడ్డల ఆత్మహత్య
మనస్తాపం.. ఒక్క నిమిషం తమాయించుకుంటే.. ఎంతటి సమస్యకైనా కాలమే సమాధానమిస్తుంది. అలా నిగ్రహించుకోలేకపోతే.. వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటోయో.. ఈ తల్లి, కొడుకు ఆత్మహత్య ఉదంతం.. సాక్ష్యంగా నిలుస్తుంది. కాపురంలో చిన్నపాటి వివాదాలు. గతంలో అలిగి పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చేసిన ఆమె.. ఈసారి మాత్రం మనస్థాపంతో నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని వెళ్లిపోయింది. ఈసారీ అలాగే వస్తుందనుకున్న భర్త, బంధువులు.. వారిద్దరి మృతదేహాలు కంటపడేసరికి తల్లడిల్లిపోయారు. పల్లం గ్రామం బోరున విలపించింది. ఇదేమీ తెలియని మృతురాలి చిన్నారి.. అందరి వైపు చూస్తుంటే.. అతడిని చూసిన అందరు.. ఉబికివస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకోలేకపోయారు. సాక్షి, కాట్రేనికోన (తూర్పు గోదావరి): పల్లం గ్రామానికి చెందిన సంగాని రామలక్ష్మి (22) కుమారుడు గీతాకృష్ణ (4)తో పాటు గోదావరి పాయలో పడి బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం ఈ గ్రామానికి చెందిన సంగాని నరసింహరాజు (చిన నరసింహులు)తో ఆరేళ్ల క్రితం రామలక్ష్మికి వివాహమైంది. వీరికి వివాహ బంధంలో ఇద్దరు పిల్లలు గీతాకృష్ణ (4) ఏడాది లోపు పాప ఉన్నారు. మృతురాలు రామలక్ష్మి సోదరుడు శేషాద్రి, ఆమె భర్త నరసింహరాజు మధ్య బుధవారం వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో రాత్రి భార్యాభర్తల మధ్య కూడా గొడవ తలెత్తడంతో విసుగు చెందిన ఆమె పుట్టింటికి వెళ్లిపోతానని, రాత్రి 12 గంటల సమయంలో కుమార్డు గీతా కృష్ణను తీసుకుని వెళ్లిపోయింది. గతంలో గొడవ పడి వెళ్లిపోయిన ఆమె బంధువుల ఇంటికి వెళ్లి ఆ తరువాత తిరిగి ఇంటి వెళ్లింది. అలాగే తిరిగి అవుతుందని అనుకున్నా.. ఆమె తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లకు వెళ్లి వెతికినా ఆమె లేకపోవడంతో పరిసరాల్లో వెతికారు. గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి బాలుడి మృతదేహం గోదావరి పాయలో కనబడింది. వినాయక నిమజ్ఙనంలో ఎవరో బాలుడు మృతి చెంది ఉంటాడనుకున్నారు. భార్య, కొడుకు కోసం వెతుకు తున్న భర్త, వారి బంధువులకు గోదావరి పాయలో బాలుడి మృతదేహం ఉన్నట్టు తెలియడంతో అక్కడికి వెళ్లి చూసి గీతకృష్ణ మృతదేహంగా గుర్తించారు. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానించి.. గాలించడంతో భార్య రామలక్ష్మి మృతదేహం కూడా బయటపడింది. వృత్తి రీత్యా మృతురాలి భర్త చేపల వేట చేస్తుంటాడు. చేపలను తక్కువ ధరకు విక్రయిస్తున్నావని రోజూ కొట్టేవాడని, అతని వేధింపులతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. కంట తడిపెట్టిన గ్రామస్తులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఏడాది పాపను ఇంటి వద్దనే వదిలి కొడుకు గీతాకృష్ణతో పాటు రామలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడటంతో పల్లం గ్రామస్తులు కంటతడి పెట్టారు. బాలుడి మృతదేహంపై పడి బంధువులు రోధిస్తున్న తీరు అందరినీ కలసి వేసింది. రోజూ అందరితో ఆడుకొనే బాలుడు మృతి చెందడంతో అతడితో ఆడుకొనే చిన్నారులు బిక్కముఖాలతో కూర్చున్నారు. ఏమి జరిగిందో తెలియని మృతురాలి ఏడాది లోపు చిన్నారి.. అక్కడి అందరినీ చూస్తూ కూర్చోవడం.. చూపరులకు దుఃఖాన్ని కలిగించింది. ఈ ఘటనపై కాట్రేనికోన ఏఎస్సై వి.నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ కుటుంబం ఆత్మహత్యకు ఈ ముఠానే కారణం!
సాక్షి, అమలాపురం(తూర్పు గోదావరి) : అమలాపురంలో డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్యహత్య చేసుకున్న ఘటనలో లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చేస్తున్న దర్యాప్తులో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ కేంద్రంగా నలుగురు వ్యక్తులతో కూడిన ఈ ముఠా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని ఈ రైసు పుల్లింగ్ ఊబిలోకి లాగి రూ.కోట్లు కాజేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలో సభ్యుడైన కృష్ణా జిల్లా కోడూరు గ్రామానికి చెందిన వరికూటి వెంకటవేణుధర ప్రసాద్‌ను అమలాపురం పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రోజే అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా ఆదేశాలతో నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ముఠా సభ్యుడైన వేణుధర ప్రసాద్‌ను అమలాపురం బస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పట్టణ సీఐ బి.సురేష్‌బాబు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ ముఠా సూత్ర, పాత్రధారి అయిన హైదరాబాద్‌కు చెందిన షావలిన్, ముఠాలోని మిగిలిన సభ్యులు అనంతరామ్, శ్రీనివాసరావులను అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ బాషా తెలిపారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్రంలో తమ పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని చెప్పారు. మన రాష్ట్రంలోనూ వీరి కోసం పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. డాక్టర్ కుటుంబం నుంచి రూ.ఐదు కోట్లు గుంజుకున్న ముఠా ముఠా సభ్యుడైన వెంకట వేణుధర ప్రసాద్‌ను అరెస్ట్ అనంతరం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ బాషా మంగళవారం ఉదయం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అమలాపురం పట్టణ, రూరల్, ముమ్మిడివరం సీఐలు బి.సురేష్‌బాబు, ఆర్.భీమరాజు, రాజశేఖర్‌లతో కలిసి ముఠా వివరాలను వెల్లడించారు. ఏడాది నుంచి డాక్టర్ రామకృష్ణంరాజు ఈ ముఠా మాయమాటల్లో పడినట్టు చెప్పారు. తొలుత వేణుధరప్రసాద్ డాక్టర్‌కు పరిచయమై రైస్ పుల్లింగ్ ఆశ పుట్టించాడు. తర్వాత డాక్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రధాన నిందితుడు షావలిన్‌కు పరిచయం చేశాడు. దైవాంశ సంభూతమైన పురాతన విగ్రహాలు, నాణేలు, పాత్రల గురించి డాక్టర్‌కు వివరించి వాటి వల్ల రుణ విముక్తి కావడమే కాకుండా అష్టైశ్వర్యాలు ఎలా ప్రాప్తిస్తాయో తన ముఠాలోని సభ్యులతో ఆయనకు చెప్పించి నమ్మించాడు. రైస్‌పుల్లింగ్‌లో ఇవ్వబోయే పురాతన వస్తువు విలువ రూ.కోట్లలో ఉంటుందని మానసికంగా సిద్ధం చేశారు. మీ కోసం రైస్ పుల్లింగ్ వస్తువు తయారవుతోందని డాక్టర్ కుటుంబం నుంచి ముఠా దఫదఫాలుగా నగదు రూపంలో, బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకుంది. ఇందు కోసం డాక్టర్ అధిక మొత్తాలను అధిక వడ్డీలకు అప్పు చేసి రూ.ఐదు కోట్లు ముఠాకు అతికష్టంగా సరిపెట్టారు. చివరకు ఈ ముఠా చేసిన మోసాలకు బలి అయ్యానని డాక్టర్ కుటుంబం గ్రహించి ఇటీవల హైదరాబాద్ వెళ్లి రెండు వారాలు ఉండి పొగొట్టుకున్న రూ.ఐదు కోట్లను ఏలాగైనా రాబట్టుకోవాలని విశ్వప్రయత్నం చేసి విఫలమైంది. ఇంతటి ఘోరమైన మోసానికి గురైన డాక్టర్ కుటుంబం చివరకు తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్యకు ఒడిగట్టిందని డీఎస్పీ బాషా తెలిపారు. డాక్టర్ పెద్ద కుమారుడు, మృతుడు డాక్టర్ కృష్ణ సందీప్ సూసైడ్ నోట్, డాక్టర్ చిన్న కుమారుడు కృష్ణ వంశీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ ఆదేశాల మేరకు రైస్ పుల్లింగ్ మోసాలు, ముఠాపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వివరించారు. -
అయ్యో.. పాపం!
సాక్షి, శంఖవరం(తూర్పుగోదావరి) : అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను ఆ ఊరు చెరువు పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటనతో సమీప బంధువులైన రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. తమ బంధువుతో చెరువులో మోటారు బైక్ కడిగేందుకు వెళ్లిన ఈ ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడగా, మరో చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. నిత్యం తమ ఇళ్లలో చలాకీగా తిరిగే ఈ ఇద్దరు చిన్నారులు తిరిగి రాని లోకానికి వెళ్లిపోవడంతో ఆ బంధువుల్లో విషాదం నెలకొంది. శంఖవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బోడపాటి వీరాస్వామి, చిలకమ్మ దంపతులకు కుమారు వీరప్రకాశ్(12), కుమార్తె కృపాజ్యోతి(10) ఉన్నారు. కుమారుడు ఆరోతరగతి చదువుతున్నాడు. బంధువైన బోడపాటి వీరాస్వామి అన్నయ్య అల్లుడైన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన గాలింక అప్పారావుకు భార్య నాగరత్నం, నాగేశ్వరరావు(10), ప్రదీప్(8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు రెండు నెలల క్రితం వ్యవసాయ పనుల కోసం ఇక్కడి వచ్చి నివాసం ఉంటున్నారు. వీరి సమీప బంధువైన గొల్లప్రోలు మండలం తాడిపత్రి గ్రామానికి చెందిన కొల్లు వీరబాబు(23) వీరాస్వామి కుటుంబాన్ని చూసేందుకు శంఖవరం వచ్చాడు. శంఖవరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండపం గ్రామం ఊర చెరువులో మోటారు బైక్‌ను కడిగేందుకు వీరాస్వామి కుమారుడు వీరప్రకాశ్, అప్పారావు కుమారుడైన నాగేశ్వరరావు, సమీప బంధువైన బోడపాటి శ్రీను(11)లను చెరువు వద్దకు తీసుకువెళ్లాడు. చెరువు వద్ద వీరబాబు బహిర్భూమికి వెళ్లగా బైక్ కడిగేందుకు ముగ్గురూ చెరువులోకి దిగారు. చెరువు లోతును గమనించకపోవడంతో ప్రమాదవశాత్తూ వీరప్రకాశ్, నాగేశ్వరరావు చెరువులో మునిగిపోయారు. అక్కడే ఉన్న శ్రీను గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వీరబాబుతో పాటు పలువురు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దగ్గలేదు. అప్పటికే చెరువులో మునిగిపోవడంతో మృత్యువాత పడ్డారు. దారిన వెళుతున్న మత్స్యకారులు విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకుని రోదించారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడంటూ వీరాస్వామి బోరున విలపించాడు. ఇంటికి పెద్ద కొడుకు మృత్యువాత పడడంతో అప్పారావు బోరున విలపించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. -
పదోన్నతి పొంది.. అంతలోనే విషాదం
పోలీస్...ఆ మూడు అక్షరాలు సాధనేతన ధ్యేయంగా భావించింది ఖాకీ దుస్తులే తనకు కవచ కుండలాలనుకుంది లాఠీ...శాంతి, భద్రతల అదుపునకు వజ్రాయుధమనుకుంది విజిల్...కూత ట్రాఫిక్ నియంత్రణకు లక్ష్మణ రేఖగా భాసించింది ,పేదరికమనే అవరోధం ఆడపిల్లనే ఆక్షేపణం అడుగడుగునా అడ్డుగా నిలిచినా అధిగమించి, అరోహించి ‘స్టార్’గా నిలవాలనే లక్ష్యం సాధించి పదోన్నతి సాధించి...అందరికీ ఆనందం పంచి అంతలోనే విషాదం నింపి జీవనం పయనం చాలించి...(పిఠాపురం పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న విజయలక్ష్మి విధి నిర్వహణలో ఉండగానే రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఏఎస్సైగా పదోన్నతి పొంది... ఆ ఫలాలు ఆస్వాదించకుండానే లారీ చక్రాల కింద బంగారు భవిత నలిగిపోయింది.) సాక్షి, తూర్పుగోదావరి(రంగంపేట) : రంగంపేట శివారు అట్టల ప్యాక్టరీ వద్ద ఏడీబీ రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా హెడ్‌కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. రంగంపేట ఏఎస్సై సుబ్బారావు కథనం ప్రకారం.. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళాహెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కూటి విజయలక్ష్మి (47)గురువారం రాజమహేంద్రవరం కోర్టులో సాక్ష్యం చెప్పడానికి తన హోండా యాక్టివా బైక్‌పై వెళుతుండగా ఉదయం తొమ్మిది గంటలకు రంగంపేట శివారు అట్టల ఫ్యాక్టరీ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి పెద్దాపురం నుంచి రాజానగరం వైపు వెళుతున్న లారీ బలంగా ఢీ కొట్టింది. విజయలక్ష్మిని కొంతదూరం ఈడ్చుకుపోయింది. టైర్ల కింద ఇరుక్కుపోయి ఆమె చనిపోయిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు. రంగంపేట వీఆర్వో శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, రంగంపేట ఇన్చార్జి ఎస్సైగా ఉన్న సామర్లకోట ఎస్సై వీఎల్‌వీకే సుమంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. మహిళా హెడ్‌కానిస్టేబుల్ మృతదేహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ పెద్దాపురం: స్థానిక ఏడీబీ రోడ్డులో రంగంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిఠాపురం పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ కె.విజయలక్ష్మి మృతదేహాన్ని గురువారం జిల్లా ఎస్పీ నయీం అస్మీ పరిశీలించారు. విజయలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పోలీస్ యంత్రాంగం నుంచి అందించాల్సిన సహాయక చర్యలు చేపట్టి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎస్బీ డీఎస్పీ సుంకర మురళీమోహన్, పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్సై వెలుగుల సురేష్ తదితరులున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రంగంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ విజయలక్ష్మి మృతి చెందడంతో ప్రమాదస్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు సందర్శించారు. -
జసిత్ కిడ్నాప్ కేసులో చిక్కిన అపరిచిత వ్యక్తి
సాక్షి, తూర్పుగోదావరి(మండపేట) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కిడ్నాప్ ఘటనను అడ్డుపెట్టుకుని సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఎత్తుగడ వేసిన అపరిచిత వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన వివరాలను సీఐ అడపా నాగమురళి గురువారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. పట్టణంలోని విజయలక్ష్మి నగర్‌కు చెందిన నాలుగేళ్ల బాలుడు జసిత్ కిడ్నాప్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం విదితమే. మండపేటలో బ్యాంకు ఉద్యోగులుగా పనిచేస్తున్న నూకా వెంకటరమణ, నాగావళి దంపతుల కుమారుడు జసిత్ గత నెల 22న కిడ్నాప్‌కు గురై 25వ తేదీ ఉదయం క్షేమంగా తల్లిదండ్రులను చేరాడు. 60 గంటల పాటు సాగిన కిడ్నాప్ కథ సుఖాంతమైనా కిడ్నాప్‌కు గల కారణాలు ఇంకా మిస్టరీగానే మిగిలాయి. కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సంఘటనతో భయాందోళనకు గురైన జసిత్ తల్లిదండ్రులు తమ స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేయించుకుని అక్కడికి వెళ్లిపోయారు. అతడి మేనమామ రామరాజు కాకినాడలో నివాసముంటున్నారు. తాము అడిగిన సొమ్ములు ఇవ్వకపోతే ఈ సారి జసిత్‌ను విడిచిపెట్టబోమంటూ మంగళవారం బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు వచ్చిన ఫోన్ నంబర్ల ఆధారంగా అపరిచిత వ్యక్తి ఆచూకీ కనిపెట్టి పథకం ప్రకారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. సులువుగా సొమ్ములు సంపాదించాలని.. జసిత్ కిడ్నాప్ వ్యవహారంపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో సులువుగా డబ్బులు సంపాదించాలని భావించిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాళ్లముదునూరిపాడు గ్రామానికి చెందిన చిక్కాల నరేష్ జసిత్ తండ్రికి ఫోన్ చేశాడు. ‘నేనే మీ అబ్బాయిని కిడ్నాప్ చేసి క్షేమంగా కుతుకులూరులో వదిలిపెట్టి వెళ్లానని, వెంటనే రూ.50 వేలు ఇవ్వాలని బెదిరించాడు. జసిత్ తండ్రి వెంకటరమణ తన బావమరిది రామరాజుకు ఫోన్‌చేసి మండపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సై తోట సునీత దర్యాప్తు చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. డబ్బులు తీసుకునేందుకు మండపేట రావాలని ఫోన్ చేసి జసిత్ తండ్రి వెంకటరమణతో నరేష్‌కు చెప్పించారు. డబ్బులు తీసుకునేందుకు మండపేట వచ్చిన నరేష్‌ను సినిమా రోడ్డులో సీఐ నాగమురళీ, ఎస్సై సునీత సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. నరేష్ గతంలో తెలంగాణలోని కాళేశ్వరం ఇసుక ర్యాంపులో పనిచేసేవాడని, నిందితుడికి భార్య, కుమారుడు ఉన్నట్టు సీఐ నాగమురళీ తెలిపారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
సాక్షి, తూర్పుగోదావరి(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ రాజమండ్రి డీఎస్పీ రామచంద్రరావు కథనం ప్రకారం.. ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ గాది వరప్రసాద్ 2016లో రూ.9.5 లక్షల వ్యయంతో అన్నవరం రైల్వేస్టేషన్‌కు ఎదురుగా గల దేవస్థానం పొలంలో రేకుల షెడ్డు నిర్మాణ కాంట్రాక్ట్‌ను టెండర్ ద్వారా పొందాడు. పని పూర్తయ్యాక అతడికి కాంట్రాక్ట్ తాలుకు బిల్లులు చెల్లించారు. నిబంధనల ప్రకారం ఈఎండీ మొత్తం రూ.40,646 దేవస్థానం వద్ద డిపాజిట్లో ఉంచారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్ట్ పూర్తయిన రెండేళ్ల తరువాత తిరిగి చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్ గాది వరప్రసాద్ నాలుగు నెలలుగా ఈఎండీ మొత్తాన్ని ఇవ్వమని ఇంజినీరింగ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈనెల 19న ఇదే పనిపై ఇంజినీరింగ్ విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ చిక్కాల సాయిబాబాను కలిశాడు. రూ.ఐదు వేలు ఇస్తే తప్ప డిపాజిట్ రిఫండ్ ఇవ్వడం కుదరదని సాయిబాబా చెప్పడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం అడిగినట్టుగా సాయిబాబా వాయిస్ రికార్డు కూడా కాంట్రాక్టర్ సమర్పించడంతో దానిని పరిశీలించి సాయిబాబాపై నిఘా ఉంచామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. గురువారం ఉదయం కాంట్రాక్టర్ వరప్రసాద్ సాయిబాబాకు కెమికల్ పూసిన రూ.500 నోట్లు ఇవ్వగా, తాము దాడి చేసి పట్టుకున్నామన్నారు. లంచం స్వీకరించిన నిందితుడు సాయిబాబాను అరెస్ట్ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం ఇవ్వమని డిమాండ్ చేస్తే సెల్:9440446160కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు తిలక్, మోహన్‌రావు, పుల్లారావు, ఎస్సై నరేష్, కానిస్టేబుళ్లు ఈ దాడి లో పాల్గొన్నారు. విసిగి ఫిర్యాదు చేశా: కాంట్రాక్టర్ గాదె వరప్రసాద్ నిరుద్యోగంతో వేగలేక చిన్నచిన్న కాంట్రాక్టులు చేసుకుని జీవిస్తున్న తనను అన్నవరం దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు ఈఎండీ ఇవ్వకుండా వేధించారని కాంట్రాక్టర్ గాదె వరప్రసాద్ విలేకర్లకు తెలిపారు. తాను ఈఎండీ సొమ్ము ఇవ్వమని ఇంజినీరింగ్ ఆఫీసు చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నానని తెలిపారు. ఇంతకు ముందు గుమస్తా కూడా ఈఎండీ ఇవ్వాలంటే కొంచం ఖర్చువుద్ది అని చెప్పాడని తెలిపారు. దాంతో మూడు నెలలు ఆగి మరలా వస్తే ఇప్పుడున్న గుమస్తా చిక్కాల సాయిబాబా కూడా రూ.ఐదు వేలు లంచం ఇవ్వనిదే పని జరగదని చెప్పాడని తెలిపారు. దాంతో ఏసీబీ ని ఆశ్రయించినట్టు తెలిపారు. దేవస్థానంలో కాంట్రాక్ట్ చేసినట్టుగా ‘ఎక్స్పీరియన్స్’ సర్టిఫికెట్ ఇవ్వమని 2018లో ఇంజినీరింగ్ అధికారులను, అప్పటి ఈఓను అడిగినా ఇవ్వలేదని తెలిపారు. అదే విధంగా ఇంజినీరింగ్ కార్యాలయం సమీపంలో నిలిపి ఉంచిన తన మోటార్ సైకిల్ చోరీ జరిగిందని దీనిపై దేవస్థానం అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని కాంట్రాక్టర్ వరప్రసాద్ వాపోయారు. దీంతో విసిగి వేసారి సిబ్బందిలో కొంతైనా మార్పు వస్తుందనే ఇలా చేశానని తెలిపారు. -
ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, ప్రత్తిపాడు రూరల్ (తూర్పు గోదావరి): రెప్పతీస్తే జననం.. రెప్ప మూస్తే మరణం అన్నాడో కవి. నిద్ర మరణానికి మరో రూపం అంటారు. అదే వారి కొంపముంచింది. కొత్తగా టాటా ఏస్ కొనుక్కున్న సంబరంతో మిత్రులతో కలసి తలుపులమ్మ లోవలో అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళుతుండగా దాన్ని నడుపుతున్న చెల్లుబోయిన మరిడియ్యకు నిద్రమత్తుతో రెప్ప పడగా రోడ్డుపక్కన ఆటోను ఢీకొన్నాడు. దాంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించగా ఎనిమిదిమంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన బొంతు సత్యశ్రీనివాస్ టాటా ఏస్ కొనుక్కొన్నాడు. అదే గ్రామానికి చెందిన పదకొండుమంది బంధు మిత్రులతో శనివారం రాత్రి తలుపులమ్మవారి దర్శనానికి బయల్దేరాడు. అమ్మవారిని దర్శించుకొని ఆదివారం వారు తిరుగుప్రయాణమయ్యారు. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న ఆటో ఢీకొంది. దాంతో అందులో ప్రయాణిస్తున్న మట్టపర్రు గ్రామానికి చెంది న చెల్లుబోయిన మరిడియ్య (ఆటో డ్రైవర్) (36), చెల్లుబోయిన సత్యనారాయణ (46), మట్టపల్లి ఏడుకొండలు (42) మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారికి ప్రత్తిపాడులో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్సై ఎ.రవికుమార్ పరిశీలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీజీహెచ్‌లో క్షతగాత్రులు కాకినాడ: ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆదివారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. యాండ్ర హరికృష్ణ, యాంత్ర పరమేష్, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, చెల్లుబోయిన శివప్రసాద్, బొంతు సత్య శ్రీనివాసరావుతో పాటు వ్యాన్ డ్రైవర్ రాపాక శ్యామ్బాబులను జీజీహెచ్‌కు తీసుకురాగా యాంత్ర పరమేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉం దని వైద్యులు చెబుతున్నారు. వీరందరినీ అత్యవసరవిభాగంలో ఉంచి వైద్యసేవలందిస్తున్నారు. గాజులగుంటలో విషాదం పి.గన్నవరం: ధర్మవరంవద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.గన్నవరం మండలం ముంగండపాలెం శివారు గాజులగుంట గ్రామానికి చెందిన మట్టపర్తి ఏడుకొండలు (చిన్న) (52) మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తాపీ పని చేసుకొనే ఏడుకొండలుకు భార్య పద్మావతి, కుమార్తెలు వర్ణిక, మౌనిక ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయాల్సి ఉంది. ఏడుకొండలు గ్రామంలో అం దరితో కలివిడిగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు. అతడి మరణ వార్తను గ్రామస్తులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. మట్టపర్రు శోకసంద్రం మలికిపురం(రాజోలు): ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన ఇద్దరు, గ్రామానికి చెందినవారి అల్లుడు మరణించడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం వార్త ఆదివారం రాత్రి గ్రామస్తులకు తెలిసింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన చెల్లుబోయిన వీర వెంకట సత్యనారాయణ కొబ్బరి ఒలుపు కార్మికుడు. అతని భార్య, కుమారుడు ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో ఉంటున్నారు. మరొక మృతుడు చెల్లుబోయిన మరిడియ్య ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య అరుణ ఉపాధికోసం విదేశాల్లో ఉంటోంది. మరిడియ్య కుమార్తె బాలదుర్గకు వివాహం కాగా కుమారుడు శ్రీరామ కృష్ణ చదువుకుంటున్నాడు. గ్రామానికి చెందిన బొక్క సత్యనారాయణ, వెంకట రమణలకు మరిడియ్య అల్లుడు. వెంకట రమణకు స్వయానా సోదరుడు. చిన్నప్పటి నుంచి అక్కే అతనిని పెంచి పెద్ద చేసి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసింది. మరిడియ్య మరణంతో వెంకట రమణ– సత్యనారాయణ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరొక మృతుడు మట్టపల్లి ఏడుకొండలు మట్టపర్తికి చెందిన యాండ్ర సత్యనారాయణకు అల్లుడు. అతను శనివారం రాత్రి అత్తవారింటికి వచ్చాడు. ఏడుకొండలు బావ మరిది హరి కృష్ణ, బంధువులతో కలిసి లోవ వెళ్లాడు. ఏడుకొండలు స్వగ్రామం పి. గన్నవరం మండలం గాజుల గుంట. అల్లుడి మృతి వార్త తెలిసి అత్తింటి వారు తల్లడిల్లుతున్నారు. ఈ ప్రమాదంలో ఏడుకొండలు బావమరిది హరి కృష్ణకు గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామం అంతా రోదనలతో నిండి పోయింది. ఆదివారం అర్ధ రాత్రి వరకూ బంధువులకు మృతి వివరాలు తెలియ లేదు. -
ఎమ్మెల్యే రాపాక అరెస్టు.. విడుదల
సాక్షి, తూర్పుగోదావరి(రాజోలు) : చట్టం ముందు అందరూ సమానమేనని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ అన్నారు. మలికిపురం పోలీస్‌స్టేషన్‌కు మంగళవారం ఆయన వచ్చారు. ఈ నెల 11న ఈ స్టేషన్ వద్ద జరిగిన ఆందోళనలో ధ్వంసమైన అద్దాలను పరిశీలించారు. పేకాడుతున్న వారి అరెస్ట్ నేపథ్యంలో, రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు, ఎస్సై కేవీ రామారావు మధ్య వివాదం కారణంగా ఏర్పడిన ఘర్షణ వివరాలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులు తప్పు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ప్రజాప్రతినిధులకు ఉందన్నారు. ఫిర్యాదులపై విచారణ చేసి తప్పు చేసిన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు. అలా కాకుండా ఎమ్మెల్యే స్టేషన్ వద్ద ధర్నా చేయడం, అనుచరులతో స్టేషన్‌పై దాడి చేయడం తగదన్నారు. ఇది యువతను తప్పు తోవ పట్టించి ప్రభుత్వం, వ్యవస్థల పట్ల తప్పుడు సంకేతాలు పంపడమేనని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులందరిపైనా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఆయన వెంట రాజోలు సీఐ మోహన్ రెడ్డి, ఎస్సై రామారావు ఉన్నారు. ఎమ్మెల్యే రాపాకపై కేసు నమోదైన నేపథ్యంలో మలికిపురంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహించారు. కాకినాడ క్రైం: మలికిపురం పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులో నిందితులు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులు ఎనిమిది మందిని మంగళవారం రాజోలు సీఐ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం రాత్రి విలేకర్లకు తెలిపారు. అనంతరం వీరిని బెయిల్‌పై విడుదల చేశామన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులోని వారు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే బెయిల్ రద్దు అవుతుందని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ తెలిపారు. ‘చిన్న విషయమని పవన్‌కల్యాణ్ ప్రకటించడం విచారకరం’ మలికిపురం: స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడి సంఘటన.. జనసేన ఎమ్మెల్యే రాపాక, పోలీసుల మధ్య ఏర్పడిన వివాదమే తప్ప ఇందులో తమ పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు అన్నారు. ఈ విషయంపై కొందరు తమ పార్టీని విమర్శించడం తగదని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. పేకాడుతున్న వారిని అరెస్ట్ చేస్తే ఆందోళన చేసిన జనసేన నేతలపై చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. జనసేన నేతలు స్టేషన్‌పై దాడి చేసి, దగ్ధం చేయడాన్ని సమర్థించడం పవన్‌కళ్యాణ్‌కు తగదని, ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డి లలిత్‌కుమార్, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మంగెన సింహాద్రి, సొసైటీ చైర్మన్లు దివ్వి చిట్టిబాబు, బెల్లంకొండ సూరిబాబు ఏఎంసీ మాజీ చైర్మన్ గెద్దాడ సత్యనారాయణ, ఎస్.శాంతికుమారి, రాయుడు విజయకుమార్, ఓగూరి హనుమంతరావు, చేట్ల సత్యనారాయణ, మేడిది రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జాతీయ ‘రక్త’దారి..
సాక్షి, తూర్పుగోదావిరి : జాతీయ రహదారులు రోడ్డు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. జిల్లాలో గోపాలపురం నుంచి తుని వద్ద గల పాయకరావు పేట వరకు 140 కిలో మీటర్లు ఉన్న జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జాతీయ రహదారి గోతులమయం కావడం, రహదారుల వెంబడి మద్యం షాపుల ఏర్పాటు, ప్రమాదకర మలుపులు, గ్రామాలను కలుపుతూ వెళ్లిన జంక్షన్ల వద్ద సరైన రక్షణ ఏర్పాటు చేయకపోవడం, మద్యం మత్తులో, నిద్ర మత్తులో, లైసెన్స్ లేని డ్రైవర్లు సైతం జాతీయ రహదారులపై హేవే వాహనాలు డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా గత టీడీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారమే ప్రధాన ఆదాయంగా నిబంధనలు తుంగలో తొక్కి లైసెన్స్‌లు ఇచ్చేసింది. దీంతో మద్యం సేవించి లారీ డ్రైవర్లు, హే టెక్ బస్సు డ్రైవర్లు, ఇతర వానం డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారు. హైవేలపై పర్యవేక్షణ చేయాల్సిన రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారులు మాముళ్ల మత్తులో వాహనాలు తనిఖీలు నిర్వహించకుండానే వదిలి వేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే సమయంలో ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించకుండా జారీ చేయడంతో రోడ్డు ప్రమాదాలకు అవి కూడా కారణమవుతున్నాయి. గత మూడేళ్లలో 1,490 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 419 మంది మృతి చెందారు. 1,653 మందికి గాయాలయ్యాయి. ఏటా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని వందలాది మంది ప్రజాలు ప్రాణాలు కోల్పోతున్నా హైవే అథారిటీ అధికారులు కళ్లు తెరవడం లేదు. గోతులను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదాలు జాతీయ రహదారిలో గోతులు పడడంతో వేగంగా వెళ్లే వాహనాలు వాటిని తప్పించుకునే క్రమంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు వాహనం గోతుల నుంచి తప్పించేందుకు కొంత పక్కకు తిప్పడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనం ఢీ కొని రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల ఐదో తేదీ సోమవారం దివాన్‌చెరువు ఆటోనగర్ వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కొత్త వెలుగు బంద గ్రామానికి చెందిన మరుకుర్తి శ్రీనివాస్, లక్ష్మి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. గోతులను తప్పించే క్రమంలో వెనుక వైపు నుంచి లారీ వచ్చి వారిని ఢీ కొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి పిల్లలు అనాథలయ్యారు. తాజాగా ఆదివారం జరిగిన రాజానగరం శివారు శ్రీరామనగర్ వద్ద హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజానగరం మండలం తోకాడకు చెందిన భార్యాభర్తలు రాయుడు నరసింహ మూర్తి, అతడి భార్య సత్యవతి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తమ కుమారుడు గోవింద్‌తో కలిసి బైక్‌పై శ్రీరామ్‌నగర్‌లోని బంధువుల ఇంట జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. వీరిని జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న గోవిందుతో పాటు వెనుక కూర్చున భార్యాభర్తలు ఎగిరి కిందపడడంతో వారి తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఇటువంటి ప్రమాదాలు నిత్యం హైవేలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. డేంజర్ జంక్షన్లు జిల్లాలో జాతీయ రహదారి 140 కిలో మీటర్లు ఉండగా జాతీయ రహదారిపై నుంచి పట్టణాలు, నగరాలకు వేళ్లే మార్గాలు, అప్రోచ్ రోడ్లు, ఇతర జంక్షన్లలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుని పరిధిలో జగన్నాథగిరి, గవరయ్య కోనేరు సెంటర్, తేటగుంట సెంటర్, సి.ఇ చిన్నాయ పాలెం, బెండపూడి, కత్తిపూడి, రామవరం, గండేపల్లి, మల్లేపల్లి, రాజానగరం, రాజమహేంద్రవరం లాలా చెరువు, మోరంపూడి సెంటర్, బొమ్మూరు జంక్షన్, కడియం, రావుల పాలెం తదితర ప్రాంతాల్లో డేంజర్ జంక్షన్లు ఉన్నాయి. హైవేకు అప్రోచ్ రోడ్లు ఉండడం వలన నగరాల నుంచి హైవేకు వెళ్లే మార్గాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సెంటర్లలో సరైన రక్షణ చర్యలు చేపకట్టకపోవడం, జాతీయ రహదారికి సంబంధం లేకుండా బ్రిడ్జిలు నిర్మించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. గోతులు పూడుస్తున్నాం జాతీయ రహదారిలో ప్రతిరోజూ రోడ్ల మరమ్మతులు చేస్తున్నాం. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నీటిపారుదల శాఖ వారు బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్లు అప్రోచ్ డైవర్షన్లు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కడియపు లంక నుంచి దివాన్ చెరువు వరకూ ఐదు టీమ్‌లు ఏర్పాటు చేసి వర్షానికి ఏర్పడిన గోతులు యుద్ధప్రాతిపదికన పూడుస్తున్నాం. – శ్రీనివాసరావు, జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ గోతులతో రోడ్డు ప్రమాదాలు జాతీయ రహాదారి పై ఏర్పాడిన గోతుల వలన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటితో పోటు అప్రోచ్ రోడ్లు, జంక్షన్లు వద్ద ఒక్క సారిగా రోడ్డు పైకి వాహనాలు వేగంగా వచ్చేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నాము. డ్రంకన్ డ్రైÐŒ , వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నాము. – ఎస్. వెంకట్రావు, ట్రాఫిక్ డీఎస్పీ,రాజమహేంద్రవరం అర్బన్ -
పోలీసు స్టేషన్‌పై జనసేన ఎమ్మెల్యే దాడి
సాక్షి, తూర్పుగోదావరి(కాకినాడ) : జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మలికిపురంలో పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సోమవారం రాత్రి తెలిపారు. మలికిపురంలో ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్నట్టు వచ్చిన సమాచారంపై మలికిపురం ఎస్సై కేవీ రామారావు తన సిబ్బందితో వెళ్లి పేకాట శిబిరంపై దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారన్నారు. ఈ దాడిలో రూ.37,700 నగదు, ఆరు మోటారు సైకిళ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అస్మీ తెలిపారు. దీనిపై క్రైం నంబర్ 182/2019గా గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. వెంటనే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతడి అనుచరుడు గెడ్డం తులసీభాస్కర్ సంఘటన స్థలంలో ఎస్సై రామారావుతో గొడవపడి మోటారు సైకిళ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకునేందుకు వీల్లేదని గొడవపడ్డారన్నారు. దీనిపై ఎస్సై ‘తాను అలా చేయడానికి లేదని, అవకాశం ఉంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేస్తాను’ అని చెప్పినా ఎమ్మెల్యే రాపాక సమక్షంలోనే గెడ్డం తులసీభాస్కర్ ఎస్సైతో వాగ్వివాదానికి దిగి ఇష్టానుసారంగా దూషించినట్టు ఎస్సై తెలిపారు. తరువాత ముద్దాయిలను, స్వాధీనం చేసుకున్న వస్తువులను ఎమ్మెల్యే స్టేషన్‌కు తీసుకువచ్చారు. తరువాత కొందరు వ్యక్తులు ఎస్సై ఎమ్మెల్యేను నిందించినట్టు ప్రచారం చేశారన్నారు. దీంతో ఎమ్మెల్యే రాపాక, అతడి అనుచరుడు గెడ్డం తులసీభాస్కర్‌లు సుమారు 100 మంది అనుచరులతో స్టేషన్‌పై దాడి చేసి పోలీసులను నిందించుకుంటూ, పోలీస్‌స్టేషన్‌పై రాళ్లు రువ్వుతూ కిటీకీ అద్దాలు పగలుగొట్టారన్నారు. పేకాడుతూ పట్టుబడిన వ్యక్తులను తక్షణం విడుదల చేయాలని పోలీసుల విధులకు ఆటంక పరిచారని ఎస్పీ నయీం అస్మీ వివరించారు. పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతడి అనుచరులపై ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ ఆదేశాల మేరకు క్రైం నంబర్ 183/2019 కింద సెక్షన్లు 143, 147, 148, 341, 427, 149, అండ సెక్షన్ 3 కింద పీడీపీపీ యాక్ట్ అండ్ క్రిమినల్ ఎమైండ్‌మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ నయీం అస్మీ వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల దుర్మరణం
‘నాతిచరామి’ అంటూ పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలను మరువ లేదేమోనన్నట్టుగా.. ఆ దంపతులు.. ఒకరికొకరు తోడుగా మృత్యు కౌగిట్లోకి ఒదిగిపోయారు. రాజానగరం శివారు శ్రీరామనగర్‌లో బంధువుల ఇంట ఓ ఫంక్షన్‌కు వెళ్లిన తోకాడకు చెందిన దంపతులు రాయుడు నరసింహమూర్తి, సత్యవతి.. తిరుగు పయనంలో.. ఆ ఫంక్షన్ జరిగిన ఇంటికి సమీపంలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బంధువులంటే అతడికి వల్లమానిన అభిమానం. ఎవరింట ఏ కార్యక్రమం జరిగినా.. తప్పనిసరిగా హాజరై అందరితో సరదాగా ఉండే అతడంటే వారందరికీ కూడా ఎంతో అభిమానం. అదేవిధంగా శ్రీరామనగర్‌లో బంధువుల ఇంట నిర్వహించిన ఫంక్షన్‌కు భార్య, కుమారుడితో వచ్చి తిరిగి వెళుతుంటే.. ఆ ఇంటి సమీపంలోనే ప్రమాదానికి గురై భార్యతో సహా చని పోయాడు. విషయం తెలుసుకున్న పంక్షన్‌లోని వారందరూ పరుగున వెళ్లి విగతజీవులుగా పడి ఉన్న భార్యాభర్తలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సాక్షి, తూర్పుగోదావరి: రాజానగరం శివారు శ్రీరామనగర్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. మండలంలోని తోకాడకు చెందిన రాయుడు నరసింహమూర్తి (55), అతని భార్య సత్యవతి (50) కుమారుడు గోవిందుతో కలసి మోటారు బైకుపై శ్రీరామనగర్‌లోని బంధువుల ఇంట జరిగే ఒక ఫంక్షన్‌కు వచ్చారు. ఫంక్షన్ ముగిశాక తిరుగు పయనమై డివైడర్ దాటి అవతల వైపువెళుతుండగా బైక్‌పై ఉన్న వీరిని.. జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైకు నడుపుతున్న కుమారుడు గోవిందుతోపాటు వెనుక కూర్చున్న భార్యాభర్తలు ఎగిరి పడ్డారు. డివైడర్‌పై వర్షపు నీరు పోయేందుకు నిర్మించిన సీసీ బోదెల అంచులకు భార్యాభర్తల తలలు బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. గోవిందు మాత్రం డివైడర్‌పై గడ్డితో ఉన్న మట్టిపై పడటంతో కాలు, చెయ్యి విరిగింది. వెంటనే అతడిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు చిన్నతనంలోనే మరణించాడు. మిగిలిన ఇద్దరిలో పెద్దవాడికి, అమ్మాయికి వివాహాలను వారు చేశారు. గాయపడిన కుమారుడు గోవిందు అవివాహితుడు. సంఘటన స్థలంలో ప్రమాదం జరిగిన తీరును రాజానగరం సీఐ ఎంవీ సుభాష్ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే సమయం మించిపోవడంతో సోమవారం ఉదయం పోస్టుమార్టం చేయించి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. -
వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, కామవరపుకోట(పశ్చిమగోదావరి) : కామవరపుకోటలోని కోటగట్టు ప్రాంతానికి చెందిన కె.రత్నశ్రీ (18) ఆకతాయి వేధింపులు తాళలేక శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకుందని తడికలపూడి ఎస్ఐ కె.సతీష్ కుమార్ తెలిపారు. రత్నశ్రీ నాయనమ్మ వీరవెంకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం..రత్నశ్రీ స్థానిక వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రత్నశ్రీ తల్లి చిన్నతనంలోనే చనిపోగా, ఇటీవలే తండ్రి కూడా మరణించాడు. దీంతో నాయనమ్మ ఆలనాపాలనా చూస్తోంది. కోటగట్టు ప్రాంతానికి చెందిన వామిశెట్టి నాగు గత ఏడాదిగా రత్నశ్రీ వెంటపడి వేధిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రత్నశ్రీని భయపెట్టే ప్రయత్నం చేశాడు. చంపేస్తానని బెదిరించాడు. దీంతో వేధింపులు తాళలేక మనస్తాపంతో శనివారం ఉదయం విషం తాగింది. మనవరాలిని నిద్ర లేపటానికి వెళ్ళిన నాయనమ్మ వీరవెంకమ్మకు పురుగుల మందు వాసన రావడం, రత్నశ్రీ అపస్మారక స్థితిలో ఉండటంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రత్నశ్రీ మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
సాక్షి, తూర్పుగోదావరి(తుని) : తుని మండలం టి.తిమ్మాపురం గ్రామంలో కట్టుకున్న భర్తే డబ్బుల కోసం తగాదా పడి భార్యను హత్య చేశాడు. ఈ సంఘటనలో పక్కుర్తి శివకుమారి(28) మృతి చెందగా, భర్త మహాలక్ష్మి పరారీలో ఉన్నాడు. విషయం తెలియడంతో సంఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, రూరల్ సీఐ కె.కిషోర్‌బాబు, రూరల్ ఎస్సై ఎస్.శివప్రసాద్ పరిశీలించారు. రూరల్ సీఐ కిషోర్‌బాబు కథనం ప్రకారం.. టి.తిమ్మాపురానికి చెందిన పక్కుర్తి మహాలక్ష్మికి, కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామానికి చెందిన శివకుమారితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికి ఎనిమిది, ఐదేళ్ల వయస్సుగల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె దేవి తాతయ్య వద్ద ఉంటుండగా, చిన్న కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మహాలక్ష్మి వ్యవసాయ కూలి. కొద్ది రోజులుగా శివకుమారి తునిలో వస్త్ర దుకాణంలో పని చేస్తుంది. ఇటీవల గొర్రెల లోను కోసం రూ.40వేలను లబ్ధిదారువాటాగా చెల్లించారు. ఆ లోను రాకపోవడంతో లబ్ధిదారు వాటాగా పెట్టిన డబ్బు మంగళవారం వెనక్కి ఇచ్చారు. ఆ డబ్బును పెద్దమ్మ వరుసైన ఆవాల సుబ్బలక్ష్మికి ఇవ్వడంపై భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ ఘర్షణ బుధవారం తెల్లవారుజామున శివకుమారి హత్యకు దారితీసింది. శివకుమారిని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందినట్టు వివరించారు. మృతురాలి తండ్రి ఇసరపు త్రిమూర్తులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ వివరించారు. నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణించినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం నిందితుడు భార్య శివకుమారిని హత్య చేసి మృతదేహాన్ని నివాస గృహం ఎదుట ఉన్న రైల్వే పట్టాలపై ఉంచి ప్రమాదం జరిగినట్టుగా చిత్రీకరించాడన్నారు. బహిర్భూమికి వెళ్లగా మృత్యువాత పడిందనుకున్న స్థానికులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి దహన సంస్కారాలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్థానికులు మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్లగా రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వ్యక్తమైంది. మృతురాలి తల్లి దుబాయ్‌లో ఉంటుండగా తండ్రి, సోదరుడు సర్పవరంలో ఉంటున్నారు. వీరిద్దరూ వచ్చి అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన ఎస్సై శివప్రసాద్, సీఐ కిశోర్‌బాబు, డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావులు హత్యగా నిర్ధారించారు. అనాథలైన చిన్నారులు : తల్లి శివకుమారి మృత్యుఒడికి చేరగా తండ్రి మహాలక్ష్మి పరారీలో ఉండడంతో వీరికి జన్మించిన ఇద్దరు చిన్నారులు అనాథులయ్యారని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. భర్తకు చేదోడుగా ఉండేందుకు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న శివకుమారి కొద్దిరోజులుగా తునిలో వస్త్ర దుకాణంలో పనికి వెళుతోంది. అందరితో కలసిమెలసి ఉండే శివకుమారి మృతితో పిల్లలు అనాథలయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అంతా ఊడ్చుకెళ్లిన దొంగలు!
సాక్షి, తూర్పుగోదావరి(గొల్లప్రోలు) : పట్టణంలో సోమవారం ఉదయం భారీ చోరీ జరిగింది. స్థానిక మార్కండేయపురంలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు మాండపాక ప్రభాకరరావు ఇంట్లో సుమారు రూ.13లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.20వేల నగదు, విలువైన బాండ్లు, డాక్యుమెంట్లు అపహరణకు గురయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మండపాక ప్రభాకరరావు, అతడి భార్య వరలక్ష్మి ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ప్రభాకరరావు ప్రత్తిపాడు మండలం ధర్మవరం జిల్లా పరిషత్ పాఠశాలలో, వరలక్ష్మి గొల్లప్రోలులోని మలిరెడ్డి వెంకట్రాజు మండల పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నారు. ఉదయం యథావిధిగా ఇద్దరూ విధుల్లోకి వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వరలక్ష్మి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు బద్దలు కొట్టి , బీరువాలో వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న భర్త ప్రభాకరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి, స్థానికులను విచారించారు. ఇంటి వెనుక గోడ దూకి వచ్చి చోరీకీ పాల్పడిన వ్యక్తి ఇంటి వెనుక ఉన్న గోడ దూకి లోపలకు ప్రవేశించినట్టు బురద కాలితో ఉన్న ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. ఇంటి తాళం బద్దలు కొట్టి బెడ్రూమ్లోకి ప్రవేశించి బీరువా తాళం తెరిచి అందులో ఉన్న వస్తువులను సోఫా, మంచంపై పేర్చి బాక్సుల్లో ఉన్న వస్తువులను చాకచక్యంగా అపహరించాడు. రూ.13లక్షల విలువైన సొత్తు అపహరణ 43కాసుల బంగారు ఆభరణాలు, 57 తులాల వెండి వస్తువులతో పాటు రూ.20వేల నగదు చోరీకు గురైంది. వీటి విలువ సుమారు రూ.13లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. వీటితో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసిన రూ.9.85 లక్షల విలువైన డిపాజిట్ బాండ్లు, రెండు స్థలాల డాక్యుమెంట్లు, భూమి డాక్యుమెంట్లు కూడా అపహరణకు గురయ్యాయి. క్రైమ్ పార్టీ, స్థానిక పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల నుంచి, సమీప నివాసితుల నుంచి వివరాలు సేకరించారు. తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేస్తున్నట్టు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. -
దారుణం: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
సాక్షి, తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం) : జాతీయరహదారిపై అడుగడుగునా ఉన్న గోతులు భార్యభర్తల ప్రాణాలను హరించాయి. త్రుటిలో మరొకరు ఈ ప్రమాదం నుంచి గట్టెక్కారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రాజానగరం మండలం దివాన్‌చెరువు ఆటోనగర్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం కొత్త వెలుగుబంద గ్రామానికి చెందిన మరికుర్తి శ్రీను(32), మరికుర్తి లక్ష్మి(28)లు భార్యాభర్తలు. రాజమహేంద్రవరంలో మరికుర్తి లక్ష్మికి దంతాన్ని తీయించేందుకు వీరిద్దరూ సోమవారం ఉదయం ఇంటి నుంచి మోటర్ బైక్‌పై వచ్చారు. దంతాన్ని తీయించిన అనంతరం కొత్త వెలుగుబంద గ్రామానికి బయలుదేరారు. ఆటోనగర్ సమీపానికి వచ్చేసరికి లాలాచెరువు నుంచి రాజానగరం వైపు యాసిడ్లోడుతో వెళుతున్న ట్యాంకర్ జాతీయరహదారి గోతిలో పడి స్పీడుగా లాగేందుకు ప్రయత్నించి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ జాతీయరహదారిపై ఉన్న మరో గోతిలో పడడంతో శ్రీను, లక్ష్మిలు బైక్‌తో సహా కిందపడి ట్యాంకర్ మధ్య చక్రాల కింద నలిగిపోయారు. లారీ వారిని, బైక్‌ను ఈడ్చుకుంటూ ముందు మరో స్కూటర్‌పై వెళుతున్న దివాన్‌చెరువు గ్రామానికి చెందిన బొంగా స్టాన్లీపాల్ను ఢీకొట్టింది. అతడు డివైడర్‌పైన ఉన్న గడ్డిలో పడిపోయాడు. త్రుటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ట్యాంకర్ చక్రాల కింద పడిన మరుకుర్తి శ్రీను, మరుకుర్తి లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. ఈ ప్రమాదంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. సంఘటన స్థలానికి బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి చేరుకుని పరిశీలించగా, ఈ లోపు అర్బన్ జిల్లా తూర్పు మండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్, ట్రాఫిక్ డీఎస్పీ ఎస్.వెంకట్రావు చేరుకుని సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలు ట్యాంకర్ చక్రాల కింద ఇరుక్కుపోవడంతో లక్ష్మి మృతదేహం బయటకు రాగా, శ్రీను మృతదేహాన్ని రెండు క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను జరిపి బయటకు తీశారు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవేపై ఉన్న గోతులతోనే ప్రమాదాలు జాతీయరహదారిపై ఉన్న గోతులతోనే తరచూ ప్రమాదాలు జరిగి వాహనచోదకులు మృత్యువాత పడుతున్నారని ట్రాఫిక్ డీఎస్పీ ఎస్.వెంకట్రావు పేర్కొన్నారు. సోమవారం ఆటోనగర్ ప్రమాద సంఘటన స్థలం వద్ద విలేకరులతో మాట్లాడుతూ భార్యభర్తలు మృత్యువాత కూడా జాతీయరహదారిపై ఉన్న గోతుల వలనే జరిగిందన్నారు. గతంలో జరిగిన రోడ్డుప్రమాదాలకు ఇవే కారణమని తెలిపారు. తూర్పు మండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్ మాట్లాడుతూ జాతీయరహదారిపై గోతులను పూడ్చితే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. సంబంధిత అధికారులకు, జాతీయరహదారి అధికారులకు గోతులను పూడ్పించాలని లిఖితపూర్వకంగా ఇస్తామన్నారు. స్వగ్రామాల్లో విషాద వాతావరణం రాజానగరం: పంటి సమస్యతో బాధపడుతున్న భార్యకు వైద్యం చేయించేందుకని వెళ్లిన తన కొడుకు భార్యతో సహా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ దివాన్‌చెరువు సమీపంలోని ఆటోనగర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన మరుకుర్తి శ్రీనివాస్ తల్లిదండ్రులు మరుకుర్తి వీర్రాజు, లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్యకు పంటి వైద్యం చేయించి, బైకుపై తిరిగి ఇంటి వస్తున్న వారిద్దరినీ మృతువు లారీ రూపంలో కబలించిన విషయం తెలియడంతో శ్రీనివాస్ స్వగ్రామమైన కొత్తవెలుగబంద, లక్ష్మి స్వగ్రామమైన దివాన్‌చెరువులో విషాదవాతావరణం నెలకొంది. శ్రీనివాస్, లక్ష్మిలను పోగొట్టుకుని దుఃఖసాగరంలో కుమిలిపోతున్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. పాడి గేదెలను మేపుకొంటూ తీరిక సమయాల్లో వ్యవసాయ పనులకు కూడా వెళుతూ కుటుంబాన్ని పోషించుకు రావడంతో చేదోడుగా ఉన్న తన తమ్ముడు, మరదలు ఇక లేరనే విషయాన్ని శ్రీనివాస్ హారిబాబు, వదిన నూకరత్నం తట్టుకోలేక పడిపడి విలపిస్తున్నారు. మమ్మీ, డాడీ ఎక్కడ? శ్రీనివాస్, లక్ష్మిల అకాల మరణంతో వారి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. అబ్బాయి రామశ్రీదుర్గాగణేష్, అమ్మాయి దుర్గాభవానీలిద్దరూ దివాన్‌చెరువులోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్, నర్సరీ చదువుతున్నారు. స్కూల్ అయ్యాక సాయంత్రం ఆ చిన్నారులు స్కూల్ బస్సులో కొత్తవెలుగుబందలోని తమ ఇంటికి చేరుకున్నారు. అయితే అక్కడ జనమంతా గుమిగూడి ఉండడంతో ఏమి జరిగిందో తెలియని అయోమయంలో అందరినీ చూస్తూ.. మమ్మీ, డాడీ ఏరీ.. అంటూ అమాయకంగా వేసిన ప్రశ్న అక్కడ ఉన్న వారి హృదయాలను కలచివేసింది. అక్కడనే రోదిస్తూ ఉన్న పెదనాన్న, పెదమ్మలు ఆ చిన్నారులను అక్కున చేర్చుకుంటుంటే అందరి కళ్లు చెమర్చాయి. దీంతో అక్కడ ఉంటే ఆ చిన్నారులకు విషయం అర్థమై బెంగపెట్టుకుంటారనే భావంతో దివాన్‌చెరువులో ఉంటున్న అమ్మమ్మ వాళ్లింటికి తీసుకువెళ్లారు. -
క్రికెట్ బెట్టింగ్ వల్లే జసిత్ కిడ్నాప్!
సాక్షి, తూర్పుగోదావరి(కాకినాడ) : మండపేటలో బ్యాంకు ఉద్యోగుల కుమారుడు జసిత్ కిడ్నాప్ క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలోనే సాగిందని ఎస్పీ అద్నాన్ నయిమ్ అస్మీ తెలిపారు. ఆయన ఆదివారం తమ కార్యాలయంలో ఆ వివరాలను విలేకరులకు తెలియజేశారు. అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విలేకరుల ప్రశ్నకు పైమేరకు సమాధానమిచ్చారు. 17 మంది బుకీలు ఈ కిడ్నాప్ సంఘటనలో ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో బాలుడి బంధువులు కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ తెలిపారు. బాలుడిని మూడు రోజుల పాటు దాచేందుకు ఉపయోగించిన స్థలాలను నిర్థారించామన్నారు. చదవండి: జసిత్‌ను కిడ్నాప్ చేసింది ఎవరు? -
ఆప్టింగ్ డ్రైవర్.. యాక్టింగ్ చోరీ
సాక్షి, అమలాపురం : ఓ డాక్టర్గారి కారుకు తరచూ ఆప్టింగ్ డైవర్‌గా వెళ్లే ఓ యువకుడు ఆ ఇంటి ఆనుపానులు అన్నీ తెలుసుకొని స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. డాక్టర్ హైదరాబాద్ వెళ్లగా ఇంట్లో ఆయన భార్య మాత్రమే ఉన్న సమయంలో తన స్నేహితులతో చోరీ చేయించాడు. ఆమె మెడలోని రూ.1.32 లక్షల విలువైన 44 గ్రాముల బంగారు నగలు కాజేశారు. ఈ సంఘటన జరిగిన పదిరోజులు కాకుండానే రాజోలు పోలీసులు నిందితులను అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపరిచారు. ఆ వివరాలను ఆదివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా రాజోలు సీఐ కె.నాగమోహరెడ్డి, ఎస్సై ఎస్.శంకర్‌లతో కలసి విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో డాక్టర్ గాదిరాజు నారాయణరాజు కొన్నేళ్లుగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన కొంబత్తుల శ్యామలరావు అలియాస్ శ్యామ్ కొన్నేళ్లుగా డాక్టర్ సూర్యనారాణరాజు కారుకు డ్రైవర్ అవసరమైతే ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డాక్టర్ ఎక్కడకైనా వెళ్లాల్సివస్తే శ్యామ్‌కు ఫోన్ చేసి ఆప్టింగ్ డ్రైవర్‌గా తీసుకు వెళుతున్నారు. శ్యామ్ డాక్టర్ కుటుంబం నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. గత నెల 26వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ సూర్యనారాయణరాజు శ్యామ్‌కు ఫోన్ చేసి తాను హైదరాబాద్ వెళ్తున్నానని, కారుకు ఆప్టింగ్ డ్రైవర్‌గా రావాలని చెప్పారు. అయితే అదే సమయానికి తన ఆస్పత్రిలో డ్రైవింగ్ వచ్చిన కాంపౌండర్ అందుబాటులో ఉండడంతో డాక్టర్ నారాయణరాజు శ్యామ్‌కు ఫోన్ చేసి అవసరం లేదని చెప్పారు. డాక్టర్ ఊరు వెళ్లడంతో సాయంత్రం ఆరు గంటలైతే ఆసుపత్రి సిబ్బంది వెళిపోతారు. ఇంట్లో డాక్టర్ భార్య రాణి సంయుక్త (72) మాత్రమే ఉంటారు. ఆమె దివ్యాంగురాలు. ఈ పరిస్థితులను శ్యామ్ అదనుగా తీసుకున్నాడు. తన స్నేహితులైన ఏనుగుపల్లి ధర్మరాజు అలియాస్ ధర్మ, నేరేడుమిల్లి రాజువర్మ అలియాస్ రాజేష్, మాదాసి వెంకటేష్ అలియాస్ చిన్న, మర్లపూడి ప్రేమ్బాబుతో కలిసి డాక్టర్ ఇంట్లో చోరీకి ప్లాన్ చేశాడు. ఈ అయిదుగురూ యువకులే. డాక్టర్ భార్యపై దాడి..ఆపై చోరీ 26వ తేదీ సాయంత్రం ఆరు గంటలు దాటాక చీకటి పడ్డాక ఆసుపత్రి పై అంతస్తులో ఉన్న డాక్టర్ ఇంట్లోకి ధర్మ, రాజేష్ వెళ్లారు. ఆసుపత్రి గేటు వద్ద ఒకరు కాపలా ఉన్నారు. ఆసుపత్రి బయట రోడ్డుపై మరో స్నేహితునితో కలిసి రెండు మోటారు సైకిళ్లపై శ్యామ్ వేచి ఉన్నాడు. డాక్టర్ భార్యపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న నగలను దోచుకున్నారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి అభినందన ఈ చోరీ కేసును కేవలం ఎనిమిది రోజుల్లో ఛేదించి చోరీకి పాల్ప డిన డ్రైవర్ శ్యామ్, అతని నలుగురు స్నేహితులను అరెస్టు చేయడంతో పాటు బంగారు నగలను నూరు శాతం రికవరీ చేసిన రాజోలు సీఐ నాగమోహనరెడ్డి, ఎస్సై శంకర్, హెచ్‌సీలు కె.గణేష్, ఎ.ప్రభాకర్, బొక్కా శ్రీను, కానిస్టేబుల్ వీరేంద్ర, హోంగార్డ్ అనంద్లను జిల్లా ఎస్పీ నయిమ్ అస్మీ, డీఎస్పీ బాషా ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డు కూడా ప్రకటిస్తారని డీఎస్పీ తెలిపారు. చోరీకి ఉపయోగించిన రెండు మోటారు సైకిళ్లు, రెండు సెల్ఫోన్లను కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ అయిదుగుర్నీ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజోలు మండలం చింతలపల్లి కళింగుల సెంటరులో రెండు మోటారు సైకిళ్లపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. -
చోరి చేశాడనే అనుమానంతో బాలుడిపై...
సాక్షి, తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం) : పాచి పని చేసుకొని జీవించే తల్లి వెంట వెళ్లడమే ఆ బాలుడి చేసిన నేరమైంది. ఇంట్లో నగదు, సెల్‌ఫోన్ చోరీ చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే తెల్లవారు జామున ఇంటికి వచ్చి తీసుకువెళ్లి ఊచ కాల్చి వాతలు పెట్టిన అమానుష సంఘటన రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం, లక్ష్మి వారపు పేటకు చెందిన మేడబోయిన సీత, అదే ప్రాంతానికి చెందిన రాణి అనే మహిళ ఇంట్లో పాచిపని చేసుకుని జీవిస్తోంది. సీత కుమారుడైన బాలుడు అప్పుడప్పుడూ తల్లితో కూడా రాణి ఇంటికి వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలో గురువారం రాణి ఇంట్లో రూ.ఐదు వేల నగదు, ఒక సెల్ ఫోన్ పోవడంతో సీత కుమారుడే తీశాడనే అనుమానంతో శుక్రవారం తెల్లవారు జామున సీత ఇంటికి వచ్చి ఆమె కుమారుడిని తీసుకువెళ్లి నగదు, సెల్ ఫోన్ ఏం చేశావంటూ రాణి, ఆమె అన్నయ్య, తల్లి, పక్కన ఉండే మరో వ్యక్తి కర్రలతో కొట్టారు. అంతటితో ఆగకుండా ఊచ కాల్చి వాతలు పెట్టారు. తనకు ఏమీ తెలియదని చెప్పినా ఆ బాలుడుని విడిచిపెట్టకుండా అమానుషంగా ప్రవర్తించారని అతడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్‌లైన్ జిల్లా కో ఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని జువైనల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చోరీ జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా చట్టాన్ని చేతులోకి తీసుకుని బాలుడిని హింసించడం తగదని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సముద్రంలో స్నానం చేస్తూ...
సాక్షి, తూర్పుగోదావరి : అల్లవరం మండలం ఓడలరేవు బీచ్‌లో గురువారం విషాదం చోటు చేసుకుంది. అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సానబోయిన హరి(19) ఓడలరేవు సముద్రంలో స్నానం చేస్తూ భారీ అలలకు మునిగి మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం బొండాయికోడుతూము గ్రామానికి చెందిన హరి తోటి విద్యార్థులతో పుట్టిన రోజు పార్టీకి హాజరయ్యాడు. అమలాపురం మండలం పేరూరు పల్లపు వీధికి చెందిన గంటి శివ(19) హరితో పాటుగా స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎస్కేబీఆర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 20 మంది విద్యార్థులు, తోటి స్నేహితుడు పుట్టిన రోజు వేడుకల నిమిత్తం ఓడలరేవు బీచ్‌లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు కావలసిన భోజన సదుపాయాలు తమతో బీచ్‌కు తీసుకెళ్లారు. తోటి విద్యార్థి పుట్టిన రోజు వేడుక పూర్తి చేసుకుని సముద్ర రిసార్ట్సు సమీపంలో సముద్రంలో స్నానానికి దిగారు. ఆ సమయంలో భారీ అలల ఉధృతికి సానబోయిన హరి, గంటి శివ గల్లంతయ్యారు. తమతో స్నానాలు చేస్తున్న హరి, శివలు కనిపించకపోవడంతో తోటి విద్యార్థుల్లో విషాదం అలుముకుంది. ఇంతలో భారీ అలలకు సానబోయిన హరి మృతదేహాం ఒడ్డుకి కొట్టుకొచ్చింది. అప్పటి వరకు సరదాగా తమతో గడిపి అంతలోనే విగతజీవుగా కనిపించడంతో విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరో విద్యార్థి గల్లంతైన శివ జాడ కోసం విద్యార్థులు నిరీక్షించడం తప్ప ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయారు. ఈ సంఘటనపై అల్లవరం పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించగా ఎస్సై కె.చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్కేబీఆర్ కాలేజీ నుంచి పుట్టిన రోజు పార్టీ నేపథ్యంలో బీచ్‌కు వచ్చిన విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. సముద్రంలో గల్లంతైన శివ ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు, గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండడంతో గాలింపు చర్యలకు అడ్డంకి మారిందని ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. విద్యార్థుల గల్లంతుపై కోనసీమ జాక్ సంతాపం ఓడలరేవు సముద్రంలో స్నానానికి దిగి మృతి చెందిన హరి, గల్లంతైన శివ పట్ల కోనసీమ జాక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఓడలరేవులో తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరిగి విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని, ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. -
నేరాలు.. ఘోరాలు!
సాక్షి, కాకినాడ క్రైం(తూర్పుగోదావరి) : క్షణికావేశంలో కొందరు.. కావాలని మరికొందరు.. ఆస్తికోసం కొందరు.. అనుమానంతో ఇంకొందరు.. ఇలా హత్యలు చేసి తమ జీవితాలను జైలుపాలు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో హత్యానేరాల సంఖ్య పెరిగింది. భార్యపై అనుమానాలు, ఆస్తి తగదాల నేపథ్యంలోనే హత్యలు జరుగుతుండడంతో జిల్లాలో భయాందోళనలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో జరిగిన జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే విధంగా 45 రోజుల క్రితం జిల్లా కేంద్రంకాకినాడలో జరిగి వృద్ధదంపతుల హత్య సంచలనం సృష్టించింది. ఈ కేసును పోలీసులు ఇప్పటి వరకు ఛేదించక పోవడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న, చిన్న విషయాలకే.. ఇటీవల కాలంలో జిల్లా పరిధిలో చోటు చేసుకుంటున్న హత్యలు క్షణికావేశంలో చోటు చేసుకుంటున్నవే అధికం. వీరందరూ చిన్న గొడవలు, ఆస్తి తగదాలు, అనుమానాలతో హత్యలకు పాల్ప డుతున్నారు. ఈ ఏడాది ఎక్కువ శాతం మహిళలే హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా అనుమానం పెనుభూతంగా మారి హత్యలకు దారితీస్తోందని పోలీసులు చెబుతున్నారు. శిక్షలపై అవగాహనేది? జిల్లాలో జరుగుతున్న హత్యలపై ప్రజల్లో నెలకొన్న భయాన్ని తగ్గించడం కోసం ఆయా నియోజక వర్గాల పరిధిలోని పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ నేరం చేస్తే ఎంతకాలం శిక్ష పడుతుంది? జైలులో అనుభవించాల్సిన కష్టాలు, నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకున్న వారి జీవితకథలను ప్రజలకు వివరిస్తే కొంత మేరకు ఈ హత్యలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉంటుంది. నేరాలు చేసి జైలుకు వెళితే.. వారి పిల్లల భవిష్యత్తు ఏంటనే స్పృహ వారిలో కలిగిస్తే కాస్త హత్యానేరాలను కొంత మేర అరికట్టవచ్చు. జిల్లాలో జరిగిన హత్యలు ఇలా.. ⇔జూన్ ఏడో తేదీన కాకినాడలో వృద్ధ దంపతుల హత్య జరిగింది. కాకినాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న ముమ్మిడివారి వీధిలో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ దంపతుల హత్యకు కారణాలేంటనే విషయంపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 50 రోజులు దాటినా నేటికీ ఈ హత్య విషయాన్ని పోలీసులు ఛేదించలేకపోవడం విశేషం. ⇔కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ బర్మాకాలనీలో ఏప్రిల్ 17న తల్లితో తండ్రి ప్రతిరోజు గొడవ పడి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, భావించిన దత్తత కొడుకు కుమార్ కర్రతో తండ్రిని కొట్టాడు. ఆ దెబ్బలకు తండ్రి గోపిరెడ్డి ఈశ్వరరావు చనిపోయాడు. వెంటనే తల్లి సాయంతో ఇంటి పెరట్లోనే గొయ్యి తీసి మూడో కంటికి తెలియకుండా పూడ్చివేశాడు. ⇔కాకినాడ సురేష్‌నగర్‌లో పైడిముక్కల రవీంద్రనాథ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. స్నేహితుల మధ్య ఉండే గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ⇔కరప మండలం పేపకాయలపాలేనికి చెందిన ఓ యువతికి మే 15న కరపకు చెందిన యువకుడితో పెళ్లి జరిగింది. పెళ్లి అయిన వారం రోజులకే తన ప్రియుడితో కలిసి పెనుగుదురులో కట్టుకున్న భర్తను కడతేర్చింది. ⇔మండపేటలో వరి చేలో ఓ మహిళను పెట్రోల్ పోసి తగులబెట్టారు. వివాహేతర సంబంధాలు వల్లే హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇలా జిల్లాలో అనేక చోట్ల హత్యలు క్షణికావేశంలోనే జరుగుతున్నాయి. అవగాహన కల్పిస్తాం జిల్లా పరిధిలో జరిగిన హత్యలు క్షణికావేశంతో అవగాహన లోపంతో జరుతున్నవే అధికం. నేరాలు చేస్తే జరిగే పరిణామాలపై శిక్షలపై పోలీస్‌శాఖ తరఫున ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. చట్టపరిధిని దాటి ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తాం. – అద్నాన్ నయీం అస్మీ, ఎస్పీ -
వలస జీవుల విషాద గీతిక
సాక్షి, రాజవొమ్మంగి (తూర్పుగోదావరి) : ఉన్నచోట ఉపాధి లభించకపోవడంతో పనులను వెతుక్కుంటూ వలసపోక తప్పదు. అదే పరిస్థితి రాజవొమ్మంగి మండలం గింజర్తి గ్రామంలో నెలకొంది. ఇక్కడ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామానికి చెందిన పదిమంది నిరుద్యోగ యువకులు కర్ణాటక రాష్ట్రంలో విద్యుత్ పనులకోసం వలస వెళ్లారు. కోలారు జిల్లాలోని మలబాగుల తాలూకా విరూపాక్ష గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ కొండెం చిన్నబాబు (28), మిరియాల బాలరాజు (29) విద్యుదాఘాతానికి గురై మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గింజర్తి గ్రామానికి చెందిన కొడెం చిన్నబాబు (28), మిరియాల బాలరాజు (29), కించు సత్యనారాయణ, ఆవూరి రాజ్‌కుమార్ కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగుల తాలుకా, విరూపాక్ష గ్రామంలో విద్యుత్తులైన్ల పనికి వెళ్లారు. వీరిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ‘పావని కంట్రోల్స్ అండ్ ప్యానల్ లిమిటెడ్’ పనుల్లో పెట్టుకొంది. విరూపాక్ష గ్రామంలో ఆది వారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్తంభం ఎక్కి విద్యుత్లైన్ల ఏర్పాటులో నిమగ్నమై ఉన్న చిన్నబాబుకు షాక్ తగిలింది. అతను విలవిలలాడుతుండగా బాలరాజు స్తంభం ఎక్కి చిన్నబాబును కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే విద్యుత్తుషాక్ నుంచి బయటపడ్డ చిన్నబాబు కిందపడి అక్కడికక్కడే మరణించగా అతనిని కాపాడేందుకు స్తంభం ఎక్కిన బాలరాజు విద్యుదాఘాతానికి గురై స్తంభానికి అతుక్కు పోయి అక్కడే మరణించాడు. వీరిని కాపాడేందుకు స్తంభం ఎక్కిన మరో యువకుడు కించు సత్యనారాయణ విద్యుత్ షాక్‌తో కింద పడి గాయాల పాలయ్యాడు. అతని కుడికాలు విరిగిపోగా ప్రాణాలు దక్కాయి. పక్కనే గల మరో స్తంభంపై పనిచేస్తున్న ఆవూరి రాజ్‌కుమార్ తనకు కూడా ఎక్కడ షాక్ తగులుతుందో అని భయపడి అక్కడ నుంచి దూకేశాడు. దాంతో రాజ్‌కుమార్ కూడా గాయాలపాలయ్యాడు. ఈ సమాచారాన్ని ఆ కంపెనీ వర్గాలు మృతుల కుటుంబ సభ్యులకు తెలియజేశాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు మంగళవారం ఉదయానికి ఇక్కడకు వస్తాయని మృతుల కుటుంబసభ్యులు సోమవారం తెలిపారు. స్థానిక మాజీ సర్పంచ్ ఆవూరి శుభలక్ష్మి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. శోక సంద్రంలో తల్లిదండ్రులు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటారనుకున్న తమ పిల్లలు మరో రాష్ట్రానికి వెళ్లి విగతజీవులుగా తిరిగివస్తున్నారని తెలిసి ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. వారిని ఊరడించడం ఎవరి వల్ల కాకపోయింది. ఈ ఏడాది మే నెల 13వ తేదీన పనులకు వెళ్లిన వీరు మరో వారంరోజుల్లో ఇంటికి వచ్చేస్తున్నారనగా ఇలా జరగడంతో చిన్నబాబు, బాలరాజుల తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. చిన్నబాబు తండ్రి నాలుగు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న చిన్నబాబు తల్లిదండ్రులకు భారంకాలేక ఉన్న ఊరు, కన్నతల్లిని వీడి కర్ణాటకకు పనుల కోసం వలస వెళ్లాడు. అక్కడ రోజుకు రూ.400 సంపాదిస్తూ తను తినగా మిగిలినదానిని తల్లిదండ్రులకు పంపించేవాడు. చిన్నబాబు గతంలో మిలటరీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకొన్నాడు. అన్నిట విజయం సాధించినప్పటికీ మెడికల్ చెకప్‌లో నెగ్గుకురాలేకపోయాడు. దాంతో ఆ ఉద్యోగం వరించలేదు. పోలీసు కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకొన్న చిన్నబాబు శారీరక దారుఢ్యపరీక్షల్లో నెగ్గుకు వచ్చినప్పటికీ రాత పరీక్షలో పాస్ కాలేకపోయాడు. పోలీసు కావాలనే కోరిక ఉన్నప్పటికీ అర్థిక పరిస్థితులు కలసిరాక, తన కొడుకు కోచింగ్‌కు కూడా వెళ్లలేకపోయాడని తండ్రి వెంకటేశ్వర్లు ‘సాక్షి’ వద్ద వాపోయాడు. ఇలా ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నించిన తన ఒక్కగానొక్క కుమారుడు సుదూర ప్రాంతానికి పనులకు వెళ్లి అర్ధాంతరంగా మరణించడం ఏనాడో నేను చేసుకొన్న పాపమంటూ అతను బోరున విలపించాడు. కొడుకు రేపో మాపో వస్తాడని ఎదురు చూస్తున్న చిన్నబాబు కన్నతల్లి లీలావతి ఈ మరణ వార్త విని కుప్పకూలింది. తమకు దిక్కెవరని కన్నీరుమున్నీరుగా దుఃఖిస్తున్న లీలావతిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ సంఘటనలో మరణించిన ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు మిరియాల బాలరాజు తల్లిదండ్రులు వరకుమారి, వెంకటేశ్వర్లులది నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబం. రెక్కాడితే కాని డొక్కాడని వీరికి ఎదిగివచ్చిన కొడుకు ఆసరాగా నిలిచాడు. పని కోసం వలస వెళ్లిన బాలరాజు ఇంటిఖర్చులకు సొమ్ములు పంపిస్తూ ఆదుకుంటున్నాడని వారు సంబరపడుతున్నారు. ఆ సమయంలో విగత జీవిగా మారాడనే సమాచారాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కొడుకు మృతదేహం ఎప్పుడు వస్తుందా అని కంటిమీద కునుకులేకుండా మృతుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. -
నేను కూడా పోలీసులను అడగలేదు : డిప్యూటీ సీఎం
మండపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలగించిన మండపేటలో నాలుగేళ్ల బాలుడు జసిత్ కిడ్నాప్ వ్యవహారంలో నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. జసిత్‌ను చూసేందుకు శనివారం మండపేట వచ్చిన డిప్యూటీ సీఎం బోస్ మీడియాతో మాట్లాడుతూ కేసు దర్యాప్తులో పోలీసులు, మీడియా ఒకరికొకరు పోటీపడి పనిచేశారని ప్రశంసించారు. జసిత్ విషయమై స్వయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీసేవారన్నారు. తాను ఎప్పటికప్పుడు పోలీసు అధికారులతో సమీక్షించానన్నారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీ మూడు రోజులపాటు మండపేటలోనే ఉండి కేసు దర్యాప్తు చేయడం పట్ల ఆయనను అభినందించారు. కేసును పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారని, వివరాలు వెల్లడించడం సరికాదని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను కూడా పోలీసులను వివరాలు అడగలేదని, వారిని స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోనివ్వాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకోనున్నట్టు చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ విషయమై అనుమానాలున్నాయని ఒక విలేకరి అడుగ్గా అసాంఘిక, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ కార్యకలాపాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రోత్సహించదన్నారు. వారు ఎవరైనా, ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని బోస్ అన్నారు. అటువంటి వ్యక్తులు ఒకవేళ తమ పార్టీలో ఉన్నా వారిని వదులుకుంటామే తప్ప క్షమించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు చాలాచోట్ల సరిగా పనిచేయడం లేదని బోస్ దృష్టికి తీసుకురాగా పక్కాగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తొలుత జసిత్ తల్లిదండ్రులు వెంకటరమణ, నాగావళిని పరామర్శించిన బోస్ కొద్దిసేపు జసిత్‌తో ముచ్చటించారు. నన్ను ఎలా కిడ్నాప్ చేశారంటే..అంటూ బాలుడు చెప్పే మాటలు విని మురిసిపోయారు. లిటిల్ హీరో అంటూ జసిత్‌ను ఆయన అభినందించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు కర్రి పాపారాయుడు, రెడ్డి రాజుబాబు, నల్లమిల్లి వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి..
సాక్షి, రాజానగరం(తూర్పు గోదావరి) : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జాతీయ రహదారి పై లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దివాన్‌చెరువుకు చెందిన బలభద్ర వీరభద్రరావు అనే చిన్నబ్బు (55) అనారోగ్యంతో రాజమహేంద్రవరంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన ఇయ్యపురాలిని పరామర్శించేందుకు భార్య, మనుమడితో కలసి బైకు పై వెళ్లి, తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ముందు వెళుతున్న లారీని వెనుక వస్తున్న మరో లారీ అధిగమించే ప్రయత్నంలో రహదారి పక్క నుంచి వెళుతున్న చిన్నబ్బు బైకును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అతడి భార్య, మనుమడు రహదారికి ఎడమ వైపు పడిపోగా, చిన్నబ్బు కుడివైపునకు పడటంతో లారీ అతడి తలపై నుంచి వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే కట్టుకున్న భర్త మృత్యువాత పడడంతో చిన్నబ్బు భార్య సూర్యలక్ష్మి సొమ్మసిల్లి పోయారు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీరభద్రరావు -
ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించాడు
సాక్షి, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి): ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీ స్థాయిలో సొమ్ములు వసూలు చేసి ఓ మోసగాడు పరారైన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. బాధితుల కథనంప్రకారం.. రాజోలు మండలం మలికిపల్లి గ్రామానికి చెందిన జోగి శ్రీనివాసరావు అనే వ్యక్తి జిల్లాలో అనేక మందితోపాటు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరుద్యోగులను వలలో వేసుకొని వారికి మాయమాటలు చెప్పి కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా మోసపోయిన వారు సుమారు 50 మంది వరకు ఉంటారని, రూ.1.80 కోట్లమేర స్వాహా చేసి నిందితుడు ఉడాయించాడని బాధితులు లాలాచెరువుకు చెందిన ఎం.శివ ప్రసాద్, కాతేరు గ్రామానికి చెందిన టి.హేమల రావు, నక్కా జయరాజు, కాకుల పాటి వీరేష్ కుమార్ తెలిపారు. మధ్యవర్తుల ద్వారా నిరుద్యోగులకు ఎర ఈ వ్యవహారంలో మధ్యవర్తులు పంపన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా నిరుద్యోగులకు ఎరవేసి జోగి శ్రీనివాసరావు రెండో భార్య అయిన ఆళ్లపు మంగ అకౌంట్లో నిరుద్యోగుల నుంచి నగదు వేయించుకుని మరో రెండు, మూడు రోజుల్లో ఉద్యోగానికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందని నమ్మించి అనంతరం కనిపించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. నిందితుడు హైదరాబాద్‌కు పరారైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరారు. -
జసిత్ కిడ్నాప్ కేసును ఛేదిస్తాం: ఎస్పీ
సాక్షి, కాకినాడ: కిడ్నాప్‌కు గురైన జసిత్ ఆచూకీ కోసం ఏడు పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం హస్మీ మంగళవారం బాలుడు కిడ్నాప్ అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం జసిత్ తండ్రి వెంకటరమణను విచారించి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. అన్ని చెక్ పోస్టులు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అప్రమత్తం చేశామని, ఆర్థిక లావాదేవీలు కూడా కిడ్నాప్‌కు కారణమా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామన్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, కచ్చితంగా చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదిస్తామన్న నమ్మకం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్స్ రాలేదని, కిడ్నాప్‌కు ముందే రెక్కి నిర్వహించి ఉంటారని అమామానిస్తున్నట్లు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చదవండి: కరెంటు లేదా అంటూ వచ్చి.. కిడ్నాప్ -
అవహేళన చేస్తావా.. అంటూ కత్తితో..
సాక్షి, రాజోలు (తూర్పు గోదావరి): చీటికీ మాటికీ తనను అవహేళనగా మాట్లాడుతున్న ఉపాధ్యాయుడిపై ఒక యువకుడి కత్తితో దాడి చేశాడు. రాజోలు తోరం వారి వీధిలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు బుడితి నాగ కోట సత్యనారాయణమూర్తిపై సోమవారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన యువకుడు నల్లి విన్సెంట్ కత్తితో దాడి చేశాడు. ఉపాధ్యాయుడికి వీపుపై రెండు, ఛాతీపై రెండు మొత్తం నాలుగు చోట్ల కత్తిపోట్లు దిగాయి. దీంతో దాడి జరిగిన ప్రాంతమంతా రక్తపు మడుగుగా మారింది. గాయాలతో కిందపడి ఉన్న ఉపాధ్యాయుడిని స్థానికులు రాజోలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో మెరుగైన వైద్యం కోసం అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కత్తితో దాడికి పాల్పడిన యువకుడు రాజోలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. యువకుడి చేతికి కూడా గాయం కావడంతో బంధువులు రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడు మలికిపురం మండలం గుడిమెళ్లంక పాఠశాలలో విధులు నిర్వహిస్తూ భార్య, కుమార్తెతో కలిసి రాజోలులోని తోరం వారి వీధిలో నివాసం ఉంటున్నాడు. అదే వీధిలో పంచాయతీ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న పాస్టర్ నల్లి విక్టర్‌బాబు కుమారుడు విన్సెంట్. విన్సెంట్, ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తి గత కొంతకాలంగా మాటామాటా అనుకుంటున్నారని స్థానికులు తెలిపారు. చీటికీమాటికీ తనను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడని అందుకే దాడికి పాల్పడినట్టు యువకుడు విన్సెంట్ తెలిపాడు. రోడ్డుపై వెళ్తుండగా ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తి తనను పిలిచి కత్తి చూపించి బెదిరించాడని, దీంతో కోపం వచ్చి ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని వివరించాడు. ఈ పెనుగులాటలో ఉపాధ్యాయుడిపై కత్తితో దాడికి పాల్పడినట్టు తెలిపాడు. ఈ క్రమంలో విన్సెంట్ చేతికి కూడా కత్తి గుచ్చుకుని గాయమైంది. రాజోలు ఎస్సై ఎస్.శంకర్ మాట్లాడుతూ గాయపడ్డ ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తిని అమలాపురం ఆస్పత్రికి తీసుకుని వెళ్లారని, ఉపాధ్యాయుడి వాగ్మూలం నమోదు చేసుకునేందుకు సిబ్బంది వెళ్లారన్నారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. -
కరెంటు లేదా అంటూ వచ్చి.. కిడ్నాప్
సాక్షి, మండపేట(తూర్పుగోదావరి): మండపేట పట్టణంలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. అప్పటివరకూ నాన్నమ్మతో కలిసి ఆడుకుని ఇంట్లోకి చేరుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఓ అపరిచిత వ్యక్తి నాన్నమ్మపై దాడి చేసి ఆ బాలుడిని ఎత్తుకెళ్లిపోయాడు. అప్పుడే విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు విషయం తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఘటన జరిగిన తీరును బట్టి ఉద్దేశపూర్వకంగానే ఈ కిడ్నాప్ జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నూకా వెంకటరమణ, నాగావళి భార్యాభర్తలు. ఏడాది క్రితం బదిలీపై వీరు మండపేట వచ్చారు. వెంకటరమణ పట్టణంలోని యూనియన్ బ్యాంకులోను, నాగావళి కెనరా బ్యాంకులోను పీవోలుగా పని చేస్తున్నారు. స్థానిక విజయలక్ష్మి నగర్‌లోని అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. వారి నాలుగేళ్ల కుమారుడు జసిత్‌ను అపార్ట్మెంట్ పక్కనే ఉన్న ప్రైవేట్ స్కూలులో యూకేజీలో చేర్పించారు. బాలుడి సంరక్షణను వెంకటరమణ తల్లి పార్వతి చూస్తోంది. జసిత్ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాన్నమ్మ పక్కనే ఉన్న స్కూల్ ఆవరణలోకి తీసుకువెళ్లి ఆడించి తీసుకువస్తూంటుంది. రోజూ మాదిరి సోమవారం సాయంత్రం జసిత్‌ను గ్రౌండ్‌కు తీసుకువెళ్లి ఆడించింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో అతడిని తీసుకుని అపార్ట్మెంట్ వద్దకు చేరుకుంది. అప్పటికే విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆ ప్రాంతమంతటా అంధకారం అలముకొంది. మెట్లు ఎక్కుతున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. నాన్నమ్మ పార్వతి.. రోదిస్తున్న తల్లిదండ్రులు వెంకటరమణ, నాగావళి కరెంటు లేదా? అని పార్వతిని ప్రశ్నించాడు. లేదని ఆమె బదులిస్తున్న సమయంలో ఒక్కసారిగా బలంగా ఆమె దవడపై కొట్టి బాలుడిని లాక్కొని మోటారు సైకిల్‌పై ఎక్కించుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఆమె ముఖంపై రక్తపు గాయాలయ్యాయి. పార్వతి వెంటనే తేరుకుని మోటారు సైకిల్‌ను వెంబడించినప్పటికీ చుట్టూ చీకటిగా ఉండటంతో ఆగంతకుడు ఎవరో గుర్తు పట్టలేకపోయింది. విధులు ముగించుకుని అదే సమయానికి ఇంటికి చేరుకున్న కుమారుడు, కోడలికి విషయం చెప్పడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. నాగావళి ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భిణి. వెంకటరమణ ఫిర్యాదు మేరకు మండపేట రూరల్ సీఐ కె.మంగాదేవి ఆధ్వర్యంలో మండపేట అర్బన్, రూరల్ ఎస్సైలు రాజేష్‌కుమార్, దొరరాజులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రామచంద్రపురం డీఎస్పీ జీవీ సంతోష్‌కుమార్ సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. బాలుడి నాన్నమ్మ పార్వతిని, తల్లిదండ్రులను విచారించారు. సంఘటన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడానికి కారణాలను ఆరా తీస్తున్నారు. తెలిసినవారి పనేనా? ఈ కిడ్నాప్ ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల అపార్ట్మెంట్లో ఉంచిన వెంకటరమణ ద్విచక్ర వాహనం చోరీ అవడం, తాజాగా ఆయన కుమారుడిని కిడ్నాప్ చేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బాలుడి ఆచూకీ కోసం డీఎస్పీ జీవీ సంతోష్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలింపు చేపట్టారు. చుట్టుపక్కల పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. వెంకటరమణకు కుటుంబ పరంగా, వృత్తిపరంగా ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా? ఎవరినుంచైనా బెదిరింపులు వచ్చాయా అనే విషయమై పోలీసులు విచారిస్తున్నారు. ఆగంతకుడిని గుర్తించడం కోసం సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు, అపరిచిత వ్యక్తుల సంచారంపై స్థానికులను ఆరా తీస్తున్నారు. -
తరిమి కొట్టి.. చెట్టుకు కట్టి..
సాక్షి, రాజానగరం(పశ్చిమ గోదావరి): భూవివాదంలో ఓ వ్యక్తిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటనతో రాజంపేటవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మునికూడలికి చెందిన చిడిపి నాగభూషణానికి తన చిన్నాన్న చిడిపి నాగయ్యతో తొమ్మిది సెంట్ల భూవివాదం కొంతకాలంగా నడుస్తోంది. గురువారం ఉదయం 6.30 గంటలకు తన చిన్నాన్న కుమారుడు చిడిపి నాగేశ్వరావు(స్టాలిన్) మునికూడలి పంచాయతీ పరిధిలోని రాజంపేటలో ఉన్న భూమిని దున్నుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న స్టాలిన్, తన కుమారుడు తరుణ్‌లతోపాటుగా ఇనుగంటివారిపేటకు చెందిన నలుగురు యువకులు క్రికెట్ బ్యాట్లు, స్టంప్లతో నాగభూషణంపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు రాజంపేట గ్రామంలోకి పరుగులు తీశాడు. నీలవేణి అనే మహిళకు తన వద్ద ఉన్న బ్యాగ్‌ను ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పగా, అప్పటికే దాడి చేస్తున్న వారు చేరుకోవడంతో భయభ్రాంతులకు గురై ఆమె తిరిగి బ్యాగ్‌ను నాగభూషణానికి అందించింది. నాగభూషణం నుంచి బ్యాగ్‌ను తీసుకుని కొడుతూ ఈడ్చుకుని వెళ్లి పొలం వద్ద ఉన్న కొబ్బరి చెట్టుకు కట్టేశారు. విషయం తెలిసిన నాగభూషణం కుమారుడు రాజు 100కు కాల్ చేయడంతో స్థానిక హెడ్ కానిస్టేబుల్ అప్పారావు, కానిస్టేబుల్ ప్రసాద్ వెళ్లి చెట్టుకు కట్టి ఉన్న నాగభూషణాన్ని విడిపించారు. బ్యాగ్‌లో పొలం దస్తావేజులు, రెండు బ్యాంక్ చెక్‌బుక్‌లతోపాటుగా పాస్‌బుక్‌లు, ప్రాజెక్ట్‌కు సంబంధించిన పత్రాలు, రూ.45 వేలు ఉన్నాయని భాదితుడు నాగభూషణం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కోరుకొండ సీఐ పవన్‌కుమార్ రెడ్డి, ఎస్సై డి ఆనంద్ కుమార్ విచారించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆనంద్ కుమార్ తెలిపారు. -
అల్లుడిని చంపిన మామ
సాక్షి, పిఠాపురం రూరల్(తూర్పు గోదావరి): పిఠాపురం మండలం ఎల్ఎన్ పురంలో పిల్లనిచ్చిన మామే సొంత అల్లుడిని హతమార్చిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎల్ఎన్ పురానికి చెందిన మృతుడు యలమంచిలి రాజు (36)కు అదే గ్రామానికి చెందిన తప్పిట చంద్రరావు కుమార్తె గాయత్రితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి. కాకినాడలోని వెల్డింగ్ పనిచేసే రాజు కొన్నాళ్లుగా మద్యం సేవించి భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మద్యం తాగి బుధవారం రాత్రి తన అత్తగారి ఇంటికి వచ్చిన రాజు భార్యతో గొడవపడి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన మామ చంద్రరావుపైనా దాడి చేయడంతో క్షణికావేశంలో మామ పక్కనే ఉన్న గునపంతో అల్లుడి తలపై బలంగా మోదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజును స్థానికులు పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై చైతన్యకుమార్, ఇన్చార్జి గోవిందరాజు పరిశీలించారు. మృతుడి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
విద్యార్థి మృతి.. పాఠశాల నిర్లక్ష్యమే కారణం
తమ కుమారుడు బాగా చదువుతున్నాడు. ఇంకా బాగా చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలని ఆ తల్లిదండ్రులు భావించారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఆ విద్యార్థి కూడా చదువులో రాణిస్తున్నాడు. ఐటీడీఏ ప్రోత్సాహంతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలోనూ అతడికి చోటు లభించింది. దీంతో రాజమహేంద్రవరంలోని హోలీ ఏంజెల్స్ పాఠశాలలో చేరాడు. అయితే విధి వక్రించింది. అతడి ఆశలను చిదిమేస్తూ అనారోగ్యం, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఆ బాలుడు మృతి చెందాడు. కన్నవారిని, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచాడు. సాక్షి, రంపచోడవరం(తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరం హోలీ ఏంజెల్స్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఓ గిరిజన విద్యార్థి మృతి చెందాడు. ఆ విద్యార్థి మృతదేహంతో ఆ గ్రామ గిరిజనులు, తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. మండలంలోని బి.రామన్నపాలెం గ్రామానికి చెందిన కంగల సాయిబాబాదొర(16) బుధవారం రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆసుపత్రిలో మృతి చెందాడు. వారం రోజుల నుంచి విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి జోగిదొర పాఠశాలకు వెళ్లి కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏటా ఐటీడీఏ బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తోంది. ఎంపిక చేసిన కార్పొరేట్ పాఠశాలకు ఐటీడీఏ ఏటా ఫీజులు చెల్లిస్తోంది. దీనిలో భాగంగానే సాయిబాబాదొర హోలీ ఎంజెల్సీలో పదో తరగతి చదువుతున్నాడు. ఐటీడీఏ ఎదుట ఆందోళన హోలీ ఏంజెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి ఐటీడీఏ ఎదుట విద్యార్థి మృతదేహంతో ఆందోళన చేశారు. వారం రోజుల నుంచి విద్యార్థి జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకోలేదని, కనీసం ఇంటికి ఫోన్ చేసుకునేందుకు కూడా ఫోన్ ఇవ్వలేదని ఆరోపించారు. సకాలంలో వైద్యం చేయించి ఉంటే విద్యార్థి మృతి చెందేవాడు కాదని గ్రామస్తులు వాపోయారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని మృతదేహంతో బైఠాయించారు. దీంతో ఐటీడీఏ ఏపీఓ నాయుడు మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించారు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహం తరలింపు రాజమహేంద్రవరం క్రైం: పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వలన గిరిజన విద్యార్థి మృతి చెందాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. మరోవైపు పాఠశాల యాజమాన్యం చర్యలు కూడా ఆ ఆరోపణలు వాస్తవమన్నట్టుగానే వ్యవహరించారు. బాలుడు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుంటే హోలీ ఏంజెల్స్ పాఠశాల యాజమాన్యం ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా తమ వద్ద ఉన్న మాత్రలు వేస్తూ కాలం వెళ్లదీసింది. ఈ నేపథ్యంలో సాయిబాబు దొర పరిస్థితి విషమించడంతో హుటాహుటిన మంగళవారం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బాలుడు స్వగ్రామం తరలించారు. పాఠశాలపై అనేక ఆరోపణలు గతంలో హోలీ ఏంజల్స్ పాఠశాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. మూడేళ్ల క్రితం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయ కృష్ణన్ ఉన్న సమయంలో గిరిజన విద్యార్థులపై దాడులకు పాల్పడడం, వారిని కొట్టడం, మంచి భోజనం పెట్టకుండా హింసించడం, వంటివి చేయడంతో అప్పట్లో పాఠశాల విద్యార్థులు ఆందోళన చేశారు. అప్పటి సబ్ కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరిపారు. అప్పటి ప్రభుత్వం పాఠశాల యాజమాన్యంపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా, పాఠశాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పాఠశాల యాజమాన్యం మరలా పాత ధోరణి అవలంభించడం, విద్యార్థులకు సరైన వసతి భోజనం పెట్టకపోవడంతో వారు పౌష్టికాహార లోపంతో ఉంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ పాఠశాల పై దృష్టి సారించి, విద్యార్థులను విచారణ చేసి పాఠశాలలో ఏవిధంగా జరుగుతున్నది సమగ్ర విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో పర్యవేక్షణ కరువు ఐటీడీఏ జిల్లాలోని ఏడు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ఏటా ప్రవేశం కల్పిస్తోంది. ఏటా మూడు, ఐదు, ఎనిమిది తరగతుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. వీరు పదో తరగతి పూర్తయిన తరువాత బయటకు వస్తారు. ఇదే తరహాలో హోలీ ఎంజెల్స్ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ రెండేళ్ల క్రితం గిరిజన విద్యార్థులు తమకు ఆహారం సరిగా పెట్టడం లేదని ఆరోపిస్తూ ఐటీడీఏ పీవోను కలిసి ఆందోళన చేశారు. గిరిజన సంక్షేమ విద్యా విభాగం బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించిన తరువాత వారి బాగోగులు పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడ విద్యార్థులు ఏం తింటున్నారో, ఎలా చదువుతున్నారో, అసలు పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఎలా వ్యవహరిస్తోంది? అనేది తెలుసుకోవడం లేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం పరిపాటిగా మారింది. -
ఒంటరిగా వెళుతున్న మహిళలే లక్ష్యంగా..
ఆ యువకులు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. డబ్బు సులభంగా సంపాదించేందుకు చోరీలకు అలవాటు పడ్డారు. చైన్ స్నాచింగ్‌లు మొదలుపెట్టారు. ఒంటరిగా వెళుతున్న వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు తెగబడ్డారు. చివరికి పోలీసులకు చిక్కారు. ఆ చోరుల వివరాలను మంగళవారం రాజమహేంద్రవరం తూర్పు మండలం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ వై.వి.రమణకుమార్, తూర్పు మండలం డీఎస్పీ వి.వి.రమణ కుమార్ వెల్లడించారు. రెండున్నర నెలలుగా రాజా నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో చైన్ స్నాచింగ్స్ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన కాకరబాల సుబ్రహ్మణ్యం(అలియాస్ బాబి) రావి వెంకటేష్ (వెంకీ), జక్కంపూడి వెంకటేష్ , ధవళేశ్వరం గ్రామానికి చెందిన సాంబారి క్రాంతి కుమార్‌లు స్నేహితులు. వీరు ఆటో డ్రైవర్‌గా, లారీ డ్రైవర్‌గా, కూలిపనులు చేసుకుని జీవిస్తుంటారు. వ్యసనాలకు బానిసలైన ఈ యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం చైన్ స్నాచింగ్‌లకు దిగారు. ఒంటరిగా నడిచి వెళుతున్న మహిళలే లక్ష్యంగా వీరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు. కాకరాల బాల సుబ్రమ్మణ్యం, మరో యువకుడు మోటారు సైకిల్‌పై మహిళలను వెంబడించి, నిర్జీవ ప్రదేశంలో వారి మెడలోని బంగారు గొలుసులను తెంచుకుని పారిపోయేవారు. వాటిని మల్లయ్య పేటకు చెందిన(రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డులో బంగారు నగలు తయారీ చేసే వ్యక్తి) పాలతీర్ధపు మహేష్ అనే వ్యక్తికి విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుండేవారని పోలీసులు తెలిపారు. పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో చోరీలు నిందితులు ప్రతి చోరీ పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో చేస్తుండేవారని అడిషనల్ ఎస్పీ వివరించారు. నిందితులు తొలిసారిగా ఈ ఏడాది మే 3న కొంతమూరులో చైన్ స్నాచింగ్ చేశారని తెలిపారు. అనంతరం మే 29న కొంతమూరు గ్రామంలో, జూన్ 6న మరో చైన్ స్నానింగ్ చేశారని తెలిపారు. జూన్ 24వ తేదీన మరో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఒకే ప్రాంతంలో చోరీలు చేస్తుండడంతో పోలీసుల నిఘా పెంచారు. దీంతో వారు చోరీ చేసే ప్రాంతాన్ని మార్చుకున్నారని తెలిపారు. ఐదో సారి జూలై నాలుగో తేదీన బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ నగర్లో చైన్ స్నాచింగ్ చేసి పరారయ్యారని తెలిపారు ఈనెల 15వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాజానగరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కొంతమూరు అవుట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మోటారు సైకిల్‌పై కాకర బాలసుబ్రహ్మణ్యం, రావి వెంకటేష్ పోలీసుల ను చూసి పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించి అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా చైన్ స్నాచింగ్ చేస్తున్న మిగిలిన వారి పేర్లు జక్కంపూడి వెంకటేష్, సాంబారీ క్రాంతి కుమార్ పేర్లు వెల్లడించారని తెలిపారు. వీరితో పాటు చోరీ చేసిన నగలు కొనుగోలు చేసిన పాలతీర్ధపు మహేష్‌ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 189 గ్రాముల బంగారు నగలు స్వాధీనం నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 189 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. వీటి విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని అన్నారు. అలాగే చోరీలు చేయడానికి ఉపయోగించే రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో క్రైం పార్టీ పోలీస్ కానిస్టేబుళ్లు కె.సురేష్, డి.విజయ కుమార్, స్టేషన్ క్రైం పోలీసు కానిస్టేబుళ్లు బీఎన్ఎస్ ప్రసాద్, కె. కళ్యాణరావు, ఎం.ప్రసాద్ సహకరించారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు ఎం.వి.సుభాష్, నాగబాబు పాల్గొన్నారు. -
టోల్గేట్ బిల్లింగ్ బూత్‌ను ఢీకొన్న లారీ
సాక్షి, కిర్లంపూడి (తూర్పుగోదావరి) : జేసీబీలను తరలిస్తున్న ఓ లారీ కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బిల్లింగ్ బూత్‌ను ఢీకొనడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒకరు మరణించారు. దాంతో మృతుని బంధువులు ధర్నా, రాస్తారోకో చేపట్టగా నాలుగు గంటలసేపు ట్రాఫిక్ స్తంభించింది. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన ఉండ్రు రాజు (25) రెండేళ్లుగా కృష్ణవరం టోల్‌గేటు వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. రాజు ఆదివారం ఉదయం యథావిధి గా విధులు నిర్వహిస్తుండగా రాజమహేంద్రవరం నుంచి వైజాగ్ వైపు రెండు జేసీబీలను తరలిస్తున్న లారీ బిల్లింగ్ బూత్‌ను ఢీకొట్టింది. దాంతో బిల్లింగ్ బూత్ శ్లాబ్ కూలి రాజు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే టోల్గేట్ సిబ్బంది రాజును ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనలో టోల్గేట్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుని బంధువులు, మాలమహానాడు, మాదిగ దండోరా నాయకులు, టోల్ సిబ్బంది టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై భారీ ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఆందోళన కొనసాగడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న పెద్దాపురం ఇన్చార్జి డీఎస్పీ ఏబీజీ తిలక్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. రాజు మృతికి టోల్గేట్ యాజమాన్యం కారణమని, ఆ యాజమాన్యమే పూర్తి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. టోల్గేట్ యాజమాన్యం నష్టపరిహారంగా రూ. లక్ష చెల్లించేందుకు ముందుకు వచ్చింది. రెండు రోజుల టోల్‌ఫీజు ఇవ్వాలని వారు పట్టుబట్టారు. పోలీసుల చొరవతో ఎట్టకేలకు టోల్గేట్ యాజమాన్యం రూ. 6 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చేందుకు అంగీకరించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో దళిత నాయకులు దానం లాజర్‌బాబు, కాపారపు రాజేంద్ర, శివ, అధిక సంఖ్యలో దళిత నాయకులు పాల్గొన్నారు. పెద్దాపురం సీఐ జి.శ్రీనివాస్, కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి, ఏలేశ్వరం ఎస్సైలు జి.అప్పలరాజు, టి.రామకృష్ణ, తిరుపతిరావు, సుధాకర్, పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎస్సై జి.అప్పలరాజు కేసు నమోదు చేశారు. వివాహమైన రెండు నెలలకే.. రాజుకు రెండు నెలల క్రితమే వివాహం అయ్యింది. రాజు మరణవార్త తెలుసుకున్నఅతని భార్య పావని, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తోటి సిబ్బంది సైతం రాజు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
వీడిన నవ వరుడి హత్యకేసు మిస్టరీ
-
హత్య పథకం నవ వధువుదే
తూర్పుగోదావరి, కరప (కాకినాడరూరల్): వైవాహిక జీవితం ఆనందంగా గడపాల్సిన ఆ యువజంటలో నవ వరుడు మరణించగా నవ వధువు జైలుపాలైంది. నవ వధువు తన ప్రియుడితో కలసి హత్యకు పథకరచన చేసి ఈ హత్య చేయించినట్టు తేలింది. కరప మండలం పెనుగుదురువద్ద ఈనెల 22వ తేదీన ఒకయువకుడు (నవవరుడు) దారుణహత్యలోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహమైన వారం రోజుల్లోనే నవవరుడు హత్యకు గురికావడం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాకినాడరూరల్ సీఐ పి.ఈశ్వరుడు ఆధ్వర్యంలో కరప ఎస్సై జి.అప్పలరాజు, పోలీసుసిబ్బంది వారంరోజుల వ్యవధిలోనే నిందితులిద్దరినీ అరెస్టు చేసి కాకినాడ కోర్టులో హాజరుపరచగా రెండువారాలు రిమాండ్ విధించారు. కరప పోలీసుస్టేషన్లో గురువారం కాకినాడరూరల్ సీఐ పి.ఈశ్వరుడు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం కరప గ్రామంలోని నీలయ్యతోటవీధికి చెందిన పేకేటి రాముడు కుమారుడు సూర్యనారాయణ (27) కరపమండలం పెనుగుదురు–పాతర్లగడ్డ రోడ్డులో పంటపొలాల్లో హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై నరకడంతో అతను మృతి చెందాడు. మృతుని సోదరుడు సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదేరోజు హత్యకేసుగా నమోదుచేశారు. మృతుడు పేకేటి సూర్యనారాయణకు కరప శివారు పేపకాయలపాలెం గ్రామానికి చెందిన మద్దూరి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మితో ఈనెల 15వ తేదీన వివాహమైంది. నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన వివాహితుడు కర్రి రాధాకృష్ణతో రెండేళ్లుగా అక్రమసంబంధం ఉంది. పెద్దలు కుదిర్చిన సంబంధం ఇష్టంలేక నాగలక్ష్మి తన ప్రియుడు రాధాకృష్ణతో కలసి హత్యకు పథక రచన చేసింది. అందులో భాగంగా ముద్దాయి రాధాకృష్ణ ఈనెల 21వ తేదీన సూర్యనారాయణకు ఫోన్ చేసి, సరదాగా బయటకు వెళదామంటూ పెనుగుదురు వద్దకు రమ్మన్నాడు. అక్కడనుంచి పక్కనే గల పాతర్లగడ్డరూటులోగల పంటపొలాల్లోకి తీసుకెళ్లి అక్కడ కూర్చుండపెట్టి తనతోపాటు తెచ్చుకున్న కత్తితో నరికి చంపేశాడు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నేరస్తుడు పట్టుబడింది ఇలా: స్థానికుల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. నవవరుడు సూర్యనారాయణ భార్యతో బయటకు వెళ్లివస్తానని చెప్పి వచ్చాడు. మృతుని భార్య నాగలక్ష్మి, ఆమెప్రియుడు రాధాకృష్ణ ముందుగా వేసుకున్న పధకం ప్రకారం రాధాకృష్ణ పెనుగుదురు వద్ద నుంచి ఫోన్ చేసి సూర్యనారాయణను రప్పించాడు. కత్తితో నరికి చంపేసి, మృతదేహంపై గడ్డికప్పి, కత్తిని కేఎంజే కాలువలో పడేసి వెళ్లిపోయాడు. మృతుడి సోదరులు, బంధువులు ఆ రాత్రి ఎంతగా గాలించినా సూర్యనారాయణ జాడ తెలియలేదు. దాంతో వారు పోలీసుస్టేషన్లో సూర్యనారాయణ అదృశ్యంపై ఫిర్యాదుచేశారు. రాధాకృష్ణ పేపకాయలపాలెంలోని నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పెళ్లికొడుకు మోటార్‌సైకిల్ పెనుగుదురు సమీపంలోని పొలాల్లో కనిపించిందని చెప్పాడు. నాగలక్ష్మి, సూర్యనారాయణ బంధువులతోపాటు వెదకటానికి రాధాకృష్ణ కూడా ఏమీతెలియనట్టు వెళ్లాడు. మోటార్‌సైకిల్‌వద్దకు అందరితోపాటు వెళ్లి కొంతసేపటికి దూరంగా మృతుడి చెయ్యి కనిపిస్తోంది అదిగో అంటూ చూపించడంతో అందరూ అక్కడకు వెళ్లారు. అక్కడ సూర్యనారాయణ మృదేహం కనిపించింది. మృతుని బంధువులు మృతదేహం కనిపించినట్టు కరప ఎస్సై జి.అప్పలరాజుకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వచ్చినా ఆధారాలు దొరకలేదు. కాకినాడరూరల్ సీఐ ఈశ్వరుడు, పోలీసుసిబ్బంది తమదైన శైలిలో మృతదేహం ఉన్నట్టు ఎవరు చెప్పారంటూ క్లూ లాగడంతో ఒకటొకటిగా వాస్తవాలు వెలుగుచూశాయి. -
వివాహమైన వారానికే.. దారుణహత్య
అతడు ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్.. ఏ విధమైన చెడు అలవాట్లు లేవు. కాలేజీ లేకపోతే పొలం పనులు చేసుకోవడం, పశువులను చూసుకోవడం తప్ప వేరే ధ్యాస కూడా ఉండదు. వారం రోజుల క్రితమే అతడికి వివాహమైంది. ఆ నవవరుడు హత్యకు గురయ్యాడు. కారణమేంటో తెలియదు కానీ ఓ పొలం గట్టు వద్ద శవమై కనిపించాడు. కరప మండలం పెనుగుదురు వద్ద మంగళవారం రాత్రి ఈ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కరప గ్రామానికి చెందిన పేకేటి సూర్యనారాయణ హత్య ఆ గ్రామంలో కలకలం రేపింది. మంగళవాయిద్యాలు మోగిన నవవరుడు, వధువు గృహాలు బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. ఎటువంటి చెడు అలవాట్లు లేని వ్యక్తి ఇలా హత్యకు గురయ్యాడంటే నమ్మలేకపోతున్నామని ఆ గ్రామస్తులు అంటున్నారు. కరప (కాకినాడరూరల్): కరప గ్రామానికి చెందిన పేకేటి రాముడుకు నలుగురు కుమారులు. ఆఖరి వాడైన సూర్యనారాయణ(30) మండపేట శ్రీవికాస కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 15న కరప శివారు పేపకాయలపాలెం గ్రామానికి చెందిన మద్దూరి వెంకటేశ్వరరావు అనే బాషా కుమార్తె నాగలక్ష్మితో అతడికి వివాహమైంది. మంగళవారం సాయంత్రం సూర్యనారాయణ తమ ఇంటి వద్ద పశువులకు నీరుపెట్టి, గడ్డివేశాడు. ఇంటి వద్ద చెప్పి అత్తారింటికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో బయల్దేరి పేపకాయలపాలెం వెళ్లాడు. అక్కడ 5.30 గంటల వరకు ఉండి, ఐదుగురు స్నేహితులు పార్టీ ఇమ్మంటున్నారు, భోజనం టైంకు వచ్చేస్తానని భార్య నాగలక్ష్మితో చెప్పి, మోటారు సైకిల్‌పై వచ్చేశాడు. రాత్రి 7.30 గంటలకు కూడా రాకపోయేసరికి భార్య ఫోన్ చేస్తే అరగంటలో వస్తానని చెప్పాడు. రాత్రి తొమ్మిది గంటలకు కూడా రాకపోయే సరికి ఫోన్ చేస్తే సూర్యనారాయణ సెల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన సూర్యనారాయణ మామ బాషా కరప ఫోన్ చేసి విషయం చెప్పాడు. రాత్రి నుంచి సూర్యనారాయణ సోదరులు, బంధువులతో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించి, స్నేహితులకు ఫోన్ చేసినా తెలియదని సమాధానం వచ్చింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో కరప నుంచి పెనుగుదురు వైపు మోటార్‌సైకిల్‌పై వెళుతున్నట్టు చూశామని గ్రామస్తులు అంటున్నారు. బుధవారం ఉదయానికి కూడా రాకపోయేసరికి కరప పోలీసుస్టేషన్ కెళ్లి సూర్యనారాయణ అదృశ్యంపై ఫిర్యాదుచేశారు. పెనుగుదురు సమీపంలో.. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో పెనుగుదురు సమీపంలో గొల్లపాలెం రోడ్డులోని లేఅవుట్ వద్ద మోటార్‌సైకిల్ ఉండడాన్ని గమనించి, అక్కడ పరిశీలించగా పొలంలో గట్టును ఆనుకుని గడ్డి కప్పి, సూర్యనారాయణ మృతదేహం కనిపించింది. వెంటనే కరప పోలీసులకు సమాచారం అందించారు. కరప ఎస్సై జి.అప్పలరాజు, రైటర్ ఎన్.వెంకటరమణ, గొల్లపాలెం, ఇంద్రపాలెం ఎస్సైలు, సిబ్బందితో కలిస ఘటనాస్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించి, హత్య గురించి సీఐకు సమాచారం ఇచ్చారు. కాకినాడరూరల్ సీఐ పి.ఈశ్వరుడు ఘటనా స్థలానికి వచ్చి, జరిగిన హత్యపై ఆరాతీశారు. హత్యకు ఆధారాలు దొరుకుతాయేమోనని కాకినాడ నుంచి డాగ్‌స్క్వా డ్‌ను పిలిపించారు. డాగ్ పరిసర ప్రాంతాల్లో కొంతదూరం తిరిగినా ఆధారాలు ఏమీ దొరకలేదు. చేతికి ఉన్న బంగారు ఉంగరాలు, జేబులో మనీపర్స్ అలాగే ఉన్నాయి. మెడలో ఉండే బంగారు చైన్లు, చేతికి ఉండే బ్రేస్లెట్ కనిపించలేదు. బంగారం కోసం జరిగిన హత్య కాదని, దీని వెనుక బలమైన కారణమే ఉంటుందని, దర్యాప్తులో అన్నీ తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. పెనుగుదురు పొలాల్లో ఉన్న సూర్యనారాయణ మృతదేహాన్ని పరిశీలిస్తున్న కాకినాడ రూరల్ సీఐ ఈశ్వరుడు హత్య మిస్టరీని ఛేదిస్తాం కరప గ్రామానికి చెందిన పేకేటి సూర్యనారాయణ వివాహమైన వారానికే హత్య గురయ్యాడంటే విచారణ జరిపి, దీనివెనుక ఉన్న మిస్టరీని ఛేదిస్తామని కాకినాడ రూరల్ సీఐ ఈశ్వరుడు తెలిపారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే హత్య జరిగి ఉండవచ్చన్నారు. తలపై గొడ్డలి, కత్తితో నరికి ఉండొచ్చన్నారు. లే అవుట్లో హత్య చేసి, మృతదేహాన్ని గట్టుపక్కన పడేసి, గడ్డికప్పి పోయారన్నారు. ప్రస్తుతానికి హత్యకు సంబంధించి ఆధారాలేమీ దొరకలేదన్నారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి, నేరస్తులను పట్టుకుంటామని సీఐ ఈశ్వరుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి, హత్య కేసు నమోదుచేశారు. -
చైన్ స్నాచర్ అరెస్ట్
తూర్పుగోదావరి, ఆలమూరు (కొత్తపేట): ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన నాతి వెంకటేష్ (వెంకన్న) ఆలమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్సై టి.క్రాంతికుమార్ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండపేట రూరల్ సీఐ కె.లక్ష్మణరెడ్డి కేసులకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఆలమూరుకు చెందిన వెంకన్న కొన్నేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే నిందితుడు వెంకన్నపై భార్యపై హత్యాయత్నం కేసుతో పాటు మరో ఏడు కేసులు స్థానిక పోలీసు స్టేషన్లో నమోదయ్యాయి. అప్పటి నుంచి అతడి కోసం ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఐడీ పార్టీ ప్రతినిధులు ఇళ్ల శ్రీనివాసు, సీహెచ్ యేసుకుమార్ తదితరులు గాలింపు చర్యలు చేపట్టారు. జొన్నాడ సెంటర్లో మంగళవారం సాయంకాలం అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి గొలుసుల రూపంలో ఉన్న 190 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడు వెంకన్నను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారు. పోలీసు శాఖలో కీలక అరెస్ట్‌లు ఆలమూరు పోలీసు స్టేషన్లో నమోదైన కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు నెలల కాలంలో కీలకమైన ఆరుగురు దారి దోపిడీ దొంగలను, ఒక గొలుసు దొంగను అరెస్ట్ చేసినట్టు మండపేట రూరల్ సీఐ కె.లక్ష్మణరెడ్డి తెలిపారు. మార్చి 31న దారి దోపిడీ దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకోగా, బుధవారం చైన్ స్నాచర్‌ను అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనల మేరకు బాధితులకు అప్పగించనున్నామన్నారు. -
గుప్పు.. గుప్పుమంటూ..
తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం క్రైం: గంజాయి సాగు, రవాణాకు జిల్లా అనుకూలంగా మారింది. జిల్లాలో 11 మండలాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏఓబీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వెళ్ల లేని ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి కూలీలను ఏర్పాటు చేసుకొని సాగు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ పండించిన గంజాయి 99 శాతం ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో అన్ని విధాలుగా రైలు, రోడ్డు మార్గాలు ఉండడం వల్ల గంజాయి రవాణాకు జిల్లా అనుకూలంగా మారింది. నిరాటంకంగా సాగుతూ.. జనసమర్థమైన ప్రదేశాలకు, జాతీయ రహదారులకు చేర్చేందుకు గిరిజనులను ఉపయోగించుకుంటున్నారు. 25 కేజీల మూటలు రెండింటిని జాతీయ రహదారికి చేర్చితే గిరిజనులకు రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు కిరాయి ఇస్తుంటారు. దీంతో రాత్రి సమయాల్లో గంజాయి రవాణా అటవీ ప్రాంతం గుండా నిరాటంకంగా సాగుతోంది. జిల్లాకు సరిహద్దు రాష్ట్రం అయిన ఒడిశా, విశాఖ జిల్లాల నుంచి కూడా ఈ జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది. విస్తారమైన అటవీ ప్రాంతం ఉండడం వల్ల జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాల్లో ఆటవీ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిరాటంకంగా సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. హైవే ప్రాంతం ఆనుకొని జిల్లా ఉండడంతో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలోని తుని, జగ్గంపేట, రాజమహేంద్రవరం, అనపర్తి, రావుల పాలెం తదితర ప్రాంతాల్లో నిల్వలు చేసి రవాణా చేస్తున్నారు. కేసులు.. అరెస్టులు.. గత మూడేళ్లలో గంజాయి తరలిస్తుండగా ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ శాఖ అధికారులు 29 మందిని అరెస్ట్ చేసి 19 కేసులు నమోదు చేశారు. 1312.65 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 91823 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల జైలు శిక్షలు ప్రస్తుతం గంజాయి కేసులో పట్టుబడిన వారికి కోర్టులు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. దీని వల్ల గిరిజన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గంజాయి స్మగ్లింగ్ వల్ల కలిగే నష్టాలపై ఐటీడీఏ అధికారులు గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గిరిజనులే బలి.. సెంట్రల్ జైలులో గంజాయి కేసుల్లో రిమాండ్‌లో ఉన్న, శిక్ష పడిన ముద్దాయిలు దాదాపు 500 మందికి పైగా ఉన్నారంటే ఈ గంజాయి సాగు, రవాణాపై ఎంతమంది ఆధారపడ్డారో అర్ధం అవుతుంది. అక్షర జ్ఞానం లేని గిరిజనులు తమకు వచ్చే కొద్ది సొమ్ముల కోసం ఆశపడి ఈ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. నర్సరీ మొక్కలు, కాయగూరల మాటున స్మగ్లింగ్ తవుడు బస్తాలు, నర్సరీ మొక్కలు, కాయగూరలు, బియ్యం బస్తాల మాటున గంజాయి రవాణా చేస్తున్నారు. టూరిస్ట్ బ్యాగ్‌లలో, రైల్వేలో ప్రయాణికుల మాదిరిగా గంజాయి తరలిస్తున్నారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఇతర ముఖ్య పట్నాల నుంచి హైటెక్ బస్సులు లగేజీల ద్వారా కూడా గంజాయి రవాణా చేస్తున్నారు. వీటితో పాటు లారీ ట్రాన్స్‌పోర్టులు ద్వారా జరుగుతోంది. జిల్లా నుంచి హైదరాబాద్, తమిళనాడు, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయలోపం.. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలంటే స్థానిక పోలీసులతో పాటు, ఎక్సైజ్, రెవెన్యూ, ఫారెస్ట్, సెంట్రల్ ఎక్సైజ్, ఎన్సీబీ(నార్కోట్సె కంట్రోల్ బోర్డు, సెంట్రల్ రెవెన్యూ ఇంటిలిజన్స్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అయితే వారి మధ్య సఖ్యత లేకపోవడం గంజాయి స్మగ్లర్లకు వరంగా మారింది. నిరంతరంనిఘా ఏర్పాటు గంజాయి రవాణా సాగుపై నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది రాయవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సుమారు 192 కేజీల గంజాయిని స్వా«ధీనం చేసుకున్నాం. ఏడుగురు ముద్దాయిలలో ఆరుగురిని అరెస్ట్ చేశాం. ఒక ముద్దాయిని అరెస్ట్ చేయాల్సి ఉంది.– కె.ఎస్.ఎన్. ప్రభు కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్. రాజమహేంద్రవరం -
దారికాసిన మృత్యువు
తూర్పుగోదావరి, రంపచోడవరం/నెల్లిపాక: నిరుద్యోగ భృతి అందుతుందని, తమకు కొంత ఆర్థిక చేయూత లభిస్తుందని ఆశపడిన ఆ యువతుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. రంపచడవరానికి ఏడు కిలోమీటర్లు దూరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఎటపాక మండలం గౌరీదేవీపేటకు చెందిన తానికొండ ప్రవల్లిక (24), తోటపల్లి గ్రామానికి చెందిన సూదిపాక లావణ్య( 24), గన్నవరానికి చెందిన ములిశెట్టి ప్రశాంత్(26) మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతి చెందిన యువతులు యువనేస్తం పథకంలో భాగంగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి సర్టిఫికెట్స్ పరిశీలన కోసం బుధవారం ఉదయం గన్నవరం నుంచి ఆరు గంటలకు ఆటోలో రాజమహేంద్రవరం బయలుదేరారు. వీరితో పాటు గన్నవరానికి చెందిన గంజి వీరబాబు, తోటపల్లి గ్రామానికి చెందిన జి రమేష్ కూడా ఆటోలో రాజమహేంద్రవరం బయలుదేరారు. రంపచోడవరానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని సీతపల్లి గుడి సమీపంలో మలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవళిక, లావణ్య, ప్రశాంత్‌లను ప్రైవేట్ వాహనంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునే సరికే ప్రవళిక, లావణ్యలు మృతి చెందారు. ప్రశాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మలుపు వద్ద పొంచి ఉన్న మృత్యువు సీతపల్లి పాత రోడ్డు, కొత్త రోడ్డు కలిసే జంక్షన్ వద్ద మృత్యువు పొంచి ఉంది. మంగళవారం రెండు వాహనాలు ఢీకొనడంతో ఎటువంటి ప్రాణనష్టం లేకుండా బయట పడ్డారు. అయితే బుధవారం జరిగిన ప్రమాదంతో ఇదే మలుపులో ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గోకవరం నుంచి ఇసుక లోడ్‌తో వస్తున్న లారీ సీతపల్లి గుడి సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో వెనుక భాగాన్ని ఢీకొనడంతో వెనుక సీటులో ఉన్న ముగ్గురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు రమేష్, వీరబాబులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. గ్రామాల్లో విషాదఛాయలు ఎటపాక మండలంలోని మూడు గ్రామాలకు చెందిన యువతులు, యువకుడు మృతి చెందడంతో ఆ గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నిరుద్యోగ భృతి కోసం వెళుతూ మృత్యువాత పడడంతో వారు తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రశాంత్ ఆటో నడుపుతూ తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడని తలచుకుని రోదిస్తున్నారు. మృతి చెందిన వారిని ప్రభుత్వపరంగా అదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ కోరారు. అలాగే రంపచోడవరం ఏరియా మార్చురీలో ఉన్న యువతుల మృతదేహాలను భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
బాలికపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
తూర్పుగోదావరి, కిర్లంపూడి (జగ్గంపేట): పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి, వారిని సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పి ఓ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన ప్రజలు ఆ పాఠశాలకు చేరుకుని, కీచక ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళన నిర్వహించారు. కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురం ఎంపీపీ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు తాటికొండ గణేశ్వరరావు ఆరో తరగతి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంటూ, ఆ బాలిక తల్లిదండ్రులతోపాటు పలువురు గ్రామస్తులు ఆందోళన చేశారు. పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. నిందితుడైన ఉపాధ్యాయుడు పరారవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రధానోపాధ్యాయుడు అడపా సత్యనారాయణను పాఠశాలలో నిర్బంధించారు. గతంలో రెండుమూడుసార్లు ఇటువంటి సంఘటనలు జరిగినా ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. కీచక ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రధానోపాధ్యాయుడిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ టి.జోసెఫ్, ఎస్సై జి.నరేష్‌లు ఎస్.తిమ్మాపురం పాఠశాలకు చేరుకుని విషయాన్ని ఆరా తీశారు. బాధిత బాలిక నుంచి, ఆమె తల్లిదండ్రుల నుంచి ఎంఈఓ రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. కీచక ఉపాధ్యాయునిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారికి సిఫారసు చేయనున్నామని తెలిపారు. ఆందోళనలో గ్రామస్తులు గొల్లపల్లి చక్రధర్, బొజ్జపు శ్రీను, ఎం.బాబ్జీ, విద్యాకమిటీ చైర్మన్ గొల్లపల్లి ప్రసాద్, గొల్లపల్లి సత్యనారాయణ, సోము నారాయణరావు, దాసు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాబేజీల మధ్యలో గంజాయి రవాణా
తూర్పుగోదావరి, రాజానగరం: పదమారో నంబరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిపోతున్న రూ.10.25 లక్షల విలువైన 205 కిలోల గంజాయిని రాజానగరం పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. సీఐ సురేష్‌బాబు, ఎస్సై జగన్మోహన్ల కథనం ప్రకారం.. విశాఖపట్నం నుంచి ముంబైకి ఐషర్ వ్యాన్‌లో క్యాబేజీ బస్తాలు రవాణా చేస్తున్నారు. వాటి మధ్య గంజాయి ఉంచి, పైకి క్యాబేజీ బస్తాలుగా చూపిస్తూ తరలిస్తున్నారు. రాజానగరం సమీపాన కలవచర్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై స్థానిక పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో దీనిని పట్టుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన దేవదాసు లడ్డూ, దిలీప్‌సింగ్ పరదేశి, బేల్ధార్, అంబుదాస్ కచ్చిరు, సురేష్ కచ్చిరు, అనాబక్రీ, ఏక్‌నాథ్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదు, 9 సెల్ఫోన్లు, కారు, క్యాబేజీల్లో గంజాయితో ఉన్న ఐషర్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.