గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సీఐ శివగణేష్, ఎస్సై ఎస్.లక్ష్మి
తూర్పుగోదావరి, రామచంద్రపురం: వాహనాలను తనిఖీ చేస్తుండగా రామచంద్రపురం బైపాస్ రోడ్డు జంక్షన్‌లో పోలీసులకు గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. రామచంద్రపురం ఎస్సై ఎస్.లక్ష్మి కథనం ప్రకారం..రామచంద్రపురం బైపాస్ రోడ్డులో సీఐ పి.శివగణేష్ నేతృత్వంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు ఆటోలో వెళుతూ అనుమాస్పదంగా కనిపించారు. వారిని విచారించగా వారి వద్ద ఉన్న చీరల మూటల్లో గంజాయి కనిపించింది.
విషయాన్ని ఆర్డీవో ఎన్.రాజశేఖర్‌కు సమాచారం అందించిన పోలీసులు ఆయన ఆదేశాల మేరకు తహసీల్దార్ పి. చిన్నారావు, ఆర్‌ఐ కె.మహాలక్ష్మినాయుడు, వీఆర్వో పెంకే సత్యనారాయణ, ఇతర రెవెన్యూ సిబ్బంది సమక్షంలో వారి వద్ద నుంచి 48 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. కాగా రాజమండ్రికి చెందిన ఇద్దరు, చెన్నైకు చెందిన ఒక వ్యక్తి, రంగంపేటకు చెందిన ఒక వ్యక్తి మండపేట నుంచి కాకినాడ వైపునకు ఆటోలో గంజాయిని తీసుకు వెళుతున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ నలుగురిని అరెస్టు చేసినట్టు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment