
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: తక్కువ ధరలకే బంగారానికి మెరుగులు పెడతామంటూ మోసాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఆలమూరు మండలం బడుగు వాణిలంక గ్రామంలో ఓ మహిళ వద్ద నుంచి పుస్తెల తాడు అపహరించి పారిపోవడానికి ప్రయత్నించగా మహిళ గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పట్టుబడిన యువకులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసలు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment