gang of thieves arrest
-
ఆలయాలే వీరి టార్గెట్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా 27 ఆలయాల్లో ఇటీవల కాలంలో నేరాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మధురవాడ వాంబే కాలనీకి చెందిన మొగిలిపల్లి నాగార్జున... తోట వీరబాబు మరుపల్లి ధనరాజుతో సహా ఆరుగురు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ముఠా సభ్యులు ఒకరికే ఆటో ఉండడంతో ఆటో పై సంచరిస్తూ నేరాలు చేయడం వీరికి అలవాటుగా మారింది. తాజాగా విజయనగరం జిల్లాలో వరుసగా ఆలయాల్లో హుండీలు పగలగొట్టిన ఈ నేరస్థులను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: వివాహేతర సంబంధం: మెడలో చెప్పులతో) అవాస్తవాలను నమ్మొద్దు:డీఐజీ ఇటీవల ఆలయాల్లో జరిగే సంఘటన ఆధారంగా కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని ఆలయాల్లో చోరీలు జరిగితే ప్రజలు మత విద్వేషాలకు లోను కావొద్దని కోరారు. కొందరు నేరస్థులు చోరీలకు పాల్పడటానికి అలవాటు పడ్డారని నేరం జరిగినప్పుడు ప్రజలు పోలీస్ సహకారం తీసుకోవాలని, ఆందోళన వద్దని విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు సూచించారు. (చదవండి: బొగ్గు గనిలో ప్రమాదం, 16 మంది మృతి) -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
సాక్షి, వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. కమిషనరేట్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలను వెల్లడించారు. అంతర్రాష్ట్ర పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.5 లక్షల విలువైన 135 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి అభరణాలు, నాలుగు సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాష్త్రం వీదిషా జిల్లా, గులాంగంజ్ మండలం వన్ గ్రామానికి చెందిన పెంటియ పార్థీ, రాజేష్ మెంగియా అలియాస్ రాజుతో పాటు మరో బాల నేరుస్తుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇక రాజేంద్రసింగ్, చంగిరాంలు పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు. ముగ్గురు నిందితులు ఒకే కులానికి చెందినవారని, ఎలాంటి వృత్తి లేకపోవడంతో దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారని ఆయన తెలిపారు. వీరితో పాటు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులతో కలిసి ఎనిమిదేళ్లుగా మధ్యప్రదేశ్, మహారాష్త్ర, నాగపూర్ ప్రాంతాలలో బెలూన్లు అమ్ముకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా చోరీలకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఇక దొంగలించిన డబ్బులతో జల్సాలకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో... పరారీలో ఉన్న నిందితులు రాజేంద్రసింగ్మోంగియా, చంగిరాంలతో కలిసి ఈ యేడాది మే, జూన్‌లో మట్టెవాడ పోలీసు స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. గౌతమినగర్‌లో 30 గ్రాముల బంగారం, శ్రీనివాసకాలనీలో 400 గ్రాముల బంగారం అభరణాలు చోరీ అయినట్లు ఆయన పేర్కొన్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవిరాజా, మట్టెవాడ ఇన్స్పెక్టర్ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద డబ్బు ఖర్చు కావడం, మళ్లీ డబ్బు అవసరం ఉండి చోరీ సోత్తును కొనుగోలు చేసే వ్యాపారి నారాయణ సోనికి అప్పగించేందుకు వరంగల్ బులియన్ మారెట్‌కు రాగా సమాచారం తెలిసిన ఇన్స్పెక్టర్లు రవిరాజ్, జీవన్‌రెడ్డిలు ఆధ్వర్యాన అరెస్టు చేసినట్లు సీపీ చెప్పారు. అధికారులకు అభినందనలు నిందితులను అరెస్టు చేయడంతో పాటు చోరీ సొమ్మును రికవరీ చేయడంలో ప్రతిభ కనపరిచిన ఉద్యోగులను సీపీ అభినందించారు. ఈ మేరకు సీసీఎస్ ఏసీపీ బాబురావు, వరంగల్ ఏసీపీ నర్సయ్య, ఇన్స్పెక్టర్లు రవిరాజ్, జీవన్‌రెడ్డి, ఎల్.రమేష్‌కుమార్, మట్టెవాడ ఎస్సై వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఏఎస్సై వీరస్వామి, హె డ్ కానిస్టేబుళ్లు, ఇనాయత్ఆలీ, జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, విజయ్‌కాంత్, మీర్ మహమ్మద్ అలీ, ఐటీ కోర్ అనాలాటికల్ అసిస్టెంట్ సల్మాన్ కానిస్టేబుల్ శ్రవణ్‌ను అభినందించి జ్ఞాపికలు అందజేశారు. -
మెరుగు పెడతామంటూ మోసం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: తక్కువ ధరలకే బంగారానికి మెరుగులు పెడతామంటూ మోసాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఆలమూరు మండలం బడుగు వాణిలంక గ్రామంలో ఓ మహిళ వద్ద నుంచి పుస్తెల తాడు అపహరించి పారిపోవడానికి ప్రయత్నించగా మహిళ గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పట్టుబడిన యువకులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసలు గుర్తించారు. -
తిరుపతిలో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
తిరుపతి: నగరంలో దొంగల ముఠాల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. అంతరాష్ట్ర దొంగల ముఠా ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ చర్యల్లో భాగంగా తిరుపతిలో బుధవారం ఏడు మంది అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ దొంగతనాలు చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వీరినుంచి 20 బైకులు, 2 కంప్యూటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన ఏడుమంది దొంగలలో 6మంది విద్యార్థులు ఉండటం విశేషం.