ఆలయాలే వీరి టార్గెట్‌.. | Six Arrested In Temple Theft Case | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

Published Sun, Sep 27 2020 3:30 PM | Last Updated on Mon, Sep 28 2020 9:41 AM

Six Arrested In Temple Theft Case - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా 27 ఆలయాల్లో ఇటీవల కాలంలో  నేరాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మధురవాడ వాంబే కాలనీకి చెందిన మొగిలిపల్లి నాగార్జున... తోట వీరబాబు మరుపల్లి ధనరాజుతో సహా ఆరుగురు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ముఠా సభ్యులు ఒకరికే ఆటో ఉండడంతో ఆటో పై సంచరిస్తూ నేరాలు చేయడం వీరికి అలవాటుగా మారింది. తాజాగా విజయనగరం జిల్లాలో వరుసగా ఆలయాల్లో హుండీలు పగలగొట్టిన ఈ నేరస్థులను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: వివాహేతర సంబంధం: మెడలో చె‍ప్పులతో

అవాస్తవాలను నమ్మొద్దు:డీఐజీ
ఇటీవల ఆలయాల్లో జరిగే సంఘటన ఆధారంగా కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని ఆలయాల్లో చోరీలు జరిగితే ప్రజలు మత విద్వేషాలకు లోను కావొద్దని కోరారు. కొందరు నేరస్థులు చోరీలకు  పాల్పడటానికి అలవాటు పడ్డారని నేరం జరిగినప్పుడు ప్రజలు పోలీస్ సహకారం తీసుకోవాలని, ఆందోళన వద్దని విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు సూచించారు. (చదవండి: బొగ్గు గనిలో ప్రమాదం, 16 మంది మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement