ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సులు
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం అమలాపురం డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు రాజమహేంద్రవరం నుంచి అమలాపురం వెళ్లే బస్సు, అమలాపురం నుంచి రాజమహేంద్రవరం వస్తున్న బస్సులు రత్నా ప్లాస్టిక్స్ వద్ద అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేస్తూ అమలాపురం నుంచి వస్తున్న బస్సును ఎదురుగా ఢీ కొట్టాడు. అమలాపురం బస్సు విద్యుత్ సబ్ స్టేషన్ గేటు గోడకు ఢీ కొట్టాగా, రాజమహేంద్రవరం బస్సు కల్యాణి సోంపాపిడి కోట్టును ఢీ కొట్టి అగిపోయింది. ఈ సంఘటనలో పట్టి సీమ ఆలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న ఉప్పలగుప్తంకు చెందిన సలాది తాతారావు, ఆయన భార్య సలాది భ్రమరాంబ, వారి కుమార్తెలు మహేశ్వరి, వైష్ణవి తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరి కుటుంబం బస్సు ముందు భాగంలో కూర్చొవడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు నరేంద్రపురానికి చెందిన వెలుగుల శంకరరావు, కొత్తపేటకు చెందిన పచ్చమళ్ళ శ్రీనివాసరావు, అమలాపురానికి చెందిన సత్య, అనుషా స్వల్పగాయాలతో బయటపడ్డరు. మరి కొంత మంది గాయాల పాలవ్వగా వారికి ప్రాథమిక చికిత్స అందించారు. టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment