
మృతురాలు పద్మ (ఫైల్)
తూర్పుగోదావరి, పెద్దాపురం: మండలంలోని వడ్లమూరు రోడ్డులోని అపెక్స్ రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న యువతి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన మాడపల్లి పద్మ (24) ఈ పరిశ్రమలో కార్మికురాలు. సహచర ఉద్యోగితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్థాపానికి గురైన పద్మ ఫాక్యరీలోనే విధుల్లో ఉండగానే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది .
పద్మ అక్కడికక్కడే మృతి చెందగా ఈ ఘటనను చూసిన ఒడిశాకు చెందిన సహచర యువతులు సోనాలి, మనీషా, గంగీలు అపస్మారక స్థితిలోకి చేరారు. దీంతో స్థానికులు వారిని పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వి,సురేష్ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.