
ప్రభాకర్‌రెడ్డి, అరుణ (ఫైల్)
చిత్తూరు ,వి.కోట: భార్యను హతమార్చి అనంతరం తానూ గొంతుకోసుకున్న సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాముగానిపల్లెకు చెందిన ప్రభాకర్‌రెడ్డి (37)కి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా అల్కీల్æ గ్రామానికి చెందిన అరుణ(29)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి దిలీప్(7), మౌనిక (6) పిల్లలు ఉన్నారు. ప్రభాకర్ గొరెల్రు మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య అరుణపై అనుమానం పెంచుకుని మద్యం సేవించి గొడవ పడేవాడు.
గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ చేసినా ఫలితం లేదు. సోమవారం దంపతులు ఇద్దరూ గొర్రెలకు మేతకోసం ఉదయాన్నే తమ పొలం వద్దకు వెళౠ్లరు. అక్క డ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ప్రభాకర్ క్షణి కావేశంతో తన వద్ద ఉన్న కొడవలితో భార్య మెడపై నరికి హతమార్చాడు. అనంతరం అదే కత్తితో తానూ గోంతుకోసుకుని ఆత్మహత్యకుయత్నించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ మహేష్‌బాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ప్రభాకర్‌ను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ ఆరిపుల్లా గ్రామస్తులతో మాట్లాడి సమాచారం సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment