గెట్‌ టు గేదర్‌కు వచ్చి.. | Women Died By Heart Attack | Sakshi

గెట్‌ టు గేదర్‌కు వచ్చి..

May 22 2018 2:14 PM | Updated on Sep 2 2018 4:52 PM

Women Died By Heart Attack - Sakshi

మద్దూరి కాశీరత్నం (ఫైల్‌)

వంగర : ఎం.సీతారాంపురం గ్రామంలో 1994–95 పదోతరగతి బ్యాచ్‌ పూర్వపు విద్యార్థులు ఈ నెల 20న జరుపుకున్న గెట్‌టుగేదర్‌ కార్యక్రమానికి వచ్చిన మహిళ మద్దూరి కాశీరత్నం(38) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు.

తోటి స్నేహితుల సమాచారం మేరకు ఎం.సీతారాంపురం పాఠశాలకు వచ్చిన ఆమె పూర్వపు విద్యార్థులు(స్నేహితులు) అందరితో కలిసి సరదాగా గడిపారు. అనంతరం తన కన్నవారి గ్రామం మద్దివలసకు చెందిన తల్లి బెజ్జిపురం నరసమ్మ వద్దకు చేరింది.

సోమవారం ఉదయం స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా శంకవరానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా ఆరోగ్యంలో తేడా అనిపించడంతో భర్త ఉదయ్‌భాస్కరనాయుడు సపర్యలు చేశారు. ఫలితం లేకపోయింది. ఆమె గుండెపోటుతో మృతిచెందారు.

విషయం తెలుసుకున్న చుట్టుపక్కలే ఉన్న ఆమె స్నేహితులు(పూర్వ విద్యార్థులు) కుప్పకూలిపోయారు. అంతా కలిసి మద్దివలస గ్రామానికి చేరుకొని కాశీరత్నం మృతదేహం వద్ద రోదించారు. తన స్నేహితురాలు ముందు రోజు తమతో సరదాగా ఉందని, ఒక్కసారి మృత్యువు కబళించడంతో వారంతా విషన్నవదనంలోకి వెళ్లిపోయారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement