
ఓ పార్కు కావాలి!
పెట్‌డాగ్స్ కూ ఓ పార్కు ఉంటే ఎంత బాగుంటుంది! బెంగళూరులో ఇలాంటి సౌకర్యం ఉందట. పెంపుడు కుక్కలన్నింటినీ తెచ్చి వాటి యజమానులు అక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారట. ఎంచక్కా నెలకోసారి అవి ఇదిగో ఇలా ఆడేసి పాడేసి ఎంజాయ్ చేసేసి వెళ్లిపోతాయి. ఎప్పుడూ నాలుగు గోడల మధ్య ‘భౌభౌ’ మంటూ బోరుమనకుండా.. ఇలాంటివి వాటిని రీఫ్రెష్ చేస్తాయనేది పెట్ లవర్స్ మాట. ఆదివారం నెక్లెస్ రోడ్డులో తమ పెంపుడు శునకాలతో సహా వచ్చిన వాటి యజమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.