డాగ్స్ spot | Dogs spot | Sakshi
Sakshi News home page

డాగ్స్ spot

Published Wed, Apr 8 2015 10:51 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

డాగ్స్  spot - Sakshi

డాగ్స్ spot

ఆదివారం వస్తోందంటే వాటికి పండుగే. ఎంచక్కా టామీతో కులాసాగా షికార్లు  కొట్టొచ్చని పప్పీ... జూలీతో జాలీగా ఎంజాయ్ చేయొచ్చని జాకీ.. తెగ ఆరాటపడుతుంటాయి. మనం ఆదివారం కోసం ఎదురు చూడటంలో అర్థం ఉంది. మరి స్కూలు, ఆఫీసు ఎరుగని శునకాలు కూడా ఆ రోజు కోసం ఎందుకంత ఆరాటంగా ఎదురుచూస్తున్నాయంటే మాత్రం.. దానికో కారణం ఉంది. ఎవ్రీ సండే వాటి యజమానులతో కలసి.. అందంగా ముస్తాబై నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌కు ఎదురుగా ఉన్న చిన్నపార్క్‌కు వచ్చేస్తాయి. ఇవే కాదు నగరం నలుమూలల నుంచి ఎన్నో శునకాలు ఈ ‘డాగ్స్ స్పాట్’కు చేరుకుంటాయి. ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు తోటి కుక్కలతో ఆటలాడుకుంటాయి... సరదాగా పోట్లాడుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే
 మస్తీ మజా చేసేస్తాయి.
 ..:: వాంకె శ్రీనివాస్
 
గాంధీనగర్‌కు చెందిన సన్నీ ఓ రోజు తన డ్యూక్ (కుక్క)ను పట్టుకుని నెక్లెస్‌రోడ్ మీదుగా వెళ్తున్నాడు. అదే టైంలో ఓ పెద్దాయన రాందాస్‌తో సన్నీకి పరిచయమైంది. వీరిద్దరూ ఇక్కడ ముచ్చట ్లలో ఉండగానే.. రాందాస్ చేతిలో ఉన్న మరో కుక్క (బాండ్), డ్యూక్‌తో సరదాగా ఆటలాడుకుంది. ఈ సీన్ ఇద్దరిలో కొత్త ఆలోచనకు నాంది పలికింది.ప్రతి ఆదివారం నెక్లెస్‌రోడ్‌కు కుక్కలను జాగింగ్‌కు తీసుకురావాలని అందులో కోరారు. మీ పెట్స్‌కు ఇంతకన్నా మంచి వీకెండ్ గిఫ్ట్ మరొకటి మీరివ్వలేరని ప్రచారం చేశారు. ప్రతివారం కుక్కలు కలుస్తుండటం వల్ల వాటి ప్రవర్తనలో మార్పు కూడా వస్తుందని అప్పీల్ చేశారు.
 
పోటీగా ఆటలు..


సన్నీ అండ్ రాందాస్ ఆలోచన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మొదట రెండు కుక్కలతో మొదలైన సండే సందడి.. ఇప్పుడు 70 శునకాలకు చేరుకుంది. సిటీ శివారు ప్రాంతాల నుంచి కూడా పెట్ లవర్స్ తమ శునకాలను తీసుకుని నెక్లెస్ రోడ్‌కు చేరుకుంటున్నారు. దీంతో ప్రతి ఆదివారం లాబ్‌రీడర్, జర్మన్ షెఫర్డ్, బిగిల్, పగ్, రాడ్విల్లర్.. ఇలా వివిధ జాతుల కుక్కలు నెక్లెస్ రోడ్‌లో ఆడిపాడేసుకుంటున్నాయి. తోటి శునకాలతో కలసి పోటీ పడిమరీ పరిగెత్తుతున్నాయి.
 
మూడు గంటల పాటు ఫుల్‌గా  ఎంజాయ్ చేస్తున్నాయి. ఫ్యామిలీ అనుబంధం...


ఇక్కడికి వచ్చిన శునకాలే కాదు.. వాటిని తమ వెంట తీసుకుని వచ్చిన యజమానులకూ కొత్త పరిచయాలు సరికొత్త ఆనందాన్ని పంచుతున్నాయి. మొదటి వారం ముఖ పరిచయంతో వెనుదిరుగుతున్న పెట్ లవర్స్.. రెండు, మూడు వారాలు అయిపోయే సరికి మంచి మిత్రులుగా మారుతున్నారు. ఒకరి ఇంటికి  మరొకరు వెళ్లి పలకరించుకునే స్థాయికి చేరుకుంటోంది వీరి స్నేహం. అంతేకాదు, అలా వాళ్ల ఇంటికి వెళ్లేటప్పుడు తమ కుక్కను కూడా వెంటబెట్టుకుని మరీ వెళ్తున్నారు. ఇక ఎవ్రీ సండే కుక్కలు చేసే విన్యాసాలతో రిలీఫ్ అవుతున్నారు వాటి ఓనర్లు. ‘కుక్కలు లేనివారు కూడా ఎందరో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అవి చేస్తున్న ఫీట్లు చూసి.. వారూ కుక్కలను పెంచుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరికొందరు మేలుజాతి కుక్కల సమాచారం తెలుసుకుంటున్నార’ని చెబుతున్నారు సన్నీ. మొత్తానికి సిటీలో కొత్తగా మొదలైన డాగ్ స్పాట్ శునకాలకే కాదు, వాటి యజమానులకు కూడా సరికొత్త జాలీ స్పాట్‌గా మారిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement