హృతిక్ రోషన్ కు సుజానే విడాకులు!
హృతిక్ రోషన్ కు సుజానే విడాకులు!
Published Fri, Dec 13 2013 8:13 PM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుజానేలు 13 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. నాతో విడిపోవడానికి సుజానే నిర్ణయించుకుంది అని హృతిక్ ఓ ప్రకటనలో తెలిపారు. దాంతో మా 17 సంవత్సరాల రిలేషన్‌కు తెరపడింది అని హృతిక్ వెల్లడించారు. తమ కుటుంబానికి ఈ విషయం జీర్ణించుకోలేనిది. తమ ప్రైవసీకి భంగం కలిగించకూడదని హృతిక్ మీడియాకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 13 ఏళ్ల దాంపత్య జీవితంలో హృతిక్, సుజానేలకు రెహాన్(7), హ్రిదాన్(5) ఇద్దరు కుమారులున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ ఖాన్ కూతురైన సుజానేతో హృతిక్ వివాహం 2000 సంవత్సరంలో జరిగింది.
గత కొద్దికాలంగా హృతిక్, సుజానేలు విడిపోతున్నారంటూ వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే గత మూడు నెలలుగా వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నట్టు సమాచారం. అంతేకాకుండా పబ్లిక్ ఫంక్షన్లో కూడా వీరిద్దరూ కనిపించలేదు. హృతిక్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు సుజానే దూరంగా ఉంది. సెప్టెంబర్‌లో రాకేశ్ రోషన్ జన్మదినం సందర్భంగా ఇలా కనిపించి అలా మాయమైందని వార్తలు వెలువడ్డాయి.
Advertisement
Advertisement