హృతిక్ రోషన్కు విడాకులు మంజూరు | Hrithik Roshan, Sussanne Khan now legally divorced | Sakshi
Sakshi News home page

హృతిక్ రోషన్కు విడాకులు మంజూరు

Published Sat, Nov 1 2014 2:30 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

హృతిక్ రోషన్కు విడాకులు మంజూరు - Sakshi

హృతిక్ రోషన్కు విడాకులు మంజూరు

ముంబై: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ దంపతుల 17 ఏళ్ల బంధం నేటితో పూర్తిగా తెగదెంపులైంది. శనివారం బాంద్రా కోర్టు హృతిక్, సుసాన్నెలకు విడాకులు మంజూరు చేసింది. హృతిక్ న్యాయవాది దీపేష్ మెహతా ఈ విషయాన్ని వెల్లడించారు.

హృతిక్, సుసాన్నెల మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది విడిపోయారు. అప్పటి నుంచి వేర్వేరుగా నివసిస్తున్నారు. హృతిక్ నుంచి సుసాన్నె వంద కోట్ల రూపాయల భరణం కోరినట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే సుసాన్నె వీటిని ఖండించింది. హృతిక్ దంపతులకు ఇద్దరు పిల్లలు రేహన్, హృదన్ ఉన్నారు. పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులకు ఇద్దరికీ సంయుక్తంగా అప్పగించినట్టు న్యాయవాది చెప్పారు. హృతిక్ 2000 వ సంవత్సరంలో సుసాన్నెను పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు నాలుగేళ్ల పాటు వీరు డేటింగ్ చేశారు. గతేడాది డిసెంబర్లో హృతిక్ తన భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి వేరుగా నివసిస్తున్నా, ఇప్పుడు చట్టబద్ధంగా విడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement