sussanne khan
-
హైదరాబాద్‌లో బిజినెస్ మొదలుపెట్టిన హృతిక్ రోషన్ మాజీ భార్య (ఫోటోలు)
-
ప్రేమించుకున్నారు.. గొడవపడ్డారు.. అంతా వాళ్లే!: హృతిక్ రోషన్ తండ్రి
ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు.. తర్వాత విడాకులు తీసుకున్నవారు చాలామందే ఉన్నారు. ఆ జాబితాలో బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan)- సుజానే (Sussanne Khan) దంపతులు కూడా ఉన్నారు. సినిమాల్లోకి రాకముందే హృతిక్ సుహానేను ప్రేమించాడు. 2000వ సంవత్సరంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాడు. ఈ దంపతులకు హ్రెహాన్, హృదాన్ అని ఇద్దరు కుమారులు సంతానం. విడాకుల తర్వాత స్నేహితులుగా..తర్వాత ఏమైందే ఏమో కానీ 2014లో హృతిక్- సుజానే విడిపోయారు. అలా అని శత్రువులుగా మిగిలిపోకుండా మంచి మిత్రులుగా తమ మధ్య అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హృతిక్.. నటి సబా ఆజాద్‌తో ప్రేమలో ఉండగా సుజానే.. అర్స్‌లన్ గోనీతో లవ్‌లో ఉంది. ఈ రెండు ప్రేమ జంటలు తరచూ షికార్లకు, డిన్నర్ డేటింగ్‌కు వెళ్తూ మీడియాకు చిక్కుతూ ఉంటారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్- సుజానే విడిపోవడానికి కారణం ఏమై ఉంటుందన్నది చాలామందికి ప్రశ్నగానే మిగిలిపోయింది. (చదవండి: మొన్న హీరోయిన్ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా)విడిపోయినంత మాత్రాన..తాజాగా దీనిపై హృతిక్ తండ్రి, దర్శకనిర్మాత, నటుడు రాకేశ్ రోషన్ (Rakesh Roshan) స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. జరిగిందేదో జరిగిపోయింది. విడిపోయినంత మాత్రాన సుజానే మాకు ఏమీ కాకుండా పోదు. ప్రేమించి పెళ్లి చేసుకుంది వాళ్లిద్దరు! అభిప్రాయభేదాలు వచ్చిందీ వారిమధ్యే! అప్పుడు దాన్ని పరిష్కరించుకోవాల్సిందీ వారిద్దరే! ఏదేమైనా తను ఇప్పటికీ మా ఇంటికి వస్తూ ఉంటుంది. తనను మా కుటుంబసభ్యురాలిగానే భావిస్తాం అని చెప్పాడు.నేనంటే భయంకుమారుడు హృతిక్, కూతురు సునయన గురించి చెప్తూ.. వీళ్లిద్దరికీ నేనంటే భయం. అదెందుకో నాకు తెలియదు. ఎవరిమీద పడితే వాళ్లపై అరిచేవాడినీ కాదు, అనవసరంగా తిట్టేవాడినసలే కాదు. కాకపోతే క్రమశిక్షణగా ఉంటాను. చిన్నప్పుడు ఈ పిల్లలిద్దరూ నాతో నిర్భయంగా మాట్లాడేవారే కాదు. కానీ ఇప్పుడు సరదాగా ఉంటారు. అందరం ఫ్రెండ్స్‌లా కలిసిపోయి మాట్లాడుకుంటాం అని చెప్పుకొచ్చాడు. రాకేశ్ రోషన్ ఫ్యామిలీపై ఇటీవల ద రోషన్స్ అని డాక్యుమెంటరీ రిలీజైంది. ఇకపోతే రాకేశ్ గతంలో గొంతు క్యాన్సర్‌తో పోరాడి గెలిచాడు.చదవండి: 300 కోట్ల బడ్జెట్.. హీరోగా సూర్య లేదా చరణ్, నో చెప్పిన దర్శకుడు! -
విడాకుల తర్వాత మరొకరితో లవ్.. సంతోషంగా ఉందన్న తల్లి
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుజానే ఖాన్.. చిన్ననాటి స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు కలిసున్నారు. పరిస్థితులు తారుమారవడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. హృతిక్ మరో హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపించడం వల్లే ఈ జంట విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి.విడాకుల తర్వాత ప్రేమలో..అయితే విడాకులు తర్వాత ఇద్దరూ శత్రువుల్లా మారిపోకుండా పిల్లల కోసం ఫ్రెండ్స్‌గా ఉన్నారు. అలాగని ఒంటరిగానూ మిగిలిపోలేదు. అటు హృతిక్.. నటి సబా ఆజాద్‌తో ప్రేమలో పడగా ఇటు సుజానే.. నటుడు అర్స్‌లన్ గోనిని లవ్ చేస్తోంది. తాజాగా సుజానే ప్రేమాయణం గురించి ఆమె తల్లి జరీన్ మాట్లాడింది. సుజానే పార్ట్నర్ అర్స్‌లన్ న్యాయవిద్యను అభ్యసించాడు. జమ్ములో పేరున్న రాజకీయ కుటుంబానికి చెందినవాడు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టం. పెళ్లి చేసుకోవాలనేం లేదునటనారంగంలోనూ తను రాణించాలని ఆశిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులు కూడా ఎంతో మంచివారు! సుజానే, అర్స్‌లన్ కలిసి ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఒకరితో మనకు సంతోషం దక్కుతుందంటే మంచిదే కదా.. అలా అని పెళ్లి చేసుకుంటే ఆ సంతోషం కంటిన్యూ అవుతుందనేం లేదు. అర్స్‌లన్, సుజానేలు వారి కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నారు. వారిని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది.చదవండి: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు.. ఎంత గొప్ప మనసో! -
11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్ కపుల్.. కుమారుడి కోసం (ఫొటోలు)
-
బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడనున్న హీరో మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 14ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత హృతిక్- సుసానే ఖాన్లు 2014లో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హృతిక్ బాలీవుడ్ నటి, సింగర్ సబా అజాద్‌తో డేటింగ్ చేస్తుండగా, సుసానే ఇప్పుడు అర్స్లాన్ గోనీతో పీకల్లోతు ప్రేమలో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వీరుద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. సుసానేకు ఇది రెండో వివాహం. వీరి పెళ్లి చాలా సింపుల్‌గా జరగనుందని సమాచారం.అయితే వివాహ వేడుక, తేది ఎప్పుడన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బీటౌన్‌లో అందరికి తెలిసిందే. తరచూ వీరిద్దరు ముంబై రోడ్లపై చట్టపట్టాలేసుకుని తిరగడం,డిన్నర్ డేట్స్‌కు,పార్టీలకూ జంటగానే హాజరయ్యేవారు. అంతేకాకుండా బర్త్‌డే లాంటి స్పెషల్ డేస్‌లోనూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగానే ప్రేమను వ్యక్తపరిచేవారు. అయితే ఇప్పుడీ జంట పెళ్లిపీటలెక్కుతుందని వార్తలు రావడంతో మరి హృతిక్- సబా అజాద్‌లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
మాజీ భర్త హృతిక్ గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్‌పై సుసానే ఆసక్తికర కామెంట్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ విడాకుల అనంతరం యంగ్ నటి సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నాడే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ హృతిక్, సబా ఈ రూమర్లపై ఇప్పటి వరకు నోరు విప్పలేదు. తరచూ వీరిద్దరు ముంబై రోడ్లపై చట్టపట్టాలేసుకుని తిరగడం, డిన్నర్ డేట్స్‌కు, జంటగా పార్టీలకు హజరవుతున్నారు. దీంతో ఈ వార్తలు నిజమే అంటూ బి-టౌన్లో గుసగులాడుకుంటున్నారు. మరోపక్క హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్ కూడా మరో నటుడితో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. చదవండి: ఆ నిర్మాత నన్ను నా ఫ్యామిలీని బెదిరించాడు: చాందిని చౌదరి తరచూ ఆమె, నటుడు అర్స్లాన్ గోనితో చట్టాపట్టాలేసుకుని ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. అంతేకాదు ఈ మాజీ కపుల్స్ తమ కొత్త పార్ట్‌నర్స్‌తో ఒకే పార్టీలో సందడి చేస్తున్నారు. వారి తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తన మాజీ భర్త రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌ను సుసానే నిక్ నేమ్‌తో పిలిచి అందరికి షాకిచ్చింది. ఇటీవల సబా ఆజాద్ షేర్ చేసిన ఓ పోస్ట్‌పై సుసానే కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సబా మిర్రర్ ముందు హోయలు పోతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. చదవండి: ట్రోలర్స్‌కు షాకిచ్చిన ప్రభాస్, స్టైలిష్ లుక్‌లో ‘డార్లింగ్’ ‘దీనికి సరిపోయే స్మార్ట్ క్యాప్షన్ ఏంటో రావడం లేదు’ అంటూ పంచుకుంది. ఇక ఈ పోస్ట్‌పై సుసానే స్పందిస్తూ ‘వావ్ సబూ.. హాట్‌గా ఉన్నావ్’ అంటూ కామెంట్ చేసింది. తన మాజీ భర్త గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్‌కు ససానే ఈ విధంగా స్పందించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆమె రియాక్షన్ చూసి పలువురు షాకవడమే కాకుండా.. సబాకు నిక్ నేమ్ కూడా పెట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ 50వ బర్త్‌డేకు హృతిక్, సబాతో జంటగా హజరయ్యాడు. ఈ సందర్భంగా సబాను తన గర్ల్‌ఫ్రెండ్ అంటూ పరిచయం చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Saba Azad (@sabazad) -
పార్టీ టైమ్: ప్రియురాలితో హృతిక్, ప్రియుడితో హీరో మాజీ భార్య
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బుధవారం(మే 25న) 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్ వంటివారికి సైతం ఆహ్వానాలు అందాయి. అటు బాలీవుడ్ హీరోహీరోయిన్లతో పాటు స్టార్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ సైతం హాజరయ్యారు. అంతేకాదు మాజీ దంపతులు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు కలిసి ఫొటోలకు పోజులిస్తూ పార్టీలో సందడి చేశారు. అలాగే మాజీ దంపతులు హృతిక్ రోషన్, సుశానే ఖాన్ వారి లవర్స్‌తో పార్టీలో తళుక్కుమని మెరిశారు. హృతిక్ ప్రేయసి సబా ఆజాద్‌ను వెంటేసుకుని రాగా, సుశానే తన ప్రియుడు అర్శ్లన్ గోనీతో విందుకు హాజరైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by kaunbolaabollywood (@kaunbolaa_bollywood) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి 👇 బంపరాఫర్, సామాన్యులకు బిగ్‌బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ విడాకుల తర్వాత కలిసి కనిపించిన మాజీ స్టార్ కపుల్ -
హాట్‌టాపిక్.. ప్రియురాలితో హృతిక్ రోషన్.. పక్కనే మాజీ భార్య కూడా!
బాలీవుడ్ మాజీ దంపతులు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ ఒకే పార్టీలో జంటలుగా సందడి చేసిన ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నారు. సీనియర్ నటి పూజ బేడీ గోవాలో హోస్ట్ చేసిన ఈ పార్టీకి హృతిక్ రోషన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సబా అజాద్ హజరయ్యాడు. అలాగే సుసాన్నే ఖాన్ తన రూమార్డ్ బాయ్‌ఫ్రెండ్ అర్స్లాన్ గోనితో పాల్గొంది. దీంతో మరోసారి ఈ మాజీ దంపతులు వార్తల్లో నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజ బేడీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేసింది. చదవండి: ప్రభాస్ పెళ్లి చేసుకునేంత వరకు నేనూ పెళ్లి చేసుకోను: బిగ్‌బాస్ బ్యూటీ దీంతో ఈ పొటోలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కాగా మంగళవారం రాత్రి ఈ లవ్‌బర్డ్స్ జంటలుగా ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోల్లో హృతిక్ తన గర్ల్‌ఫ్రెండ్ సబా అజాద్ చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ కనిపించాడు. అలాగే సుసాన్నే సైతం తన ప్రియుడు అర్స్లాన్ గోని చేతిలో చేయి వేసుకుని ఎయిర్పోర్ట్ లోపలికి వెళుతూ కనిపించింది. దీంతో ఈ మాజీ దంపతులు కొత్త జంటలతో ఒకే పార్టీకి హాజరుకావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. చదవండి: హైదరాబాద్ పబ్ డ్రగ్స్ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) కాగా ఈ పార్టీకి వీరితో పాటు ఫరా ఖాన్ అలీ, దర్శకుడు అభిషేక్ కపూర్లతో పాటు తదితర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా షారుక్, సబాలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్‌పై ఈజంట ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీరిద్దరు మంచి స్నేహితులే అంటూ హృతిక్ సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరోవైపు సుసానే ఖాన్ కొంతాకాలంగా అర్స్లాన్ గోనితో సీక్రెట్ డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బర్త్‌డే పార్టీ, మాజీ భార్యతో హృతిక్ రోషన్ సెల్ఫీ
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఆయన మాజీ భార్య సుశానే ఖాన్‌ను కలిశాడు. అంతేకాదు, ఆమెతో కలిసి సెల్ఫీ కూడా దిగాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం హృతిక్ రోషన్ సోదరి సునయన బర్త్‌డే జరుపుకుంది. ఈ బర్త్‌డే పార్టీకి హృతిక్ మాజీ భార్య సుశానే ఖాన్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా బర్త్‌డే గర్ల్‌తో పాటు మాజీ భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. 'కొన్ని బంధాలకు అంతం లేదు, అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. డార్లింగ్ నిక్కూ.. నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ హృతిక్, సునయనలను ట్యాగ్ చేసింది. వారి ముఖంపై కనిపిస్తున్న చిరునవ్వులే వారి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా హృతిక్, సుశానే ఖాన్లు 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ తర్వాత 2014లో ఈ దంపతులు విడిపోయారు. -
స్టార్ హీరో మాజీ భార్యకు కరోనా.. పెద్ద మొండిఘటం
Sussanne Khan Test Positive For Covid 19: బాలీవుడ్లో కరోనా కల్లోలం ఏమాత్రం తగ్గట్లేదు. రోజురోజూకీ ఉగ్రరూపం దాల్చుతోంది కొవిడ్ మహమ్మారి. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. తాజాగా బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ మాజీ భార్య, ఇంటీరియర్ డిజైనర్ సుసనే ఖాన్ కొవిడ్ బారిన పడింది. మంగళవారం తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా కరోనా సోకినట్లు చెప్పుకొచ్చింది. 'కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్న తర్వాత మూడో సంవత్సరం ఈ మొండిఘటమైన ఒమిక్రాన్ నా రోగనిరోధక వ్యవస్థలోకి చొరబడింది. నేను సోమవారం రాత్రి పరీక్ష చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఇది చాలా ప్రమాదకరమైంది. దయచేసి అందరూ సురక్షితంగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి.' అని పోస్ట్ పెట్టింది సుసనే. ఈ పోస్ట్‌కు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సుసనే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 'త్వరగా కోలుకోండి' అని బ్యూటీ బిపాసా బసు రాయగా, 'మీరు త్వరలో కోలుకుంటారు' అని సుసనే సోదరి ఫరా ఖాన్ అలీ కామెంట్ పెట్టారు. ఇదిలా ఉంటే జనవరి 10న హృతిక్ బర్త్‌డే సందర్భంగా సుసనే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. 'నువ్ చాలా అద్భుతమైన తండ్రివి. నీలాంటి తండ్రి ఉండటం రే అండ్ రిడ్జ్‌ల అదృష్టం. నీ కలలన్నీ నెరవేరుతాయి. ఇప్పటికీ ఎప్పటికీ బిగ్ హగ్' అని సుసనే విష్ చేసింది. View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) ఇదీ చదవండి: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది -
ఆ నటుడితో స్టార్ హీరో మాజీ భార్య లవ్ ఎఫైర్!, ఇదిగో ఫ్రూఫ్
కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ నటుడు అర్స్లాన్ గోనితో ప్రేమలో మునిగితేలుతొందంటూ బీ-టౌన్లో గుసగులు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌తో విడాకుల అనంతరం అర్స్లాన్ గోనితో ఆమె సన్నిహితంగా ఉండటంతో ఈ రూమర్లకు బీజం పడింది. అయితే దీనిపై ఇంతవరకు సుసానే ఖాన్ కానీ అర్స్లాన్ గోని కానీ స్పందించలేదు. ఈ రూమర్లను కూడా వారెప్పుడు ఖండించలేదు. ఈ క్రమంలో అర్స్లాన్ గోని, సుసానే రూమార్డ్ బాయ్‌ఫ్రెండ్‌గా మీడియాలో పేర్కొంటున్నారు. చదవండి: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే.. ఇదిలా ఉంటే వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారనడానికి సుసానే తాజా పోస్ట్ మరోసారి ఉదాహరణగా నిలిచింది. డిసెంబర్ 20న అర్స్లాన్ గోని బర్త్‌డే. ఈ సదర్భంగా సుసానే అతడితో క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే. నీ జీవితంలో నీవు కోరుకునేవన్నీ ఉండాలని, స్వచ్ఛమైన ప్రేమ నీ చుట్టూ ఉండాలని కోరుకుంటున్నా. నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూసిన ఒక అందమైన శక్తివి నీవు' అంటూ రాసుకొచ్చింది. దీనికి గోనీ స్పందిస్తూ.. ‘లవ్ యూ’ అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ పోస్టు కొందరూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ పోస్ట్‌కు కొందరు మద్దతుగా కామెంట్ చేస్తుండగా.. చదవండి: పుష్ప స్పెషల్ సాంగ్‌పై సమంత హాట్ కామెంట్స్, సెక్సీగా కనిపించాలంటే.. మరికొందరూ విమర్శిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అక్టోబర్‌లో సుసానే పుట్టినరోజు సందర్భంగా గోనీ కూడా ఇదే విధంగా స్పందించాడు. ‘హ్యాపీ బర్త్ డే డాలింగ్. నీ జీవితం అద్భుతంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. నా జీవితంలో నేను చూసిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తివి నీవు. నీవు కోరుకున్నదంతా భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. లాట్స్ ఆఫ్ లవ్' అంటూ గ్రీటింగ్స్ చెప్పాడు. కాగా హృతిక్ రోషన్ చిన్ననాటి స్నేహితురాలైన సుసానేను 2000 సంవత్సరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే విభేదాల వల్ల 2014లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) -
స్టార్ హీరో షర్ట్‌లెస్ ఫొటో.. 21 ఏళ్ల వాడిలా ఉన్నావన్న మాజీ భార్య!
ముంబై: ఫిట్నెస్ విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీల అందరి కంటే ఓ అడుగు ముందే ఉంటాడు స్టార్ హీరో హృతిక్ రోషన్. 47 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ కండలు తిరిగిన దేహంతో తనకు తానే సాటి నిరూపించుకుంటున్నాడు. అందంతో, అదరగొట్టే డ్యాన్సులతో అభిమానుల మనసు కొల్లగొట్టే.. ఈ ‘గ్రీక్‌గాడ్’కు సంబంధించిన ఓ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్.. ఈ షర్ట్‌లెస్ ఫొటోపై చేసిన కామెంట్ అభిమానులను మరింతగా ఆకర్షిస్తోంది. ఫ్యాన్ పేజ్ షేర్ చేసిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న హృతిక్... ‘గుడ్ క్యాచ్’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు స్పందించిన సుసానే.. ‘‘నువ్వు 21 ఏళ్ల వాడిలా కనిపిస్తున్నావు’’ అంటూ తన ప్రియమైన ‘స్నేహితుడి’పై అభిమానం చాటుకున్నారు. కాగా చిన్ననాటి స్నేహితులైన హృతిక్- సుసానే 2000, డిసెంబర్ 20న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు హ్రేహాన్, హ్రిధాన్. ఇక బీ-టౌన్ జంటల్లో ఎంతో అన్యోన్య దంపతులుగా పేరొందిన వీరు.. అభిప్రాయ భేదాల కారణంగా 2014లో విడాకులు తీసుకుని అభిమానులకు షాకిచ్చారు. అయితే భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కొడుకుల కోసం స్నేహితుల్లా కొనసాగుతున్నారు. పిల్లల పుట్టినరోజు లాంటి వేడుకలను కలిసి జరిపిస్తూ.. మంచి తల్లిదండ్రులు అనిపించుకుంటున్నారు. చదవండి: భార్య ఉండగా హీరోయిన్‌తో హృతిక్ రోషన్ ప్రేమాయణం! View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
ఆ హీరోయిన్ వల్లే భార్యకు హృతిక్ రోషన్ విడాకులు!
‘ఆయన గొప్ప నటుడు.. మంచి మనసున్న మనిషి. మహా అందగాడు. ఏ అమ్మాౖయెనా అతనితో ఇట్టే ప్రేమలో పడిపోతుంది’ అని చెప్పింది బార్బరా మోరీ.. హృతిక్ రోషన్ గురించి. ఆమె మెక్సికో దేశస్తురాలు. ‘కైట్స్’ అనే హిందీ సినిమాలో నటించింది హృతిక్ రోషన్ సరసన. ఈ ఉపోద్ఘాతంతో అర్థమైపోయి ఉంటుంది ఈ వారం మొహబ్బతే కథానాయిక, నాయకులెవరో! ‘కైట్స్’ సినిమా.. హృతిక్ రోషన్ వాళ్ల హోమ్ ప్రొడక్షన్. దర్శకుడు అనురాగ్ బసు. ప్రధాన నాయికగా బార్బరా మోరీ. మరో హీరోయిన్ కంగనా రౌనత్. అసలు విషయంలోకి వస్తే.. కైట్స్ సినిమా కోసం బార్బరా మోరీ ముంబై వచ్చింది. ఆమెకు కొత్త అయిన ఈ దేశంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత సహజంగానే హృతిక్ రోషన్ కుటుంబం తీసుకుంది. అద్దెకు సర్వీస్ అపార్ట్మెంట్ నుంచి రాకపోకలకు వాహనాన్ని ఏర్పాటు చేయడం వరకు అన్నీ హృతిక్ రోషనే దగ్గరుండి చూసుకున్నాడు. వాటన్నిటినీ నోట్ చేసుకుంది మీడియా. షూటింగ్ మొదలైంది... సినిమా కంటే ముందే మొదలైన హృతిక్ రోషన్, బార్బరా స్నేహం ఆన్ సెట్స్‌లోనూ కొనసాగింది. కైట్స్ చాలా వరకు అమెరికా, మెక్సికో దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ ప్యాకప్ అయ్యాక కబుర్లు, వాహ్యాళి, లాంగ్ డ్రైవ్‌లతో కాలక్షేపం చేసేవారిద్దరూ. వీటన్నిటినీ ఫొటో జర్నలిస్ట్‌లు రికార్డ్ చేశారు. ఒక్కొక్కటిగా ప్రచురించాయి పత్రికలు. కైట్స్ కన్నా వాళ్ల ప్రేమ కథే ముందు విడుదలైంది. సుజైన్ ఖాన్ కూడా ఆ ప్రేమ చిత్రం వార్తలు విన్నది. బాధ పడింది. భర్త బార్బరాతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడన్న వదంతుల గురించి. హృతిక్ ఆమెకు చిన్ననాటి స్నేహితుడు. ఇష్టపడి.. రెండు కుటుంబాలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల అన్యోన్య దాంపత్యం బాలీవుడ్లో చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి జంట మధ్య బార్బర చిచ్చు పెడుతోందనే వ్యాఖ్యానాలూ సుజైన్కు చేరాయి. ఆ బాధనే హృతిక్‌తో పంచుకుంది. భరోసా ఇచ్చాడు అతను. వాళ్ల కాపురం గురించి పత్రికల వాళ్లు గుచ్చిగుచ్చి అడిగినప్పుడు ‘రబ్బిష్. మీడియా క్రియేట్ చేసే ఈ రూమర్స్‌తోనే ఇద్దరం అప్సెట్ అవుతున్నాం తప్ప మా మధ్య ఎలాంటి గొడవలూ లేవు. ఎవరో చిచ్చు పెడితే బ్రేక్ అయిపోయేంత బలహీనం కాదు మా బంధం. చాలా స్ట్రాంగ్ ’ అని సమాధానమిచ్చింది సుజైన్. సినిమా సంగతికొస్తే.. కైట్స్ రిలీజ్ అయింది. పెద్దగా ఆడకపోయినా బార్బరా, హృతిక్ ఆన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చింది. ఆ కెమిస్ట్రీ వాళ్ల జీవితంలోనూ కొనసాగింది. నిజంగానే ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. హృతిక్ చాలాసార్లు మీడియా ముఖంగా బార్బరాను స్తుతించాడు. ‘బార్బరా నన్ను అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ అర్థం చేసుకోలేదు. రియల్ ఫ్రెండ్ అంటే తనే’ అంటూ. ఈ డాట్స్ అన్నిటినీ కలుపుకొంటూ ఆ ప్రేమ కథను మరింత చిక్కగా అల్లింది మీడియా. సాక్ష్యాలుగా బార్బరా వాడే వేనిటీ వ్యాన్‌ను చూపించింది. అత్యంత విలాస వంతమైన ఆ వాహనాన్ని హృతిక్ రోషనే కానుకగా ఇచ్చాడని.. దాని ధర దాదాపుగా రెండు కోట్లుంటుందనీ రాసింది. అంతేకాదు బార్బరా కోసం తీసుకున్న సర్వీస్ అపార్ట్మెంట్ అద్దెనూ హృతికే చెల్లించేవాడనీ చెప్పింది. బార్బరా ముంబైలో ఉన్నప్పుడు రాకేష్ రోషన్ వాళ్లింట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా హాజరయ్యేదనీ యాడ్ చేసింది. ఈ వివరాల్లో కొన్నిటినీ హృతిక్ ప్రవర్తనతో సరిపోల్చుకున్నట్టుంది సుజైన్. నిజాన్ని గ్రహించినట్టుంది. మొత్తం విషయం అర్థమైంది. ‘ఇక మనం కలసి ఉండడం కుదరదు’ అని తనిల్లు అనుకున్న ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది పిల్లలను తీసుకొని. ఇరువైపు పెద్దలు వాళ్లిద్దరి మధ్య సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ సయోధ్య కుదరలేదు. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. బార్బరా మోరీ, హృతిక్ రోషన్ల మధ్య ఉన్న ప్రేమా నిలువ లేదు. కైట్స్ సమయంలో సుజైన్.. బార్బరాకూ మంచి స్నేహితురాలైంది. తన వల్ల ఆమె బాధ పడిందని, చక్కటి జంట విడిపోయిందనే అపరాధ భావం బహుశా బార్బరాను వెంటాడి ఉండొచ్చు.. అందుకే హృతిక్‌తో తెగతెంపులు చేసుకొని ఉంటుంది. తను దూరమైతే హృతిక్ మళ్లీ సుజైన్కు దగ్గరవుతాడని బార్బరా అనుకొని ఉండొచ్చు అంటారు హృతిక్ సన్నిహితులు. కానీ ఆ ఆలుమగల మధ్య స్పర్థలకు బార్బర మాత్రమే కారణం కాదు.. బార్బరా కూడా ఒక కారణం అంటారు. వాళ్లన్నట్టుగానే బార్బరా వెళ్లిపోయినా హృతిక్, సుజైన్ మళ్లీ కలవలేదు. మంచి స్నేహితులుగా, పిల్లలకు ఏ లోటూ రానివ్వని తల్లిదండ్రులగా కొనసాగుతున్నారు అంతే! - ఎస్సార్ చదవండి: తెరవెనుక మహేశ్, ప్రభాస్ అలా ఉంటారు : సుబ్బరాజు -
హృతిక్ రోషన్ మాజీ భార్య పోస్టుపై బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్ వైరల్!
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్ మాజీ భార్య, ది చార్కోల్ ప్రాజెక్ట్ అధినేత సుసానే ఖాన్ మంగళవారం కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్‌ను తీసుకున్నారు. తనతో పాటు తన టీం అందరికీ వ్యాక్సిన్ వేయించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్ చేశారు. 'కోవిషీల్డ్ రెండవ డోస్‌ను తీసుకున్నాను. ‘‘నాతో పాటు నా చార్కోల్ టీం 50 మందికి టీకాలు వేశారు. ఇందుకు సహకరించిన నా సోదరి సిమోన్ అరోరా, సోదరుడు అజయ్ అరోరారు ధన్యవాదాలు. ప్రతి ఒక్క భారతీయుడికి టీకాలు త్వరగా అందాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను'’ అని పేర్కొంది. ఇక సుసానే ఖాన్ పోస్టుపై ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న అర్స్లాన్ గోని కూడా స్పందించాడు. చప్పట్లు కొడుతున్నట్లున్న ఎమోజీని కామెంట్ రూపంలో తెలియజేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వీరిద్దరి లవ్ ఎఫైర్‌పై గత కొంతకాలంగా రూమర్లు వస్తున్నా ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. అయితే చాలా సార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్యా లవ్ ట్రాక్ నడుస్తుందని బీటౌన్ టాక్. కాగా సుసానే ఖాన్ పోస్టుపై టీవీ నిర్మాత ఏక్తాకపూర్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. తనతో పాటు టీం అందరికి వ్యాక్సిన్ వేయించినందుకు, మీ మనసు మంచిదంటూ ఆమెను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) చదవండి : అరెస్ట్ వార్తలపై స్పందించిన సుసానే ఖాన్ -
అరెస్ట్ వార్తలపై స్పందించిన సుసానే ఖాన్
మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ముంబై విమానాశ్రయం సమీపంలోని డ్రాగన్ ఫ్లై క్లబ్లో దాడి జరిపి, కోవిడ్ నియమాలు ఉల్లంఘించినందుకు గాను ముంబై పోలీసులు 34 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో సురేశ్ రైనా, గురు రంధావా, సుసానే ఖాన్ సహా పలువురు సెలిబ్రిటీలు కూడా ఉన్నారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో మునిసిపాలిటీల పరిధిలో జనవరి 5 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారమే ఆదేశాలు జారీచేసింది. వాటి ప్రకారం నైట్ క్లబ్‌లు, పబ్‌లు రాత్రి 11.30 గంటలకల్లా మూసివేయాలి. అయితే అందుకు విరుద్ధంగా అర్ధరాత్రి తర్వాత కూడా క్లబ్‌ను తెరిచి ఉంచినందుకు నిర్వాహకులను, కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకుగాను అక్కడ ఉన్నా 34 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 27 మంది కస్టమర్లు ఉండగా.. ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో సుసానే ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె స్పందించారు. తనను అరెస్ట్ చేశారంటూ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నారు సుసానే ఖాన్. దీని గురించి తమను లేదా క్లబ్ యాజమాన్యాన్ని సంప్రదించకుండా ఊహాగానాలు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. తమ నుంచి ప్రకటన వచ్చే వరకు ఆగరు.. స్వయంగా వారే ఎంక్వైరీ చేయ్యరు. ఏది తోస్తే అది రాస్తారు.. ఇలాంటి అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తారో తనకు అర్థం కావడం లేదన్నారు సుసానే ఖాన్. ఇక దీని గురించి తానే స్వయంగా వివరణ ఇవ్వాలని భావించానని వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ విడుదల చేశారు సుసానే ఖాన్. దీనిలో ఆమె ‘గత రాత్రి క్లోజ్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో భాగంగా సహార్ జేడబ్ల్యూ మారియట్‌లోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌కి వెళ్లాం. పార్టీ టైం కాస్త ఎక్స్టెండ్ అయ్యింది. ఉదయం 2.30గంటల సమయంలో అధికారులు క్లబ్‌లోకి వచ్చారు. యాజమాన్యాన్ని పిలిచి కొత్త కర్ఫ్యూ నియమాలు గురించి చెప్పి.. ఇంతసేపు ఎందుకు ఒపెన్ చేసి ఉంచారనే తదితర విషయాల గురించి ఎంక్వైరీ చేశారు. అక్కడ ఉన్న వారందరని మరో మూడు గంటల పాటు వెయిట్ చేయాల్సిందిగా కోరారు. ఉదయం 6 గంటలకి మమ్మల్ని బయటకు పంపిచారు. ఇది వాస్తవంగా జరిగింది. ఇక మీడియాలో నేను అరెస్ట్ అయ్యానంటూ వస్తున్న వార్తలు పూర్తిగా బాద్యతారహితమైనవి.. అవాస్తవాలు’ అని పేర్కొన్నారు సుసానే. (చదవండి: రైనా, టాప్ హీరో మాజీ భార్య అరెస్ట్) View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) ఇక ఇందుకు సంబంధించి గురు రంధావా కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. గత రాత్రి జరిగిన సంఘటనకు తాను ఎంతో బాధపడుతున్నానని... కొత్త కర్ఫ్యూ నియమాల గురించి తనకు తెలియదని.. ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని దానిలో వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తానని తెలిపారు. -
వారి కోసం నేను బాధపడను: సూసానే ఖాన్
ముంబై: ‘నన్ను వదిలి వెళ్లిపోయిన వారి కోసం నేను చింతించను. అలా బాధపడుతూ ఒక్కరోజును కూడా వృథా చేయను’ అని బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ పేర్కొన్నారు. అంతేగాక ఇక జీవితంలో ఇక వెనుదిరిగే ప్రసక్తి లేదంటూ నిలిరంగు కోటుతో ఫార్మల్ వేర్ ధరించిన తన ఫొటోను ఆమె బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమె స్ట్రాంగ్ బిజినెస్ ఉమెన్‌లా కనిపించారు. అయితే ఆమెకు స్వయంగా ఇంటిరియల్ డిజైనింగ్ లెబుల్ దీ చార్కోల్ ప్రాజెక్టు ఉన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె బిజినెస్‌కు దూరమయ్యారు. తాజాగా సుసానే తిరిగి తన బిజినెస్‌పై దృష్టి పెట్టారు. (చదవండి: అందుకే హృతిక్ ఇంటికి వెళ్లాను: సుసానే ఖాన్) ఈ నేపథ్యంలో తను స్ట్రాంగ్ బిజినెస్ ఉమెన్‌గా పేర్కొంటూ ఈ తాజాగా ఈ ఫొటోను షేర్ చేసినట్లను తెలుస్తోంది. సుపానే పోస్టుకు హృతీక్ స్పందిస్తూ ‘సూపర్ పిక్ అంటూ’ కామెంట్ పెట్టాడు. దీనికి సుసానె ‘లుక్ అవే లుక్ కోసం ప్రయత్నించాను’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు. అయితే హృతిక్, సుసానేలు 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల 2014లో విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ కరోనా నేపథ్యంలో అమలైన లాక్డౌన్లో వీరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ ఇద్దరూ పిల్లలు హ్రేహాన్, హ్రిధాన్ల కోరిక మేరకు తాత్కాలికంగా తాము ఒకే ఇంట్లో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. View this post on Instagram If you leave I won’t cry... I won’t waste a single day.. 🦋😊#neverlookback #eaglesnestwarmth A post shared by Sussanne Khan (@suzkr) on Sep 15, 2020 at 9:47am PDT -
అందుకే ఆ ఇంటికి వెళ్లా: స్టార్ హీరో మాజీ భార్య
ముంబై: ‘‘కోవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించిన సమయంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు బయటకు వచ్చాయి. అప్పుడే హృతిక్, నేనూ ఒకే ఇంట్లో ఉండాలని నిశ్చయించుకున్నాం. మా కోసం, మా కొడుకుల కోసం మేం తీసుకున్న తెలివిగల నిర్ణయం ఇది. ఎవరికీ ఇబ్బంది కలగకూడదని భావించాం’’ అని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ పేర్కొన్నారు. కుమారులు హ్రేహాన్, హ్రిధాన్ కోసమే తాను మాజీ భర్త ఇంటికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఈ లాక్డౌన్ సమయాన్ని తన జీవితంలో వచ్చిన మార్పులు, తన గురించి తాను తెలుసుకునేందుకు ఉయోగించుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.(అస్సలు ఊహించలేదు...: హృతిక్ రోషన్) ‘‘మనల్ని మనం తెలుసుకోవడానికి.. ప్రతీ విషయాన్ని వివిధ కోణాల నుంచి చూసేందుకు ఇదొక వేకప్ కాల్ లాంటిది. మనకు ప్రియమైన వాళ్లు, సహచరులతో బంధాన్ని మరింతగా పెంచుకునే అవకాశం కల్పించింది. ఎక్కడ.. ఎప్పుడు ఏ చోట ఉన్నా దయతో మెలగడం, నిస్వార్ధంగా సేవ చేయడం గురించి మరింత లోతుగా తెలియజేస్తోంది. అందమైన జ్ఞాపకాలు పదిలపరుచుకునే వీలు కల్పించింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునప్పుడో.. మంచం మీద పడుకుని ఉన్నపుడో.. మన బట్టలు మనమే ఉతుక్కున్నపుడో.. బొమ్మలు గీస్తున్నపుడో.. మేడ మీద చెట్లకు నీళ్లు పట్టినపుడో మనల్ని మనమే పొగుడుకునే సమయాన్ని ఇచ్చింది. లాక్డౌన్ తర్వాత కూడా వీటన్నింటినీ పాటించాలని నేను నిర్ణయించుకున్నా’’ అని లాక్డౌన్ సమయాన్ని తాను ఆస్వాదిస్తున్న తీరును సుసానే వోగ్‌తో పంచుకున్నారు. (రే... నువ్వు అత్యంత అద్భుతమైన వ్యక్తివి!) కాగా విడాకులు తీసుకున్నప్పటికీ హృతిక్, సుసానే మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ కుమారులకు సంబంధించిన ప్రతీ వేడుకను కలిసి జరుపుకునే ఈ జంట.. పిల్లల కోసం భేషజాలు పక్కన పెట్టి కలిసి ముందుకు సాగుతున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ మంచి తల్లిదండ్రులు అనిపించుకుంటున్నారు. ఇక ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం కుటుంబమంతా ఒక్కచోట చేరింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన హృతిక్ తన మాజీ భార్య సుసానే వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించాడు.(హృతిక్ సిగరెట్ తాగుతున్నాడా?) -
హృతిక్ సిగరెట్ తాగుతున్నాడా?
ఈ ఫొటోలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కొడుకు ముందే సిగరెట్ కాల్చుతున్నాడా? లేదూ, కొడుకులతో కలిసి సిగరెట్ తాగుతున్నాడా? లేకపోతే అక్కడ సిగరెట్ ఉన్నట్టు మనమే పొరపడుతున్నామా? ఇలా రకరకాల అనుమానాలతో అతని అభిమానుల బుర్ర వేడెక్కిపోయింది. దీంతో ఉండబట్టలేక హృతిక్‌నే అడిగేశారు. దానికి హీరో బదులిస్తూ తనకు ధూమపానం అలవాటు లేదని స్పష్టం చేశాడు. నేను క్రిష్(అద్భుత శక్తులున్న పాత్ర) అయితే మొట్ట మొదట ప్రస్తుత వైరస్‌ను నిర్మూలించి, వెంటనే ఈ భూగ్రహం మీద నుంచి ఆఖరి సిగరెట్ వరకు అన్నింటినీ నాశనం చేస్తానని పేర్కొన్నాడు. (లాక్డౌన్: కరీనాకు సలహా ఇచ్చిన అర్జున్ కపూర్) తన ప్రశ్నకు బదులు వస్తుందని ఊహించని అభిమాని అనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. అయితే హృతిక్ సిగరెట్ తాగడని తనకు తెలుసని, కానీ ఎంతో మంది ఈ ఫొటో చూసి హీరో ధూమపానం చేస్తాడేమోనని భ్రమపడుతున్నారని పేర్కొన్నాడు. తన అనుమానాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. మిగతా అభిమానులు సైతం సిగరెట్ అలవాటు లేని హృతిక్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. "నీకు ఎలాంటి శక్తులున్నా లేకపోయినా నువ్వు మాకు క్రిష్వే.." అంటూ కామెంట్లతో ప్రేమను చాటుకుంటున్నారు. ఇంతకీ ఈ ఫొటోను హృతిక్ రోషన్ మాజీ భార్య సుశానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (హృతిక్‌రోషన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు) -
‘ఆత్మలు డ్యాన్స్ చేయాల్సిందే’
హీరో హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసానే ఖాన్‌తో కలిసి తన తల్లిదండ్రులు రాకేష్ రోషన్, పింకి రోషన్లకు వివాహ వార్షిక శుభకాంక్షలు తెలిపుతున్న వీడియోను సోషల్ మీడియాలో గురువారం షేర్ చేశాడు. కాగా బుధవారం(ఏప్రీల్ 22) రాకేష్, పింకి రోషన్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా హృతిక్ తన ఇద్దరూ కూమారులు, మాజీ భార్యతో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మూడు వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘బయట ఉన్నప్పటీకీ, క్వారంటైన్లో ఇంట్లో ఉన్నప్పటికీ ఇప్పుడు మన ఆత్మలు డ్యాన్స్ చేయాల్సిందే..! హ్యాపీ యానివర్సరీ మమ్మ, పప్పా, లవ్ యూ’ అనే క్యాప్షన్‌కు ‘‘ఫ్యామిలీ స్పీరిట్’’ అనే హ్యాష్ ట్యాగ్‌కు జత చేసి షేర్ చేశాడు. (వైరస్ భయపడుతుంది!) View this post on Instagram The spirit must dance whether outdoors or quarantined indoors !. . Happy anniversary mama and papa. Love you ! 22nd April 2020 #familyspirit #bethereforeachother #naturalhairnotwigs #49years @rakesh_roshan9 @pinkieroshan A post shared by Hrithik Roshan (@hrithikroshan) on Apr 23, 2020 at 3:48am PDT కాగా ఓ వీడియోలో హృతిక్ పియానో వాయిస్తుంటే తన ఇద్దరూ కూమారులు హ్రేహాన్, హ్రిధాన్లతో పాటు మాజీ భార్య సుసానే శుభాకాంక్షలు తెలుపుతూ పాట పాడుతున్నారు. కాగా మరో వీడియోలో హృతిక్ తల్లిదండ్రులు రాకేష్, పింకి రోషన్లు కేక్ కట్ చేస్తుంటే కుటుంబ సభ్యులంతా వీడియో కాల్లో శుభకాంక్షలు తెలుపుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే చిన్నప్పటీ నుంచి మంచి స్నేహితులైన హృతిక్, సుసానేలు 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. కాగా ఓ స్టార్ హీరోయిన్ వల్ల వీరీ వివాహ బంధంలో కలతలు రావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో వారిద్దరు 2014లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి దూరంగా ఉంటున్న ఈ మాజీ దంపతులు లాక్డౌన్లో ఒకే ఇంట్లో తమ ఇద్దరూ కుమారులతో కలిసి క్వారంటైన్లో ఉండటం గమనార్హం. (కరోనా: స్టార్ హీరో ఇంటికి చేరిన మాజీ భార్య) -
సుసానే సోదరికి కరోనా నెగిటివ్.. కానీ!
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ సోదరి, జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీకి కరోనా వైరస్ నెగటివ్ వచ్చినట్లు ఆమె ప్రకటించారు. అయినప్పటికీ ఏప్రిల్ 29 వరకు తనని క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించినట్లు సోషల్ మీడియాలో శుక్రవారం తెలిపారు. కాగా ఆమె ఇంట్లో పనిచేసే సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చినట్లు పెర్కొన్నారు. (నటుడి కూతురి ఇంట్లో కరోనా కలకలం) బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ ఖాన్ కుమార్తె అయిన ఫరా ఖాన్ ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేస్తూ... ‘నెగటివ్ వచ్చింది.. యే యే’ అంటూ ట్వీట్ చేశారు. అంతేగాక ‘‘దేవుడు గొప్పవాడు... ప్రార్ధించే వారిని ఆయన నిర్లక్ష్యం చేయడు. ఈ మహమ్మారి బారినపడిన వారంతా త్వరలోనే కోలుకుంటారు. అంతేగాక ప్రపంచాన్ని కూడా వైరస్ నుంచి స్వస్థపరుస్తాడు’’ అంటూ రాసుకొచ్చారు. (కరోనా: మరో రెండేళ్లు ఇదే కథ) -
నటుడి కూతురి ఇంట్లో సిబ్బందికి కరోనా
నటుడు సంజయ్‌ఖాన్ కూతురు, హృతిక్ రోషన్ మాజీ భార్య సుజేఖాన్ సోదరి ఫరాఖాన్ అలీ నివాసంలో కరోనా కలకలం చెలరేగింది. ఆమె ఇంట్లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిచగా తన కుటుంబ సభ్యులు కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారని ఫరాఖాన్ అలీ ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం తామంతా స్వీయనిర్బంధం విధించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీనికి నటి పూజా బేడీ స్పందిస్తూ.. ధృడంగా ఉంటూ, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లండని ధైర్యం చెప్పింది. (పెద్ద మనసు చాటుకున్న విశాల్) ఇది మీరు ప్రస్తుత పరిస్థితిని జయించడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. ఎందరో నెటిజన్లు సైతం ఆమెకు మద్దతుగా సందేశాలను పంపిస్తున్నారు. కాగా ఇప్పటికే బాలీవుడ్లో నిర్మాత కరీం మొరానీ కుటుంబం కరోనా విషవలయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీని నుంచి అతని ఇద్దరు కుమార్తెలు బయటపడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా కరీం మొరానీకి రెండోసారి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పదివేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా 339 మంది మృతి చెందారు. 1036 మంది కోలుకున్నారు. (ఊ.. రాయండి) -
కరోనా దగ్గర చేసింది!
‘సామాజిక దూరం పాటించండి... కరోనాని నియత్రించండి’ అనే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇలా కరోనా అందరినీ విడదీస్తోంది. కానీ విడివిడిగా ఉంటున్న హృతిక్ రోషన్, ఆయన భార్య సుజానే ఖాన్ని ఒకే ఇంట్లో ఉండేలా చేసింది. విషయం ఏంటంటే... హృతిక్, సుజానే విడిపోయి ఆరేళ్లు పైనే అయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి దగ్గర కొన్నాళ్లు, తండ్రి దగ్గర కొన్నాళ్లు పిల్లలు ఉంటారు. పండగలు, పార్టీలను భార్యాభర్తలిద్దరూ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు హృతిక్ దగ్గరే పిల్లలు ఉన్నారు. కరోనా కారణంగా లాక్డౌన్ వల్ల పిల్లలు, హృతిక్ బయటకు వెళ్లడంలేదు. దాంతో పిల్లలను సుజానే మిస్ అవుతున్నారు. ఈ సమయాన్ని పిల్లలతో గడపాలనుకున్న ఆమె సూట్‌కేస్ సర్దుకుని మాజీ భర్త హృతిక్ ఇంటికి వెళ్లిపోయారు. ‘‘పిల్లలతో గడపాలని నా మాజీ భార్య మా ఇంటికి వచ్చేసింది. ఈ టైమ్‌లో పిల్లలతో పాటు తను ఉండటం చాలా అవసరం. థ్యాంక్యూ సుజానే’’ అని పేర్కొన్నారు హృతిక్. -
కరోనా: స్టార్ హీరో ఇంటికి చేరిన మాజీ భార్య
ముంబై: బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ ఆయన భార్య సుసానే ఖాన్‌తో విడాకులు తీసుకున్నప్పటికీ వారిద్దరి మధ్య నేటికీ స్నేహం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పిల్లల కోసం అనేకసార్లు కలిసి ప్రయాణం చేసే ఈ జంట.. వారికి సంబంధించిన ప్రతీ వేడుకను కలిసి నిర్వహిస్తూ బెస్ట్ పేరెంట్స్ అనిపించుకుంటున్నారు. తాజాగా కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో తమ కొడుకులు హ్రేహాన్, హ్రిధాన్ కోసం ఒకే ఇంట్లో కలిసి ఉంటూ మరోసారి ఆదర్శంగా నిలిచారు. ప్రాణాంతక వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో తమ కుమారులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో సుసాన్ ఖాన్ తన మాజీ భర్త ఇంటికి చేరి తల్లి మనసు చాటుకున్నారు. ఈ విషయాన్ని హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.(కరోనా: 20 వేలు దాటిన మరణాలు.. అత్యధికంగా అక్కడే) అస్సలు ఊహించలేదు... ‘‘దేశంలో లాక్డౌన్ విధించిన వేళ తల్లిదండ్రులుగా ఒకేచోట ఉండటం అస్సలు ఊహించని విషయం. కరోనాను కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటిస్తూ ప్రపంచమంతా ఏకతాటిపైకి రావడం బాగుంది. మానవత్వం వెల్లివిరస్తున్న తరుణంలో ప్రతీ వ్యక్తి ఆమె లేదా అతడు తన పిల్లలతో సమయం గడపడం ఎంతో ముఖ్యం. నా మాజీ భార్య సుసానే ఖాన్ ఫొటో ఇది. ఎంతో దయ కలిగిన వ్యక్తి. తనకు తానుగా తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. పిల్లలు దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఇక్కడికి చేరుకుంది. కో- పేరెంటింగ్‌లో నాకు ఎంతగానో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు సుసానే. మన పిల్లల కోసం మనం సృష్టిస్తున్న కథను వాళ్లే చెబుతారు’’ అంటూ ఇన్‌స్టాలో షేర్ చేసిన సుసానే ఫొటోకు క్యాప్షన్ జతచేశాడు. (‘భూగ్రహం నుంచి తప్పించుకోవాలని ఉంది’) ఈ క్రమంలో.. ‘‘కరోనా మహమ్మారి పుణ్యమా అని కుటుంబాలంతా ఒక్కచోట చేరుతున్నాయి. మీరు మరోసారి వివాహ బంధంతో ఒక్కటి కావాలి’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా బాల్య స్నేహితులుగా మెలిగిన హృతిక్- సుసానే 2000 సంవత్సరంలో డిసెంబర్ 20న వివాహం చేసుకున్నారు. బీ-టౌన్ జంటల్లో ఎంతో అన్యోన్య దంపతులుగా పేరొందిన వీరి కాపురంలో ఓ స్టార్ హీరోయిన్ చిచ్చు పెట్టిందనే వదంతులు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో 2013 నుంచి దూరంగా ఉంటున్న జంట 2014లో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram . It is unimaginable for me, as a parent, to think of having to be separated from my children at a time when the country is practicing lockdowns. . It is heartwarming to see the world come together as one in this time of deep uncertainty and possibility of months of social distancing and potential lockdowns for several weeks perhaps . . While the world talks about humanity coming together, I think it represents more than just an idea especially for parents sharing custody of their kids. How to keep their kids close to them without infringing on the right of the other who also has an equal right to be with his/her children. . This is a picture of dear Sussanne (my ex wife) , who has graciously volunteered to temporarily move out of her home so that our children are not disconnected indefinitely from either one of us. . Thank you Sussanne for being so supportive and understanding in our journey of co-parenting. . Our children will tell the story we create for them. . I hope and pray that in order to safeguard the health of ourselves and our loved ones, we all find our way to express love, empathy, courage, strength with an open heart ❤️. . #beopen #bekind #bebrave #responsibility #coexist #empathy #strength #courage #oneworld #humanity #wecanfighththis #loveoverfear A post shared by Hrithik Roshan (@hrithikroshan) on Mar 25, 2020 at 1:20am PDT -
రే... నువ్వు అత్యంత అద్భుతమైన వ్యక్తివి!
‘అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం.. భార్యాభర్తలుగా విడిపోయినా మంచి స్నేహితులుగా కలకాలం కలిసి ఉంటాం’... ఇటీవలి కాలంలో విడాకులు తీసుకున్న అరడజనుకు పైగా బాలీవుడ్ జంటలు చేసిన ప్రకటన ఇది. అయితే అందులో కొంతమంది మాత్రమే ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ముందు వరుసలో ఉంటారు బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్.. ఆయన మాజీ భార్య సుసానే ఖాన్. హృతిక్, సుసానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాల్యం నుంచి స్నేహితులుగా మెలిగిన హృతిక్- సుసానే 2000 సంవత్సరంలో డిసెంబర్ 20న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు హ్రేహాన్, హ్రిధాన్ ఉన్నారు. బీ-టౌన్ జంటల్లో ఎంతో అన్యోన్య దంపతులుగా పేరొందిన వీరి కాపురంలో చిచ్చుకు ఓ స్టార్ హీరోయిన్ కారణమనే వార్తలు గతంలో ప్రచారమయ్యాయి. ఈ నేపథ్యంలో 2013లో దూరమైన ఈ జంట... 2014 నవంబర్‌లో విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారు. అయితే.. పిల్లల కోసం వీరిద్దరూ తరచుగా కలుస్తూ ఉంటారు. పిల్లల పుట్టినరోజుల వంటి ప్రత్యేక సమయాల్లోనే గాకుండా వారితో కలిసి హాలిడే ట్రిప్పులకు సైతం వెళ్తుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు. ఇక హృతిక్ సంబంధించిన ప్రతీ విషయంలో ప్రత్యక్షంగానైనా లేదా పరోక్షంగానైనా సుసానే ప్రమేయం ఉండనే ఉంటుంది. అంతేకాదు మాజీ భర్త వ్యక్తిత్వాన్ని ప్రశంసించడంలోనూ సుసానే ముందే ఉంటారు. ఇక ఈరోజు హృతిక్ పుట్టినరోజు సందర్భంగా.. బెస్ట్ డాడీ అంటూ సుసానే ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు. ‘ రే... నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తివి నువ్వు. మున్ముందు నీ జీవితం ఎంతో గొప్పగా సాగుతుంది’ అని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కుమారులతో కలిసి ఉన్న హృతిక్ ఫొటోలతో పాటు వీడియోలు షేర్ చేసి... బెస్ట్ డాడీ, ఫిలాసఫర్ అని పేర్కొన్నారు. బహుశా ఇందుకేనేమో... హృతిక్- సుసానే మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నారంటూ కొన్నాళ్ల క్రితం వదంతులు వ్యాపించాయి. ఏదేమైనస్పటికీ సుసానేను.. హృతిక్ మాజీ భార్య అనే కంటే హృతిక్ బెస్ట్‌ఫ్రెండ్ అని పేర్కొంటే బాగుంటుందేమో కదా. View this post on Instagram ‘Happiest Happiest Birthday Rye... you are the most incredible Man I know.. ♥️😇 🎂🎈#tothebestoflifeaheadofyou #10thjan2020🔥🚩 #bestdaddyaward #bestphilosophertoo ☺️ A post shared by Sussanne Khan (@suzkr) on Jan 9, 2020 at 6:29pm PST -
‘ఆరోజంతా ఏడుస్తూనే ఉన్నాను’
తాను క్యాన్సర్‌తో బాధ పడుతున్నానంటూ బాలీవుడ్ హీరోయిన్ సొనాలీ బింద్రే.. చేదు నిజాన్ని వెల్లడించిన నాటి నుంచి ఆమె కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో వేదనకు గురయ్యారు. సాఫీగా సాగుతున్న సోనాలీ బింద్రే జీవితంలో క్యాన్సర్ రూపంలో పెద్ద కుదుపు. గతేడాది బాలీవుడ్ షాకింగ్ మూమెంట్స్‌లో ఇదొకటి. అయితే న్యూయార్క్‌లో చికిత్స తీసుకున్న అనంతరం సొనాలీ ఆరోగ్యం కాస్త కుదుట పడింది. ఆమె తిరిగి ముంబైకి రావడంతో పాటు కొన్ని యాడ్ షూటింగ్లలో కూడా పాల్గొంటూ మళ్లీ సాధారణ జీవితంలో పడిపోయారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే తనకు క్యాన్సర్ అని తెలియగానే షాక్ గురైన సొనాలీ ఆరోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారట. ‘ ఈ విషయం గురించి తెలిసిన రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. కానీ మరుసటి రోజే నిజాన్ని అంగీకరించాను. ఇకపై ఏడ్వకూడదని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నా జీవితంలో మళ్లీ సంతోషం మొదలైంది. నా జీవితంలో సూర్యుడు మళ్లీ ప్రకాశించడం మొదలుపెట్టాడు. ఇందుకు నిదర్శనంగా నా కుటుంబం, నా గర్ల్స్(తన స్నేహితురాళ్లను ఉద్దేశించి)తో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసినపుడు స్విచ్ ఆన్ సన్‌షైన్ అని పెడతాను’ అంటూ బీఎఫ్ఎఫ్(బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్) విత్ వోగ్ సీజన్ 3లో తన భర్త, స్నేహితులతో ఉన్న అనుబంధం గురించి మరోసారి చెప్పుకొచ్చారు. అదీ ఓ కారణం.. ‘ గోల్డీని పెళ్లి చేసుకుని 16 ఏళ్లు అయ్యింది. నాకు క్యాన్సర్ అని తెలియగానే మొదట నాకు గుర్తొచ్చిన వ్యక్తి తనే. నాకేమైనా అయితే తను ఎలా ఉండగలుగుతాడనే ఆలోచన నన్ను వెంటాడేది’ అని పేర్కొన్నారు. అదే విధంగా న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సమయంలో తన ప్రాణ స్నేహితులు సుసానే ఖాన్(హృతిక్ మాజీ భార్య), గాయత్రి జోషి అక్కడికి వచ్చి తనతో సమయం గడిపేవారని తెలిపారు. పిల్లలను స్కూళ్లో డ్రాప్ చేయడం, మళ్లీ నా దగ్గరికి వచ్చి కబుర్లు చెప్పడం, ఇలా నా కోసం ఎంతో సమయం కేటాయించేవారు. కీమో, సర్జరీ జరుగుతున్న సమయంలోనూ నేను ధైర్యంగా ఉండటానికి కుటుంబ సభ్యులతో పాటు వాళ్ల సాన్నిహిత్యం కూడా ఓ కారణం అని సొనాలీ చెప్పుకొచ్చారు. -
వారు విడిపోయినా కలివిడిగా..
ముంబై : బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, సుసనే ఖాన్ విడిపోయి ఐదేళ్లు దాటినా పిల్లలు హ్రిదాన్, హ్రిహాన్లను సంతోషంగా ఉంచేందుకు తరచూ కలవడం, హాలిడేస్‌ను ఎంజాయ్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. సుసనే ఇటీవల ఓ టీవీ చానెల్ షోకు హాజరైన సందర్భంలో సింగిల్ మదర్‌గా మీ అనుభవం ఎలా ఉందని ప్రశ్నించగా తనను వర్కింగ్ మామ్‌గా పిలవాలని కోరారు. తన ఇద్దరు పిల్లల బాగోగులు చూడటం, వారి కోసం కష్టపడి పనిచేయడం తనకు స్ఫూర్తినిస్తుందని చెప్పుకొచ్చారు. హృతిక్ రోషన్ తనకు బాసటగా నిలిచే తీరు తనలో భరోసా నింపుతుందని, తాము వివాహ బంధంలో లేకున్నా మంచి స్నేహితులమని చెప్పారు. హృతిక్‌తో తన అనుబంధం తాను ఒంటరిననే భావనను దూరం చేస్తుందన్నారు. -
సుసానే ఫోటోను షేర్ చేస్తూ.. హృతిక్ ఆసక్తికర కామెంట్స్!
బాలీవుడ్లో పెళ్లి సందడి జోరుగా సాగుతున్న వేళలో మనస్పర్ధలతో విడిపోయిన హృతిక్ రోషన్, సుసానే ఖాన్లు మళ్లీ ఒకటవ్వనున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బాల్య స్నేహితులైన వీరు వివాహబందంతో ఒక్కటై దాదాపు దశాబ్దం పాటు కాపురం చేసి..2014లో చట్టబద్దంగా విడిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్‌కు దగ్గరవ్వడంతో భార్య సుసానే ఖాన్‌కు హృతిక్ రోషన్ విడాకులు ఇచ్చాడు. హృతిక్, సుసానేలు విడిపోయినా..తమ పిల్లలకోసం తరుచూ కలుస్తుంటారు. పిల్లలతో సరదాగా గడుపుతుంటారు. అయితే కంగనా రనౌత్‌తో హృతిక్‌కు బేదాభిప్రాయాలు రావడంతో వీరిద్దరు కూడా కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. ఇవన్నీ పాత విషయాలే కానీ.. మళ్లీ ఇప్పుడు చర్చించుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే హృతిక్ సోషల్ మీడియాలో తన మాజీ భార్య సుసానే ఖాన్ ఫోటోను షేర్ చేస్తూ.. చేసిన సుదీర్ఘ కామెంట్స్‌ను చూస్తే త్వరలోనే మళ్లీ ఇద్దరు ఒక్కటవ్వబోతున్నారని అభిమానులు అనుకుంటున్నారు. ‘ఇక్కడ ఉన్నది సుసానే. నా క్లోజెస్ట్ ఫ్రెండ్ ( నా మాజీ భార్య కూడా) నన్ను మా పిల్లలను ఫోటో తీస్తోంది. ఈ మూమెంట్ మా పిల్లలకు ఒక స్టోరీని చెబుతోంది. ఎన్నో రకాలుగా మరెన్నో ఆలోచనలుగా విడిపోయిన ఈ ప్రపంచంలో ఒక్కటిగా కలిసిఉండటం సాధ్యమే. మనుషులుగా మనకు ఎన్ని విభిన్న ఆలోచనలు ఉన్నా.. విడిపోకుండా ఉండగలం. ఈ ప్రపంచంలో ధైర్యంగా, సహనపూర్వకంగా, ఐకమత్యంగా, ప్రేమగా ఉండాలి. ఇవన్నీ ఇంటి (కుటుంబం) నుంచే ప్రారంభం అవుతాయి.’ అంటూ ధైర్యంగా ఉండాలి, ఓపెన్‌గా ఉండాలి, భయం కంటే ప్రేమే గొప్పది, పిల్లలే భవిష్యత్తు వంటి హ్యాష్‌ట్యాగ్‌లను షేర్ చేశారు. View this post on Instagram Here is Sussanne , my closest friend ( also my ex wife) capturing a moment with me and our boys. . A moment in itself. . It tells a story to our kids. That in a world separated by lines and ideas , it is still possible to be united. And that you can want different things as people and yet stay undivided. . Here’s to a more united, tolerant, brave, open and loving world. It all starts at home. . #beOpen #bebrave #artoflove #tolerance #courage #abundance #loveisgreaterthanfear #explorersforever #childrenarethefuture #harmony A post shared by Hrithik Roshan (@hrithikroshan) on Nov 25, 2018 at 3:22am PST -
విడాకులు తీసుకున్న ఆ జంటకు మళ్లీ పెళ్లి?
-
విడాకులు తీసుకున్న ఆ జంటకు మళ్లీ పెళ్లి?
బాలీవుడ్ హీరోలకు ప్రేమలు ఎక్కువే. విడిపోవడాలు కూడా ఎక్కువే. రోజులు గడిస్తే కానీ ఆ ప్రేమ వెనకున్న బంధాల గురించి అర్థం కాదు. కొంతకాలం క్రితం భార్య సుసానే ఖాన్‌కు విడాకులిచ్చిన హృతిక్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడని రిపోర్టులు వస్తున్నాయి. సుసానే ఖాన్‌ను హృతిక్ రోషన్‌ను మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారట. ఈ కపుల్ మళ్లీ చేసుకోబోతున్నారని పలు రిపోర్టులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే హృతిక్, సుసానే మళ్లీ పెళ్లి వార్తలో ఎలాంటి నిజం లేదని వారి సన్నిహిత వర్గాలు చెప్పినట్టు డెక్కన్ క్రోనికల్ రిపోర్టు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పిల్లల అవసరాల కోసం కలిసి గడుపుతున్నారని, కచ్చితంగా వారి పిల్లలు, తల్లిదండ్రుల నుంచి అంతులేని ప్రేమను పొందుతూ.. ఆనందంగా గడుపుతున్నారని సన్నిహిత వర్గాలు చెప్పాయి. అయితే హృతిక్, సుసానేలు చాలా స్వతంత్ర ఆలోచనలు కలిగి వారని, ఒకవేళ వారు మళ్లీ కలిసే ఉద్దేశ్యం ఉంటే, బయటికి వెల్లడిస్తారని తెలిపాయి. బాల్య స్నేహితులైన హృతిక్, సుసానేలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దశాబ్దానికి పైనే కాపురం కూడా చేశారు. వీరికి ఇద్దరు కొడుకులు పుట్టాక.. విడాకులు తీసుకున్నారు. కంగనారనౌత్‌తో హృతిక్ చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వీరి వివాహ బంధం బీటలు వారింది. కానీ కంగనాకు హృతిక్‌కు ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి, వారి బంధం కూడా రచ్చ రచ్చ అయింది. దాదాపు ఐదు సంవత్సరాల కిందట హృతిక్, సుసానేలు వేరుపడ్డారు. తమ వివాహాన్ని చట్టబద్ధంగా రద్దు చేసుకున్నప్పటికీ.. ప్రస్తుతం వీళ్లిద్దరూ స్నేహితుల్లా అయితే గడుపుతున్నారు. తమ పిల్లలకు సంబంధించిన బర్త్ డే పార్టీల్లో.. సమ్మర్ వెకేషన్లలో వీళ్లిద్దరూ జంటగా అగుపిస్తూ ఉన్నారు. భార్యభర్తలుగా విడిపోయినా.. తల్లిదండ్రులుగా కలిసి ఉంటూ.. వీళ్లిద్దరూ చాలా హ్యాపీగా గడుపుతున్నారు. తరచుగా హృతిక్ తన పిల్లలు, సుసానేతో కలిసి సినిమాలకు, విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. విడిపోయినప్పటికీ, హృతిక్, సుసానేలు ఒకరికొకరు సపోర్టు ఇచ్చుకుంటూ.. ప్రోత్సహించుకుంటూ కూడా ఉంటున్నారు. సుసాన్ తన నుంచి విడిపోయాక, ఆమె కెరీర్ ఎంపికలను హృతిక్ గౌరవిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడుకుల కోసం మళ్లీ ఈ జంట ఒక్కటి అయ్యేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. హృతిక్ తన తప్పు తెలుసుకొని ఇప్పుడు సుసానేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని సమాచారం. విడాకులు తీసుకున్న చాలా వరకు జంటలు, కొన్నేళ్ల తర్వాత వేరే వాళ్లను వివాహం చేసుకుంటూ ఉన్నారు. కానీ హృతిక్, సుసానేలు విడిపోయాక, మళ్లీ కలువబోతున్నారని వార్తలు రావడం బాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశమైంది. -
మాజీ భర్తకు ఎంత అందంగా విష్ చేసిందో చూడండి!
సాక్షి, ముంబై: దేశీ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ బుధవారం 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హృతిక్‌కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనను విష్ చేశారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని శుభాశీస్సులు అందించారు. అందరిలోనూ మాజీ భార్య సుసానె ఖాన్ తెలిపిన జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకమని చెప్పాలి. తామిద్దరు కలిసి దిగిన ఓ అందమైన ఫొటోకు.. అంతకంటే అందమైన కామెంట్‌తో సుసానె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 'ఎప్పటికీ, ఎల్లప్పటికీ నా జీవితంలో ఆనందానివి (సన్‌షైన్) నువ్వే. హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్‌డే. నీ నవ్వు మరింత వెలుగనీ.. పరిమితుల్లేకుండా నువ్వు మరింతగా వెలుగును పంచు.. పవిత్రమైన హృదయమా' అంటూ సుసానె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. హృతిక్, సుసానె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2000 సంవత్సరం డిసెంబర్ 20న వీరి పెళ్లి జరిగింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు డిసెంబర్ 2013లో విభేదాల కారణంగా వేరయ్యారు. 2014 నవంబర్‌లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు హ్రేహాన్, హ్రిధాన్ ఉన్నారు. విడాకులు తీసుకున్నా.. పిల్లల కోసం తరచూ కలుస్తూ.. చక్కని స్నేహితులుగా ముందుకు సాగుతున్నారు. Forever and always you stay the sunshine in my life.. Happy happiest birthday 🖤 🎂 🌈🧚🏻♂️🌟smile that smile brightest and u always will spread that light...limitless 😇 #sacredheart A post shared by Sussanne Khan (@suzkr) on Jan 9, 2018 at 10:27am PST -
షారుక్ కూతురు ఎంట్రీ అదుర్స్.. కెమెరా క్లిక్స్
ముంబయి: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ సతీమణి గౌరీఖాన్ బాలీవుడ్ ప్రముఖులకు గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చారు. ముంబయిలోని ఏఆర్‌టీహెచ్ అనే రెస్టారెంట్లో ఆమె పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్‌కు ఇంటీరియర్ స్వయంగా ఆమెనే రూపకల్పన చేశారు. కొత్తగా డిజైన్ చేసిన ఈ రెస్టారెంటు ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె బాలీవుడ్ ప్రముఖులకు విందును ఏర్పాటుచేశారు. అయితే, ఇది పెద్ద విశేషం కాకపోవచ్చుగానీ అంతకంటే పెద్ద విశేషం మరొకటి ఉంది. ఈ పార్టీలో వారి ముద్దుల తనయా సుసానే ఖాన్ అందరినీ ఆకర్షించింది. తండ్రి షారుక్‌ఖాన్‌తో కలిసి పార్టీకి విచ్చేసిన సుసానే చూసిన ఏ ఒక్కరిని తలతిప్పులేనంత అందంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అలిల్ కపూర్, అర్జున్‌కపూర్, సోనమ్ కపూర్, కరణ్‌జోహార్, ఫరాఖాన్, సిద్ధార్థ మల్హోత్రా, అలియా భట్, మలైకా అరోరా హాజరయ్యారు. వీరంతా పార్టీలో నిమగ్నమై ఉండగా అనూహ్యంగా ఆరెంజ్ కలర్లో ధరించిన స్టర్ట్తో ఉన్న తన కూతురు చేయందకుని నడుస్తూ షారుక్, ఆయన కూతురు కెమెరాకు పోజులిచ్చారు. దీంతో ఇదే అవకాశం అనుకొని కెమెరాలన్నీ క్లిక్ మనిపించేశాయి. -
నా మాజీ భార్యకు నచ్చడం సంతోషం: హీరో
ముంబై: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాజా సినిమా కాబిల్కు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడంతో అతను సంతోషంగా ఉన్నాడు. అంతేగాక మాజీ భార్య సుసానే ఖాన్.. కాబిల్ స్పెషల్ షో చూడటంతో పాటు ఈ సినిమా బాగుందని, హృతిక్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించడం హృతిక్ కు మరింత సంతోషాన్ని కలిగించింది. హృతిక్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. భారత చలనచిత్ర చరిత్రలో.. ఇది అద్భుత ప్రదర్శనని, హృతిక్‌కు కాబిల్ మంచి పేరు తెస్తుందని, ఈ సినిమా యూనిట్‌కు అభినందనలు తెలుపుతూ సుసానె ట్వీట్ చేసింది. హృతిక్‌తో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అంటూ కామెంట్ చేసింది. దీనిపై హృతిక్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. కాబిల్ సినిమా సుసానెకు నచ్చడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. మరో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు.. ఇప్పట్లో ఆ ఉద్దేశంలేదన్నాడు. గత ఏడాది కంగనా రనౌత్‌తో గొడవ, వరుస ప్లాఫులతో సతమతమవుతున్న హృతిక్.. తన తాజా సినిమా కాబిల్కు హిట్ టాక్ రావడం, తన మాజీ భార్య ప్రశంసించడంతో అతనికి ఆత్మవిశ్వాసం కలిగించినట్టయ్యింది. హృతిక్, సుసానె తమ పదమూడేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా తమ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు కలుస్తూ వచ్చారు. ఇప్పుడు మరింత సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వాళ్లు మళ్లీ దగ్గరయ్యే అవకాశముందని సన్నిహితులు భావిస్తున్నారు. -
ఆ స్టార్ కపుల్ మళ్లీ ఒకటవుతున్నారా!
ముంబై: తమ పదమూడేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ వాళ్లు విడాకులు తీసుకున్నారు. సామరస్యపూర్వకంగా వీడిపోయినా.. ఎదిగే తమ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు కలుస్తూ వచ్చారు. ఇప్పుడు మరింత సన్నిహితంగా ఒక్కటవుతారా? అన్నంత చేరువగా వచ్చారు. వారే మాజీ బాలీవుడ్ జంట హృతిక్ రోషన్. సుసానె ఖాన్. విడాకులు తీసుకున్న ఈ మాజీ దంపతులు కొడుకులు రెహాన్, హ్రిదాన్ కోసం ఇప్పటివరకు హుందాగా పరస్పరం సహకరించుకున్నారు. ఇటీవల హృతిక్ 43వ పుట్టినరోజుకు హాజరై సుసానె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి మధ్య అనుబంధం మళ్లీ రోజురోజుకు దృఢపడుతుండటం బాలీవుడ్ వర్గాలను, అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. గత ఏడాది కంగనా రనౌత్‌తో గొడవ, వరుస ప్లాఫులతో సతమతమవుతున్న హృతిక్ తన తాజా సినిమా ’కాబిల్’పై చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్ స్క్రీనింగ్ ఇటీవల ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి హృతిక్ తో కలిసి సుసానె రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి మధ్య మళ్లీ చిగురిస్తున్న సానుకూల అనుబంధం మళ్లీ వీరు ఒక్కటవుతారా అన్న కథనాలకు తావిస్తోంది. విభేదాలతో వీడిపోయిన ఈ జంట మళ్లీ ఒకటై ఆనందంగా గడుపాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
మాజీ భర్త సినిమాపై ఆమె స్పందన!
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో విడాకులు తీసుకున్నా.. అతనికి అండగా నిలిచే విషయంలో మాజీ భార్య సుసానె ఖాన్ ఎప్పుడూ ముందుంటున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో పబ్లిక్‌గా మాజీ భర్తకు అండగా నిలిచిన సుసానె.. తాజాగా 'కాబిల్' సినిమా విషయంలోనూ మద్దతు పలికారు. ఇంటీరియర్ డిజైనర్ అయిన సుసానెకు ఇటీవల చార్కోల్ డిజైన్ ప్రాజెక్టుకు అవార్డు లభించింది. బుధవారం ముంబైలో ఈ అవార్డు అందుకున్న సందర్భంగా 'కాబిల్' సినిమా గురించి ఆహూతులు ఆమె స్పందన అడిగారు. 'మొహెంజోదారు' ప్లాప్ తర్వాత సొంత బ్యానర్లో హృతిక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా గురించి అడగ్గానే నవ్వుతూ స్పందించిన ఆమె.. 'ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని నాకు నమ్మకం ఉంది' అని ఆమె పేర్కొన్నారు. 17 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్తూ 2013లో హృతిక్, సుసానె విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు రెహాన్, రిధాన్ ఉన్నారు. విడాకుల అనంతరం కూడా ఈ జంట అప్పుడప్పుడు కలుస్తూ స్నేహపూర్వకంగా ఉంటున్నారు. ఇటీవల ఈ జంట పిల్లలతో కలిసి ఓ డిన్నర్ పార్టీలో సరదాగా గడిపింది. గతంలో కంగనా-హృతిక్ మధ్య నడిచిన లీగల్ పోరులోనూ మాజీ భర్తకు సుసానె అండగా నిలిచింది. -
హీరో మాజీ భార్యపై కేసు కొట్టివేత
ముంబై: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. రెండు నెలల క్రితం ఆమెపై దాఖలైన చీటింగ్ కేసును బాంబే హైకోర్టు గోవా బెంచ్ గురువారం కొట్టివేసింది. రూ. 1.87 కోట్లకు సుసానే ఖాన్ తమను మోసం చేసిందని ఎంజీ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గోవాలో ఛీటింగ్ కేసు పెట్టింది. ఆమె మోసానికి పాల్పడినట్టు ఎఫ్ఐఆర్ లో ఎక్కడా నమోదు కాలేదని కోర్టు తెలిపినట్టు సుసానే ఖాన్ తరపు న్యాయవాదులు నితిన్ సర్వేశాయ్, హితేశ్ జైన్ వెల్లడించారు. ఎఫ్ఐఆర్ లో ఆమెకు వ్యతిరేకంగా ఎటువంటి అభియోగాలు నమోదుకానప్పుడు కేసు నిలవదని న్యాయస్థానం అభిప్రాయపడిందని తెలిపారు. సివిల్ కేసును పోలీసు యంత్రాంగం అండతో క్రిమినల్ కేసుగా మార్చాలని పిటిషన్లు ప్రయత్నించారని ఆరోపించారు. కాగా, తన గౌరవాన్ని చెడగొట్టేందుకే ఛీటింగ్ కేసు పెట్టారని, ఇలాంటి కేసులకు బెదిరేది లేదని సుసానే ఖాన్ అంతకుముందు అన్నారు. -
కేసులకు భయపడను: హీరో మాజీ భార్య
ముంబై: తన గౌరవాన్ని చెడగొట్టేందుకే ఛీటింగ్ కేసు పెట్టారని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ ఆరోపించారు. తనను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే కేసు పెట్టారని అన్నారు. ఇలాంటి కేసులకు బెదిరేది లేదని చెప్పారు. లండన్ లో ఉన్న సుసానే ఖాన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు రద్దు చేసినందుకు తనకే డబ్బులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తనకు రావాల్సిన డబ్బుల గురించి అడిగినందుకే తనపై కేసు పెట్టారని సుసానే ఖాన్ ఆరోపించారు. ఒత్తిడికి గురి చేసి రాజీ రావాలన్న కుట్రతోనే ఇదంతా చేశారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. 'ఇలాంటి కేసులు నన్ను భయపెట్టలేవు. రెట్టించిన ఉత్సాహంతో సత్యం కోసం పోరాడతా. ఫిర్యాదులో నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం. నన్ను అవమానించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాన'ని సుసానే ఖాన్ హెచ్చరించారు. రూ. 1.87 కోట్లకు సుసానే ఖాన్ తమను మోసం చేసిందని ఎంజీ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గోవాలో ఛీటింగ్ కేసు పెట్టింది. -
ప్రముఖ హీరో మాజీ భార్యపై ఛీటింగ్ కేసు
గోవా: బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య, ఇంటీరియర్ డిజైనర్ సుసానే ఖాన్‌పై గోవాలో చీటింగ్ కేసు నమోదైంది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు ఆమెపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆర్కిటెక్ట్‌గా పరిచయం చేసుకున్న సుసానే ఖాన్ తమ నుంచి ఓ కాంట్రాక్టు తీసుకుందని, ఈ పనికోసం 2013లో ఆమెకు 1.87 కోట్ల రూపాయలు చెల్లించామని, అయితే ఇప్పటివరకు పని పూర్తిచేయలేదని ఎంజీ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సిందిగా సుసానేను కోరగా, ఆమె తెలియజేయలేదని ఆరోపించింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఆరా తీయగా సుసానే అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలిసిందని ఈ సంస్థ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
'అతనితో ఫాల్స్ రిలేషన్ వద్దనుకున్నా..'
ముంబై: 'చిన్నప్పటి నుంచే మేం బెస్ట్ ఫ్రెండ్స్. ప్రేమించుకుని పెళ్లాడాం. పిల్లలు పుట్టిన కొన్నేళ్లకు నన్ను నేను తరచి చూసుకున్నా. అప్పటికే మా మధ్య అంతులేని అగాథం. మాట్లాడుకుంటాం, కలిసి భోజనం చేస్తాం.. అయినా ఏదో వెలితి. ఇంకొన్నాళ్లకు నాకు అనిపించింది..ఈ బూటక సంబంధం(ఫాల్స్ రిలేషన్ షిప్) అవసరమా! అని. తర్వాత ఇద్దరం మాట్లాడుకుని విడాకులు తీసుకున్నాం' అంటూ విడిపోయిన రెండేళ్ల తర్వాత హృతిక్ తో విడాకులపై పెదవి విప్పింది సుజానే ఖాన్. విడాకులు పొందినా, ఇప్పటికీ తాము మాట్లాడుకుంటామని, పిల్లల విషయంలో నిర్ణయాలు కలిసే తీసుకుంటామని ప్రఖ్యాత ఫెమినా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజానే చెప్పారు. గత ఏడాది ముంబైలోని ఓ రెస్టారెంట్ లో హృతిక, సుజానేలు పిల్లలతోపాటు కనిపించారు. ఆ ఫొటోల ఆధారంగా 'వీళ్లు మళ్లీ కలిపోయారు' అంటూ ఓ వర్గం మీడియా వార్తలు ప్రసారం చేసింది. అయితే సుజానే మాత్రం తాము ఎప్పటికే కలవబోయేది లేదని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదని విజ్క్షప్తి చేశారు. ఇప్పుడు ఆమే స్వయంగా హృతిక్ తో విడిపోవటానికి గల కారణాలను వెల్లడించారు. కంగనా రనౌత్ తో వివాదం విషయంలోనూ హృతిక్ ను వెనకేసుకొచ్చిన సుజానే.. హృతిక్ మంచివాడని కితాబు ఇచ్చింది. భార్యా భర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసే ఉన్నామని చెప్పింది. -
'ఈ విషయంలో నా సపోర్ట్ హృతిక్ కే'
ముంబై: బాలీవుడ్ టాప్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల మధ్య జరుగుతున్న లీగల్ వివాదం రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతూ థ్రిల్లర్ సినిమాలతో పోటీ పడుతోంది. అయితే ఇప్పుడు ఇదంతా చూస్తూ హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్ ఎలా ఫీలవుతున్నారో తెలుసుకోవాలనేది మీడియా తాపత్రయం. అందుకు సుసానే.. హృతిక్-కంగనల బురద జల్లుకునే పండుగ మధ్యలో అస్సలు ఎంటర్ అవ్వనని ట్విట్టర్ ద్వారా చెప్పకనే చెప్పుకొచ్చారు. బాలీవుడ్లో మోస్ట్ స్టైలిష్ కపుల్‌గా గుర్తింపు ఉన్న హృతిక్-సుసానేలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పలు మీడియా సంస్థలు.. తన మాజీ భర్త నడిపిన ప్రేమ వ్యవహారంపై ఆమె ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తిని కనబరిచాయి. ఈ విషయమై ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించిన వరుస కథనాలు చదివిన సుసానే రెండు రోజుల క్రితం.. 'నేను ఏమనుకుంటున్నానో తెలుసుకోవాలని ఉంది కదా. సో సారీ.. ఎప్పటికీ తెలుసుకోలేరు. మీ ఊహాగానాలు కంటిన్యూ చేయండి' అంటూ ట్వీట్ చేశారు. అంతలోనే హృతిక్, కంగనలు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటపడి మరింత దుమారం రేపాయి. ఆ ఫొటోలు చూసిన సుసానే ఏమనుకున్నారో ఏమో.. 'ఫొటోషాప్ చేసిన ఫొటోలతో అబద్ధపు కథనాలు ప్రచారం చేస్తున్నారు, ఈ విషయంలో మాత్రం నా సపోర్ట్ హృతిక్ కే' అంటూ ఈ సారి తనంతట తానే స్పందించారు సుసానే. pictures are photoshopped and untrue stories carry 2 much weight.another pic for d rec. I support @iHrithik in this. pic.twitter.com/TGKTc40h0J — Sussanne Khan (@sussannekroshan) April 27, 2016 -
'ఆ హీరోతో రెండో పెళ్లి వార్తలు అబద్ధం'
ముంబై: మరోసారి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్నె ఖాన్ చెప్పారు. హృతిక్ స్నేహితుడు, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవల వచ్చిన వార్తలను ఖండించారు. ఇలాంటి వదంతులు మనోవేదన కలిగిస్తాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హృతిక్, సుసాన్నె నాలుగేళ్లు డేటింగ్ చేశాక 2000లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే 2013లో హృతిక్, సుసాన్నె జంట విడిపోయారు. హృతిక్, సుసాన్నెలు విడిపోవడానికి అర్జున్ రాంపాలే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. సుసాన్నె, అర్జున్ ఇటీవల ఓ కాఫీ షాప్‌లో కనబడ్డారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. అయితే హృతిక్‌తో తాను విడిపోవడానికి ఎవరూ కారణం కాదని, పెళ్లికి సంబంధించిన వార్తలు నిరాధారమని సుసాన్నె స్పష్టం చేశారు. -
హృతిక్ రోషన్‌కు విడాకులు మంజూరు
ముంబై: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ దంపతుల 17 ఏళ్ల బంధం నేటితో పూర్తిగా తెగదెంపులైంది. శనివారం బాంద్రా కోర్టు హృతిక్, సుసాన్నెలకు విడాకులు మంజూరు చేసింది. హృతిక్ న్యాయవాది దీపేష్ మెహతా ఈ విషయాన్ని వెల్లడించారు. హృతిక్, సుసాన్నెల మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది విడిపోయారు. అప్పటి నుంచి వేర్వేరుగా నివసిస్తున్నారు. హృతిక్ నుంచి సుసాన్నె వంద కోట్ల రూపాయల భరణం కోరినట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే సుసాన్నె వీటిని ఖండించింది. హృతిక్ దంపతులకు ఇద్దరు పిల్లలు రేహన్, హృదన్ ఉన్నారు. పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులకు ఇద్దరికీ సంయుక్తంగా అప్పగించినట్టు న్యాయవాది చెప్పారు. హృతిక్ 2000 వ సంవత్సరంలో సుసాన్నెను పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు నాలుగేళ్ల పాటు వీరు డేటింగ్ చేశారు. గతేడాది డిసెంబర్లో హృతిక్ తన భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి వేరుగా నివసిస్తున్నా, ఇప్పుడు చట్టబద్ధంగా విడిపోయారు. -
హృతిక్ ను 400 కోట్లు డిమాండ్ చేసిన సుజానే!
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బ్యాంగ్ బ్యాంగ్ ట్రైలర్ కు వచ్చిన సానుకూల స్పందన ద్వారా వచ్చిన ఆనందం మాటుమాయమైంది. హృతిక్ ను మనోవర్తి కింద 400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ లో పరస్పర అంగీకారంతో హృతిక్, సుజానేలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తుది తీర్పు అక్టోబర్ 31 తేదిన వెలువడనుంది. ఇప్పటికే హృతిక్ దంపతులకు జన్మించిన హ్రిహాన్, హ్రేదాన్ లను సుజానేలకు అప్పగించారు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా తమ పిల్లలతో హృతిక్ దంపతులు కలిసి కనిపించారు. ఇటీవల కాలంలో సుజానే కుటుంబ సభ్యులతో హృతిక్ కూడా చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. పిల్లల కోసం వ్యక్తిగత అభిప్రాయాలను, విభేదాలను పక్కన పెట్టాలని హృతిక్, సుజానేలు నిర్ణయించుకున్నట్టు సమాచారం.