Sussanne Khan Test Positive For Covid 19: బాలీవుడ్‌లో కరోనా కల్లోలం ఏమాత్రం తగ్గట్లేదు. రోజురోజూకీ ఉగ్రరూపం దాల్చుతోంది కొవిడ్ మహమ్మారి. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. తాజాగా బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ మాజీ భార్య, ఇంటీరియర్ డిజైనర్ సుసనే ఖాన్ కొవిడ్ బారిన పడింది. మంగళవారం తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా కరోనా సోకినట్లు చెప్పుకొచ్చింది. 'కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్న తర్వాత మూడో సంవత్సరం ఈ మొండిఘటమైన ఒమిక్రాన్ నా రోగనిరోధక వ్యవస్థలోకి చొరబడింది. నేను సోమవారం రాత్రి పరీక్ష చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఇది చాలా ప్రమాదకరమైంది. దయచేసి అందరూ సురక్షితంగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి.' అని పోస్ట్ పెట్టింది సుసనే.
ఈ పోస్ట్‌కు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సుసనే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 'త్వరగా కోలుకోండి' అని బ్యూటీ బిపాసా బసు రాయగా, 'మీరు త్వరలో కోలుకుంటారు' అని సుసనే సోదరి ఫరా ఖాన్ అలీ కామెంట్ పెట్టారు. ఇదిలా ఉంటే జనవరి 10న హృతిక్ బర్త్‌డే సందర్భంగా సుసనే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. 'నువ్ చాలా అద్భుతమైన తండ్రివి. నీలాంటి తండ్రి ఉండటం రే అండ్ రిడ్జ్‌ల అదృష్టం. నీ కలలన్నీ నెరవేరుతాయి. ఇప్పటికీ ఎప్పటికీ బిగ్ హగ్' అని సుసనే విష్ చేసింది.
ఇదీ చదవండి: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది
Comments
Please login to add a commentAdd a comment