Did Janhvi Kapoor Khushi Kapoor Test Positive For Covid 19 - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor - Khushi Kapoor: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్‌ ఏం చెబుతోంది

Published Tue, Jan 11 2022 4:22 PM | Last Updated on Tue, Jan 11 2022 6:54 PM

Did Janhvi Kapoor Khushi Kapoor Test Positive For Covid 19 - Sakshi

Did Janhvi Kapoor Khushi Kapoor Test Positive For Covid 19: బాలీవుడ్‌ కపూర్ ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించలేదు. జనవరి 10న జాన్వీ కపూర్‌ ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటోస్‌తో వారికి కరోనా సోకిందని అనుమానాలు వచ్చాయి. ఈ పోస్ట్‌లో జాన్వీ తన నోట్లో థర్మామీటర్‌ పెట్టుకుని కనిపించింది. ఆమెతోపాటు ఖుషీ కపూర్‌ కూడా ఉంది. జాన్వీ ఇన్‌స్టా పోస్ట్‌ చూసి వారికి కరోనా సోకిందని భావిస్తున్నారు. వీరితో పాటు బోనీ కపూర్‌ కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇటీవల అర్జున్‌ కపూర్‌ ఇంట్లో నలుగురికి కరోనా సోకడంతో వారి నివాసాన్ని బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు (బీఎంసీ) సీల్‌ వేసి శానిటైజ్‌ చేసిన విషయం తెలిసిందే. అర్జున్‌ కపూర్‌, అన్షులా కపూర్‌, రియా కపూర్‌, కరణ్‌ బూలానీలను కొవిడ్‌ పలకరించింది. తాజాగా అర్జున్‌, అన్షులా, రియాకు కరోనా నెగెటివ్‌ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కూడా వారు అధికారికంగా వెల్లడించలేదు. బాలీవుడ్‌ తారలను కరోనా తెగ ఇబ్బందిపెడుతుంది. ఇప్పటికే జాన్‌ అబ్రహం, అతని భార్య ప్రియా రుంచల్‌, మధుర్ భండార్కర్‌, ప్రేమ్ చోప్రా, అతని భార్య ఉమా చోప్రా, మృణాల్‌ ఠాకూర్‌, స్వరా భాస్కర్‌లకు కొవిడ్‌ సోకింది. 
 

ఇదీ చదవండి: బీటౌన్‌ బ్యూటీకి కొవిడ్‌.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తానని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement