
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ సోదరి, జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీకి కరోనా వైరస్ నెగటివ్ వచ్చినట్లు ఆమె ప్రకటించారు. అయినప్పటికీ ఏప్రిల్ 29 వరకు తనని క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించినట్లు సోషల్ మీడియాలో శుక్రవారం తెలిపారు. కాగా ఆమె ఇంట్లో పనిచేసే సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చినట్లు పెర్కొన్నారు. (నటుడి కూతురి ఇంట్లో కరోనా కలకలం)
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ ఖాన్ కుమార్తె అయిన ఫరా ఖాన్ ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్ చేస్తూ... ‘నెగటివ్ వచ్చింది.. యే యే’ అంటూ ట్వీట్ చేశారు. అంతేగాక ‘‘దేవుడు గొప్పవాడు... ప్రార్ధించే వారిని ఆయన నిర్లక్ష్యం చేయడు. ఈ మహమ్మారి బారినపడిన వారంతా త్వరలోనే కోలుకుంటారు. అంతేగాక ప్రపంచాన్ని కూడా వైరస్ నుంచి స్వస్థపరుస్తాడు’’ అంటూ రాసుకొచ్చారు. (కరోనా: మరో రెండేళ్లు ఇదే కథ)
Comments
Please login to add a commentAdd a comment