
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బుధవారం(మే 25న) 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్ వంటివారికి సైతం ఆహ్వానాలు అందాయి. అటు బాలీవుడ్ హీరోహీరోయిన్లతో పాటు స్టార్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ సైతం హాజరయ్యారు.
అంతేకాదు మాజీ దంపతులు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు కలిసి ఫొటోలకు పోజులిస్తూ పార్టీలో సందడి చేశారు. అలాగే మాజీ దంపతులు హృతిక్ రోషన్, సుశానే ఖాన్ వారి లవర్స్‌తో పార్టీలో తళుక్కుమని మెరిశారు. హృతిక్ ప్రేయసి సబా ఆజాద్‌ను వెంటేసుకుని రాగా, సుశానే తన ప్రియుడు అర్‌శ్లన్ గోనీతో విందుకు హాజరైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
చదవండి 👇
బంపరాఫర్, సామాన్యులకు బిగ్‌బాస్ షోలో పాల్గొనే ఛాన్స్
విడాకుల తర్వాత కలిసి కనిపించిన మాజీ స్టార్ కపుల్
Comments
Please login to add a commentAdd a comment