స్టార్ హీరో గర్ల్‌ఫ్రెండ్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా? | Hrithik Roshan Girlfriend Saba Azad Singing Lakme Fashion Show | Sakshi
Sakshi News home page

Saba Azad: ఫ్యాషన్ షోలో దుమ్మురేపిన స్టార్ హీరో ప్రేయసి!

Published Sat, Oct 14 2023 7:44 PM | Last Updated on Sat, Oct 14 2023 7:54 PM

Hrithik Roshan Girlfriend Saba Azad Singing Lakme Fashion Show - Sakshi

ఆమె ఆ స్టార్ హీరో గర్ల్‌ఫ్రెండ్. ఇప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అతడితో ప్రేమలో పడింది. పలు సందర్భాల్లో ఈ జంట కలిసి కనిపిస్తుంటారు. ఆమె నటి అని చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు ఎవరికీ తెలియని ఓ కొత్త టాలెంట్ ని బయటపెట్టి అందరికీ షాకిచ్చింది. 

(ఇదీ చదవండి: ఆమె కోసం ఈమె బలి? వచ్చిన వారంలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్!)

బాలీవుడ్ స్టార్ హీరోల్లో హృతిక్ రోషన్ కాస్త డిఫరెంట్. త్వరగా సినిమాలు చేసేయకుండా విభిన్న కథలతో మూవీస్ చేస్తుంటాడు. వ్యక్తిగత జీవితానికి వస్తే దాదాపు 14 ఏళ్లపాటు సంసారం చేసిన సుస్సానే ఖాన్‌కి విడాకులు ఇచ్చేశాడు. ప్రస్తుతం నటి, డైరెక్టర్ సబా ఆజాద్‌తో రిలేషన్‌లో ఉన్నాడు.

హృతిక్ కంటే సబా ఆజాద్‌ది చాలా చిన్న వయసు. ఈ విషయమై అప్పట్లో తెగ మాట్లాడుకున్నారు. సరే అదంతా పక్కనబెడితే రీసెంట్‌గా ఓ ఫ్యాషన్ షోలో పాటలు పాడిన సబా ఆకట్టుకుంది. ఇప్పటివరకు అందరికీ ఈమె నటి అని మాత్రమే తెలుసు. ఇప్పుడు అదిరిపోయే ర్యాప్ సాంగ్స్ పాడి ఆశ్చర్యపరిచింది. అయితే ఈమె ఎప్పటినుంచో సింగర్ అని, సొంతంగా ఓ బ్యాండ్ కూడా ఉందని తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement