విడాకుల తర్వాత మరొకరితో లవ్‌.. సంతోషంగా ఉందన్న తల్లి | Sussanne Khan Mom Happy Her Daughter Found Love After Hrithik Roshan Divorce, Deets Inside | Sakshi
Sakshi News home page

Sussanne Khan Love: విడాకుల తర్వాత మరొకరితో ప్రేమాయణం.. పెళ్లెందుకు అంటున్న తల్లి

Published Thu, Jul 4 2024 2:27 PM | Last Updated on Thu, Jul 4 2024 4:08 PM

Sussanne Khan Mom Happy Her Daughter Found Love after Hrithik Roshan Divorce

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌, సుజానే ఖాన్‌.. చిన్ననాటి స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు కలిసున్నారు. పరిస్థితులు తారుమారవడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. హృతిక్‌ మరో హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపించడం వల్లే ఈ జంట విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అప్పట్లో రూమర్స్‌ వినిపించాయి.

విడాకుల తర్వాత ప్రేమలో..
అయితే విడాకులు తర్వాత ఇద్దరూ శత్రువుల్లా మారిపోకుండా పిల్లల కోసం ఫ్రెండ్స్‌గా ఉన్నారు. అలాగని ఒంటరిగానూ మిగిలిపోలేదు. అటు హృతిక్‌.. నటి సబా ఆజాద్‌తో ప్రేమలో పడగా ఇటు సుజానే.. నటుడు అర్స్‌లన్‌ గోనిని లవ్‌ చేస్తోంది. తాజాగా సుజానే ప్రేమాయణం గురించి ఆమె తల్లి జరీన్‌ మాట్లాడింది. సుజానే పార్ట్‌నర్‌ అర్స్‌లన్‌ న్యాయవిద్యను అభ్యసించాడు. జమ్ములో పేరున్న రాజకీయ కుటుంబానికి చెందినవాడు. తనకు యాక్టింగ్‌ అంటే ఇష్టం. 

పెళ్లి చేసుకోవాలనేం లేదు
నటనారంగంలోనూ తను రాణించాలని ఆశిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులు కూడా ఎంతో మంచివారు! సుజానే, అర్స్‌లన్‌ కలిసి ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఒకరితో మనకు సంతోషం దక్కుతుందంటే మంచిదే కదా.. అలా అని పెళ్లి చేసుకుంటే ఆ సంతోషం కంటిన్యూ అవుతుందనేం లేదు. అర్స్‌లన్‌, సుజానేలు వారి కెరీర్‌పై ఫోకస్‌ చేస్తున్నారు. వారిని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది.

చదవండి: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు.. ఎంత గొప్ప మనసో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement