![Hrithik Roshan Ex Wife Sussane Khan To Tie Knot With Her Boy Friend Arslan Goni - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/6/hrithik.jpg.webp?itok=8a51qLuY)
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 14ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత హృతిక్- సుసానే ఖాన్‌లు 2014లో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హృతిక్ బాలీవుడ్ నటి, సింగర్ సబా అజాద్‌తో డేటింగ్ చేస్తుండగా, సుసానే ఇప్పుడు అర్స్లాన్ గోనీతో పీకల్లోతు ప్రేమలో ఉంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వీరుద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. సుసానేకు ఇది రెండో వివాహం. వీరి పెళ్లి చాలా సింపుల్‌గా జరగనుందని సమాచారం.అయితే వివాహ వేడుక, తేది ఎప్పుడన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బీటౌన్‌లో అందరికి తెలిసిందే. తరచూ వీరిద్దరు ముంబై రోడ్లపై చట్టపట్టాలేసుకుని తిరగడం,డిన్నర్ డేట్స్‌కు,పార్టీలకూ జంటగానే హాజరయ్యేవారు.
అంతేకాకుండా బర్త్‌డే లాంటి స్పెషల్ డేస్‌లోనూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగానే ప్రేమను వ్యక్తపరిచేవారు. అయితే ఇప్పుడీ జంట పెళ్లిపీటలెక్కుతుందని వార్తలు రావడంతో మరి హృతిక్- సబా అజాద్‌లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment