Pic Viral: Hrithik Roshan and Saba Azad Party With Sussanne Khan, Arslan Goni in Goa - Sakshi
Sakshi News home page

Hrithik Roshan: ప్రియురాలితో హృతిక్‌ రోషన్‌.. పక్కనే మాజీ భార్య కూడా!

Published Wed, Apr 6 2022 2:50 PM | Last Updated on Wed, Apr 6 2022 4:01 PM

Hrithik Roshan and Saba Azad Party With Sussanne Khan, Arslan Goni in Goa - Sakshi

బాలీవుడ్‌ మాజీ దంపతులు హృతిక్‌ రోషన్‌, సుసానే ఖాన్‌ ఒకే పార్టీలో జంటలుగా సందడి చేసిన ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు. సీనియర్‌ నటి పూజ బేడీ గోవాలో హోస్ట్‌ చేసిన ఈ పార్టీకి హృతిక్‌ రోషన్‌ తన రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ సబా అజాద్‌ హజరయ్యాడు. అలాగే సుసాన్నే ఖాన్‌ తన రూమార్డ్‌ బాయ్‌ఫ్రెండ్‌  అర్స్లాన్ గోనితో పాల్గొంది. దీంతో మరోసారి ఈ మాజీ దంపతులు వార్తల్లో నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజ బేడీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ షేర్‌ చేసింది.

చదవండి: ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంత వరకు నేనూ పెళ్లి చేసుకోను: బిగ్‌బాస్‌ బ్యూటీ

దీంతో ఈ పొటోలు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కాగా మంగళవారం రాత్రి ఈ లవ్‌బర్డ్స్‌ జంటలుగా ముంబై ఎయిర్‌ పోర్టులో దర్శనమించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోల్లో హృతిక్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ సబా అజాద్‌ చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ కనిపించాడు. అలాగే సుసాన్నే సైతం తన ప్రియుడు అర్స్లాన్ గోని చేతిలో చేయి వేసుకుని ఎయిర్‌పోర్ట్‌ లోపలికి వెళుతూ కనిపించింది. దీంతో ఈ మాజీ దంపతులు కొత్త జంటలతో ఒకే పార్టీకి హాజరుకావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. 

చదవండి: హైదరాబాద్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

కాగా ఈ పార్టీకి వీరితో పాటు ఫరా ఖాన్‌ అలీ, దర్శకుడు అభిషేక్‌ కపూర్‌లతో పాటు తదితర బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా షారుక్‌, సబాలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ బి-టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్‌పై ఈజంట ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీరిద్దరు మంచి స్నేహితులే అంటూ హృతిక్‌ సన్నిహిత వర్గాలు చెప్పుకొ‍స్తు‍న్నాయి. మరోవైపు సుసానే ఖాన్‌ కొంతాకాలంగా అర్స్లాన్ గోనితో సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement