విడాకులు తీసుకున్న ఆ జంటకు మళ్లీ పెళ్లి?  | Hrithik Roshan-Sussanne Khan To Remarry? | Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకున్న ఆ జంటకు మళ్లీ పెళ్లి? 

Published Mon, Jul 30 2018 3:49 PM | Last Updated on Tue, Jul 31 2018 12:57 PM

Hrithik Roshan-Sussanne Khan To Remarry? - Sakshi

బాలీవుడ్ హీరోలకు ప్రేమలు ఎక్కువే. విడిపోవడాలు కూడా ఎక్కువే. రోజులు గడిస్తే కానీ ఆ ప్రేమ వెనకున్న బంధాల గురించి అర్థం కాదు. కొంతకాలం క్రితం భార్య సుసానే ఖాన్‌కు విడాకులిచ్చిన హృతిక్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడని రిపోర్టులు వస్తున్నాయి. సుసానే ఖాన్‌ను హృతిక్‌ రోషన్‌ను మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారట. ఈ కపుల్‌ మళ్లీ చేసుకోబోతున్నారని పలు రిపోర్టులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే హృతిక్‌, సుసానే మళ్లీ పెళ్లి వార్తలో ఎలాంటి నిజం లేదని వారి సన్నిహిత వర్గాలు చెప్పినట్టు డెక్కన్‌ క్రోనికల్‌ రిపోర్టు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పిల్లల అవసరాల కోసం కలిసి గడుపుతున్నారని, కచ్చితంగా వారి పిల్లలు, తల్లిదండ్రుల నుంచి అంతులేని ప్రేమను పొందుతూ.. ఆనందంగా గడుపుతున్నారని సన్నిహిత వర్గాలు చెప్పాయి. అయితే హృతిక్‌, సుసానేలు చాలా స్వతంత్ర ఆలోచనలు కలిగి వారని, ఒకవేళ వారు మళ్లీ కలిసే ఉద్దేశ్యం ఉంటే, బయటికి వెల్లడిస్తారని తెలిపాయి.

బాల్య స్నేహితులైన హృతిక్‌, సుసానేలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దశాబ్దానికి పైనే కాపురం కూడా చేశారు. వీరికి ఇద్దరు కొడుకులు పుట్టాక.. విడాకులు తీసుకున్నారు. కంగనారనౌత్‌తో హృతిక్ చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వీరి వివాహ బంధం బీటలు వారింది. కానీ కంగనాకు హృతిక్‌కు ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి, వారి బంధం కూడా రచ్చ రచ్చ అయింది. దాదాపు ఐదు సంవత్సరాల కిందట హృతిక్‌, సుసానేలు వేరుపడ్డారు. తమ వివాహాన్ని చట్టబద్ధంగా రద్దు చేసుకున్నప్పటికీ.. ప్రస్తుతం వీళ్లిద్దరూ స్నేహితుల్లా అయితే గడుపుతున్నారు. తమ పిల్లలకు సంబంధించిన బర్త్ డే పార్టీల్లో.. సమ్మర్ వెకేషన్లలో వీళ్లిద్దరూ జంటగా అగుపిస్తూ ఉన్నారు. 

భార్యభర్తలుగా విడిపోయినా.. తల్లిదండ్రులుగా కలిసి ఉంటూ.. వీళ్లిద్దరూ చాలా హ్యాపీగా గడుపుతున్నారు. తరచుగా హృతిక్ తన పిల్లలు, సుసానేతో కలిసి సినిమాలకు, విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. విడిపోయినప్పటికీ, హృతిక్‌, సుసానేలు ఒకరికొకరు సపోర్టు ఇచ్చుకుంటూ.. ప్రోత్సహించుకుంటూ కూడా ఉంటున్నారు. సుసాన్‌ తన నుంచి విడిపోయాక, ఆమె కెరీర్‌ ఎంపికలను హృతిక్‌ గౌరవిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడుకుల కోసం మళ్లీ ఈ జంట ఒక్కటి అయ్యేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. హృతిక్ తన తప్పు తెలుసుకొని ఇప్పుడు సుసానేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని సమాచారం. విడాకులు తీసుకున్న చాలా వరకు జంటలు, కొన్నేళ్ల తర్వాత వేరే వాళ్లను వివాహం చేసుకుంటూ ఉన్నారు. కానీ హృతిక్‌, సుసానేలు విడిపోయాక, మళ్లీ కలువబోతున్నారని వార్తలు రావడం బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement