'ఈ విషయంలో నా సపోర్ట్ హృతిక్ కే' | Sussanne Khan refuses to be dragged into the Kangana-Hrithik mire | Sakshi
Sakshi News home page

'ఈ విషయంలో నా సపోర్ట్ హృతిక్ కే'

Published Wed, Apr 27 2016 8:16 PM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

'ఈ విషయంలో నా సపోర్ట్ హృతిక్ కే'

'ఈ విషయంలో నా సపోర్ట్ హృతిక్ కే'

ముంబై: బాలీవుడ్ టాప్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల మధ్య జరుగుతున్న లీగల్ వివాదం రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతూ థ్రిల్లర్ సినిమాలతో పోటీ పడుతోంది. అయితే ఇప్పుడు ఇదంతా చూస్తూ హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్ ఎలా ఫీలవుతున్నారో తెలుసుకోవాలనేది మీడియా తాపత్రయం. అందుకు సుసానే.. హృతిక్-కంగనల బురద జల్లుకునే పండుగ మధ్యలో అస్సలు ఎంటర్ అవ్వనని ట్విట్టర్ ద్వారా చెప్పకనే చెప్పుకొచ్చారు.

బాలీవుడ్లో మోస్ట్ స్టైలిష్ కపుల్గా గుర్తింపు ఉన్న హృతిక్-సుసానేలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పలు మీడియా సంస్థలు.. తన మాజీ భర్త నడిపిన ప్రేమ వ్యవహారంపై ఆమె ఎలా స్పందిస్తారో  తెలుసుకోవాలనే ఆసక్తిని కనబరిచాయి. ఈ విషయమై ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించిన వరుస కథనాలు చదివిన సుసానే రెండు రోజుల క్రితం.. 'నేను ఏమనుకుంటున్నానో తెలుసుకోవాలని ఉంది కదా. సో సారీ.. ఎప్పటికీ తెలుసుకోలేరు. మీ ఊహాగానాలు కంటిన్యూ చేయండి' అంటూ ట్వీట్ చేశారు.

అంతలోనే హృతిక్, కంగనలు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటపడి మరింత దుమారం రేపాయి. ఆ ఫొటోలు చూసిన సుసానే ఏమనుకున్నారో ఏమో.. 'ఫొటోషాప్ చేసిన ఫొటోలతో అబద్ధపు కథనాలు ప్రచారం చేస్తున్నారు, ఈ విషయంలో మాత్రం నా సపోర్ట్ హృతిక్ కే' అంటూ ఈ సారి తనంతట తానే స్పందించారు సుసానే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement