అందుకే ఆ ఇంటికి వెళ్లా: స్టార్‌ హీరో మాజీ భార్య | Sussanne Khan On Co Parenting With Hrithik Roshan During Lockdown | Sakshi
Sakshi News home page

అందుకే హృతిక్‌ ఇంటికి వెళ్లాను: సుసానే ఖాన్‌

Published Tue, May 12 2020 5:13 PM | Last Updated on Tue, May 12 2020 6:26 PM

Sussanne Khan On Co Parenting With Hrithik Roshan During Lockdown - Sakshi

ముంబై: ‘‘కోవిడ్‌-19ను మహమ్మారిగా ప్రకటించిన సమయంలో లాక్‌డౌన్‌ విధిస్తారనే వార్తలు బయటకు వచ్చాయి. అప్పుడే హృతిక్‌, నేనూ ఒకే ఇంట్లో ఉండాలని నిశ్చయించుకున్నాం. మా కోసం, మా కొడుకుల కోసం మేం తీసుకున్న తెలివిగల నిర్ణయం ఇది. ఎవరికీ ఇబ్బంది కలగకూడదని భావించాం’’ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌ పేర్కొన్నారు. కుమారులు హ్రేహాన్‌, హ్రిధాన్‌ కోసమే తాను మాజీ భర్త ఇంటికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని తన జీవితంలో వచ్చిన మార్పులు, తన గురించి తాను తెలుసుకునేందుకు ఉయోగించుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.(అస్సలు ఊహించలేదు...: హృతిక్‌ రోషన్‌)

‘‘మనల్ని మనం తెలుసుకోవడానికి.. ప్రతీ విషయాన్ని వివిధ కోణాల నుంచి చూసేందుకు ఇదొక వేకప్‌ కాల్‌ లాంటిది. మనకు ప్రియమైన వాళ్లు, సహచరులతో బంధాన్ని మరింతగా పెంచుకునే అవకాశం కల్పించింది. ఎక్కడ.. ఎప్పుడు  ఏ చోట ఉన్నా దయతో మెలగడం, నిస్వార్ధంగా సేవ చేయడం గురించి మరింత లోతుగా తెలియజేస్తోంది. అందమైన జ్ఞాపకాలు పదిలపరుచుకునే వీలు కల్పించింది. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చునప్పుడో.. మంచం మీద పడుకుని ఉన్నపుడో.. మన బట్టలు మనమే ఉతుక్కున్నపుడో.. బొమ్మలు గీస్తున్నపుడో.. మేడ మీద చెట్లకు నీళ్లు పట్టినపుడో మనల్ని మనమే పొగుడుకునే సమయాన్ని ఇచ్చింది. లాక్‌డౌన్‌ తర్వాత కూడా వీటన్నింటినీ పాటించాలని నేను నిర్ణయించుకున్నా’’ అని లాక్‌డౌన్‌ సమయాన్ని తాను ఆస్వాదిస్తున్న తీరును సుసానే వోగ్‌తో పంచుకున్నారు. (రే... నువ్వు అత్యంత అద్భుతమైన వ్యక్తివి!)

కాగా విడాకులు తీసుకున్నప్పటికీ హృతిక్‌, సుసానే మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ కుమారులకు సంబంధించిన ప్రతీ వేడుకను కలిసి జరుపుకునే ఈ జంట.. పిల్లల కోసం భేషజాలు పక్కన పెట్టి కలిసి ముందుకు సాగుతున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ మంచి తల్లిదండ్రులు అనిపించుకుంటున్నారు. ఇక ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం కుటుంబమంతా ఒక్కచోట చేరింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన హృతిక్‌ తన మాజీ భార్య సుసానే వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించాడు.(హృతిక్ సిగ‌రెట్ తాగుతున్నాడా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement