Hrithik Roshan Wife Comments On His Stunning Look Goes Viral - Sakshi
Sakshi News home page

Hrithik Roshan: 21 ఏళ్ల వాడిలా ఉన్నావు: స్టార్‌ హీరో మాజీ భార్య

Published Tue, Jun 29 2021 5:14 PM | Last Updated on Tue, Jun 29 2021 8:04 PM

Hrithik Roshan Shared Fan Page Pic Sussanne Khan Says You Look 21 - Sakshi

ముంబై: ఫిట్‌నెస్‌ విషయంలో బాలీవుడ్‌ సెలబ్రిటీల అందరి కంటే ఓ అడుగు ముందే ఉంటాడు స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌. 47 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ కండలు తిరిగిన దేహంతో తనకు తానే సాటి నిరూపించుకుంటున్నాడు. అందంతో, అదరగొట్టే డ్యాన్సులతో అభిమానుల మనసు కొల్లగొట్టే.. ఈ ‘గ్రీక్‌గాడ్‌’కు సంబంధించిన ఓ ఫొటో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా హృతిక్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌.. ఈ షర్ట్‌లెస్‌ ఫొటోపై చేసిన కామెంట్‌ అభిమానులను మరింతగా ఆకర్షిస్తోంది. 

ఫ్యాన్‌ పేజ్‌ షేర్‌ చేసిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న హృతిక్‌... ‘గుడ్‌ క్యాచ్‌’ అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. ఇందుకు స్పందించిన సుసానే.. ‘‘నువ్వు 21 ఏళ్ల వాడిలా కనిపిస్తున్నావు’’ అంటూ తన ప్రియమైన ‘స్నేహితుడి’పై అభిమానం చాటుకున్నారు. కాగా చిన్ననాటి స్నేహితులైన హృతిక్‌​- సుసానే 2000, డిసెంబర్‌ 20న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు హ్రేహాన్‌, హ్రిధాన్‌. 

ఇక బీ-టౌన్‌ జంటల్లో ఎంతో అన్యోన్య దంపతులుగా పేరొందిన వీరు.. అభిప్రాయ భేదాల కారణంగా 2014లో విడాకులు తీసుకుని అభిమానులకు షాకిచ్చారు. అయితే భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కొడుకుల కోసం స్నేహితుల్లా కొనసాగుతున్నారు. పిల్లల పుట్టినరోజు లాంటి వేడుకలను కలిసి జరిపిస్తూ.. మంచి తల్లిదండ్రులు అనిపించుకుంటున్నారు. 

చదవండి: భార్య ఉండగా హీరోయిన్‌తో హృతిక్‌ రోషన్‌ ప్రేమాయణం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement