
షారుక్ కూతురు ఎంట్రీ అదుర్స్.. కెమెరా క్లిక్స్
ముంబయి: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ సతీమణి గౌరీఖాన్ బాలీవుడ్ ప్రముఖులకు గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చారు. ముంబయిలోని ఏఆర్‌టీహెచ్ అనే రెస్టారెంట్‌లో ఆమె పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్‌కు ఇంటీరియర్ స్వయంగా ఆమెనే రూపకల్పన చేశారు. కొత్తగా డిజైన్ చేసిన ఈ రెస్టారెంటు ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె బాలీవుడ్ ప్రముఖులకు విందును ఏర్పాటుచేశారు. అయితే, ఇది పెద్ద విశేషం కాకపోవచ్చుగానీ అంతకంటే పెద్ద విశేషం మరొకటి ఉంది. ఈ పార్టీలో వారి ముద్దుల తనయా సుసానే ఖాన్ అందరినీ ఆకర్షించింది.
తండ్రి షారుక్‌ఖాన్‌తో కలిసి పార్టీకి విచ్చేసిన సుసానే చూసిన ఏ ఒక్కరిని తలతిప్పులేనంత అందంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అలిల్ కపూర్, అర్జున్‌కపూర్, సోనమ్ కపూర్, కరణ్‌జోహార్, ఫరాఖాన్, సిద్ధార్థ మల్హోత్రా, అలియా భట్, మలైకా అరోరా హాజరయ్యారు. వీరంతా పార్టీలో నిమగ్నమై ఉండగా అనూహ్యంగా ఆరెంజ్ కలర్‌లో ధరించిన స్టర్ట్‌తో ఉన్న తన కూతురు చేయందకుని నడుస్తూ షారుక్, ఆయన కూతురు కెమెరాకు పోజులిచ్చారు. దీంతో ఇదే అవకాశం అనుకొని కెమెరాలన్నీ క్లిక్ మనిపించేశాయి.