'ఆ హీరోతో రెండో పెళ్లి వార్తలు అబద్ధం' | Sussanne Khan lambasts gossip mongers over wedding rumours | Sakshi
Sakshi News home page

'ఆ హీరోతో రెండో పెళ్లి వార్తలు అబద్ధం'

Published Wed, Sep 30 2015 5:44 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

'ఆ హీరోతో రెండో పెళ్లి వార్తలు అబద్ధం'

'ఆ హీరోతో రెండో పెళ్లి వార్తలు అబద్ధం'

ముంబై: మరోసారి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్నె ఖాన్ చెప్పారు. హృతిక్ స్నేహితుడు, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవల వచ్చిన వార్తలను ఖండించారు. ఇలాంటి వదంతులు మనోవేదన కలిగిస్తాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హృతిక్, సుసాన్నె నాలుగేళ్లు డేటింగ్ చేశాక 2000లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే 2013లో హృతిక్, సుసాన్నె జంట విడిపోయారు. హృతిక్, సుసాన్నెలు విడిపోవడానికి అర్జున్ రాంపాలే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. సుసాన్నె, అర్జున్ ఇటీవల ఓ కాఫీ షాప్లో కనబడ్డారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. అయితే హృతిక్తో తాను విడిపోవడానికి ఎవరూ కారణం కాదని, పెళ్లికి సంబంధించిన వార్తలు నిరాధారమని సుసాన్నె స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement