![Sussanne Khan Sister Farah Khan Alis House Staff Tests Coronavirus Positive - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/15/Sussanne-Khan.jpg.webp?itok=ukaby8iB)
నటుడు సంజయ్‌ఖాన్ కూతురు, హృతిక్ రోషన్ మాజీ భార్య సుజేఖాన్ సోదరి ఫరాఖాన్ అలీ నివాసంలో కరోనా కలకలం చెలరేగింది. ఆమె ఇంట్లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిచగా తన కుటుంబ సభ్యులు కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారని ఫరాఖాన్ అలీ ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తామంతా స్వీయనిర్బంధం విధించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీనికి నటి పూజా బేడీ స్పందిస్తూ.. ధృడంగా ఉంటూ, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లండని ధైర్యం చెప్పింది. (పెద్ద మనసు చాటుకున్న విశాల్)
ఇది మీరు ప్రస్తుత పరిస్థితిని జయించడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. ఎందరో నెటిజన్లు సైతం ఆమెకు మద్దతుగా సందేశాలను పంపిస్తున్నారు. కాగా ఇప్పటికే బాలీవుడ్‌లో నిర్మాత కరీం మొరానీ కుటుంబం కరోనా విషవలయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీని నుంచి అతని ఇద్దరు కుమార్తెలు బయటపడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా కరీం మొరానీకి రెండోసారి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పదివేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా 339 మంది మృతి చెందారు. 1036 మంది కోలుకున్నారు. (ఊ.. రాయండి)
Comments
Please login to add a commentAdd a comment