బర్త్‌డే పార్టీ, మాజీ భార్యతో హృతిక్‌ రోషన్‌ సెల్ఫీ | Hrithik Roshan Reunites With Ex Wife Sussanne Khan In Birthday Party | Sakshi
Sakshi News home page

Sussanne Khan: కొన్ని బంధాలు శాశ్వతమైనవి.. హృతిక్‌ మాజీ భార్య ఎమోషనల్‌

Published Sun, Jan 23 2022 12:06 PM | Last Updated on Sun, Jan 23 2022 12:32 PM

Hrithik Roshan Reunites With Ex Wife Sussanne Khan In Birthday Party - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ ఆయన మాజీ భార్య సుశానే ఖాన్‌ను కలిశాడు. అంతేకాదు, ఆమెతో కలిసి సెల్ఫీ కూడా దిగాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం హృతిక్‌ రోషన్‌ సోదరి సునయన బర్త్‌డే జరుపుకుంది. ఈ బర్త్‌డే పార్టీకి హృతిక్‌ మాజీ భార్య సుశానే ఖాన్‌ కూడా హాజరైంది. ఈ సందర్భంగా బర్త్‌డే గర్ల్‌తో పాటు మాజీ భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది.

'కొన్ని బంధాలకు అంతం లేదు, అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. డార్లింగ్‌ నిక్కూ.. నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ హృతిక్‌, సునయనలను ట్యాగ్‌ చేసింది. వారి ముఖంపై కనిపిస్తున్న చిరునవ్వులే వారి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా హృతిక్‌, సుశానే ఖాన్‌లు 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ తర్వాత 2014లో ఈ దంపతులు విడిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement