వారు విడిపోయినా కలివిడిగా.. | Sussanne Says Have A Support System In Hrithik | Sakshi
Sakshi News home page

వారు విడిపోయినా కలివిడిగా..

Published Thu, May 2 2019 8:20 AM | Last Updated on Thu, May 2 2019 11:21 AM

Sussanne Says Have A Support System In Hrithik   - Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌, సుసనే ఖాన్‌ విడిపోయి ఐదేళ్లు దాటినా పిల్లలు హ్రిదాన్‌, హ్రిహాన్‌లను సంతోషంగా ఉంచేందుకు తరచూ కలవడం, హాలిడేస్‌ను ఎంజాయ్‌ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. సుసనే ఇటీవల ఓ టీవీ చానెల్‌ షోకు హాజరైన సందర్భంలో సింగిల్‌ మదర్‌గా మీ అనుభవం ఎలా ఉందని ప్రశ్నించగా తనను వర్కింగ్‌ మామ్‌గా పిలవాలని కోరారు.

తన ఇద్దరు పిల్లల బాగోగులు చూడటం, వారి కోసం కష్టపడి పనిచేయడం తనకు స్ఫూర్తినిస్తుందని చెప్పుకొచ్చారు. హృతిక్‌ రోషన్‌ తనకు బాసటగా నిలిచే తీరు తనలో భరోసా నింపుతుందని, తాము వివాహ బంధంలో లేకున్నా మంచి స్నేహితులమని చెప్పారు. హృతిక్‌తో తన అనుబంధం తాను ఒంటరిననే భావనను దూరం చేస్తుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement