హృతిక్ ను 400 కోట్లు డిమాండ్ చేసిన సుజానే! | Sussanne Demands Hrithik Roshan 400 Crores for Alimony | Sakshi
Sakshi News home page

హృతిక్ ను 400 కోట్లు డిమాండ్ చేసిన సుజానే!

Published Tue, Jul 29 2014 12:40 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

హృతిక్ ను 400 కోట్లు డిమాండ్ చేసిన సుజానే! - Sakshi

హృతిక్ ను 400 కోట్లు డిమాండ్ చేసిన సుజానే!

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బ్యాంగ్ బ్యాంగ్ ట్రైలర్ కు వచ్చిన సానుకూల స్పందన ద్వారా వచ్చిన ఆనందం మాటుమాయమైంది. హృతిక్ ను మనోవర్తి కింద 400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ లో పరస్పర అంగీకారంతో హృతిక్, సుజానేలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఈ కేసులో తుది తీర్పు  అక్టోబర్ 31 తేదిన వెలువడనుంది. ఇప్పటికే హృతిక్ దంపతులకు జన్మించిన హ్రిహాన్, హ్రేదాన్ లను సుజానేలకు అప్పగించారు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా తమ పిల్లలతో హృతిక్ దంపతులు కలిసి కనిపించారు. 
 
ఇటీవల కాలంలో సుజానే కుటుంబ సభ్యులతో హృతిక్ కూడా చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. పిల్లల కోసం వ్యక్తిగత అభిప్రాయాలను, విభేదాలను పక్కన పెట్టాలని హృతిక్, సుజానేలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement