కరోనా: స్టార్‌ హీరో ఇంటికి చేరిన మాజీ భార్య | Hrithik Roshan Ex Wife Sussanne Khan At Same Home During Corona Virus Lockdown | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌: ఒకే ఇంట్లో స్టార్‌ హీరో, మాజీ భార్య

Published Thu, Mar 26 2020 11:12 AM | Last Updated on Thu, Mar 26 2020 11:22 AM

Hrithik Roshan Ex Wife Sussanne Khan At Same Home During Corona Virus Lockdown - Sakshi

ముంబై: బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌ ఆయన భార్య సుసానే ఖాన్‌తో విడాకులు తీసుకున్నప్పటికీ వారిద్దరి మధ్య నేటికీ స్నేహం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పిల్లల కోసం అనేకసార్లు కలిసి ప్రయాణం చేసే ఈ జంట.. వారికి సంబంధించిన ప్రతీ వేడుకను కలిసి నిర్వహిస్తూ బెస్ట్‌ పేరెంట్స్‌ అనిపించుకుంటున్నారు. తాజాగా కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమ కొడుకులు హ్రేహాన్‌, హ్రిధాన్‌ కోసం ఒకే ఇంట్లో కలిసి ఉంటూ మరోసారి ఆదర్శంగా నిలిచారు. ప్రాణాంతక వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో తమ కుమారులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో సుసాన్‌ ఖాన్‌ తన మాజీ భర్త ఇంటికి చేరి తల్లి మనసు చాటుకున్నారు. ఈ విషయాన్ని హృతిక్‌ రోషన్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.(కరోనా: 20 వేలు దాటిన మరణాలు.. అత్యధికంగా అక్కడే)

అస్సలు ఊహించలేదు...
‘‘దేశంలో లాక్‌డౌన్‌ విధించిన వేళ తల్లిదండ్రులుగా ఒకేచోట ఉండటం అస్సలు ఊహించని విషయం. కరోనాను కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటిస్తూ ప్రపంచమంతా ఏకతాటిపైకి రావడం బాగుంది. మానవత్వం వెల్లివిరస్తున్న తరుణంలో ప్రతీ వ్యక్తి ఆమె లేదా అతడు తన పిల్లలతో సమయం గడపడం ఎంతో ముఖ్యం. నా మాజీ భార్య సుసానే ఖాన్‌ ఫొటో ఇది. ఎంతో దయ కలిగిన  వ్యక్తి. తనకు తానుగా తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. పిల్లలు దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఇక్కడికి చేరుకుంది. కో- పేరెంటింగ్‌లో నాకు ఎంతగానో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు సుసానే. మన పిల్లల కోసం మనం సృష్టిస్తున్న కథను వాళ్లే చెబుతారు’’ అంటూ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సుసానే ఫొటోకు క్యాప్షన్‌ జతచేశాడు. (‘భూగ్రహం నుంచి తప్పించుకోవాలని ఉంది’)

ఈ క్రమంలో.. ‘‘కరోనా మహమ్మారి పుణ్యమా అని కుటుంబాలంతా ఒక్కచోట చేరుతున్నాయి. మీరు మరోసారి వివాహ బంధంతో ఒక్కటి కావాలి’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా బాల్య స్నేహితులుగా మెలిగిన హృతిక్‌​- సుసానే 2000 సంవత్సరంలో డిసెంబర్‌ 20న వివాహం చేసుకున్నారు. బీ-టౌన్‌ జంటల్లో ఎంతో అన్యోన్య దంపతులుగా పేరొందిన వీరి కాపురంలో ఓ స్టార్‌ హీరోయిన్‌ చిచ్చు పెట్టిందనే వదంతులు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో 2013 నుంచి దూరంగా ఉంటున్న జంట 2014లో విడాకులు తీసుకున్నారు.

. It is unimaginable for me, as a parent, to think of having to be separated from my children at a time when the country is practicing lockdowns. . It is heartwarming to see the world come together as one in this time of deep uncertainty and possibility of months of social distancing and potential lockdowns for several weeks perhaps . . While the world talks about humanity coming together, I think it represents more than just an idea especially for parents sharing custody of their kids. How to keep their kids close to them without infringing on the right of the other who also has an equal right to be with his/her children. . This is a picture of dear Sussanne (my ex wife) , who has graciously volunteered to temporarily move out of her home so that our children are not disconnected indefinitely from either one of us. . Thank you Sussanne for being so supportive and understanding in our journey of co-parenting. . Our children will tell the story we create for them. . I hope and pray that in order to safeguard the health of ourselves and our loved ones, we all find our way to express love, empathy, courage, strength with an open heart ❤️. . #beopen #bekind #bebrave #responsibility #coexist #empathy #strength #courage #oneworld #humanity #wecanfighththis #loveoverfear

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement