సినీ ఇండస్ట్రీ వాళ్ళ పెళ్లిళ్లు అసలు నిలబడవనేది తరచూ వినిపించే మాట. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడమనేది చాలా సహజం. చివరి వరకు నిలబడే వివాహ బంధాలకన్నా వెంటనే విడిపోయే జంటలే ఎక్కువగా ఉండటం ఈ అభిప్రాయాలకు కారణం. ముఖ్యంగా బాలీవుడ్‌లో విడాకులు అనేది కామన్ అయిపోయింది. నచ్చకపోతే విడిపోవడమే మంచిదని వారి భావన. కోట్లల్లో భరణాలు ఇచ్చి మరీ భార్యకు విడాకులు ఇచ్చిన హీరోలు ఎందరో ఉన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ అమీర్ ఖాన్,కిరణ్ రావులు విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో భారీగా భరణాలు ఇచ్చి విడాకులు తీసుకున్న జంటల గురించి..
హృతిక్ రోషన్‌లాంటి భర్త రావాలని కోరుకోని అమ్మాయి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన్ని అందరూ బాలీవుడ్ గ్రీక్ గాడ్ అని అంటూ ఉంటారు. అంతటి అందగాడిని పెళ్లి చేసుకునే అదృష్టం సుసాన్ ఖాన్‌కు దక్కింది. దాదాపు పదేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం ఆనందంగా గడిచింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఏమైందో తెలీదు కానీ హృతిక్ రోషన్, సుసాన్‌కు మధ్య గొడవలు తలెత్తాయి. దాంతో ఇద్దరూ విడిపోయారు. సుసాన్ ఖాన్‌కి విడాకులు ఇచ్చాడు హృతిక్. అయితే భరణంగా దాదాపు 400 కోట్ల రూపాయాలను అడిగిందట సుసాన్. అప్పట్లో ఈ వార్తలు దుమారం లేపాయి. హృతిక్ ఆ వార్తల్ని ఖండించినప్పటికీ.. ఆమెకు రూ.380 కోట్లను భరణంగా ఇచ్చినట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరిగింది.
మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కూడా భరణంగా రీనా దత్తాకు భారీగానే అప్పగించారట. ఆమిర్, రీనా పెద్దల అమోదం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లకే ఇద్దరూ విడిపోవాల్సిన స్థితి వచ్చింది. అయితే, ఆమిర్ రూ. కోట్లలో రీనా దత్తాకి ఇచ్చాడని టాక్. ఎంత అనేది మాత్రం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.
సైఫ్ అలీఖాన్ కూడా మొదటి భార్య అమృతా సింగ్‌కు భారీ నష్టపరిహారమే చెల్లించాడట. 13 ఏళ్ల కాపురం తర్వాత సైఫ్, అమృత విడాకులు తీసుకున్నారు. భరణంగా తన ఆస్తిలో సగ భాగం అమృత పేర రాసించ్చాడట సైఫ్ అలీఖాన్. అయితే అప్పట్లో ఆయన ఆస్తుల విలువ ఎంత అనేది తెలియరాలేదు. ఇక అమృతా సింగ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కరీనాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సైఫ్ అలీ ఖాన్.
సంజయ్ దత్, రియా పిళ్లై కూడా విభేదాల కారణంగా విడిపోయారు. సంజయ్ నుంచీ విడిపోతూ రియా ఒక సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఖరీదైన కార్ భరణంగా పొందిందట!
ఇక కొరియో గ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా విడాకుల వ్యవహారం కూడా అప్పట్లో దేశమంతా చర్చనీయాంశంగా మారింది నయనతారతో ఎఫైర్ కారణంగా భార్య రమాలత్‌తో ప్రభుదేవాకు చెడిందనే వార్తలు వినిపించాయి. ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరి, చివరకు విడాకుల వరకు వెళ్లింది. నష్టపరిహారంలో భాగంగా రూ.10 లక్షల నగదుతో పాటు ఖరీదైన రెండు కార్లు, రూ. 20-25 కోట్ల విలువ చేసే ఆస్తులను ఆమె పేరిట రాసిచ్చారని ప్రచారం జరిగింది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా సైతం మొదటి భార్య పాయల్ ఖన్నాకి విడాకులు ఇచ్చాడు. ఆయన రాణీ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం నడపడంతో వారి దాంపత్యంలో గొడవలు మొదలయ్యాయి. చివరకు అది విడాకుల వరకు వెళ్లింది. అప్పట్లో ఆదిత్య పెద్ద మొత్తంలోనే పాయల్ ఖన్నాకి అప్పజెప్పాడట. ఎంత ఇచ్చాడన్నది బయటకు రాలేదు. కానీ, బడా నిర్మాత కదా పెద్ద మొత్తమే ఇచ్చి ఉంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ విడాకుల వ్యవహారం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వారు విడిపోయే క్రమంలో కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ 14 కోట్ల విలువైన బాండ్లను పిల్లల పేరు మీద కొనుగోలు చేశారట. వాటిపై నెలకు పది లక్షల దాకా వడ్డీ వస్తుందని అంటారు. వీటితో పాటు ముంబైలోని ఖర్ ఏరియాలో ఉన్న తన ఖరీదైన ఇంటిని కూడా ఆమెకు నష్టపరిహారంగా ఇచ్చాడట.
చదవండి :
చెల్లం సర్, నాకు పెళ్లెప్పుడు అవుతుంది?
ఫ్యామిలీ మ్యాన్ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా?
షారుక్, సల్మాన్‌లో ఎవరు కావాలి? విద్యాబాలన్ రిప్లై ఇదే!
Bollywood: విభేదాలు.. విడాకులు.. కోట్లలో నష్ట పరిహారం
Published Wed, Jun 9 2021 10:53 AM | Last Updated on Sat, Jul 3 2021 4:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment